శివం (శివుడు చెప్పిన కధ)
ఫణి రాజ కార్తీక్
(రావణుడి భక్తిని గురించి చెప్తుంటాడు శివుడు...)
‘ఏమైంది నాయనా’ అని నేను తన మొహాన్ని తీసుకొని చేతులోని కళ్లలో పడ్డ విభూది తీశాను. మళ్ళీ రావణుడు కుబేరుడికీ లక్ష్మీ దేవికీ ధనమిచ్చింది నీవేకదయ్యా నీవెందుకు ఆభరణరహితుడై ఉంటావు. అని కీర్తన ఆలపించాడు నేను దానికి సమాధానంగా ‘నాజటాజూటాలలో విశ్వాలు, బ్రహ్మాండాలు నాకు ఆభరణాలు, నా కొప్పులో పంచభూతాలు నాఆభరణాలు, ఎప్పుడైనా ఏదైనా బూడిద కావల్సిందే అని తెలుపుటకే నా శరీరానికీ విభూది ఆభరణం భక్తితో నా మెడలో ఉంటాను తండ్రీ అని అడిగిన నాగరాజే నా ఆభరణం గజాసురుడు తన చర్మాన్ని నన్ను వస్త్రంగా కట్టుకోమని వరం కోరాడు. అతడి కోరికమెచ్చి అతను భక్తితో ఇచ్చిన గజచర్మమే నా ఆభరణం అని సమాధానం చెప్పాను. రావణుడు దరహాసంతో ప్రభూ! మీరు జ్ఞానంతోనే కాదు, చమత్కారంతో కూడా భక్తులను ఆనందింపజేశారు అని అన్నాడు. నేను రావణా ఎల్లప్పుడు భక్తి కలిగి ఉండు అదియే నిన్ను పరమపదమునక్ ఉచేర్చేది నమ్మకం కలిగి ఉండు అదియే నిన్ను కర్మరహితం చేసే జ్ఞానం. నమ్మకం గూర్చి వివరిస్తూ రావణా! నా మీద నమ్మకం కలిగి ఉండు నేను నాలోనే ఉంటా నా మీద నమ్మకం లేకపోయి ఉన్నా మీరు నాలోనే ఉంటారు మొత్తానికి మీరు నేను ఒకటే అదియే అంతరార్థం. అదియే తాత్పర్యం అదియే సూక్ష్మం అదియే నిత్యం అదియే సత్యం అదియే మార్గం అదియే యోగం అదియే ధ్యానం అదియే సర్వం అదియే ప్రణవం శివం’ అని పలికాడు. ఏదో తెలుసుకున్నట్లు రావణుడు మోహమందు తేజస్సు తన్మయత్వం ప్రస్ఫుటమయ్యింది. ‘శంకరా పాహి పాహి శశిధరా పాహి పాహి మహాజనకా ఎన్నో ఏళ్ళుగా ఎన్నో తపస్సులద్వారా తెలుసుకునె జ్ఞానం నీవు నేను ఒకటే అనే చిన్నమాటతో చెప్పావు కదయ్యా ఎంతైనా ఆదియోగివి కదా అని సమ్తసపడ్డాడు పిదప రావణుడు ప్రభూ మిమ్ము విభూది చందన వాటితో అలంకరించుకున్నా మీరు అనుమతిస్తే మీకు ప్రత్యక్షంగా అభిషేకం చేసుకుంటాను ప్రభూ! అని అడిగాడు. “అభిషేకానికి జలం లేవు కదా రావణా అని అన్నాను. రావణుడు శీఘ్రముగా పోయి తెస్తాను ప్రభూ అని తన జలం తేవడం మరిచాడని గ్రహించాడు, అవసరం రేయ రావణా అని పలికీ నా జటంలోనుండి గంగని బయటకి రమ్మని ఆజ్ఞాపించాను. నా భక్తుని కోరిక వల్ల ఏమో గంగకూడా ఉత్సాహంగా వచ్చింది. రావణుడు స్వామీ ఈ దీనభక్తుడి కోసం స్వయానా నీవే జలమును గంగరూపంలో ఇచ్చి వాటితో అభిషేకం చేసుకోమన్నావు కదయ్యా ఆహా ఏమి నా భాగ్యం అని అన్నాడు. నా కొప్పులోనుండి వస్తున్న జలమును తను ఒక పాత్రలో పెట్టుకొని వాటితో తిరిగి నాకు అభిషేకం చేయసాగాడు. “నీనుండి వస్తున్న గంగ నీకు ఇస్తున్న గంగ నీ వు ఇచ్చినది నీకు ఇవ్వడమే కదయ్యా జీవితం ఓ అభిషేక ప్రియుడా ఎంతటి కరుణామయుడివయ్యా నీవి ఏంఇ మంత్రం తంత్రం ధ్యానం యోగం తెలియకపోయినా నిన్ను తలిస్తే వాటికన్నా ఫలమును ప్రసాదిస్తావు. ఎంతటి స్వార్థపరుడివయ్యా నీవు నా తలమీద గంగని పెట్టుకొని మళ్ళీ మాకు గంగతో అభిషేకం చేయాలనుకుంటావు ఎంతటి దురాశాపరుడవయ్యా నీవు ఎంతటి పాపాత్ముడైన నిన్ను ఆశ్రయించగానే వారిని పునీతలను చేస్తావు. ఎంతటి మాయగాడివయ్యా నీ మాయలో మమ్మల్ని భక్తితో కట్టివేస్తావు. ఎంతటిలోభివయ్యా నీ భక్తులు సుఖంగా ఉంది నిన్ను చేరేలా అనుగ్రహిస్తావు. ఎంతటి కామం కలవాడివయ్యా బుద్ధిలేని రాక్షసులకు వరాలను ప్రసాదిస్తావు నిన్ను తలచారని ఎంతటి క్రోధం కలవడివయ్యా నీ భక్తుల జోలికి వస్తే యముడ్నే యమలోకానికి పంపిస్తావు” అని అంటూ నా అభిషేకం కావించాడు. మందహాసం చేస్తే రావణుడ్ని నేను పరికిస్తున్నాను నిజానికి అతను చెప్పిన దాంట్లో తప్పేముంది రావణుడు ‘కైలాసనాథా! నిన్ను ఏమన్నా తిడితే నన్ను క్షమించవయ్యా అన్నాడు నీవు అన్ని నిజాలు చెప్పావు రావణా! భక్తితో నన్ను తిట్టిన కీర్తన అనుకునే విరాగిని నేను నేను అభిషేకప్రియుడ్ని కాదయ్యా భక్తప్రియుడ్ని వారి అందరూ న్యాయమార్గాన ఏమి చేస్తే నాకు ఇష్టం అనుకుంటారో అది నేను స్వీకరిస్తాను. నాయనా వేదాలు ఉపనిషత్తులు సకలవిద్యలు అన్నీ నా చెంతకు చేరుటయే పరమసత్యమును తెలుపుతున్నాయి. నేను సైతం మిమ్ములనందర్నీ చూస్తూనే ఉంటాను. సత్యం అనేది ఎంతటి గొప్పదో అది తెలుసుకొనుటకు ప్రయత్నించే ప్రతిఒక్కరూ నాచెంతకు ప్రయాణం మొదలుపెట్టినవారౌతారు. నీవుచేసిన నిందాస్తుతికి ఎంతో సంతుష్టుడయ్యాను. నాభక్తుడు నా మీద తను చూపు ప్రేమలో నేను కరిగిపోతూనే ఉంటాను. భక్తులారా! నన్ను అనన్యచింతన చేయండి మిమ్మల్ని స్వీకరిస్తాను మీ తప్పొప్పులు కాస్తాను. మీ పాపపుణ్యాలు నాకు అర్పించండి మీకు నిశ్చలమైన భక్తిని ప్రసాదిస్తాను. నేను తప్పు వేరొకటి కోరుకోకపోవడమే భక్తి అనేమాటకీ నిజమైన అర్థం అది కోరుకున్నావు కాబట్టే రావణా నీకు ‘మహాభక్తుడు అను విరుదును వరముగా ప్రసాదిస్తున్నాను. తాదాత్మ్యం చెందిన రావణుడు శివోహం శివోహం శివోహం అని పరికించాడు. విశ్వనాథా ఈ లోకమే ఈ సృష్టే నీ భిక్ష మరి నీవు ఎందుకయ్యా భిక్ష ఎత్తుకుంటావు దేవా అని అడిగాడు. నీ నిందాస్తుతిలో పాపాలు తీసుకునే యాచకుడివి అనడం మరిచినట్టు ఉన్నావు. మాత్సర్యముతో నా భక్తుల కోరిక తీర్చేవాడిని అవటము మరిచావు రావణా అని అన్నాను. రావణుడు ఏమి చెప్పావు హరా” అని అన్నాడు. “ప్రభూ ఎప్పుడూ మీతోనే ఉండాలి ఇలా మీతోనే సమయం గడపాలి అని అడిగాడు. ‘నేను ఒక లింగమును రావణునికి ప్రసాదించి ఇది నేను ఒకటే రావణా అని చెప్పి దాన్ని పూజించుకోమని చెప్పి అంతర్థానమయ్యాను. రావణుడు భక్తితో నేను ప్రసాదించిన శివలింగమును తీసుకొని బయలుదేరాడు. బయలుదేరుతున్న రావణుడు మొహంలో ఎంతో తేజస్సును గాంచాను. నేను ఇచ్చిన శివలింగమున తన కిరీటములో ఉన్న స్థానంలో పెట్టుకొని ‘మహేశ్వరా! అమరేశ్వరా! శరణం శూలపాణి పినాకపాణీ శరణం అని మరొక కీర్తన పడూకుంటూ తన లంకకు వెళ్ళినాడు. అది కూడా భక్తితో పాడాడు కాబట్టే రావణుడి కిరీటంపై ఉన్న నన్ను స్తుతించాడు. లింగరూపంలో కావున ఆ లింగస్వరూపంలోనే వసించి కీర్తన విని ఆనందించాను., నేను ఇచ్చిన శివలింగమునకు శాస్త్రోక్తంగాను రాగభక్తితోను రావణుడు అచంచలంగా పూజిస్తూనే ఉన్నాడు. అతను ఆ శివలింగమునకు చేసిన ప్రతిచర్య పరిచర్య నేను స్వీకరిస్తున్నాను. రావణాసురుడు వేదపండితుడు కూడా వేదాలను అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదించిన సర్వనిగూఢాలను మననం చేసుకొని వాటియొక్క భావతాత్పర్యాలకన్నా నీ యందు తీవ్రమైన భక్తి కల్గి ఉండడమే వాటియొక్క సారం అని తెలుసుకొన్నాడు. రావణుడు ఒకానొక భక్తునికి నాగురించి ఇలా చెప్పసాగాడు. ‘ మహాదేవుడు భక్తసులభుడు ఆ దేవుని యందు సమస్తము కొలువై ఉంది కంటితో చూస్తే కనబడేవాడు కాదు పరమేశ్వరుడు ముక్కంటిని చూడాలంటే జ్ఞాననేత్రం ఉండాలి. పిలిస్తే పలికేవాడు కాదు పరమేశ్వరుడు. మనసుతో పిలిచిన శీఘ్రముగా వచ్చువాడు శంభుడు. దేవుడు అంటే ఆయనే అది అనాదిగా అయనను గురించి తెలుసుకోవడం ఎవరివల్ల కాదు, దేవుళ్ళకు దేవుడు కాబట్టే ఆయన మహాదేవుడు ఆయన ఏం చేసినా ఆయనకే చెల్లు. ఏ రూపంలో తలచినా అట్లే వస్తాడు. ఎవరిని దూషించకుండా నిశ్చలంగా నాస్తికత కూడా మహాదేవుని భక్తికి సోపానం. ఆయన యందు మాత్రమే భక్తి ఉండడం జన్మజన్మల అదృష్టం. మిగతా ఏదైవస్వరూపం మీదయినా భక్తి కలగాలంటే దానికి మహాదేవుని కృప ఉండాలి. తల్లి దండ్రి అయిన మనల్ని విడిచిపోతారేమో కానీ ఆయన మాత్రం తన చల్లని చూపును మన మీద ప్రసరింపజేస్తూనే ఉంటాడు. ఆయన ఉనికి గూర్చి ఆయన విశిష్టత గూర్చి చెప్పడం సృష్ఠి ప్రారంభమైన నాటినుంచీ తపస్సుచేస్తున్న వ్యక్తి వల్ల కూడా కాదు. ఆయన భక్తి సాగాంలో కలసిన తర్వాత కదా అది అర్థం అయ్యేది. “అంతయే గాక ఆభక్తునికి నాకు రావణుడు చేసిన అభిషేకములు అలంకారములు స్తోత్రములు కీర్తనలను గూర్చి చెప్పాడు ఆభక్తుడు వెలుగుతున్న దీపం మరొకదీపాన్ని ఎలా వెలిగించగలదో ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విని అర్థం అయింది. దశకంఠ రావణా శివుని ఎలా వైదికంగా పూజించాలో రాగభక్తితో ఎలా ధ్యానించాలో చెప్పండి’ అని అన్నాడు. ఆయన గూర్చి నేను చెప్పటమంత మాత్ర వాడినా ఆయన్ని కొలవాలంటే ఆయనే దారి చూపిస్తాడు, ఆయన ఒరిగేది భక్తికే. ఆయనపట్ల ప్రేమే భక్తి వైరాగ్యాలు” అని అన్నాడు. రావణుడి చెప్పినది సత్యం కదా నా భక్తితో లయించిన వారు చెప్పినా నేను చెప్పినా ఒకటే. రావణుడు తనకు తోచిన విధంగా ఆభక్తునికి నా భక్తి సాధనలు వివరించి తిరిగి నన్ను “శివశివ ఆది శివ అనుతశివ” అంటూ ఆనందపడ్డాడు. ఈ నిమిషంలో మహాదేవుడు ఎట్లుండునో ఎట్లా తపస్సు చేయునో ఎలా కదలునో ఎలా స్పందించునో ఎలా వివరించునో అన్ని నేను ఎట్లు ఉండునో అని తలవసాగాడు. అది కూడా నా తపస్సే కదా నన్ను చింతన చేస్తూ ఉండేవాడు. నేను ఇచ్చిన శివలింగములో బాటి మహాలింగమున ప్రతిష్ఠించుకొని పూజించేవాడు. తన ఎత్తు ఉన్న ఆ లింగమును ఎల్లప్పుడూ వాటేసుకొని ఉండేవాడు “నిండుగా ఉన్న నీ భక్తిలో… పండగే కదా నీ రక్తిలో” అని పాడుతూ ఉండేవాడు. “ప్రభూ! మహాదేవా ఈ శివలింగమును ఆలింగనం చేసుకుంటే మిమ్ము చేసుకున్నట్టే ఉంది అని తీవ్రంగా తలచేవాడు. అతగాడి తలపులు అన్నీ నా తలంపులే. ఇలా ఉండగా రావణుడి పరివారం అతన్ని యుద్ధాలకీ పురిగొల్పిన అతను అవన్నీ తుచ్ఛంగా భావింపసాగాడు. యుద్ధం చేద్దామని వచ్చిన వారందరికీ నా మహత్తులు చెప్పి వారికి జ్ఞానోదయం చేసేవాడు. ఇలా నా నామం చేసి అతనికి వాక్శుద్ధి వచ్చింది. అతను ఏమి చెప్తే అది జరిగేది క్రమేణా రావణుడు జ్యోతిష్యశాస్త్రంలో సైతం పండితుడైనాడు. అతను ప్రతి ఒక్కరికి నాకు సంబంధించిన స్తోత్రం చెప్పి ఇది చేసుకో నాయనా మీ ఇబ్బందులు ఆ ఈశ్వరుడు తీరుస్తాడు అనేవాడు. నేను ఏమి చేసేది అట్లనే రావణుడి మాటమీద నమ్మకముంచి నా స్తోత్రాలు చేసిన వారి కష్టాలు తీర్చేవాడను. ఎవరూ ఎక్కడ శివపూజచేసినా రావణుడ్ని పౌరోహిత్యానికి రమ్మనేవారు. వారి యొక్కస్థితిలో సంబంధం లేకుందా వారిగృహాలకీ వెళ్ళిన రావణుడు నా పూజ ఎంతో అందంగా ఆనందంగా చేసేవాడు. (సశేషం...)
No comments:
Post a Comment