"రవము" అంటే శబ్దం. "అరవం" అంటే నిశ్శబ్దం. తమిళ భాష ఉచ్చారణలో చాల ప్రత్యేకం. చెవులకు ఇంపుగా వుండదు అనే విషయం అందరూ ఒప్పుకొంటారు. (వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అదీ న్యాయమె కదా). వ్యంగ్యంగా, శబ్దం లేని నిశ్శబ్దమైన భాష అని వాడుకుకలో ఆ భాషనీ "అరవం" అని పెట్టి వుంటారు.అలాగే, అర్థం పర్థం లేకుండా, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసే చాకిరీని "అరవ చాకిరీ" అంటారు. పాపం, దాంతో అరవ వాళ్ళకి ఏమి సంబంధం లేదు.(ఎస్ గుంటూరు రామకృష్ణ గారు )
నాకో చిన్న సందేహం. ఎవరైనా తీర్చండి. పని ఎక్కువ అయినపుడు, "అరవ చాకిరీ" అంటాము కదా, అంటే అరవ వారు ఎక్కువ పని చేస్తారు అని అర్ధమా, లేక వారు ఎక్కువ పని మిగతా వారితో చేయించుకుంటారు అని అర్ధమా? అసలు ఈ పదం ఎక్కడినుంచి వచ్చింది? తెలిసిన వారు దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు.(పద్మ గారు)
No comments:
Post a Comment