శ్రీధర మాధురి 2 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి 2

Share This
 శ్రీధర మాధురి 2
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )

శ్రీ 'కృష్ణ' భగవానుడు
1. దేవుని దయ అంతటా ఉంది... అది ఎల్లప్పుడూ ఉంటుంది... కాని దేవుడి దయను మీరు గుర్తించడానికి కూడా ఆయన దయ మీకు కావాలి.
2. ఒంటరిగా ఉన్నామని అనుకునే బదులు, మీరు భగవంతుడితో ఏకాంతంగా ఉన్నామని భావించండి.
3. దేవునితో నా సంభాషణల్లో, ఆయన్ను ఇలా అడిగాను దేవా ! కృష్ణ, అల్లాహ్, జహోవా, బుద్ధ, మధ్య తేడా ఏమిటి ?
ఆయన నవ్వి ఇలా అన్నారు అమ్మ, అమ్మి, అమ్మే, మామ్... మధ్య తేడా వంటిదే!
4. దేవుని మార్గం నిగూఢమైనది ఏ తర్కం, లేక శాస్త్రం వివరించలేనిది.ఆయన అద్భుతమైనవారు, ఆయన్ను చూసి ఆశ్చర్యపోవాల్సిందే! నిజానికి ఆయనకు లింగ భేదాలు లేవు కాలాతీతులు గుణాతీతులు ఇంద్రియాలకు అతీతులు ఆయనే కర్త. అన్నింటా, అంతటా ఆయన్ను చూసేలా మాకు శిక్షణ ఇచ్చారు. మేము ఆయన్ను అనుభూతి చెందగలగడం ఆయన దయే !మీరాయన్ను ప్రకృతి అనండి, దైవం అనండి, జ్ఞానం అనండి, జాగృతి అనండి, మనిషి అనండి, లేక జంతువులు, మొక్కలు, చెట్లు, సముద్రాలు అనండి అవన్నీ కేవలం ఆయన స్వరూపాలే!మేమాయనను చూస్తాం, తింటాం, వాసన చూస్తాం, రుచి చూస్తాము, అనుభూతి చెందుతాం, కౌగిలించుకుంటాం, ఆయనతో నిద్రిస్తాం. ఆయన అతి గూఢమైన వారు, ప్రశ్నించనలవికానివారు, యుక్తికి అందనివారు, ఆయన చేసేవన్నీ స్వచ్చమైన ప్రేమతో, దయతో నిండి ఉంటాయి. దైవాన్ని ప్రార్ధించండి.
5. మరీ గంభీరంగా జీవించకండి , కాస్త సరదాగా ఉండండి. కొందరు వారికి లేని వాటి గురించి ఆలోచించడం నేను చూసాను. మీకున్న వాటిని అనుభవించండి, ఆలోచిస్తూ, మండిపడుతూ ఉండకండి. మీరిక్కడికి మీరుగా ఉండేందుకే వచ్చారు, అలాగే ఉండండి. మీరు కృష్ణుడో, జీసెసో, లేక జురాష్ట్రా అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని, మీ జీవితాన్ని అంగీకరించండి. జీవితం తిరోగమనం కాదు, ఎల్లప్పుడూ పురోగమనమే. జీవితం వికసిస్తూ ఉంటుంది. దేవునిపై విశ్వాసమే జీవన సౌందర్యం. దైవాన్ని ప్రతికూలతలతో సహా, అన్నింటిలోనూ చూడండి.
6. స్వచ్చమైన, విస్తారమైన, ఉత్కృష్టమైన భగవత్ స్వరూపం త్రిగుణాలకు అతీతం. మీరు ఈ రూపాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, జెహోవా, అల్లాహ్, ఆహుర్ మజ్ద ఏ పేరుతోనైనా పిలవండి, అది ఒక్కటే! ఈ నిర్గుణ స్వరూపం నుంచి సగుణ స్వరూపం అవతారాలుగా వస్తుంది. అనంతం నుంచి పరిమితానికి... నిర్గుణ స్వరూపం కాలానికి అతీతం, సగుణ స్వరూపం కాలానికి బద్ధం... నిర్గుణ స్వరూపానికి నాశనం లేదు, సగుణ స్వరూపం నశిస్తుంది. అందుకే అన్ని అవతారాలకు ఒక తార్కికమైన అంతం ఉంటుంది, ఆ తర్కం నిర్గుణ స్వరూపానికి వర్తించదు, ఎందుకంటే అది కాలాతీతం కనుక. ఇతిహాసం ప్రకారం నిర్గుణ స్వరూపం లేక విశ్వ చైతన్యం లేక పరమాత్మ, తన సంకల్పానుసారం క్రిందికి వచ్చి, ఒక నిర్ణీత కాల పరిమితితో ఒక అవతారం ధరిస్తుంది. హిరణ్యాక్షుడిని చంపేందుకు వరాహ స్వామిగా, హిరణ్యకశిపుని సంహరించేందుకు నృసింహునిగా, రావణుడిని చంపేందుకు రాముడిగా, కంసుని సంహారానికి కృష్ణుడిగా , మొదలైనవి. ఇక్కడ కూడా మన ఉద్దేశం చెడును చంపేందుకు లేక దుష్ట శక్తిని నిర్మూలించేందుకు, అంతే కాని, వాక్య పరంగా వ్యక్తిని చంపడం అని కాదు. నృసింహ అవతారంలో సగుణ నృసింహుడి కోపం హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా చల్లారలేదు. కాబట్టి, నిర్గుణ స్వరూపంతో ఉండే వరం కలిగిన అందరు సగుణ దేవతలు ఆయన్ను సాయం కోరారు. అప్పుడు నిర్గుణ స్వరూపం శరభఅనే పక్షి రూపం ధరించింది. నృసింహుడు గండ భేరుండ స్వరూపం. కాబట్టి పురాణాలను బట్టి, శరభ తన భార్యలైన శూలిని మరియు ప్రత్యంగిర లతో సహా నృసింహుని హత్తుకున్నాడు. నృసింహుడి వారి ప్రేమను, దయను అనుభూతి చెంది, తన కోపాన్ని వారికి అర్పించాడు. కాబట్టి నిర్గుణ స్వరూపం యెంత విస్తారమైనది మరియు శక్తివంతమైనది అంటే, అది ఒకేసారి అనేక రూపాలు ధరించగలదు. అదంతా దైవలీల. ఆయన లీలలను ఆస్వాదించండి, వివాదాలతో ముగించకండి. కారణాలను వివరించడానికి, తీర్మానాలు చెయ్యడానికి మన చిన్ని బుర్ర సరిపోదు. దైవానుగ్రహం, ఆనందించండి.
7. దేవుడు మీ ఉనికికి కేంద్ర స్థానం కావాలి. తక్కినవన్నీ చుట్టుప్రక్కల పరిధిలో ఉండాలి. ఇది ఎలాగంటే కృష్ణ భగవానుడు గోపగోపికలతో దివ్యనృత్యంలో ఉన్నట్లుగా... దురదృష్టవశాత్తూ దైవం ప్రక్కకు తోయబడి, మిగిలిన అన్ని అంశాలు కేంద్రంలో ఉన్నాయి. దీనివల్ల మీరు కేవలం శాంతిని కోల్పోవడమే కాక, దుఃఖానికి గురయ్యి, ఇతరులను మీ బాధలకు కారకులుగా నిందిస్తూ ఉంటారు.
8. దైవం అంతా చూస్తున్నారు.దైవం మహావిష్ణువు రూపంలో ఆదిశేషునిపై యోగ నిద్రగా పిలవబడే గాఢ నిద్రలో ఉంటారు.మన ప్రతి చర్యకు ఆయన సాక్షి. ఆయన తాను కర్తను కాదుఅని భావించే ఒక్క ఆత్మకి అన్వేషిస్తూ ఉంటారు. కాబట్టి, విశ్వంలో జరిగే ప్రతీ విషయాన్ని ఆయన చూస్తుంటారు. ఈ సాక్షీభూతంగా ఉండే అత్యున్నత స్థాయిలో, ఆయన యోగ నారాయణుడిగా ధ్యానిస్తూ ఉంటారు. నటరాజస్వామిగా ఆయన తన తాండవ నృత్యాన్ని తానే ఆస్వాదిస్తూ ఉంటారు. దక్షిణామూర్తి స్వరూపంలోని ఈశ్వరుడు అన్ని ఘటనలు చూస్తూ ఉంటారు, మరియు అత్యున్నత ధ్యాన స్థాయిలో ఆయన తన స్వీయ నృత్యాన్ని, కృష్ణుడి రాసలీలగా అనుభూతి చెందుతూ ఉంటారు. సాక్షిగా, తన స్వీయ చర్యలకు సాక్షీభూతునిగా, ఏ ఊహలకు లేక భావనలకు అతీతంగా తన స్వీయ నృత్యాన్ని ఆస్వాదిస్తారు. సచ్చిదానందం....అంతా దైవానుగ్రహం, దయ.
9. ఫేస్ బుక్ లో ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు అడిగే, నేను అడిగినవాటికి తగిన సమాధానాలు ఇచ్చే నా మిత్రుడొకరు ప్రైవేటు చాట్ లో నన్ను ఇలా అడిగారు – ‘ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తో మీ అనుబంధం ఏమిటి ? చాలామంది స్వామి భక్తులు మిమ్మల్ని కూడా గురూజీఅని పిలవడం చూసాను,’ అని అడిగారు.
నేను నవ్వి, ‘ ఈ విషయం వారినే అడగడం మంచిది బహుశా మా అనుబంధం అర్జునుడికి (నాకు) కృష్ణ భాగవానుడితో (బాబా) ఉన్న బంధం వంటిది,’ అన్నాను.
10. మీరు దైవానికి వెన్న నివేదిస్తే, ఆయన స్వీకరిస్తారు. మీకు అజ్ఞానం వద్దు, కనుక సూచనాత్మకంగా మీరు మీలోని అజ్ఞానమనే వెన్నను దైవానికి ఇచ్చి, ఆయన్ను ప్రార్ధిస్తారు. బదులుగా ఆయన మీకు జ్ఞానమిచ్చి అనుగ్రహిస్తారు.
11. కృష్ణ భగవానుడు గోకులంలో తయారైన వెన్నంతా తినేసేవారు. ప్రతీ గోప లేక గోపిక వెన్న తయారుచేస్తూ కృష్ణుడి గురించి ఆలోచించేవారు. గోపగోపికలంతా కృష్ణుడితో బలమైన అనుబంధం కలిగి ఉండేవారు. కృష్ణుడు వారితో తనను ప్రకృతి లోని అన్ని పదార్ధాలలో చూడమని చెప్పినప్పటికీ వారు కృష్ణుడి భౌతిక రూపంతోనే ఎక్కువ బంధం కలిగిఉండేవారు. వెన్న అనేది అజ్ఞానం’, వెన్న అవివేకానికి చిహ్నం, అది మొదటి ఫలమైన పాలు (తెలియనితనం, నిష్కళంకత్వం)కాదు, చివరి ఫలమైన నెయ్యి (జ్ఞానం)కాదు. కాబట్టి కృష్ణుడు గోపికల్లోని అజ్ఞానం తొలగించాలని అనుకున్నాడు. అందుకే సూచనామాత్రంగా ఆయన వెన్న(వారి అజ్ఞానం) స్వీకరించి, వారికి జ్ఞానం కలిగించాడు. ఆయన ఎదుగుతున్నారని, గోకులాన్ని విడిచే సమయం వస్తుందనీ, వారికి సూచిస్తూనే ఉన్నారు. కాబట్టి అంతా ఆయన్ను భౌతిక రూపంలోనే కాక, సృష్టిలోని ప్రతి వస్తువులో చూడాలి. అంతా కృష్ణుడి దయ.
12. అర్జునుడు చాలా యుద్ధాలు చేసి, ‘క్షత్రియ ధర్మంపేరుతో అనేకమందిని చంపాడు. మహాభారత యుద్ధంలో పాల్గొనే ముందు, అతనికి ధర్మపరిపాలనగురించిన సందేహాలు వచ్చాయి. వారంతా తనకు సోదరులు, మామలు, తండ్రి వంటివారు అన్నాడు. కొంతమంది నా స్నేహితులు, గురువులు అన్నాడు. నేను వారితో యుద్ధం ఎలా చెయ్యను కృష్ణా ?’ అని అడిగాడు. వారంతా తన వారు అని తోచగానే బాధ మొదలయ్యింది. మీరు ఇది నాదిఅనుకోగానే, ఆ క్షణమే వేదన మొదలయ్యింది. కాబట్టి, ఆడంబరంగా, వైభవంగా జీవించండి. కాని, మనసులో ఏదీ మీది కాదన్న భావన మరువకండి. దేనికీ కర్తృత్వం వహించకండి, మనం కర్తలు కాదని గుర్తుంచుకోండి. పూజ గదిలో, పడక గదిలో, ఇంట్లో,ఆఫీసులో ,స్నేహితులతో లేక చుట్టాలతో మీరు ఏమి చేసినా – ‘మీరు కర్త కాదుఅన్న విషయాన్ని మనసులో ఉంచుకోండి. అలా ఉండగలిగితే అర్జునుడిలా అపరాధభావన కలగదు. భగవద్గీత అప్పుడు మీకు అవసరమే ఉండదు.
13. నన్నెవరో అడిగారు గురూజీ మీరేది చెప్తారో అది పాటించరు, ఎందుకని?
నేను నవ్వి – ‘నేను చెప్పేది నేనే పాటిస్తే, నేను ఉపాధ్యాయుడిని అవుతాను. కాని, మేము గురువులం. మేము బోధించేవి మేము పాటించము. గ్రంధకర్త పుస్తకాన్ని చదవక్కర్లేదు. కృష్ణుడి భగవద్గీత అర్జునుడి వంటి వారికి కాని, కృష్ణుడికి ఉపయోగించదు కదా!
14. కృష్ణుడు, రుక్మిణి,పాచికలు ఆడుతున్నారు. హఠాత్తుగా కృష్ణుడు ఒక గొంతు విన్నాడు –“ కృష్ణా, నన్ను రక్షించు’- ఒక కృష్ణ దేవాలయంలోని పూజారి తనను సాయం కోరి పిలుస్తున్నాడని కృష్ణుడు రుక్మిణికి చెప్పాడు. కాబట్టి, తాను ఆలస్యంగా వస్తానని చెప్పి, ఆయన వెళ్ళిపోయారు. మరో నిముషంలో ఆయన తిరిగి వచ్చేసారు.రుక్మిణి ఆశ్చర్యంగా, “అంత త్వరగా ఎలా వచ్చేసారు ?” అని అడిగింది. కృష్ణుడు,” పూజారి స్నానానంతరం పొరపాటున చాకలి అప్పుడే ఉతికి ఆరేసిన బట్టలపై నడిచాడు. చాకలి కోపించి, బెత్తంతో ఆయన్ను కొట్టేందుకు వచ్చాడు. అందుకే పూజారి కృష్ణా! అని అరిచాడు. నేనక్కడకు వెళ్లేసరికి పూజారి చాకలిని తిరిగి కొట్టేందుకు వంగి రాయి తీసుకోబోతున్నాడు. అతడు తనను తాను రక్షించుకోవడానికి సిద్ధపడ్డాడు, కనుక నేను తిరిగి వచ్చేసాను,” అని చెప్పాడు.
15. రాధేకృష్ణ దీని అర్ధం ఏమిటి ?
రాహ్-దే-కృష్ణ అంటే,’ హే భగవాన్ ! నిన్ను చేరే మార్గంలోకి వెళ్ళేలా మాకు దిశా నిర్దేశం చెయ్యి.
16. ‘దాసస్య దాస్యోహం ‘....
దేవుని సేవ చేసేవారి సేవకుడిగా ఉండేందుకు నేను ఇష్టపడతాను.
17. నారదముని కృష్ణ భగవానుడిని కలిసేందుకు వెళ్ళాడు. కృష్ణుడు పూజా మందిరంలో పూజలో ఉన్నారని రుక్మిణి చెప్తుంది. నారదుడిలా అనుకున్నాడు,’ఇదేమి చోద్యం ? మేమంతా కృష్ణుడిని పూజిస్తుంటే, ఆయన వేరేవర్నో పూజిస్తారా?’ ఆయన నిజమేమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు.
నారదుడు – ‘రుక్మిణీ, ఆయనెవరిని పూజిస్తున్నారు ?’
రుక్మిణి – ‘నాకు తెలీదు, రోజుకు మూడు సార్లు పూజ చేస్తారు, మీరే చూసి తెలుసుకోండి.
నారదుడు పూజామందిరానికి వెళ్ళాడు. అక్కడొక రాగి పాత్ర ఉంది, కృష్ణుడు దానికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం వంటివి ఇచ్చి, చివరకు మంగళ హారతిచ్చాడు. నారదుని వైపుకు తిరిగి అతనికి హారతిచ్చాడు. నారదుడు వద్దని ఉండవచ్చు. కాని, హారతి తీసుకున్నాడు.
నారదుడు ఆ చిన్న రాగి పాత్రలో ఏముంది?
కృష్ణుడు నీవే బయటికి తీసి చూడు.
నారదుడు- వద్దు వద్దు, మీరే చూపండి.
కృష్ణుడు పాత్రను తెరిచి లోనున్నది చూపాడు. అందులో కేవలం ఇసుక ఉంది.
నారదుడు మీరు ఇసుకను పూజిస్తారా?
కృష్ణుడు నవ్వి, ఇది ఇసుక కాదు నారదా! నా భక్తులందరి పాదధూళి నుంచి ఒక్కొక్క రేణువు. వారివల్లే కృష్ణుడు ఎవరో అందరికీ తెలుస్తుంది. వారు నన్ను పూజిస్తారు, బదులుగా నేను వారిని పూజిస్తాను. భాగవతులు భగవంతుడిని పూజిస్తారు, భక్తులు భగవంతుడిని పూజిస్తారు. దైవం అందుకు బదులుగా తన కృతజ్ఞతను చూపేందుకు భక్తుడిని పూజించి, ఆరాధిస్తాడు.
18. అర్జునుడు కృష్ణా, ప్రతీసారి శకుని పాచికలు వేసే ముందు కళ్ళు మూసుకుని, ప్రార్ధించి, వేసేవాడు. అతడు ఎవరిని ప్రార్దిస్తున్నాడు కృష్ణా ?
కృష్ణుడు ప్రతీసారి అతడు నన్ను ప్రార్ధించి పాచికలు వేస్తాడు. అర్జునా, నిజానికి దుష్టుడు దైవానికి తీవ్ర ఉపాసకుడు. ఎందుకంటే, అతడు కూడా దైవం తనకు కేటాయించిన పనినే చేస్తాడు.
19. మహాభారత యుద్ధంలో కృష్ణుడు శంఖం పూరించినప్పుడు, అది ప్రతీ ఒక్కరికీ విభిన్నంగా వినిపించింది. ఎవరికి ఎలా వినబడింది అనేది వారి వారి జాగృత స్థితిపై ఆధారపడి ఉంది. కృష్ణుడి భావం కేవలం శకునికి, భీష్ముడికి అర్ధమయ్యింది. వారిరువురూ కృష్ణుడిని చూసి నవ్వారు. నిజమైన శిష్యులే గురువు మాటల్లోని అంతరార్ధం తెలుసుకుని, ఆస్వాదించగలుగుతారు.
20. ఝాన్సీ కృష్ణుడు సుదాముడిని ప్రాణ స్నేహితుడిగా చూసాడా లేక శిష్యుడిగానా?
నేను రెండు విధాలుగానూ కాదు. కృష్ణ భగవానుడు సుదాముడిని తన గురువుగా చూసాడు. అందుకే సుదాముడు తన వద్దకు వచ్చినప్పుడు, ఆయన శిష్యుడిగా మారి పాదపూజ చేసారు. అంతేకాక, రుక్మిణి తనను ఆపే ముందు, సుదాముడు తెచ్చిన దానిలో కేవలం మూడువంతుల అటుకుల్ని స్వీకరించి ఆయన శిష్యుడిగా సుదాముడు అడిగినవన్నీ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఈ విధంగా చేసి, ఒక శిష్యుడు తన గురువును ఎలా సత్కరించాలో ఆయన ప్రపంచానికి ఆచరించి చూపారు. అంతా దైవానుగ్రహం.
21. అతడు గీతలో భగవానుడు ఏమంటాడంటే...
నేనతనికి అడ్డు వచ్చి అలాగా, దాని సంగతి ఏమిటి ?
అతడు కానీ, మీరిలాగే అంటారు కదా!
నేను – (నవ్వాపుకోలేక పోయాను) అవును, అందుకే అతను కృష్ణుడు అయ్యాడు, నేను శ్రీధర్ అయ్యాను. మీరేదీ అవ్వటానికి ప్రయత్నించక్కర్లేదు- కృష్ణ, జీసస్, శంకర, ప్రోఫేట్ , కబీర్, గురుద్జీఫ్ నిజానికి మీరేదో అవ్వడానికి ప్రయత్నిస్తే, అలా అవ్వలేకపోతే , అది చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మీరు దైవ సృష్టిలో ప్రత్యేకమైనవారు, సుందరమైనవారు. అందుకే మీరు మీలాగే ఉండండి. హృదయంతో అన్వేషిస్తూ ఉండండి. అత్యున్నత ధ్యాన స్థాయికి మరియు సమాధికి చేరండి. ఇది ఎప్పుడు సాధ్యమౌతుంది అంటే, దైవం మిమ్మల్ని విడిచిన చిరునామాలో మీరు ఉంటేనే! ఉత్తమ జాగృత స్థితికై మీరు మీరులాగే ఉండండి. అంతా దేవుని దయ.
22. అర్జునుడు దేవుడు ఎవరు ? ఎక్కడుంటాడు? నేను ఈ యుద్ధం గెలిచేలా ఆయన తోడ్పడతారా ?
కృష్ణ భగవానుడు ఆయన అచ్చం నీ వీపులా ఉంటారు. ఆయన్ను నీవు చూడలేకపోయినా, ఉన్నారని నీకు తెలుసు. నీ వీపును నీవు చూడలేకపోయినా, అది నీదేనని నీకు తెలుసు. నీవు చెయ్యగలిగిందల్లా దాన్ని అనుభూతి చెందడమే! కాబట్టి, దైవం తేలిగ్గా అనుభూతి చెందేట్టు, స్ప్రుశించేట్టుఉంటారు. అందుకే అర్జునా, నేను రధంలో నా వీపు నీవు చూసేలా కూర్చున్నాను. నీవు బాహ్య విషయాలు చూడక్కర్లేదు. విశ్వాసంతో నా వీపును చూసి, బాణాన్ని గురిపెట్టు, అది నేరుగా గమ్యాన్ని చేరుతుంది. నీ వీపు నీదని నీవనుకుంటావు. నీ వీపు నేనే అయినప్పటికీ అది నీది అని నీవనుకోవడం వల్ల, అజ్ఞానంలో ఉంటావు. నేనెల్లప్పుడూ నా వీపు ఇతరులదని అనుకుంటాను, దైవంగా నా ముందూవెనుకలు నావే అయినప్పటికీ, నేను జ్ఞానంతో ఉంటాను. కాబట్టి, పూర్ణ విశ్వాసంతో నా వీపును చూసి, బాణాలు సంధించు. నీవు సాధించాలని అనుకున్నది సాధిస్తావు. నీకిదే నా దిశా నిర్దేశం(ఉపదేశం).
23. దేవునితో ఒక సంభాషణలో...
అర్జునుడు పాచికలు వేసేముందు, శకుని కళ్ళు మూసుకుని ప్రార్ధించడం నేను చూసాను. అతను ఎవర్ని ప్రార్దిస్తున్నాడు ?
కృష్ణ భగవానుడు అతడు నన్ను ప్రార్ధిస్తున్నాడు. సరే కాని, యుధిష్టరుడు పాచికలు వేసేముందు ఏం చేసాడో నీకు గుర్తుందా?
అర్జునుడు అతడు కేవలం పాచికలు తిప్పాడు.
కృష్ణ భగవానుడు నవ్వాడు.
24. కృష్ణ భగవానుడు నేను కేవలం నా శంఖం పూరిస్తాను. నేను అది పూరించే సమయం వచ్చింది కనుక నేను శంఖారావం చేస్తాను. కాని, అర్జునా, నీవు వినాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే నీవది వింటావు.
అర్జునుడు నాకు అర్ధం కాలేదు ప్రభూ !
కృష్ణుడు అందుకే నేను తగిన సమయం వచ్చేంత వరకూ నీవు కేవలం వింటావు, కాని శ్రద్ధగా ఆలకించవు, అని చెప్పాను.
25. రాధ కృష్ణా, ప్రేమకు,స్నేహానికి మధ్య తేడా ఏమిటి ?
కృష్ణుడు ప్రేమ బంగారం వంటిది. కాని స్నేహం వజ్రం వంటిది. ప్రేమను పగులగొట్టినా, బంగారం లాగా దాన్ని పునర్నిర్మించవచ్చు. కాని వజ్రం(స్నేహం) ఒకసారి పగిలితే, అతకలేము.

No comments:

Post a Comment

Pages