పారడీ పాట రచన : చివుకుల బాల భాస్కర్. - అచ్చంగా తెలుగు

పారడీ పాట రచన : చివుకుల బాల భాస్కర్.

Share This
పారడీ పాట  
  చివుకుల బాల భాస్కర్.



ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము... 
పద్మినమ్మ "అచ్చంగా తెలుగు" పూల తోట లో ...... 
వీడలేమంటూ ..వీడుకోలంటూ ..లేనే .లేని... ఫెసుబుక్కు లో... 
చిలిపితనపు మొదటి మలుపులో ...

పద్మినమ్మ రాసిన భావ కవితలు .... 
ఆర్ వి ప్రభు గారి చిలిపి జోకులు ..... 
కళ్యాణ కృష్ణ రాసే కొంటె కవితలు ... 
గోటేటి వారి మమ కారం దోసెలు.... 
గీతక్క,దుర్గక్క పెట్టే పిండివంటలు ... 
విజయమ్మ, వసంత గారి వింత పోస్టులు .. 
నాగ జ్యోతి గారి నవ్వించే పోస్టులు .... 
 యనమండ్ర సీనన్న బుడుగు మాటలు .. 
బండారు సీనన్న పొలిటికల్ పోస్టులు ... 

కొండూరు వాసన్నకొంటె రాతలు ... 
భాగవత గణాధ్యాయి గారి కృష్ణ గీతలు.... 
వడ్డాది మూర్తి గారి రామ కధలు .... 
గోపీనాథ్ తాత గారి జోకు మకరందాలు ..... 
 మరపురాని మధురమైన తీపి గురుతులండీ .... 
మీ మనసు నొచ్చుకుని వుంటే మన్నించండి..... 
 అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి.... 
ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండి ... 

 ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము... 
పద్మినమ్మ "అచ్చంగా తెలుగు" పూల తోట లో ...... 
వీడలేమంటూ ..వీడుకోలంటూ ..లేనే .లేని... ఫెసుబుక్కు లో... 
చిలిపితనపు మొదటి మలుపులో ...

No comments:

Post a Comment

Pages