వైద్యులు ఒక శరీర అవయవాన్నితీసి ఇంకోటి అమర్చి అవయవ మార్పిడి చేయగలుగుతున్నారు. కృత్రిమ పరికరాన్నిఅమర్చి మనిషిలో లోపాల్నిసరిదిద్దగలుగుతున్నారు. కానీ మనిషిలో ప్రాణాన్నిపోయగలుగుతున్నారా? ఒక మనిషి నుంచి మరొక మనిషికి ప్రాణాన్నిTransfer చేయగలుగుతున్నారా వైద్యులు? లేదే! ఈసృష్టిలోచరాచర ప్రాణికోటిలో ప్రాణం పోసేవాడే ఆభగవంతుడు. మనిషిలో కనిపించనిది కానీ మనిషిని చైతన్యంగా చేసే ఆచలనమే ప్రాణం అందామా? ఆచలనమేఆత్మ. ఆఆత్మశాశ్వతమైనది. శరీరంఅశాశ్వతం. ఆఆత్మశరీరంలోప్రవేశించినపుడుమనిషిజీవనంమొదలౌతుంది. శరీరాన్నిఆఆత్మవదిలినపుడుమనిషిమరణించాడుఅంటారు. ఈఆత్మశరీరాన్నివదిలిఅనంతవాయువులోకలిసిపోయిందిఅంటాము. అంటేఆఆత్మ - జీవాత్మపరమాత్మనిచేరి, పరమాత్మలోఐక్యంఅవుతుంది. దానినేమోక్షంఅంటారు. ఆత్మపరమాత్మనిచేరటంఅంటేనువ్వుచేసేపాపపుణ్యకర్మలమీదఆధారపడిఉంటుంది. పాపంచేస్తేనరకలోకానికిపుణ్యంచేస్తేస్వర్గలోకానికిచేరతారుఅంటారు. అంటే మన అకౌంట్ లో క్రెడిట్ ఎక్కువ ఉంటే స్వర్గానికి తరవాత నరకానికి, డెబిట్ ఉంటే నరకంలోకి చేరతారు. ఈ రెండూ ప్రమాదమే. ఈ రెండూ కాకుండా, జన్మించి, చైతన్యం కలిగి ఊహ తెలిసి పరిపక్వత చెందే దశ లో భగవన్నామ సంకీర్తనం చేస్తూ సదా భగవంతుని ధ్యానిస్తూ నిన్ను నువ్వు భగవంతునికి అర్పించుకుంటూ భగవంతునితో సంబంధం అలవరుచుకుంటూ నిన్ను నువ్వు మలుచుకోగలగాలి. అంటే మాయ బారిన పడకుండా - మాయ అంటే ఏమిటి? ఆవేశకావేషాలు, బంధాలు, అనుభందాలు, దురలవాట్లు, దుర్వసనాలు, వస్తువులపై వ్యామోహం. జీవితం పెడదారిన పడకుండా నిన్ను కాపాడుకోవడానికి భగవానుని శరణుజొచ్చిన అదే నీ జీవిత ఆయుధమౌతుంది. జీవితంలో నీ జన్మకు ఒక సార్ధకత ఏర్పడుతుంది. నీ జన్మ యొక్క ఉద్ద్యేశ్యం ఏమిటి? జీవితంలో కోటీశ్వరునిగా జీవించటమా? సాటి మనిషిని హింసించటమా? పార్టీలు, సరదాలు, విలాసాలు, వినోదాలతో గడపటమా? ని ఉనికిని ప్రపంచానికి చాటటమా? నీ జీవనానికి గమ్యాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి? పాఠశాలలో విద్యనభ్యసించేటపుదు లేక చిన్నతనంలో సహజంగా నీకే సొంతమైన కొన్ని గుణాలంటూ ఉంటాయి.వాటిని నీ తల్లితండ్రులు గమనించి ఉండవచ్చు లేదా నువ్వే ఆ గుణాల్ని పెంపొందించుకుంటూ దానినే జీవిత లక్ష్యంగా, ఆశయంగా మార్చుకోవచ్చు. జీవితం ఆ దిశలో పయనిస్తున్నపుడు నువ్వు ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అనే మీమాంస వచ్చినపుడు నీ దైనందిన జీవితంలో నీలో చైతన్యం కలిగించే ఆత్మ అనేది ఏదైతే ఉందో దానికి ఆలంబనగా దైవస్మరణ చేస్తూ ఆ పరమాత్ముని అభయంగా తెచ్చుకున్నపుడు ఆ భగవంతుడు నువ్వు వెళ్ళే మార్గం సరైనదా కాదా అనే విచక్షణా జ్ఞానం, ఆలోచనా శక్తి నీకు సొంతం చేస్తాడు. నువ్వు నిర్దేశించుకున్న గమ్యంలో నీ శక్తితో లోకానికి మంచి చేయగల్గుతున్నావా? లోకకళ్యాణం జరుగుతోందా లేక వినాశనం జరుగుతోందా? ఇవన్నీ కలగలిపి నీ జన్మ, చైతన్యంతో నువ్వు నిర్వర్తించిన భాద్యతలు. ఆ చైతన్యం నీ శరీరం వీడిన నాడు మరణం సంభవించింది. ఇదే జీవితం. ఆత్మ చేరిక + శరీరం = జన్మ ఆత్మ - మానవశరీరం = మరణం ఆత్మ + భగవంతుడు = మోక్షం ఆత్మ + పుణ్యకార్యాలు = స్వర్గం -->ఉత్తమ మానవ జన్మ ఆత్మ + చెడుకార్యాలు = నరకం -->హీన జన్మ లేదా జంతుజన్మ ఆత్మ + శరీరం + భగవంతుడు = మోక్షం -->ఇక మరో జన్మ అంటూ ఉండదు. భగవద్గీతమహాగ్రంధం నుంచి ఇది నేను నేర్చుకున్న, తెలుసుకున్న జీవిత సత్యం.
జీవితసత్యం : విజయ గొల్లపూడి (సిడ్నీ, ఆస్ట్రేలియా)
Share This
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment