అతివలూ! నిర్ –భయంగా.... పురోగమించండి. ‘అ’ భయంగా ......మునుముందుకు అడుగేయండి ; ‘అ’ ధైర్యంగా ..... వెనుకకు పారిపోకండి ! అతివలూ ! మీరెవరూ... ‘అనూహ్యలు’ కాకూడదు; అజేయంగా ఝాన్సీ రాణులై ముందుకు దూసుకుపొండి ! ఆదరకండి! బెదరకండి! సునీతలా గగన యుద్ధానికి సిద్ధం కండి ; ‘ఇందిర ‘లా దేశాపాలనకు కూడా సమర్ధవంతమవ్వండి ! ‘దుర్గా –బాయి’లా సమాజ ఉద్ధరణకు పూనిక పూనండి ; ‘సరోజినీ నాయుడు’లా భారత కోకిలలుగా కవితా సామ్రాజ్యమేలండి ! ‘కుముద్ బెన్ జోషి’ లా కార్య సాఫల్యులు కండి ; ‘రాణీ రుద్రమ దేవి ’ లా జీవిత యుద్ధంలో గెలవండి ! ‘పల్నాటి నాగమ్మ’ లా కుటిల నీతులను త్రిప్పికోట్టండి. అర్దాంగులై మగవానితో జీవితాన్ని సమానంగా పండించుకోండి . పైసాచిక- ద్రావక దాడులకు కృంగక ధీరలై నిలబడండి, కాముకుని చేతిలో ‘ఆయేషా’ లు కాక, హమేషా అప్రమత్తులై ఉండండి. అమ్మాయిలూ! ఆకతాయిల అల్లరికి, ధైర్య- చీత్కార జవాబులివ్వండి. మహిళ ‘మదన సామ్రాజ్య దేవతే’ కాదు; అవసరమైతే అపరకాళి అనిపించండి. మహిళలూ ! మీకు అన్యాయం జరిగితే; తలవంచి తప్పుకోకండి; తలెత్తి, అన్యాయాన్ని ఎదిరించి; మీకు మీరే సాటి అని నిరూపించండి. వనితా! ఈ ‘శ్రీ జయ ‘ వత్సరం నుంచి , విజయం ... నీదే, నీదే, నీదే!
No comments:
Post a Comment