వాణిపుత్రుడు వాడినేమి కోరేది
శ్రీనివాస్ యనమండ్ర
వాణిపుత్రుడు వాడినేమి కోరేది
ఆణిముత్యాలిచ్చువాడినేమి అడిగేది
ఏమికోరేది వాడినేమి అడిగేది
ఏమికోరేది వాడినేమి అడిగేది
తేనెలొలికే నా తేటతెనుగుకి భావసొబగులద్దినవానినేమి కోరేది
ప్రణవనాదముల తాళములకుపదగతులు పరచినవాని నేమిఅడిగేది
ఏమికోరేది వాడినేమిఅడిగేది
ఇంధ్రదనసున సప్తవర్ణములకు స్వరముకూర్చినవాని నేమికోరేది
చంద్రదర్శనాసమయమున విరహవీచికలకు రూపమిచ్చినవాని నేమిఅడిగేది
ఏమికోరేది వాడినేమి అడిగేది
చరణాన చిరుపదజల్లులతో మనసుపులకింపచేయువాడు…..వానినేమికోరేది
పల్లవిన ఆ జీవసాఫల్యమంత్ర మందించువాడు….వానినేమిఅడిగేది
స్వరగతలు దాచాడు స్వరపేటికన….వానినేమికోరేది
సీతమ్మరామయ్య…..సిరివెన్నెలకురిపించు సీతరామయ్య
వాణిపుత్రుడు వాడినేమి కోరేది
ఆణిముత్యాలిచ్చువాడి నేమిఅడిగేది
No comments:
Post a Comment