కవిత:కన్నీళ్ళ విలువ
..............
- విసురజ
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
బంగారుజింకకై పట్టుబట్టి పతిరాముడిని ఎడబాసినందుకు సతి సీత కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
రాని వేణుధరునికై బృందావనంలో వేదనతో రామణి రాధ కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
కురుసభలో పంచభర్తల బానిసావస్త చూసిన అలివేణి పాంచాలి కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
బిడ్డలాకలి తీర్చలేని పరిస్థితులను చూసిన ఆత్మీయుల అమ్మానాన్నల కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
సామాన్యులవెతలను ఎక్కువచేసే ధరల మంటను చూసిన బడుగుల కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
భువిలో మోసాలరారాజుల పేట్రిగిపోవడం చూసిన భూరాణి ధరిత్రి కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
మోహాలవ్యామోహాల ఊభిలో నలిగిన మనసులవస్తను చూసిన విరిబోణి ప్రేమ కంట
.......
No comments:
Post a Comment