భరతవర్షే...భరత ఖండే
పెయ్యేటి రంగారావు
ప| ఖండ ఖండాంతరాలలో
ఖ్యాతిగొన్న భరతఖండమిది
జగ జగాల చరిత పుటలలో
పసిడివన్నె నొంది యున్నది ||
అ.ప.| ఈ ధరణి పుణ్యకారిణి
గీతార్థసార బోధిని
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
1. ఇట త్రివేణిసంగమం
ఘోరాఘ భగ్నకారకం
బహుజాతుల సంగమం
విశాల భావప్రేరకం
ఘోరాఘ భగ్నకారకం
బహుజాతుల సంగమం
విశాల భావప్రేరకం
ఈ ధరణి కర్మచారిణి
క్షమయా ధరిత్రి రూపిణి
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
క్షమయా ధరిత్రి రూపిణి
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
2. శత శహస్ర శాఖల
తనరుచున్న తరువిది
దశానీక భాషల
నిస్వనించు పికమిది
తనరుచున్న తరువిది
దశానీక భాషల
నిస్వనించు పికమిది
ఈ ధరణి తత్వరూపిణి
ఏకత్వసాధ్య కారిణి
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
ఏకత్వసాధ్య కారిణి
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
3. మతము మతము మధ్యన
మమతలతో వంతెన
భాష భాష నడుమన
భావాలతొ స్పందన
మమతలతో వంతెన
భాష భాష నడుమన
భావాలతొ స్పందన
ఈ ధరణి ప్రేమచారిణి
నిస్వార్థ తత్వదాయిని
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
నిస్వార్థ తత్వదాయిని
ఇచ్చోట జన్మనొందుట
ఇది ఎంతొ పుణ్యఫలమట ||
********************
No comments:
Post a Comment