కనక దురగమ్మ మాత్యం - అచ్చంగా తెలుగు

కనక దురగమ్మ మాత్యం

Share This
కనక దురగమ్మ మాత్యం
-      బి.వి.రమణారావు
"దురగా టీ సల్లారిపోతున్నాది. పొద్దుటేళ సదివిన పేపరుకందా! మళ్ళీ అంత సేపేం సదువుతావే!" అన్న నరసమ్మ కేక విని పేపరు పక్కనపెట్టి టీ కప్పు అందుకుంది కూతురు దుర్గ. "ఇది ఇవ్వాళ్టి పేపర్ కాదు. వారం రోజు క్రితంది. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ పని గట్టుకుని ఇందులో ప్రకటన చూడమని ఫోన్ చేసింది. ఈ పేపర్ మా ఆఫీస్ నుంచి తెచ్చాను" అంది దుర్గ ఆ ప్రకటన మరోసారి చదువుతూ. "ఏంటది?" అడిగింది తల్లి అది ఇంగ్లీష్ పేపరని గమనించి. "పెళ్ళికూతురుకోసం ఇచ్చిన ప్రకటనకాదులే!" అంది దుర్గ నవ్వుతూ. "అవును మరి. నీకు పెళ్ళికేటి తొందరొచ్చింది! నీ వయసోళ్ళ పెళ్ళిళ్ళై పిల్లల్ని కంటావున్నారు." "ఇది నీకు పాతపాటే. సత్యం ఇంజనీరింగ్ చదువైపోయింది. వాడేదైనా ఉద్యోగంలో స్థిరపడ్డాక నా పెళ్ళిగురించి ఆలోచిద్దాం. ఈ లోగా నాకు తెలీకుండా వాడూ, నువ్వూ కలిసి ఎన్ని ప్రకటనలకి నా ఫోటోలు, జాతకాలు పంపినా పోస్టు ఖర్చుల దండగ. చూసుకోడానికి వాల్లు వస్తానన్నా, నన్ను రమ్మన్నా వాళ్ళని కలపను, జవాబివ్వను." "సరేలే నువ్వుసూతున్నదేంటి" "ఓ పెద్ద కంపెనీలో పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం ఖాలీ ఉందట. బి.కాం. డిగ్రీ, టైపు, షార్ట్ హాండు, కంప్యూటర్ కోర్సులోనూ, బిజినెస్ మేనేజ్ మెంట్ లోనూ డిప్లొమాలు ఉండాలిట. జీతం పదివేలు, పైన అలవెన్సులు." "అయ్యన్నీ నీకున్నాయికందా! నీకోసమే వేసినట్టుంది పేపర్లో." "అదే ఆశ్చర్యంగా ఉంది. పర్సనల్ సెక్రటరీ పోస్ట్ కీ, బిజినెస్ మేనేజ్ మెంట్ లోనూ డిప్లొమా ఎందుకో!" "ఎందుకేంటి! ఈ ఉద్యోగం నీకు రానాకి. అంత ఆ కనకదుర్గమ్మ దయ! నీకాయమ్మ పేరెట్టుకున్నాం కదా! అంతా ఆయమ్మే సూసుకుంటాది. సూత్తావుండు. ఈ ఉద్యోగం నీకే వస్తాది. దాంతో కానీ కట్నలేకుండా నిన్ను కట్టుకుంటామంటూ ఎగబడతారు పెళ్లికొడుకులు” అంది నరసమ్మ. “అలాగే కలలు కంటూ వుండు. ముందీ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టనీ. రేపు ఆదివారం ఎల్లుండి పంపాలి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. “ఉద్యోగం ఎక్కదేంటి ?” “హైదరాబాద్ లో”. “ఓలమ్మో! ఉన్నవూరు ఈ యిజయవాడిడిసి పెట్టి అయిదరాబాడా! ఆడ ఎంత జీతనైన ఇంటద్దికే సాల్దంట!”. ఉద్యోగామంతో వొస్తే నేనోక్కర్తినే మా ఫ్రెండ్ భారతి లాగ అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టలుంది.అందులో ఉంటాను. నువ్వు తమ్ముడితో ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడికెడతావు” అండి దుర్గ తల్లి భుజాలు పట్టుకొని ఆప్యాయంగా కుదుపుతూ. *** విజయవాడ లో ఓ ప్రయివేట్ స్కూల్లో దుర్గ తండ్రి వాచ్ మెన్ ఉంటూ ఎనిమిదేళ్ళ క్రితం కేన్సర్ వ్యాధితో పోయాడు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రామమూర్తి గారికి ఈ కుటుంబం పట్ల సానుభూతితో పాటు పిల్లలిద్దరి మీదా అభిమానం ఉంది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ బాపతు ఓ ముప్పయి వేలోస్తే వాళ్ళ పేరా బ్యాంక్ లో వేసాడు. దుర్గ అప్పటికి బి.కాం., ఫైనల్ ఇయర్ లోనూ, సత్యం టెన్త్ లోనూ ఉన్నారు. నరసమ్మకి స్వీపర్ ఉద్యోగం ఇప్పించి, ఆ కాంపౌండ్ లోనే ఇన్నాళ్ళూ ఉన్న షెడ్ లో నే ఇంకొన్నాళ్ళు ఉండనిచ్చాడు. ఉండటం రేకుల షెడ్డయినా, ఆయన చలవ వల్ల స్కూలు వేళల అనంతరం పగలూ, రాత్రీ యా స్కూలు వరండాలోనే చదువుకుంటూ కాలక్షేపం చేసారు. దానికి సాయం నరసమ్మ విద్యార్థుల టిఫిన్ కారియర్ లు కడుగుతూ మరో నాలుగు రాళ్ళు సంపాదించేది. దుర్గ బి కాం పాస్ అవ్వగానే రామమూర్తి గారు తన దగ్గర చదువుకుని పైకొచ్చిన ఓ పారిశ్రామిక వేత్తకి చెప్పి ఉద్యోగం ఇప్పించారు. ఉద్యోగ్రం చేరే ముందు తన ఆశీస్సుల కోసం వచ్చిన దుర్గాకి “నీకు చక్కని రూపం ఉంది, చదువుంది. ఇప్పుడు ఉద్యోగం కూడా ఉంది. వీటితో బాటు వినయవిధేయతలు, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటె నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ తమ్ముడు సత్యాన్ని పైకి తీసురాగాలుగుతావు. ఇప్పుడు రోజులు బాగాలేవు. జాగ్రత్తగా ఉండాలి. ఈ నాటి యువతీ యువకుల్లో సామాజిక విలువలు, క్రమశిక్షణ లోపించాయి. చదువు, సంపాదన, స్వయంకృషి మీదకంటే వాళ్ల ధ్యాస విచక్షణాజ్ఞానంలేని ప్రేమ, పెళ్ళి, రొమాన్స్, సెక్స్ మీద ఎక్కువగా ఉంది. ఇది సాంఘిక వాతావరణ్కాలుష్య ప్రభావం. అందుకే నిత్యం వార్తల్లో స్త్రీలమీద అత్యాచారాలు, పెళ్ళి పేర మోసాలు, వరకట్నచావులు, ఆత్మహత్యలు..." అంటూ హితోపదేశం చేశారు. "లేదుసార్ చాలా జాగ్రత్తగా నడుచుకుంటాను. మీరే మాకు పెద్దదిక్కు, మీ మాటలు మరిచిపోను" అంటూ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన హెచ్చరికకు కారణం దుర్గకి తెలుసు. ఆయన మూడొకూతురిది ప్రేమవివాహం. ఆవిడే దుర్గకి ఫైనలియర్ లో కామర్స్ లెక్చరర్. గత ఎనిమిదేళ్ళ జీవితానుభవం దుర్గకొక సుదీర్ఘ మహాయజ్ఞం. ఉద్యోగం చేసుకుంటూ ప్రయివేటుగా చదువుకుని ఆ డిప్లొమాలన్నీ సంపాదించింది. తల్లికి టైలరింగ్ నేర్పించింది. పిల్లలకి యూనిఫాంలు కుట్ట్డంలో నరసమ్మ ప్రావిణ్యం సంపాదించింది. తమ్ముడు సత్యం షెడ్యూల్ కులాలకున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేశాడు. వెయ్యి రూపాయలు నుంచి తన జీతం అయిదువేలయింది. ఆఫీసులో తోటి ఉద్యోగులు, బయట రౌడీమూకచేసే ఇకిలింపులు, సకిలింపులు, వెర్రిమొర్రి వేషాలు, వేధింపులు ధైర్యంగా ఎదుర్కొంది. కరాటే కూడా నేర్చుకుంది. ఇన్నాళ్ళూ పెళ్ళి ఆలొచనకు దూరంగా ఉండబట్టే ఈపాటి సంతృప్తి, సంతోషం సాధించగలిగానంటుంది. 'ఓ స్త్రీ! నువ్వు అబలవు. నీకు పురుషుడి రక్షన అవసరం. పెళ్ళి నీకో వరం. పాతివ్రత్యం నీ ధర్మం. మాతృత్వం నీ జీవిత పరమావధీ అంటూ యుగయుగాలుగా వినపడే శాస్త్ర ఘోషతో చెవులు గింగురుమనడం చేత స్త్రీ ఆలొచనా శక్తి స్తంభించిపోయింది. ఆచారంలాంటి శక్తివంతమైన మత్తుమందు మరోటి లేదని త్రికరణశుద్ధిగా నమ్మింది దుర్గ. **** ప్రకాశ్ నగర్ రెండు పెద్ద గదుల్తో మరికాస్త వాసయోగ్యంగా ఉన్న ఇంటిభాగంలోకి రెండేల్ల క్రితం మారింది దుర్గ. అక్కడికి కనకదుర్గ ఆలయం రెండు కిలోమీటర్లు. పది నిమిషాలకో సిటీబస్. ప్రతి ఆదివారం ఉదయం దుర్గని వెంటబెట్టుకు ఆలయానికి వెళ్ళేది నరసమ్మ. తనకి భక్తి, విశ్వాసాలమాటెలాగున్నా తను వెంటవస్తే తల్లి ఎంత సంతోషిస్తుందో తెలిసిన దుర్గ ఎప్పుడూ బద్ధకించలేదు. ఆలయానికి వెళ్ళినప్పుడల్లా తల్లి మాట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తీ చేసుకువోచ్చే వరకూ ఆలయ ప్రాంగణంలో ఉన్న పూలతోట లో నిరీక్షితూ కూర్చోడం దుర్గకు ప్రుపాటి. తర్వాత ఇద్దరూ కలిసి దర్శనం చేసుకేలుతుంటారు. క్రితం సాయంత్రం చూసిన ప్రకటన గురించి ఆలయంలో కూర్చుని దుర్గ ఆలోచించసాగింది. తనకుఇ అన్ని అర్హతలూ ఉన్నాయి. ఈ ఉద్యోగం వస్తే తను జీవితం లో ఒగ్ప్ప విజయం సాధించినట్లే. ఇప్పుడు తను పనిచేస్తున్న కంపెనీ ఏం డీ కూడా సంతోషించి ఆశీర్వదించి పంపించే శ్రేయోభిలాషి. ఇలా ఆలోచిస్తూ ఉండగా.. “హమ్మయ్య” అని ప్రక్కన ఒకావిడ కూర్చుని ఒక క్షణం చీరచెంగుతో విసురుకుని దుర్గాతో “అమ్మాయ్ నువ్వు నరసంమగారి కూతురుడుర్గావేనా ? అని అడిగింది. ఆవిన్నెప్పుదూ చుసిన గుర్తులేదు. వయస్సు సుమ్మారు అరవయ్యేళ్ళుంటాయి. మంచి విగ్రహం, మొహంలో తేజస్సు రెట్టింపుచేస్తూ పెద్దబొట్టు. ఓ చేతికి రిస్ట్ వాచి, మరోచేతికి నాలుగు బంగారు గాజులు, మెడలో రెండుపేట్ల గొలుసు. చేతిలో పూలసజ్జ. "మీరు మా అమ్మని ఎరుగుదురా ?" అని అడిగింది దుర్గ. "నా పేరు భవాని. నేను మీ అమ్మనెరుగును. ఆవిడ నన్నూ ఎరుగదు. ఇందాక నేను ప్రదక్షిణం చేస్తూండగా చూశాను. ఆ దారిలో కోతి అనుకుంటాను పాడుచేసినట్టుంది. ఒకటే వాసన. భక్తులందరూ దూరదూరంగా ఉండి ప్రదక్షిణం చేస్తున్నారు. చేతిలో తువ్వాలుంటే సగం చింపి, మీ అమ్మగారు ఆ మలిన్యం అంతా ఎత్తిపారేసి, నీళ్ళు తెచ్చి మిగిలిన సగం తువ్వాలుతోనూ కడిగి తుడిచి బాగుచేసింది. ఆమె పట్టుచీర, మెళ్ళొ సన్నని రుద్రాక్షమాల, నుదుట విభూతి, మొహంలో శాంతం, ఆమె చేసిన పని చూసి "అదీ నిజమైన భగవత్సేవ" అనిపించి పైకి అనేసాను. అది విని ఒకావిడ చెప్పింది. ఆవిడపేరు నరసమ్మనీ, కూతురిపేరు దుర్గనీ, చక్కగా ఉంటుందనీ, ఇద్దరూ ప్రతి ఆదివారం వస్తూ ఉంటారనీ" అంది ఆవిడ నవ్వుతూ. ఆమె మాటతీరులో హుందాతనం, సంస్కారం దుర్గని ఆకర్షిస్తాయి. భవానీగారూ మాటల్లోదింపి తన చదువు, ఉద్యోగం, తమ్ముడి చదువు, తల్లి కృషి, రామ్మూర్తి మేష్టారి అభిమానం గురించీ దుర్గచేత చెప్పించింది. "చాలా సంతోషం. నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ నీ ఆత్మ విశ్వాసమే నీకు రక్ష. అసలు కష్టాల్లేందే సుఖం తెలియదు. నీకున్న క్వాలిఫికేషన్స్ కి హైదరాబాద్ లో ఇంతకంటే మంచి అవకాశాలుంటాయెమో!" (మిగతా కధ వచ్చే సంచికలో...)

No comments:

Post a Comment

Pages