స్వేచ్చ : భారతి కాట్రగడ్డ - అచ్చంగా తెలుగు

స్వేచ్చ : భారతి కాట్రగడ్డ

Share This
ఏమిటా వస్త్రధారణ?
ఎందుకీ అవహేళన?
 ఒంటికి బట్టే కరువా?
 లేక మోయలేని బరువా?

యాభై కిలోల ఒంటికి అరమీటరు ముక్కా?
 ఎటుపోతుంది అతివ బతుకు ?
అతుకులముక్కల్లో కొట్టుకుపోతూ!

ఎందుకా అంగాంగ ప్రదర్శన ?
శరీరం నాదేనన్న సిగ్గులేనితనమా!
ఆడదంటే వ్యాపారవస్తువా?
లేక ఆడుకునేబొమ్మా?
ఎటుపోతుంది వ్యవస్థ?
ఏమైపోతుంది సంస్కృతి?

గుండెల మీద పైట బరువై
కప్పుకునే బట్ట బరువై
అర్ధనగ్నంగా, అనాగరికంగా
విపరీతంగా తిరిగితేనే స్వేచ్చా?

 ఎంతో విలువైన సంస్కృతీ సంప్రదాయాలున్న
 పవిత్రమైన నేల మనది.
అలాంటి నేలపై స్త్రీని భూమాతతో ఆదిశక్తితో,
లక్ష్మీదేవి రూపంతో కొలిచారు!
అలాంటి స్త్రీలకి వారసులం మనమంతా!

ఇలా సభ్యతా సంస్కారాలు మరచిపోయి
 మన విలువలను పోగొట్టుకోగూడదు!
విదేశస్థులు సైతం మన వస్త్రధారణని అనుసరిస్తుంటే
మనమిలా అర్ధనగ్న దుస్తులతో
అంగడిబొమ్మలమవుతున్నాము!
ఇకనైనా కళ్లు తెరవండి!
మన నిండైన వస్త్రధారణతో అందరికీ ఆదర్శం కండి!!
పాశ్చాత్య పోకడలకి నీళ్ళొదలండి!
 ( మితిమీరిపోతున్న స్త్రీల వస్త్రధారణ చూసి ఆవేదనతో రాసిన కవిత - భారతీరాయన్న)

No comments:

Post a Comment

Pages