రుణానుబంధ రూపేణా పశు, పత్ని,సుత,ఆలయ, అనేది ఆధ్యాత్మక సిద్ధాంతం.అందులోనిజలేలా ఉన్నా ఈ పని మనిషి అనే శాల్తి మనల్ని రుణ విముక్తుల్ని చెయ్యటానికి అవతరించిన కారణ జన్మురాలనటానికి సందేహం లేదు. గత ఎనిమిది సంవత్సరాలలోనూ , ఇప్పుడు మా ఇంట్లో వెలసిన సత్తెమ్మ తొమ్మిదో అవతారం. బీరువాలోంచి నా బట్టలు మాయమవ్వటం వాటి స్థానే ఇంట్లో రక రకాల స్టీల్ సామాన్లు ప్రత్యక్షమవ్వటం మా ఆవిడ ఆర్ధిక శాస్త్ర పాండిత్యాన్ని బట్టి జరుగుతుంటే అవి మా పనిమనిషి దివ్య సంకల్పానుసారం అదృశ్యమవ్వటం పరిపాటయి౦ది .పోయిన ప్రతి వస్తువు కి మాకు రుణం తీరిపోయింది అని తిలోదకాలివ్వటం కూడా అలవాటై పోయింది.
ఇంటి కొచ్చి అరగంటైనా కాఫీ రాకపోవటం చూసి మూడోసారి ఆర్త నాదం చేశాను. “తెచ్చే లోగా అంత తొందరేమిటండి? నాకున్నవి రెండే చేతులు ,అంట్లు తోమటం లో నే అవి సగం అరిగిపోయాయి “ అంటూ కాఫీ కప్పు తో ప్రత్యక్షమైంది మా ఆవిడ.
“కేజువల్లీవా? ఎరన్ద్ద్ లీవా ? డిస్మిసలా ?” అడిగేను.
“పనిలోనుంచి మాన్పించేసి పొమ్మన్నాను.సత్తెమ్మ ఎంత రభస చేసిందనుకున్నారు?
దానికి వన్ మంత్ నోటీసివ్వాలట లేకపోతే నెల జీతం యాభై రూపాయలు యిమ్మని ఒకటే అరుపులు పెడబోబ్బలునూ.
ప్రాణం విసిగి యభైరుపాయల దాని మొహాన్న కొట్టి పొమ్మన్నాను “ అంది.
“ఇల్లు కాలిపాయింది అని చెప్పి నాలుగు రోజులు పనిలోకి రాకుండా మొన్నోచ్చి ఏడిస్తే రెండు చీరలూ, దుప్పటి , ఇంకేవో గుడ్డ ముక్కలూ, ముప్పై రూపాయలూ ఇచ్చి ఓదార్చాను. మొన్ననగా పట్టుకేల్లిన పులుసు గిన్నె ఇంతవరకు తేలేదు . మధ్యాహ్నం
రాజలక్ష్మి గారింటికి కెళితే తెలిసింది . నెల్లాళ్ళ క్రితం ఇల్లు కాలిపాయిందని చెప్పి , వాళ్ళ దగ్గరా యిలాగే డబ్బు, బట్టా పాతా గుంజుకుందిట!”
“దానికి రెండిళ్ళున్నాయేమో?” అన్నాను పరధ్యానంగా.
“రెండు కాదు పద్నాలుగున్నాయి! ఇంత పచ్చిఅబద్దాలు ఆడతావా అనినిలదీసిఅడిగితే ‘అబద్దమాడక ఏం చేయ్యమంటారు! ఈ నౌకరి కేమైనా సెలవలిస్తారా బోనసులిస్తారా !’ అని అంటుంది
“పులుసు గిన్నె తిరిగి ఇచ్చేసిందా?”
“అసలలాంటి గిన్నె తాను తీసికెళ్ళలేదు” అంది,ఇంక కన్నీరే తరువాయి అన్నట్టు , బిక్కమొహం పెట్టి .
మా కాలని లో పని చేసే పనిమనుషులందరికి ఓ ప్రత్యేకమైన కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది . కొత్తవాళ్ళ నెవరిని ఈ కాలనికి రానివ్వరు . ఓ మనిషి మానేయ్యగానే మరో మనిషి కాస్త బెట్టు చేసి పది రూపాయలు ఎక్కువ మీద చేరుతుంది .ఇల్లు మారినప్పుడల్లా ఆ విధంగా వాళ్ళకి అయిదో పదో ఇంక్రిమెంటు౦టు౦ది.
ఒక్కొక్కపుడు “పాపం! అదే నయం “ అనిపించి వెనక పనిచేసి మానేసిన పనిమనిషినే మళ్ళి పెట్టుకోవటం కుడా కద్దు . ఉదాహరణకి యల్లమ్మ మా ఇంట్లో 1975 ఫిబ్రవరి నుంచి 1976 మార్చి వరకు నెలకు ఇరవై రూపాయల మీద , 1978 జూలై నుంచి 1979 నవంబర్ వరకు ముప్పయి అయిదు రూపాయల మీదా, 1981 ఏప్రిల్ నుండి 1982 ఆగష్టు వరకు నలభైయ్యయిదు రూపాయల మీద పనిచేసింది . ఇప్పుడు లేటెస్ట్ స్టార్ సత్తెమ్మ కి నెలకి యాభై ఇస్తున్నాం .
వీళ్ళని సంస్కరించి , వీళ్ళలో నైతిక పరివర్తన తీసుకురావాలన్న సదాశయం తో మా కాలని లో ఉన్న మహిళామండలి వాళ్ళు వీళ్ళ కోసం ప్రత్యేకం గా ఓ వయోజన విద్యా శిబిరం నడుపుతూ , వాళ్ళకి అక్షర జ్ఞానం తో పాటు లెక్కలు,చరిత్ర,పురాణేతి హాసాలు
చెప్తున్నారట. వీళ్ళకి చదువు మీద కించిత్తు కూడా ధ్యాస లేదు కాబట్టి,వీళ్ళుశాశ్వత విధ్యార్దినులవటం వలన ఈ కార్యక్రమం నిరాఘాటం గా జరిగిపోతుంది .రాను రాను ఈ విద్యార్దినుల ప్రాముఖ్యత కూడా పెరుగుతూ వచ్చింది .మహిళా మండలి లో రెండేసి సంవత్సారాల కొకసారి కార్యకర్త ల ఎన్నికలు జరుగుతాయి.ఈ ఎన్నిక సంరంభంలో సభ్యులను గురించి ప్రచార ద్రుష్పచారములలో ఈ పనిమనుషులు ప్రముఖ పాత్ర వహిస్తారు .క్రిందటి సారి ఎలక్షన్స్ లో మా ఆవిడ సెక్రెటరి అవ్వటానికి ప్రత్యర్ధి అయిన నాగరత్నం మీద సత్తెమ్మ చేసిన ద్రుష్పచారమే అంటారు .
“ మరింకో పనిమనిషి చూశావా?” అని అడిగేను.ఓ మనిషిని బర్తరఫ్ చేసి మరో మనిషి ని కుదుర్చుకునే మద్య వ్యవధి లో మా ఆవిడ అగ్ని పర్వతం లాగా పొగలూ సెగలు కక్కుతూ ఉంటుంది .
“నాగారత్నం గారింట్లోపనిచేస్తున్న మంగమ్మ చాలా నీటుగా చేస్తుందట. పదిరూపాయలు ఎక్కువ అయినా సరే దాన్నేకుదుర్చుకుంటున్నాను” అంది. ఆ నాగరత్నం భర్త వెంకట్రావు నా కొలీగ్. కిందటి సారి ఎలక్షన్స్ లో వాళ్ళావిడ ఓడిపోయాక పదిహేను రోజుల వరకు నాతో మాట్టాడ్డానికే సిగ్గు పడేవాడు.
సాయంత్రం క్లబ్ కని బయల్దేరి వెడుతుండగా దార్లో వెంకట్రావు కనపడ్డాడు . వాడేప్పుడు నాకంటే ముందే క్లబ్బుకి బయల్దేరేవాడు. “ఏరా, ఇంత లేటయింది ఇవ్వాళ?” అని అడిగాను.
“ఇప్పటి వరకు పనిమనిషి నానా గోడవా చేసి యాభైరుపాయలు గుంజుకు పోయింది. పోతే పోయింది కానీ శని విరగడైంది.
“ఎవరా పనిమనిషి ?” అని అడిగేను మనసులో కీడు శ౦కిస్తూ.
“మంగమ్మ నే బ్రహ్మ రాక్షసి . అదేమో సి.పి.ఐ దాని అన్న గారికిక్కడో కూరల బండి ఉంది . వాడు సి.పి.యం,దాని మొగుడు డిస్మిస్సిడ్ పోలీస్ కానిస్టేబుల్. వాడు పగలు కాంగ్రెస్ ఐ ; రాత్రి తాగోచ్చాక ‘తెలుగు దేశం .’ దాన్నో మాటంటే అన్నని మొగుడ్ని పెట్టి పంచాయతి పెట్టిస్తుంది ‘. అన్నాడు . నా మనస్సులో భయం ఘనీభవించింది. ఏం లాభం !స్వానుభవం వలన కానీ తత్వం బోధపడదు మా ఆవిడకి. ఒక దుస్సంఘటన జరగవలసినప్పుడు దాని తాలూకు దుశ్శకునాలు దశరధుడి కి , అభిమన్యుడు యుద్దానికి బయల్దేరేముందు ఉత్తరకి , సీసర్ సేనేట్ కి ముందు గానే కనిపిస్తాయి అంటారు . సీతా కళ్యాణమై అయోధ్యకి
వెళ్ళేముందర కాలిఫోర్నియా కి ఎన్నో అపశకునా లు కనపడ్డాయట. వాళ్ళు ఖాతరు చెయ్యలేదు. ఫలితం ఊరికే పోతుందా.
మొన్న భూకంపం, నిన్న మా పక్క కాలని లో బందిపోట్లు , ఇవ్వాళ పనిమనిషి గురించి విన్న వివరాలతోను మనస్సు పరిపరి విధాలా పోయిందేమో.రాత్రి ఒకటే కలత నిద్ర! ఎందుకో రాత్రి గబుక్కున మెలుకువ వచ్చింది .గది గుమ్మం లో చాకులు చేతుల్లో పట్టుకొని ఇద్దరు మొగాళ్ళు, మద్యన మా పనిమనిషి మంగమ్మ ప్రత్యక్షం అయ్యారు .వాళ్ళు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మా వైపే వస్తున్నారు .గట్టిగా అరుద్దాం అనుకున్న నోరు పెగల్లేదు .గబుక్కున వెనక్కి దోర్లేను. “అబ్బ! చంపెసారండి! ఒళ్ళు హూనమైపోయింది..
అదేమిటి ,పూనకమోచ్చినట్లు ఆ మొహం మీరూనూ ‘ అంటూ మా ఆవిడ లేచి కూర్చుంది. గుమ్మం కేసి బెదురు చూపులు చూస్తూ “అదేది.... దొంగమ్మ!”అన్నాను ,మాటలు తడబడుతూ.నా మొహం కేసి తేరిపారా చూసి “ఆ పూనం దేవో దుర్గా దేవో కల్లోకోచ్చు౦టుంది.కళ్ళు మూసుకొని ఆంజనేయ దండకం చదువుకోండి” అంది మా ఆవిడ.
మనిషి ని నీడ లా వెంటాడుతూ అనుక్షణం మృతువు వైపు నెట్టే బ్రహ్మ రాక్షసి ఎవరు అంటే – వయస్సు.మృత్యువు కంటే భయంకరమైనది వృద్దాప్యం. వృద్దాప్యం కంటే దుర్బర మైనది యాభైయ్యోపడి.భార్య మాట వినదు ,పిల్లలు ఎదురు తిరుగుతారు ,ఓపిక తరుగుతుంది,సుఖశాంతులు కరువవుతాయి,పొగడ్తకు మొహం వాస్తాము,భవిష్యత్ అంటే ఆందోళన, సందేహాలు,భయం. రోజులు మనవి కానప్పుడు తాడే పామై కరుస్తుంది అంటారు .
అంచేత నా జాగ్రత్త లో నేనుంటునే ఉంటాను. పొద్దున్నే లేచి బాత్ రూమ్ లో కి వెళ్ళబోతూ అడ్డం గా స్టూల్ మీద కూర్చున్న మా ఆవిడ భుజం తట్టి కాస్త తప్పుకో అన్నాను .”ఏమిటయ్యోయ్ మీద చెయ్యేత్తన్నావ్!” అన్న అపస్వరం వినపడగానే మరి కళ్ళజోడేట్టుకొని, నైలాన్ చీర కట్టుకొని కుర్చీ పీట మీద హుందా గా కూర్చున్న వ్యక్తి ఎవరా అని కాస్త పరకాయించి చూస్తుంటే ఎడమ కన్నదిరింది.దాంతో కన్ను కొట్టేనని తారాజువ్వలా లేచినది మా కొత్త పనిమనిషి మంగమ్మే అని యిట్టె గ్రహించాను .
నే నంతటి మొగాడ్ని కాదని మా ఆవిడ హామీ ఇచ్చిన మీదట గ్రహం శాంతించింది .మంగమ్మ పని లో చేరాక మా ఆవిడ మనసుకి శాంతి మరింత దూరమైంది. వారానికి ఒక రెండు రోజులైనా పని ఎగ్గోట్టేస్తుంది.గిన్నెలు,బట్టలు యధా ప్రకారం అంతర్ధానం అవుతున్నాయి . పైగా ,దాని నోరు కూడా వాడి .అన్నిటి కంటే ముఖ్యమైన కారణం మరొకటి ఉంది . మంగమ్మ మంచిదని నమ్మించి పన్లో పెట్టుకోమని ప్రోత్చహించటం నాగరత్నమ్మ తో కుమ్మక్కు అయిన ప్రతిపక్షాల కుట్ర వల్ల జరిగిందట.దానికి తార్కాణం గా ఆ మర్నాడే బంగారం లాంటి సత్తెమ్మ నాగరత్నమ్మ ఇంట్లో దానికి సాయం యిదంతా తన పన్నగామేనని అవిడేళ్లి సబ్యులందరి చెవిలోను కోడై కూస్తుందట.దానా దీనా మా ఆవిడ బ్లడ్ ప్రషర్ పెరిగిందంటే ఆచ్చర్యమేముంది!ఉదయం తల దువ్వు కుంటూ అద్దం లో చూస్తుండగా అప్రయత్నం గా నా ద్రుష్టి మంగమ్మ ప్రతిబింబం మీద పడింది . అటు ఇటూ దిక్కులు చూస్తూ ఏదో చీర చాటున దాచుకొని గబా గబా మెట్లు దిగుతుంది . అనుమానం వేసి పిల్లిలా అడుగులేసుకుంటూ బాల్కని అంచుకెళ్ళీ ముందుకు వంగి కింద సందులోకి చూశాను . ఓ స్టీల్ గిన్నె తన సంచి లోకి దోపేసి పైన చక్కగా ఏవో గుడ్డల మడతలతో కప్పేసింది .’చాలా నీట్ గా పని చేస్తుందని ‘మా ఆవిడకి చెప్పేరట,అదేనేమో ! నేను వెంటనే
వెళ్లి మా ఆవిడ చెవి లో ఊదాను మంగమ్మ పైకొచ్చింది.మా ఆవిడ కిందకు వెళ్లి ఆ సంచి పైకితెచ్చి మంగమ్మ కెదురుగా దాంట్లోనుంచి మేజీషియన్ లాగా గిన్నె పైకి లాగింది. ఇదంతా చూస్తూ , ఏమి చూడనట్టు గా నటిస్తూ మంగమ్మ స్టూల్ మీద కూర్చొని అంట్లు తోమటం లో నిమగ్నురాలైంది.
“గిన్నె చూసావా? ఇదిగో మంగమ్మ, మా గిన్నె నీ సంచిలో కేలా వెళ్ళింది?”
అంటూ మా ఆవిడ నిలదీసి అడిగింది.“నేనే సంచిలో ఎట్టుకున్నాను. అది మీ గిన్నైతే ఇది మా గిన్నై ఉంటాది”
అంటూ ఇంచు మించు అలాంటిదే తన కుర్చిపీట పక్కనున్న గిన్నెకేసి చూపెట్టింది. మా ఆవిడ ఆ గిన్నె కేసి చూసి
నిర్ఘాంతపోయి అక్కడే పెట్టేసింది.
......................................................................
మంగమ్మ తటాలన లేచి , మా ఆవిడ చేతిలో ఉన్న సంచి లాక్కొని , సగం తోమిన అంట్లు అలాగే వొదిలేసి చెయ్యి కడుక్కొని , సంచి లోని నాప్కిన్ తో చెయ్యి తుడుచుకొని , మా ఆవిడ మొహం కేసి కిటికీ లోంచి చూస్తున్న నా మొహం కేసి చుర చుర చూసి మాటా మంతి లేకుండా వెళ్ళిపోయింది.
నేను ఆఫీస్ కు బయల్దేరుదామనుకుంటు౦డగా మాసిపోయిన కాకి చొక్కా నిక్కర్లు తోడుకున్న ఓ నలబైయైదేళ్ళ ఆసామి, లాఠి కర్ర లాంటిది చంక నెట్టుకొని ప్రత్యక్షమై” నమస్కారం సార్” అన్నాడు కుర్చీ మీద కూర్చుంటూ.
“ఎవరు నువ్వు !” అని అడిగేను, వాడి వాలకం, వాడు కుర్చీ మీద కూర్చున్న పద్ధతి కేసి పరీక్షగా చూస్తూ.
“ వన్ మినిట్” అని కిటికీలోంచి రోడ్ మీదకు చూస్తూ “ రా రా వెంకటేశ్వర్లు , అయ్య ఉన్నాడు “ అని కేకేశాడు.
ఇంచు మించు ఇలాంటి అవతారమే – ఎటోచ్చి చారల పైజమా గళ్ళ చొక్కాలతో ప్రత్యక్షమై
“గుడ్ మార్నింగ్ సార్!”
అంటూ మరో ఖాళి కుర్చీ ని అధిష్టించాడు.
“మీరెవరు ? ఎం కావాలి ? నాకు ఆఫీస్ కెళ్ళే టైం ఐంది . నాతో ఏ౦ పనో త్వరగా చెప్పండి “ అన్నాను .చూడ్డానికి
ఇద్దరు రౌడి ల్లా ఉన్నారు .కుర్చీలో కుర్చున్నానన్న మాటే గాని కాళ్ళలో వొణుకు పుట్టింది.
“ నా పేరు వెంకటేశ్వర్లండి. ఈ కాలనిలో కూరల బండితిప్పుకుంటూ యాపారం చేసుకుంటానండి. ఈడిపేరు ఈర్రాజ౦డి,
మీ ఇంట్లోపనిచేసేమంగమ్మ పెనిమిటినండి.మంగమ్మ మా చేల్లెలండి.మీరు మరిబిజీగా ఉంటే మరికోపాలి సాయంత్రం.."
“ సరే , తొందరగా చెప్పండి “ అన్నాను ,మళ్ళి సాయంత్రం వీళ్ళు మా గృహం పావనం చేసే ప్రమాదాన్ని తప్పిద్దామని.
“మా ఆవిడ మంచి మనిషేకందా వెంకట్రావ్ గారింట్లో మానేసి మా ఇంట్లో పనిచెయ్యి , మరో పది రూపాయలు
ఎక్కువిత్తానని చెప్పి మీ వైఫ్ గారు కుదుర్చుకున్నారు ! మీరు మర్యాదైనోల్లె కందా అని మా ఆవిడా సేరింది . సెరిన రోజు పొద్దున్నే మా ఆవిడ బుజం తట్టి కన్నుకోట్టేరు”అన్నాడు మంగమ్మ మొగుడు వీర్రాజు. వీడు డిస్మిస్డ్ పోలీస్ కానిస్టేబులని వెంకట్రావు చెప్పాడు
...........................................................................
“తేల్లార గట్ట మసగ చీకట్లో నేను కళ్ళజోడు పెట్టుకోకపోవటం వల్ల అలా జరిగింది అని ఆనాడే చెప్పేను “
“సెబితే సరిపోద్దండి? ఇయ్యాళ పొద్దుగాల మా ఆవిడ మీద దొంగ తనం కట్టి సంచి సెర్చ్ చేసారంట.మా అవిడసలె అభిమానం తో సచ్చే ఆడది. ఇంతవమానమైపోయాక బతుకెందుకని,గుడిసెలోకి రాగానే వొంటి మీద కిరసనాయిలు పోసేసుకొని అగ్గేట్టేసుకుంటుంటే సటుక్కున అగ్గిపెట్టె లాగేసుకున్నాన౦డి. మరి నేనో చెనం లేటయితే మరి మా యావిడ సూసైడయి పోనాండి?”
“కళ్ళ ముందరే మా గిన్నె పట్టుకుపోతుంటే వెతికి పట్టుకోకుండా వదిలేస్తామా?”
“ వదిలెయ్యకూడదండి మనిషిని పట్టుకోండి . కానీ సెర్చ్ చేయటానికి మీకు పవర్స్ లేవండి . మీరు పోలీస్ రిపోర్ట్ ఇయ్యాల పోలీస్ వచ్చి పంచనామా జరపాలా. ఆళ్ళు సెర్చ్ చేయటానికి పవర్స్ ఉన్నాయండి . ఆళ్ళు గిన్నె తీసి దాని మీదున్న ఫింగర్ ప్రింట్లు తీత్తారండి. ఆదండి రూల్స్.మీరు సెక్షన్ 98 సి.అర్.పి.సి.,సదవండి తెల్సుద్ది” అన్నాడు డి.పో.కా . వీర్రాజు.
“ఇదిగో,పొద్దున్నే ఆఫీసుకెళ్ళే టైం లో ఏంటి గొడవ? మీ గిన్నె మీరట్టుకుపొండి.మంగమ్మ ఈ నెలలో వారం రోజులు పని
చేసింది,ఇదిగో ఈ పదిహేను రూపాయలు తీసుకెళ్ళండి .ఇంకా పిచ్చి పిచ్చి వేషాలేస్తే డి.యస్.పి.,శేషగిరిరావు కు ఫోన్
చేస్తాను .వాడోచ్చి సెటిల్ చేస్తాడు .”
“సిత్తం. ఇవి కూడా తవ దగ్గిరే ఉంచండి .ఆ డి.యస్.పి.గారు రాగానే కబురెడితే వస్తామండి” అన్నాడు మం. మొ. బంక లాగా
“ సూడండి బాబూ! రెండునిమిషాలిడి౦టికి వెళ్ళటం లేటైతే మంగమ్మ వొళ్ళు కాల్సుకు సచ్చిపోయేద౦డి! అంత సీకటి పొద్దుటేల తవరో మనిషిని జూసి ఓ మనిషనుకున్నారు గందా! మరి ఓ గిన్నె చూసి ఓ గిన్నె అనుకోకుడదా బాబూ? అంతా దాని గెహశారం.అసలే అగ్గిలాంటి ఆడది. ఆ అవమానం తో దాని పాణం కుతకుత లాడిపోనాది.పాపం ,కిరాసనాయిలోసుకొని..? అంటూ దాని అన్నగారు వకాలత్ పుచ్చుకున్నాడు ,పొడి కళ్ళు “ చూడు , వెంకటేశ్వర్లు! ఇంకా ఆర్గుమెంట్లు అనవసరం . నేనా గిన్నె చూడక పోతే, పైనున్న తన గిన్నెలో ఏ కూరో పులుసో వేసుకొని ,’అమ్మా,యిది నా గిన్నె చూసుకొండని చెప్పి పట్టుకుపోను .మా గిన్నె సంచి తోటే వెడుతుంది”అన్నాను.
“ మీరనుకుంటే సరిపోద్దాండి ? దానికేవిడెన్సు౦డోద్ద౦డి?” అన్నాడు మంగమ్మ మొగుడు బుసకొడుతూ.
“ఈర్రాజు! నువ్వు నోరుమూసుకో. మీరు చెప్పేది రైట్.ఇంకా ఆర్గుమెంట్లు ఎందుకండి ?ఓ రెండొందలాడి మొకాన్న
పారేసి సెటిల్మెంట్ చేసి పారెయ్యండి...”
“ రెండు వందల రూపాయలా! నాన్ సెన్సు ! ఇదిగో ఓ నెల జీతం అరవై రూపాయలిస్తాను తీసుకో . మరో ఇంట్లో పని
కుదరటానికి టైం పట్టినా యిబ్బందు౦ డదు “ అంటూ ఓ అరవై రూపాయలు మళ్ళి పడేసాను .
“ సూడండి ,తమరు గవర్నమెంట్ ఆఫీసరు. పెద్ద జీతం , లంచాలు,మామూళ్ళు, వైట్ బ్లాకు ఉంటాయండి! మాకేమున్టాయండి? రెక్కాడితే దోక్కాడిద్ది.కడం నూటపాతిక ఇప్పించేయ్యండి.ఆడి పెళ్ళానికి గండం గడిసిద్ది,తమకి పరువు నిలబడిద్ది.”అంటూ మళ్ళి గీతోపదేశం ప్రారంభించేడు,అరవై జేబులో పెట్టుకొని .
“పొద్దున్నే యింటికోచ్చి ఏమిటి అల్లరి ? చేసింది దొంగతనం పైగా , ఈ సతాఇంపు! నేని౦కోక్క పైసా ఇవ్వను “ అన్నాను .వెధవ బ్లాక్మెయిలింగూ వీళ్ళును!
“ఇవ్వనంటే ఎలా కుదురుద్దండి? మీకుటు౦బం మూలాన్న మా కుటుంబం అన్యాయమైపోయింది.ఒక కేసా రెండు కేసులా! మానబంగం,అవమానం,సూసైడ్!ఇవన్ని కాలనివాళ్ళకితెలిస్తే... తవరా గవర్నమెంట్ఆఫీసర్ ...మీవైఫ్ గారా ఆడోళ్ళ సంగానికి సెక్రెటరీ..”
నా దగ్గర నూటయాభై రూపాయలు పిండేసి పైగా బెదిరింపులు కారు కూతలు కూసి పోయేరు , ఆ యమ కింకరులు
ఇద్దరు .ఇదంతా హల్లో కూర్చొని వింటున్న మా ఆవిడ” ఏవండి! ఈ కాలని వాళ్ళకో దణ్ణం. మీరు వెంటనే మరో కాలని
లో ఇళ్ళు చూడండి “ అంది.
No comments:
Post a Comment