కావలసినవి: గుత్తివంకాయకు వాడే వంకాయలు - 6, ఆలుగడ్డ - 1, ఉల్లిపాయలు - 4, టొమేటోలు - 4, కేరట్ - 1, ఉడికించిన పచ్చి బటానీలు, ఎర్రకారం, ఉప్పు, ఒక స్పూను MTR సాంబారు పొడి, కొంచెం జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర.
తయారు చేసే విధానం: వంకాయలు గుత్తిగా కొయ్యాలి. ఆలుగడ్డ, ఉల్లిపాయలు ముక్కలుగా తరుగుకోవాలి.
స్టౌ వెలిగించి మూకుడు పెట్టి, నూనె, నీళ్ళు కలిపి వెయ్యాలి. అందులో గుత్తివంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి, మూత పెట్టి సన్నమంట మీద మగ్గనివ్వాలి. తరువాత వీలును బట్టి మంట పెద్దది చేసుకోవచ్చు. నీళ్ళన్నీ ఇగిరిపోయి నూనెలో వున్నట్లే వుండి మెత్తగా మగ్గుతాయి. నాలుగు టొమేటోలు, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎర్రకారం మిక్సీలో రుబ్బి, ఆ గ్రేవీ కూరలో వేసి ఉడికించి, బటానీలు, కొత్తిమీర జల్లి కలియపెట్టాలి. అప్పుడు ఒక స్పూను MTR సాంబారుపొడి చల్లాలి. తరవాత పైన కేరట్ తురుము వెయ్యాలి. ఈ కూర చాలా తేలికగా చిటికెలో అయిపోతుంది. అతిథులొచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. మరెందుకాలస్యం? మొదలుపెట్టండి.
No comments:
Post a Comment