మౌనమే నీ భాష..
- కరణం కళ్యాణ్ కృష్ణకుమార్
ఆలింగనం మౌనం
అలజడి మదికి
ఆత్మబంధువు మౌనం
అల్లరి జీవితంలో
అనుకోని అతిథి మౌనం
మనలోని మనమే కదా మౌనం..
మునులెల్ల ఆశ్రయించే మౌనం
కనులెల్ల కోరుకునే మౌనం
ధ్యానం దాశ్యమే కదా మౌనం
పుస్తక భాండాగార ముఖద్వారం మౌనం
మౌనం ఆచరణీయం..
గుండె చప్పుడు తో భయపెట్టేది మౌనం
గుండె నిబ్బరాన్ని ప్రశ్నించేది మౌనం
గుండె కరిగేలా చేసేది మౌనం
గుండె ఆగేలా చేసేదీ మౌనం
మౌనం భయానకం..
సత్యాసత్యాల అర్థాంగీకారం మౌనం
నిరంతర రణగొణ ధ్వనులకు
దూరంగా ఎత్తుకెళ్లేది మౌనం
బదిరుల దైవభాష కదా మౌనం
నిరసనల పొలికేక మౌనం
జీవిత చరమాంకంలో...
శ్వాసకు సేద అందించేది మౌనం
మౌనం సర్వజగద్రక్షకం
***
No comments:
Post a Comment