కమనీయ చిత్రము - అచ్చంగా తెలుగు

కమనీయ చిత్రము

Share This

కమనీయ చిత్రము

(చిత్రం : పొన్నాడ మూర్తి గారి సౌజన్యంతో...)

- చెరుకు రామ మోహన్ రావు

కంటి పాపలు మెరియ కనుబొమలు పైకెగియ

 

చూపరుల అందాల కాపరులు భ్రమ చెంద

 

కలికి రూపములోన కాదు రమ్య గతిలోన

 

కలహంస నడకతో కవిత కదిలింది

 

 

నెమలి పింఛములాయే నెలత కన్నుల జోడు

 

మరుశరాసనమాయె మగువ కనుబొమలు

 

వేల చీకటి కురుల వెనకేసి ఉదయించె

 

అరుణుడే అందాల అతివ తిలకముగ

 

 

కురులందు మల్లికా విరులు తారకలాయె

 

చంద్రవంకయె తలన చంద్రవంకై మెరిసె

 

మెరుపు తీగెలు నిలిచె మొగిలి రేకుల జడగ

 

చిరుమేఘములు అమరే జడకుచ్చులగుచు

 

 

సెలయేటి అలలు తన చేతులై కదలంగ

 

నాగదళ పాదముల నడక వయ్యారాల

 

నవ్యతకు నాణ్యతకు నడుము యిడుములు బడగ

 

కనని విననటువంటి కమనీయ చిత్రమై

No comments:

Post a Comment

Pages