చైతన్యమూర్తివి నీవే!
తిమిరాన్ని పటాపంచలు చేసే
జ్యోతి స్వరూపం నీవే !
సప్తాశ్వరధాన్నధిరోహించి
అనూరుడు సారధిగా
తూర్పున, కొండల మాటునుంచి
నీవింకా బయల్వెడలక మునుపే ~
నీ ఆగమనాన్ని సూచిస్తూ
వేన చుక్కలూ ... అరునకాంతులూ...
యెంత మనోహరంగా ఉందా దృశ్యం !!
ప్రాణాలను హరించే యమధర్మరాజుకు,
ఆరోగ్యం ప్రసాదించే నీవు తండ్రివంటే ...
యెంత సృష్టి విచిత్రం ? వైవిధ్యం కదూ !!
అమిత బలశాలి హనుమంతునికి
విద్యగరపిన, మహిమాన్విత ఒజ్జవు నీవే !
గురోత్తమా !! సకలవిద్యా పారంగాతా !!
అందుకో ప్రణామములు,
'అచ్చంగా తెలుగు' ఆవిష్కరణ సందర్భంగా
ప్రసరించాలి నీ మనోహర కిరణాలు...
తిమిరాంధకారాన్నిపారద్రోలుతూ...
జగతిని వెలుగులమయం చేస్తూ...
విశ్వానికి ఆరోగ్యమందిస్తూ...
పాఠకులకు దివ్యాశీస్సులందిస్తూ...
'అచ్చంగా తెలుగు' ను అజరామారం చేస్తూ...
****
No comments:
Post a Comment