కలం రాయమంటుంది....
- సత్య
నిలువెల్లా పరవశం తో
వర్షంలో తడుస్తూంటే
చినుకులనొక్కొక్కటినీ
లెక్క పెట్టమనట్టుందీ వ్యవహారం
చినుకుల్లో తడవాలో
చినుకు లెక్క పెట్టాలో
అర్థం కావడం లేదు
తనలోని తలపులని ఉన్నది ఉన్నట్టు
బరువైన భావాలని విని, విన్నట్టు
తడిసిన తడినంతా
తోడి పెట్టమన్నట్టు..
రాస్తూ రాసూ
కాలంతో బతుకెలా బతకాలో
బతుకుతూ బతుకుతూ
కలంతో భావాలెలా వెతకాలో
అర్థం కావడం లేదు
కాని..
కలం రాయమంటుంది.
No comments:
Post a Comment