పదునైన కలం
- కలిగొట్ల కాంతి
కలలలో తేలిపోతూకలకాలం గుర్తుండిపోయే
కమ్మని కవిత రాయాలని
కలం చేత పట్టుకుని కూర్చున్నాక
తెలిసింది!
రాయాలంటే
కావలసింది రాసే చేతులు కాదు
కరిగే కమ్మని హృదయం అని!
అక్షరాలు కాదు అక్షర సత్యాలు!
కన్నీటికి తడిసిన కథలలోని
కొత్త కోణాల భావజాలాలు!
హృదయంలో ఎగసిపడే
భావ సముద్రాల కెరటాల ఉప్పెనను
సాంత్వన పరిచి
అక్షర కెరటాల ఉప్పెనగా మార్చగలిగే
సూర్యుడిలోని చైతన్యం, చంద్రునిలోని చల్లదనం
కలిగిన ఒక పదునైన కలం!!
No comments:
Post a Comment