తుంటరి - అచ్చంగా తెలుగు

తుంటరి

Share This
తుంటరి
--- రచన: రామాసుందరి
కొండపక్క వాగులో
పారుతున్న నీటిలో
విచ్చుకొన్న నీలికలువ
అడిరిపడ్డదొక్క క్షణం
ఎవరా తుంటరి
ఎందుకలా చూస్తాడు
వినువీధిని విహరిస్తూ
వెక్కిరించి పోతాడు
కలువ కన్నె స్వగతాలను
కన్నెతనపు పోకిళ్ళను
ముచ్చటగా చూచుచున్న
తల్లి ఏరు నవ్వుకొనియె
వయసు చేత వలపు చేత
వంగియున్న కలువలేమ
తల్లి నవ్వు చూచి తలచి
తలచ చిందులెయ్య సాగె
అతని గూర్చి తెలుసుకొనగ
ఆమెకెంతో వేడుకయ్యె
అమ్మనడుగుదామంటే
పాడు సిగ్గు అడ్డమయ్యె

No comments:

Post a Comment

Pages