శంకరా త్రిపురారి నీ చల్లని చూపులతో మాలోని కామాన్ని దహించరా జటాధరా కరుణాంతరంగా నీ దయా దృక్కులతో మా క్రోధాన్ని హరించరా గంగాధరా నీ పావనగంగా ధారలతో మాలోని లోభాన్ని కడిగివేయరా నాగాభరణధరా నీ భక్తిని రాజేసి మాలోని మోహావేశాన్నిపారద్రోలరా గజచర్మధరా లింగోద్భవ కాలంవలె మాలోని మదాన్ని శూన్యం చేయరా ఫాలనేత్రధరా మాలోని మాత్సర్యాన్ని త్రినేత్రంతో భస్మీపటలం చేయరా చంద్రశేఖరా మాలోని సత్వ గుణాన్ని పదిలపరచరా హరిహరా నీ తలంపు అభిషేకం వలె భావించరా విశ్వేశ్వరా నీవుతప్ప అన్నీ అశాశ్వతం అని బోధించరా రామేశ్వరా మమ్మల్ని నీ కన్నబిడ్డలవలె సాకరా నందీశ్వరా నిన్ను మోసే భాగ్యం మాకొసగరా శశిధరా ముక్కంటివై ఇహపరాలు అనుగ్రహించరా వైరాగ్యకరా జన్మజన్మల పాపాల్ని దక్షయజ్ఞం కావించరా త్రిశూలధరా రావణుడి లాగా రుద్రవీణ మీటలేని ఈ భక్తుని కనరా నీలకంధరా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలాన్ని ప్రసాదించరా భవహరా ఈ స్తుతిలో దోషాలు ఉన్న క్షమింపరా ఈ జన్మకు నీ మీద ఈ ఈ కృతి రచనకు ధన్యుడను రా మహాదేవర .... శంభోశంకరా .... దేవాధిదేవరా ... ఫణిరాజ స్తోత్రేశ్వరా...
No comments:
Post a Comment