పాలకూర పకోడీలు కరకర లాడుతూ మంచి రుచిగావుంటాయి. ఇవి శనగపిండి తో చేసే ఉల్లిపాయ పకోడీల్లా, ఎక్కువ నూనె పీల్చవు. పైగా ఎక్కువ ఆకుకూర..అందునా పాలకూర..పిల్లలకి మంచి స్నాక్ అవుతుంది. స్కూల్ నుండి రాగానే ,ఇంట్లో చేసిన పదార్ధాలనే ఇస్తే,ఆరోగ్యం కూడా.ఇందుకు కావలసిన పదార్ధాలు ..
కావలసిన పదార్ధాలు :
1.శుభ్రంచేసి,కడిగి,తరిగిన పాలకూర 5 కట్టలు,
2. శనగపిండి 2 కప్పులు ,
3. బియ్యప్పిండి పావు కప్పు,
4. అల్లవేల్లుల్లి పేస్ట్ 1 sp.,
5.ఉప్పు+కారం తగినంత,
6. కొత్తిమిర తరుగు 1 కట్ట,
7.పచ్చిమిర్చి 3 సన్నగాతరిగి,
8. జీలకర్ర పొడి 1 sp,
9 . వేయించడానికి నూనె తగినంత .
చేయువిధానము : ఒక వెడల్పైన పాత్రలో శనగపిండి + పాలకూర తరుగు + బియ్యప్పిండి + అల్లం వెల్లుల్లి పేస్ట్ + జీరా పొడి+ఉప్పు+కారం +కొత్తిమీర + పచ్చిమిర్చి తరుగు వేసి అందులో కాచిననూనే ఒక పెద్ద చెంచాడుపోసి బాగా కలిపి,కొద్దిగా నీరుచల్లి (జాగ్రత్త గా కలపాలి ,ఎక్కువ నీరు పట్టదు .)గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రై పాన్ పెట్టి ,నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడెక్కాక.. చేతిలోకి పెద్ద పిండి ముద్ద తీసుకొని ,పకోడీల్లా నూనెలో వేయాలి..మీడియం ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ..పైన ఇష్టమైతే కొంచం ఛాట్ మసాలా చల్లుకొంటే ..వేడి వేడి పాలక్ పకోడీలు సిద్ధం.ప్రయత్నిస్తారు కదూ.. :)
No comments:
Post a Comment