వంటింటివెనక పెరట్లో పచ్చాని పెద్దఅరిటాకు... కోసితెండి కాస్త నీరు చిలకరించి... పొగలు సెగలు చిమ్ము అన్నభాండము తెచ్చి.. చల్లారుదాకా ఊరుకోకండి... గరిటెతో గబగబా వడ్డించి ఆపై వేయండి అపుడే తీసిన కొత్తావకాయ ... చురుకుమంటున్నా అన్నాన్ని కలుపుతూ ధారగా పోయండి వెన్నకాచిన నేయి.. పచ్చపచ్చని ఆకులో.. ఎర్రఎర్రని ఆవకాయ అన్నము.. ప్రతిముద్దకీ కాస్త పేరిన్నెయ్యినంచి... సిద్దంగా ఉండండి స్వర్గానుభూతికి.. ఈరుచికి మరియే రుచి సాటి యగునా... కనులుమూయకనే లోకాన్ని మరిచి.. అస్వాదించండి వేడి చల్లారకుండా... అప్పుడే అయినదా? లేదండిలేదు.. వేయండి ఇంకొక్క ఆవకాయముక్క... ఆవకాయ కొసరుకి మొహమాటమేల? ఆంధ్రదేశమున పుట్టిపెరిగిన అదృష్టవంతుడా... ఎంత పుణ్యము చేసితివో ఆవకాయ రుచిచూడ!!!
No comments:
Post a Comment