మీ జీవితానికి మీరే హీరో కావాలనుకుంటే??!!
వ్యాసకర్త : బి.వి.సత్యనగేష్ ,
హైదరాబాదులోని మైండ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ డైరెక్టర్.
జీవితం విజయం వైపు పరుగులు తీసినా, దిగజారుడుగా అపజయం వైపు వెళ్తున్నా జీవితానికి సారథి మీరే అని గ్రహించాలి. మన జీవితం మన నమ్మకాల ప్రతిబింబం, ఈ నమ్మకాలన్నీ మన సబ్కా న్షస్మైంాడ్లోప లోతుగా రిజిస్టర్ అయినవే. విచిత్రమేమిటంటే… సగటు మనిషి మనసులో చాలా వరకు నమ్మకాలు ప్రతికూలమైనవి. (నెగిటివ్గాు) ఉంటాయి. మనజీవితంలో ఎదురైన సంఘటనలు అనుభవాలుగా మారి చివరికి నమ్మకాలుగా మారతాయి. వీటినే ‘మానసికముద్రలు’ అంటాం. 95% సమయంలో ప్రతికూల ఆలోచనలతో మన నమ్మకాలను ప్రతికూలంగా చెయ్యడం వలన మనకు గుర్తుకొచ్చేవి కూడా ప్రతికూలపు తలపులే. వీటివల్ల అనుమానం, భయం, ఆందోళన, ఒత్తిడి, పిరికితనం, ఆత్మన్యూనతాభావం, కలవరం సృష్టింపబడతాయి. వాటి ప్రభావం మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తాయి. ఒక ఊరిలో ఒక రైతు దగ్గర రెండు కుక్కలున్నాయి. ఒకటి మంచి కుక్క. మరొకటి చెడ్డ కుక్క. ఈ రెండు యుద్ధం చేసుకుంటే ఏ కుక్క నెగ్గుతుంది? అని ప్రశ్నించుకుంటే ఏ కుక్కకు బలం, దైర్యం, ఎక్కువ ఉంటే ఆ కుక్క యుద్ధంలో నెగ్గుతుందనటంలో సందేహం లేదు. ఈ సందర్భంలో ‘మంచి’ లేదా ‘చెడు’ అనే విశ్లేషణకు తావులేదు. మంచి కుక్కకు శారీరకబలం కూడా ఉండాలనేది అతి ముఖ్యమైన విషయం, చెడ్డ కుక్కకు తిండి ఎక్కువ పెట్టి, మంచి కుక్కను అశ్రద్ధ చేస్తే చెడ్డకుక్కే నెగ్గుతుంది. అలాగే చెడు విషయాలనే ఆలోచిస్తూ ఉంటే చెడు నమ్మకాలు/ మానసిక ముద్రలే మనసులో చోటు చేసుకుంటాయి. మనిషి చెడుకు ఎందుకు ఎక్కువగా ఆఅకర్షింపబడతాడనేది సామాన్య మానవుడి వ్యధ. ఎందుకో చూద్దాం. ఒక విద్యార్థి మంచి మార్కులు సంపాదించాలంటే చాలా కృషి చెయ్యాలి. పరీక్షలో ఫెయిల్ అవ్వాలంటే అస్సలు చదవకపోయినా చాలు. సహజంగానే ఫెయిల్ అవుతాడు. సహజం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. సహజం అంటే నేచురల్ అని అప్రయత్నంగా వచ్చేది’ అసంకల్పితం. అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ప్రపంచంలో సహజ శక్తులెన్నో ఉన్నాయి. సగటు మనిషి గుర్తించే మూడు సహజ శక్తుల గురించి చూద్దాం. 1. భూమ్యాకర్షణ శక్తి 2. దిక్సూచి ఎప్పుడూ ఉత్తరంవైపే చూపిస్తుంది 3. అయస్కాంతం ఎప్పుడూ ఇనుమునే ఆకర్షిస్తుంది. ప్రతికూల ఆలోచనాప్రక్రియ కూడ పై మూడు సహజశక్తులు లాంటిదే. ఈ క్రింద ఉదాహరణలను చూద్దాం. 1. మనిషి నీటిలో పడిపోవడం వలన మునిగిపోడు. నీటిలో నుంచి పైకి రావడానికి ప్రయత్నం చెయ్యకపోవడం వల్లనే మునిగిపోతాడు. ఈతకొట్టడం అనేది అనుకూల ఆలోచనా ప్రక్రియతో కూడిన ‘ప్రయత్నం’ భయం ఆందోళనతో ఏ ప్రయత్నం చెయ్యకపోవడాన్ని ప్రతికూల ఆలోచనా ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇది భూమ్యాకర్షణశక్తి లాంటిదే. ఇది మనిషిని నీటిలోతు భాగంలోకి తీసుకుపోయి ప్రాణం తీస్తుంది. విషం లేకపోయినా, పాముకాటు వేసినపుడు భయానికి, ఆందోళనకి చనిపోయినవారెందరో ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. పదిమంచి పనులు చేసినా, రెండు చెడ్డ పనులు చేస్తే ఆ రెండు తప్పులు గురించే సమాజం మాట్లాడుతుంది. ఒక విద్యార్థి 5 సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకుని, ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయితే, అపజయం గురించే మాట్లాడుతుందీ సమాజం. ఇది దిక్సూచి ఎప్పుడూ ఉత్తరం వైపు చూపించినట్లే. అయిస్కాంతం ఇనుమునే ఆకర్షిస్తుంది. ఖరీదైన బంగారం, వెండి అనే లోహాలను ఆకర్షించదు. కనుక పైన పేర్కొన్న సహజశక్తులలాంటిదే మన ప్రతికూల ఆలోచనా ప్రక్రియ. అందువల్ల ప్రతికూల ఆలోచనా ప్రక్రియకు వ్యతిరేకమైన సానుకూల ఆలోచనా ప్రక్రియను అలవాటు చేసుకోవాలి. గాలిపటం పైపైకి పోవాలంటే గాలిని ఢీ కొనాలి. ఒకవస్తువును క్రిందకు పడేయాలంటే దానికి శక్తి అవసరం లేదు. చేతులతో పట్టుకున్న వస్తువును చేతులు దూరం చేయటం ద్వారా జార విడిస్తే సహజశక్తి వల్ల క్రిందకు పడిపోతుంది. అదే వస్తువును పైకి విసరాలంటే ఎంతో శక్తి అవసరం. అలాగే మనిషి సుఖంగా, సంతోషంగా, అభివృద్ధి చెందాలంటే సానుకూల దృక్పథంలోకి జారిపోతాం. ప్రకృతిలో మరొక సహజసిద్ధమైన నిజం ఉంది. ఈ నిజం మనకు రెండు రంగుల ద్వారా తెలుస్తుంది. ఒకటి తెలుపు. రెండవది నలుపు. ఈ రెండు రంగులు కలిపితే బూడిదరంగు (గ్రే) వస్తుంది. కాని యిందులో విచిత్రమేమిటంటే… తెలుపు రంగు ఎక్కువ, నలుపు రంగు తక్కువగ కలిస్తే బూడిదరంగు వస్తుంది. ఒక లీటర్ తెలుపు రంగును కేవలం 100 మిల్లీ మీటర్ల నల్లరంగుతో కలిపితే బూడిదరంగు వస్తుంది. కాని ఒక లీటర్ నలుపురంగులో 100 మిల్లీమీటర్లు తెలుపురంగు కలిపితే బూడిదరంగు రాదు. అంతేకాదు… తెలుపురంగు కనిపించకుండా పోతుంది. ఒక లీటర్ నలుపురంగులో ఎన్నో లీటర్ల తెలుపు రంగు కలిపితే కాని బూడిదరంగు రాదు. పూర్తిగా తెలుపు రంగు కావాలంటే చాలా లీటర్ల తెలుపు రంగు కలపాలి. పాలు, కాఫీ డికాషన్ లను కూడా ఉదాహరణలుగా తీసుకోవచ్చు. తెలుపు రంగును పాజిటివ్ గానూ, నలుపు రంగును నెగిటివ్ గానూ తీసుకుంటే పోజిటివ్ సజిషన్లను ఎంతగా ఉపయోగించాలో మనకు అర్థమవుతుంది. కనుక మన జీవితములో మంచి, చెడు ఫలితాలకు మన ఆలోచనాసరళి మాత్రమే కారణం అని నమ్మాలి. అందువల్ల మన జీవితంలోని సారధి ఎవరు ఎంటే మనమే, అంటే ‘నేనే’ నా జీవితానికి నిర్మాణకర్త, శిల్పి, సారధి నేనే, కనుక నా జీవితానికి సారధి అయిన నేను జీవితాన్ని అర్థవంతంగా చేసుకోవడానికి ఈరోజు నుంచి సానుకూల దృక్పధంతో నా సారధి బాధ్యతను చేపడతాను అని ప్రారంభించండి. లేకపోతే సహజమైన ప్రతికూల ఆలోచనా ప్రక్రియ వల్ల తెలియకుండానే జీవితానికి ‘విలన్’గా మారిపోయే ప్రమాదముంది. Failure is an option. It happens when no efforts are made. ఏమీ చెయ్యనప్పుడు ఫెయిల్యూర్ సహజంగానే వస్తుంది కనుక మోడరన్ బిహేవియరల్ సైంటిస్టులు ఈ క్రిందివిధంగా చెప్తున్నారు. నెగిటివ్గాీ ఆలోచించకూడదు. నిజమే! కాని అన్నివిషయాల్లోనూ పాజిటివ్గా్ ఆలోచించలేం కదా అని ప్రశ్నించుకుని, అధ్యయనం చేసి మరొక విషయం తెలియజేశారు. దానినే ‘రైట్ థింకింగ్’ అంటారు. దీనిని మనం ‘అనుకూల ఆలోచనా సరళి, సానుకూల అలోచనా సరళి’ అని అనుకుందాం. ఉదాహరణకు… అడవిలో రాత్రివేళ తెలియని దట్టమైన చెట్లు, పొదలు ఉన్న చోటకు వెళ్ళాలి అనుకుందాం. వెళ్ళడానికి భయపడడం ‘నెగిటివ్’. ధైర్యంగా దూసుకుపోవడం ‘పాజిటివ్’ అనుకుందాం. ఈ రెండూ తప్పు అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఉదయం పూట వెళ్ళడం అనుకూలమైన ఆలోచనా విధానం అని చెప్పుకోవచ్చు. అందుకని ‘థింకింగ్’ అనే ముఖ్యమైన ప్రక్రియ మన అదుపులోనే ఉంది కనుక నా జీవితానికి నేనే సారథిని అని నమ్ముదాం.
No comments:
Post a Comment