నమో మాత భారతీ!! - అచ్చంగా తెలుగు

నమో మాత భారతీ!!

Share This
నమో మాత  భారతీ!!
- నాగ జ్యోతి సుసర్ల
జయము జయము భరతమాత
జయ జనతా  సువిరాజిత
జయ జగతీ సువిఖ్యాత
జయహొ జయహొ సుజననుతా!!
సకల పుణ్య నదీ ప్రవాహిత
సప్త మోక్ష పురీ పదార్చిత
సర్వ వీర మాతృచరిత
సఫల శుభద సుధా కలిత || జయము||
త్రిపధ సాంద్ర పరివేష్టిత
త్రిజగోన్నత అచలధరిత
త్రివిధ దళ పదాతి భరిత
త్రిపుర సుందరీ సమ్మానిత ||జయము||
విశ్వ విజయ ఘన కామిత
వివిధ దేశ విపుల వినుత
విమల సర్వ కవి సేవిత
విజయ భరిత రాజ పూజిత ||జయము ||
నాద వేద కళా సుపూజిత
నాక లోక సుర సేవిత
నవ జాగృతి తవ సంతతి
నమో మాత భారతీ...నమో మాత  భారతీ!!

No comments:

Post a Comment

Pages