జాగృతి నీవే!! - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ - అచ్చంగా తెలుగు

జాగృతి నీవే!! - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

Share This
 జాగృతి నీవే!!
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్


శుభోదయం మిత్రమా..
ముఖపుస్తక నేస్తమా..!
ఓ సంధ్యా సమీరమా..!
ఆ సెలయేటి నవ్వుల గలగల లేవమ్మా..
ఆ పావన భావ రస వేద నైవేద్యం ఎక్కడమ్మా
ఆ సుందర సుమనోహర సుప్రభాతమేదమ్మా..
లలిత ప్రియకమలమా..!
సిరి ఉషా తుషారమా..!
పద్మినీప్రియనందన స్వరమా!
సురనందిని రమా రూపమా..!
మురిసి మెరిసిన  వాణీ వసంతమా..
హృదయరంజిత కళ్యాణి రాగమా..!
ఉషస్సు కై పలికిన గౌతమీ భావ గీతమా..!
 రాధామానసమా.. దీప్తీహేమంతమా..!
 విశృంకలత్వం పై విసిరిన రాణి శరమా..!
చంద్రకళా కరుణా సంద్రమా..!
ఎక్కడమ్మా ఆనాటి పదనిసలు..స్వరఝతులు
ఏమాయెనో ఆ కిలకిలలు కోయిలరవాలు..
ఏవమ్మా ఆలనాటి మేటి కేరింతలు..అల్లరి చేష్టలు
యామినిలో వెలుగిచ్చే జ్యోతి ప్రజ్వలనమా..!
అలుపన్నది ఎరుగని విజయకేతనమా!
వనజ జాజుల  పరిమళలాల సమ్మోహనమా..!
ధవళ శోభిత మరుమల్లెల మానసమా!
అజంతా శిల్ప ప్రతిమ వు మాత్రమే కావమ్మా.!
ఆగ్రహజ్వాల వు కావాలమ్మా! లావా చిందించాలమ్మా!

చిత్రమా..పాకమా..శాస్త్రమా..
కవనమా..కవిత్వమా..కదనమా..
ఏదైనా ...ఎపుడైనా
ఇట్టే కనిపెట్టే...ఒడిసిపట్టే..సరస్వతీ ప్రతిబింబమా!
ఓ కలకంఠీరవమా.. మాకు గమనమా.. గమ్యమా..!
 పారాహుషార్..!
చీకట్లు చుట్టూముడుతున్నాయ్..!
దాగిన నీ అవతారం ఏదమ్మా దుర్గమ్మా..!
 సహనం వీడమ్మా మధుర మీనాక్షి ప్రతిరూపమా..!
ఒలికే కన్నీటిని దోసిట దాచుకునే కరుణా సంద్రమా..!
రాజీలేని పోరాటానికి తెరతీయాలమ్మ
మేకవన్నె పులులకు నీ అసమాన శక్తిని చూపాలమ్మా..!
 నిర్మలత్వం.. నిశ్చలత్వం.. నిర్భయత్వం నీలో నిండాలమ్మా.!
 మగువజాతికి అండా దండగ నువ్వుండాలమ్మా..
అరుణారుణ కిరణమా!…నీ జాతికి జాగృతి నీవేనమ్మా!!!
ఓ నా ముఖపుస్తక నేస్తమా..!
-మీ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
(ఇందులో చాలామంది ఆడలేడీసున్నారు.. కనిపెట్టిన వారికి అడ్మిన్ కొన్ని మంచి బహుమతులు ఇస్తారని ఆశిస్తున్నా..)

No comments:

Post a Comment

Pages