వెజిటబుల్ కిచిడి - అచ్చంగా తెలుగు

వెజిటబుల్ కిచిడి

Share This

@ @ @ @ వెజిటబుల్ కిచిడి @ @ @

ఉషారాణి నూతులపాటి

అన్ని వయసులవారికీ ఆరోగ్యకరంగా ,రుచిగా వుంది త్వరగా జీర్ణమయ్యే ఆహారం కిచిడీ..ఇది పసివారి నుండీ వృద్ధుల వరకూ చక్కని పోషకాహారం..త్వరగా
చేసుకోగలం. దీనికి కావలసిన పదార్ధాలు.. కావలసిన పదార్ధాలు :     1. బియ్యం 1 గ్లాసు, కంది/పెసర పప్పు 1/2 గ్లాసు, సోయా నగ్గెట్స్ / చిప్స్ 1/4 కప్పు , ఆలూ + బీన్స్+ పచ్చి బఠానీలు + కాలీఫ్లవర్ + కారట్ +పచ్చిమిర్చి (3),+ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి 3 కప్పులు., పసుపు,ఉప్పు,నూనె, పోపు దినుసులు, మిరియాలు, నెయ్యి .,కరివేపాకు ,కొత్తిమిర.   తయారు చేయు విధానము :   ముందుగా బియ్యము + పప్పు కడిగి కాసిని నీళ్ళుపోసి పెట్టుకోవాలి. కుక్కర్ వేడి చేసి కొద్దిగా నూనె + నెయ్యి వేసి పోపుదినుసులు + జీలకర్ర + మిరియాలు,కరివేపాకు వేసుకోవాలి. తరవాత కూరగాయ ముక్కలూ ,సోయా నగ్గెట్స్ వేసుకొని పసుపు వేయాలి..కాసేపు కలిపి కడిగి ఉంచుకున్న బియ్యం పప్పు వేసుకోవాలి. అన్నీ మరోసారి కలిపి ,తగినంత ఉప్పు వేసుకొని , 2 గ్లాసుల నీల్లుపోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి.. వెయిట్ వచ్చాక మూతతీసి మరి కాస్త నెయ్యి, కొత్తిమిర చల్లుకొంటే ఘుమ ఘుమ లాడే కిచిడీ సిద్ధం.. కీరా పెరుగు పచ్చడితో హాయిగా తినెయ్యొచ్చు..ఆవకాయ తో కూడా..

No comments:

Post a Comment

Pages