అటుకుల ఉప్మా (పోహా )
అటుకుల ఉప్మా ఆరోగ్యానికి మంచిది..బొంబాయి రవ్వ ఉప్మా కి ఆయిల్/ నెయ్యి ఎక్కువగా ఉపయోగించాలి. పైగా అది ఎక్కువ శుద్ధి చేసినది (రిఫైండ్ )అవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు..అటుకులు (మరీ తెల్లగా ,పల్చగా వున్నవి కాకుండా దొడ్డు అటుకులు వాడాలి )ధాన్యం నుండి తయారు అవుతాయి..అందులోని ముడిబియ్యం వల్ల విటమిన్లను కోల్పోదు. త్వరగా పూర్తి అయ్యే వంట. రుచికరం కూడా..ఉపవాసాల్లో కూడా వాడుకోతగ్గ , ఉపాహారం ఇది. కావలసిన పదార్ధాలు : 1.అటుకులు 200 గ్రా., 2.అల్లంముక్కలు, 3.పచ్చిమిర్చి ముక్కలు ,4.కరివేపాకు,కొత్తిమిర , 5.జీడిపప్పు/పల్లీలు , 6. పోపుదినుసులు, 7.కారట్+బీన్స్+ ఆలూ +పచ్చిబటానీ+ఉల్లితరుగు (ఇవి కావాలనుకొంటే వేసుకోవచ్చు ), 9 .పల్లీలు + పుట్నాల పొడి 2 sp., 10. ఆయిల్. చేయువిధానం : ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని, 2 సార్లు కడిగి , నీరు వంచి ,పెట్టుకోవాలి.పాన్ వేడి చేసి ,నూనె వేసి పోపుదినుసులు (శనగపప్పు+ మినపప్పు+ ఆవాలు+ జీలకర్ర ) వేసి ,వేగినతరువాత జీడిపప్పు /పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం ,పచ్చిమిర్చి ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరువాత కూరగాయ ముక్కలు కూడా వేసి ,కొంచం సేపు మగ్గనివ్వాలి.తరవాత ఉప్పు + పసుపు వేసి, అటుకులు కూడా కలపాలి.బాగా కలిపి ,కొంచం ముద్దగా కావాలనుకొంటే పావు కప్పు నీరు కలుపుకోవచ్చు..లేదా పొడిపొడిగా కావాలనుకుంటే అలాగే వుంచి ఇష్టమైతే 2 sp పల్లీలపొడి ,2 sp . నిమ్మరసం వేసుకొని కొత్తిమిర జల్లితే వేడి వేడి అతుకుల ఉప్మా రెడీ..అన్నీ రెడీగా వుంటే 6 ,7 నిముషాలకన్నా ఎక్కువ సమయం పట్టదు మరి..:) సేమియా ఉప్మా +అల్లం.,3.పోపు దినుసులు,4. జీడిపప్పు,5 నూనె ,6.ఉప్పు, 7.పసుపు.
మరొక తేలికైన త్వరగా ముగిసేవంట సేమియా ఉప్మా. ఇప్పుడు రెడీమేడ్ గా వేయించిన సేమియా లభిస్తోంది..కావాలనుకొంటే వాడుకోవచ్చు..ఉప్మాకి సేమియా వేయించకపోయినా బాగానేవుంటుంది. మరి సేమియా ఉప్మా తయారీ చూద్దామా..
కావలసిన పదార్ధాలు : 1.సేమియా 200 గ్రా. 2.సన్నగా తరిగిన కారట్+బీన్స్+పచ్చి బటాణీ+ఆలూ+ఉల్లిపాయ+పచ్చిమిర్చిచేయువిధానము : పాన్ వేడి చేసి ఆయీ వేసి ,పోపుదినుసులు వేయాలి .అవి వేగాక కూరగాయముక్కలు,అల్లం ,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి బాగాకలపాలి కొద్దిగా వేగినతరవాత పసుపు ,ఉప్పు వేసి ,1 కప్పు సేమియాకు 2 కప్పులు నీరు పోయాలి. నీరు బాగా బాయి అయ్యాక సేమియా వేసి కలపాలి.మంట బాగా తగ్గించి ఉడకనివ్వాలి.3 ని.నీరు పీల్చుకొని సేమియా ఉప్మా తయారు అవుతుంది.కొత్తిమిరచల్లుకొని ,కావాలంటే నిమ్మరసం నిమ్మరసం వేసుకోవచ్చు.
మామిడికాయ పులిహోర పులిహోర అందరికీ ఇష్టమే..చింతపండు పులిహోర కాస్త ఎక్కువ సమయం తీసుకొంటుంది. నిమ్మకాయ ,మామిడికాయ,దబ్బకాయ పులిహోరలు చిటుక్కున చేసేయవచ్చు. అన్నం వండటమే ఆలస్యం. మరి ఒకసారి కావలసిన పదార్ధాలు చూద్దామా .. కావలసిన పదార్ధాలు : 1 కప్పు బియ్యాన్ని ఉడికించిన అన్నం , ,1 మీడియం సైజ్ మామిడికాయ తురుము , ఉప్పు ,పసుపు,పోపు దినుసులు ,పల్లీలు,కరివేపాకు ,ఇంగువ (చిటికెడు ),నూనె తగినంత. చేయువిధానము : వండిన అన్నాన్ని ఒక బేసిన్/వెడల్పైన పళ్ళెంలో చల్లార్చాలి. పాన్ వేడిచేసి నూనె పోసి వేడి అయ్యాక పోపుగింజలు + పల్లీలు + కరివేపాకు+ 3 ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి.కావాలంటే ౨పక్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు.కొద్దిగా ఇంగువ + పసుపు వేసి అందులోనే మామిడి కాయ తురుము వేసి 1 ని,పాటు వేగనివ్వాలి.మంటతీసేసి 5 ని .చల్లారాక అన్నంలో వేసి తగినంత ఉప్పుకూడా కలిపి ,బాగా అన్నం మొత్తం కలిసేలా కలగలపాలి .ఇష్టమైతే 2 sp .వేయించిన నువ్వులపొడి కలిపితే చాలా బావుంటుంది. పుల్లటి మామిడికాయ పులిహోర వడ్డించడానికి సిద్ధం.. సేమియా దద్ధోజనం ఎండాకాలం లో పెరుగన్నం,దద్ధోజనం ఎంత హాయిగా ఉంటాయో చెప్పక్కర్లేదు. రుచి,చలవ . అన్నం తో దద్ధోజనం ఎప్పుడూ చేసుకోనేదే..మరి 5 ని. సేమియాతో దద్ధోజనం చేసుకోవచ్చు.ట్రై చెయ్యండి..ముందు కావలసిన పదార్ధాలు చూద్దాం. కావలసిన పదార్ధాలు :సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు ,1/2 కప్పు పాలు ,అల్లం పచ్చిమిర్చి తరుగు 1 sp. పోపు దినుసులు ,జీడిపప్పు, నెయ్యి 2 sp.,కరివేపాకు.,ఉప్పు తగినంత. చేయువిధానము : మరుగుతున్న నీళ్ళలో 1 sp నూనె వేసి, అందులో సేమియా వెయ్యాలి 3 ని.సేమియా ఉడికి పోతుంది.నూనె వెయ్యడం వల్ల సేమియా ముద్దలా అంటుకోకుండా వస్తుంది.ఉడికిన సేమియాని చిల్లుల పళ్ళెం లో పోసి పైనుండి చల్లని నీరు ధారగా పొయ్యాలి.అప్పుడు సేమియా పొడిగా వుంటుంది. ఇప్పుడు సేమియాని బౌల్ లోకి తీసుకొని పెరుగు, పాలు ,ఉప్పు కలుపుకోవాలి . పాన్ వేడిచేసి నెయ్యి వేసి పోపు దినుసులు + జీడిపప్పు +కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ,అల్లం+పచ్చిమిర్చి ముక్కలూ వేసి 1 ని వేయించి సేమియాకు కలపాలి .పిల్లలకోసం చేసినప్పుడు అల్లం ,పచ్చిమిర్చి కాకుండా దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలూ,మామిడి పండు ముక్కలూ, వేసి ,చల్లబరిచి ఇవ్వండి..సాయంత్రం స్నాక్ గా .చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు.
No comments:
Post a Comment