ఇడ్లీ, దోసె, పెసరట్ల లోకి అల్లం చట్నీ: పెయ్యేటి శ్రీదేవి - అచ్చంగా తెలుగు

ఇడ్లీ, దోసె, పెసరట్ల లోకి అల్లం చట్నీ: పెయ్యేటి శ్రీదేవి

Share This

 కావలసినవి:  కొంచెం పుట్నాలపప్పు, అల్లంముక్క, ఎర్రకారం, కరివేపాకు, తీపికి సరిపడ బెల్లం, ఉప్పు, నానబెట్టిన చింతపండు.

తయారు చేసే విధానం:  చిన్న మిక్సీగిన్నెలో పుట్నాలపప్పు, అల్లంముక్క, ఎర్రకారం, కరివేపాకు, ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి.  తరువాత నానబిట్టిన చింతపండు, బెల్లంపొడి, నీళ్ళు పోసి మళ్ళీ తిప్పాలి.  తీపి, పులుపు మీకు తగినట్లుగా వేసుకోండి.

ఈ చట్నీ ఇడ్లి, దోసెల్లోకి, పెసరట్లలోకి చాలా బాగుంటుంది.  ఈ చట్నీ ఎర్రకారం బదులు పచ్చిమిరపకాయలు వేసి కూడా చెయ్యచ్చు.  మధుమేహం ఉన్నవారికి బెల్లం బదులు సుగర్ ఫ్రీ పౌడరు వాడవచ్చు.

No comments:

Post a Comment

Pages