కనకదుర్గమ్మ మాత్యం (కధ- 2 వ భాగం) - అచ్చంగా తెలుగు

కనకదుర్గమ్మ మాత్యం (కధ- 2 వ భాగం)

Share This
కనకదుర్గమ్మ మాత్యం (కధ- 2 వ భాగం)
బి.వి.రమణ రావు
"మా తమ్ముడి చదువై పోయింది కనుక ఇక మీదట ప్రయత్నిస్తాను.రేపే ఒక మల్టీనేషనల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కు పర్సనల్ సెక్రటరీ....   పర్సనల్ సెక్రటరీ పోస్టా ? యూ  హావే చార్మింగ్ పర్సనాల్టీ అసలు ఔటర్ వ్యూ లోనే సెలెక్టయి పోతావు . ఇంక ఇంటర్వ్యూ లో వాళ్ళ మొహం వాళ్ళెం అడుగుతారు? అయినా నీకు అనుభవం ఉంది".   ఆ ధైర్యం తో నే అప్లయ్ చేద్దామనుకుంటున్నాను.   " తప్పకుండా చెయ్యి. అదిసరే ఉద్యోగమొస్తే  నిన్ను పెళ్ళి చేసుకోడానికి పెళ్ళికొడుకెవరైనా రెడీ గా ....." "లేదు నాకింకా ఆ అలోచన లేదు".   "పర్సనల్ సెక్రటరీ అంటే మీ బాస్ తో అవసరమొస్తే ఎక్కడికైనా టూర్  చెయ్యవలసి   వస్తుందేమో!"   "వెడతాను నాకేవిధమైన సంకోచం భయం లేవు".   "మరైతే నువ్వు సెలెక్టయిపోయినట్టే..కంగ్రాట్స్ " అంటూ నాటకీయం గా అభినందన పూర్వకముగా కరచాలనం చెసింది ..లేచివెళ్ళే ప్రయత్నం లో   " మీ అభినందన ఆశీర్వచనం గా భావిస్తాను ...మీ ప్రోత్సహానికి ధన్యవాదములు నమస్కారం " అంది పొద్దున్నే అంత సరదాగా అయిన అనుభవజ్ఞురాలు ,విజ్ఞురాలైన మనిషి తో పరిచయమైనందుకు ఆనందిస్తూ,   తల్లి వచ్చి భుజం మీద చెయ్యివెయ్యగానే దుర్గ  ఈ లోకములో కొచ్చింది .దర్శనం చేసుకుని ఇంటికి వెడుతున్నప్పుడు భవాని గారితో పరిచయం , ఆమె మాటలు ఇచ్చిన ధైర్యం గురించి తల్లి తో చెప్పింది.   "అంతా కనక దుర్గమ్మ దయ ఆ దేవి మాటలే ఈయమ్మ నోటినుంచొచ్చాయ్ " అంది నరసమ్మ.   సోమవారం రిజిస్టర్ పోస్ట్ లో తనకొచ్చిన ఉత్తరం చూసి దుర్గ నిర్ఘాత పోయింది . ఏ కంపెనీ లో ఉద్యోగం చెయ్యాలనుకుందో  ఆ కంపెనీ పర్సనల్ ఆఫీసర్ నుండే దగ్గర్నుండే వచ్చిందా ఉత్తరం  . దాని సారాంసం ఇది " నాలుగు రోజుల క్రితం మీరు పంపిన దరఖాస్తు అందింది . బుధవారం ఉదయం పదకొండు గంటలకు  హైదరాబాద్ హెడ్డాఫీస్ లో ఇంటర్వ్యూ కి రాకోరుతున్నాం".
దుర్గ తనకీ ఉద్యోగం అంత సులభం గా వస్తుందని కలలో కూడా అనుకోలేదు అసలు అప్లికేషన్ అయినా పెట్టలేదు.   తిరిగొచ్చాక జరిగిందంతా తల్లికి చెప్పింది .తను అనుకున్నట్టు గానే నెవ్వెళ్ళీన కాడినుంచీ ఆ కనక దురగమ్మ తల్లికి దణ్ణాలెట్టుకుంటూనే వున్నాను .అంతా ఆ చల్లని తల్లి మాత్యం" అంది.   "దుర్గ తన తల్లిని టైలరింగ్ ట్రైనింగ్ తో బాటు వయోజన విద్యా కేంద్రం లో చేర్పించింది . తన టైలరింగ్ వృత్తికి  కావల్సిన పేర్లూ కొలతలూ ,తేదీలూ లాంటివి తప్పులతోనైనా వ్రాసుకోగల చదువు నేర్చుకుంది . అయితే తల్లి మాటల్లో చిన్ననాతి నుంచీ అలవాతైన యాస మాత్రం పోలేదు . ఇప్పుడు దుర్గ కి తల్లంటే ఎంత ప్రాణమో ,తల్లి మాటల్లో సహజమైన ఆ యాస వినటమన్నా అంత ప్రాణం.   ******************   ప్రసాద్ విదేశాల్లో ట్రైనింగ్ అయ్యి స్వయంకృషి తో  వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) స్థాయికి ఎదిగాడు .అందరితో పాటు దుర్గ ని కూడా నవ్వుతూ పలుకరించేవాడు ,మంచి మాటకారనీ,సమయస్పూర్తి తో సలహాలివ్వగల పేరుంది  . అతని దగ్గిర సెక్రటరీ గా వుండటం  ఎంత ఆనందదాయకమో అంత మానసిక ఉద్రిక్తతకు గురయ్యే అనుభవమూ ఉంది. విధినిర్వహణలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నామందలించి దాన్ని   ఏవిధముగా సవరించాలో చెప్పి చేయించి ,మళ్ళీ కొన్ని నిమిషాలలో మరచిపోయినట్లే ప్రవర్తించి ఊరట కలిగించేవాడు.ఎన్నో సందర్భాలలో అతనితో కలిసి విందులూ ,వినోద కార్యక్రమాలలోనూ  పాల్గొంది . అతను ఎంత చనువిచ్చినా తమ మధ్య ఉన్న అంతస్తుల అంతరాల నూ విస్మరించకుండా  తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్మణ రేఖను దాటకుండా వివేకము తో ప్రవర్తించేది.   ప్రసాద్ తో టూర్ వెళ్ళి రెండు మూడు రోజులున్న సంఘటనలు ఉన్నాయి ఎక్కడకెళ్ళినా తన ప్రయాణ బడలిక ,భోజన వసతుల పట్ల శ్రద్ధ చూపే వాడు . ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వెట్టర్ ,స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు  వాచ్ ,హాంగ్ కాంగ్ లో వైట్ ఎంబ్రాయిడరీ  శారీ కొని ,వొద్దనటానికి వీలు లేనంత  అతి సున్నితమైన మాటలతో బహుకరించాడు . ఎంత సన్నిహితం గా ఎన్నడూ ప్రేమ, పెళ్ళి అనే వ్యక్తిగతమైన విషయాల మీద సంభాషణ రాలేదు.   రెండు రోజులు వరుసగా శలవుదినాలొచ్చాయి . అందులోనూ .అందులోనూ ఉగాది ఆదివారం  ఓ రోజునే అయ్యింది .సనివారం  ఉదయానికల్లా విజయవాడ  రమ్మని తల్లి వ్రాసింది . తను శుక్రవారం  బయల్దేరి విజయవాడ  వెళ్ళి సోమవారం ఉదయానికల్లా తిరిగొస్తానని ప్రసాద్ కి చెప్పినప్పుడు- అసలు తను అప్లై చెయ్యలేదు.పత్రికలో చూసిన ప్రకటనలో ఫొటో బయోడేటా సర్టిఫికేట్ల కాపీ లు పంపమని ఉంది . అంచేత తనపేర తనకి తెలియ కుండా అప్లయ్ చేసే అవకాసం కానీ అవసరం కానీ ఎవరికీ లేదు.   ఆ వచ్చిన ఉత్తరం గురించి అడిగితే తల్లి చెప్పింది , తడుముకోకుండా అంత ఆ కనక దురగమ్మ మహత్యం " అంది.   ఆఫీసుకెళ్ళేక హైదరాబాద్ లో ఉన్న భారతికి ఫోన్ చేసి చెప్పింది.ఇదంతా తనను ఆటపట్టించటానికి ఎవరైనా పన్నిన పన్నాగమేమో అన్న అనుమానంతో.   నువ్వే ఏ నిద్దట్లోనో అప్లయ్ చేసిఉంటావు. ఇంక దాన్ని గురించి తర్జన భర్జన చేయకుండా నోరుమూసుకుని అవసరమైతే ఇవ్వడానికి మరొ దరఖాస్తు కాపీ వెంటతెచ్చుకుని రేపు సాయంత్రం బయలుదేరి బుధవారం తెల్లవారేటప్పటికి ఇక్కడికొచ్చెయ్యి. నీకు అన్ని క్వాలిఫికేషన్సూ ఉన్నాయి . నీ అప్లికేషన్ అందింది అన్నారు ,నిన్ను రమ్మన్నారు . ఇంటర్వ్యూ చేస్తారు , సెలెక్ట్ అవుతావు .ఉద్యోగం వస్తుంది . నాతోనే ఇక్కద ఉంటావు .గుడ్ డే అంటూ ఫోన్ పెట్టేసింది . అదసలే పెంకిఘటం .దానికి కాబోయే భర్త పోలీస్  ఇన్ స్పెక్టర్.   ***************   ఆర్.కే ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ అని బోర్డ్ ఉన్న గదిలోకి కూడా ఉండి పర్సనల్ ఆఫీసర్ తీసుకెళ్ళాడు   ఆ ప్రసాద్ వయస్సు ముప్పైఏళ్ళు ఉంటాయి . మంచి ముఖ వర్ఛస్సు ,ఫుల్ సూట్ లో  వచ్చాడేమో హేంగర్ కి కోటు వేళ్ళాడతీసినట్టు ఉంది . ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సగౌరవం గా ఆహ్వానించాదు. అతని ముందు పర్సనల్ ఆఫీసర్ ఉంచిన ఫైల్లోని  అప్లికేషన్ ఫార్మ్ లో తన ఫోటో.సర్టిఫికేట్లు ఉందటం గమనించింది. ఓ సారి ఆ ఫైల్ చూసి ఇక దానితో పని లేదన్నట్టు మూసేసి ప్రక్కన కూర్చున్న పర్సనల్ ఆఫీసర్ వైపు నెట్టేశారు . దుర్గ ప్రయాణం గురించి, ఇక్కడి బస గురించి ,తిరుగు ప్రయానం గురించి కుశలప్రశ్నలు వేశాక " యు ఆర్ సెలెక్టెడ్. ఈ ఉద్యోగం లో చేరుతున్నదీ లేనిదీ ,చేరితే ఎప్పుడు చేరేదీ ఒక వారం రోజుల్లోగా తెలియచేయండి" అని చెప్పి ఆ ఫైలు మీద ఏదోవ్రాసి పర్సనల్ ఆఫీసర్ కి అందిస్తూ ,దుర్గ కేసి చూసి "ఒక పావుగంట ఆగి లెటరాఫ్ అపాయింట్మెంట్ మీరు ఇంటర్వ్యూ కొచ్చినందుకు మీకు కంపెనీ రూల్స్ ప్రకారమూ రావల్సిన టియ్యే  డియ్యే  తీసుకువెళ్ళండి,బెస్టాఫ్ లక్ అండ్ గుడ్ డే " అని ఇద్దరితోనూ కరచాలనం చేసి పంపించేశాడు. (సశేషం)  

No comments:

Post a Comment

Pages