సరదా సమయం
- వసంత శ్రీ
ఇంట్లో మన:శాంతి లేదండీ గురువుగారు. ఏ వ్రతం చెయ్యాలో చెప్పండి అడిగింది గంభీర కంఠీ .
గురువుగారు_ మీరు చెయ్యాల్సిన వ్రతం ఉందమ్మా చెప్తా , చేస్తారా? గం.కం :తప్పక చేస్తా చెప్పండి గురువుగారు.
గురువుగారు: మీరుచేయ్యల్సింది –మౌనవ్రతం.
****************************************************************************************************************************************************************************
ఇంటికి వస్తూనే హడావిడిగా –' నే మళ్ళీ మర్చిపోతానేమో రేపు మా కొలీగ్ వాళ్ళింట్లో భోజనానికి పిలిచారు,' చెప్పాడు అర్సంఝా రావ్.
ఎవరండీ అడిగింది సుమతి...
"నా ఫ్రెండ్ ముకర్జీ -కల్ హమారా ఘర్ మే భోజన్ హై,జరూర్ ఆనా,8 బజే “ అని పిలిచేరు, చెప్పాడు అర్సంఝా రావ్.
అర్సంఝారావ్ భోజన ప్రియుడు ,ఇంకేముంది ఇంచక్కా రసగుల్లలూ స్వీట్లు అవీ తినోచ్చని పిల్లలిద్దర్నీ తీసుకొని , సాయంత్రం వెళ్ళారు .
అప్పటికి చాల మంది వచ్చారు. కొంత మంది డోలక్ అవీ రెడీ చేస్తున్నారు . పువ్వులు డేకరేట్ చేసి, ఇల్లు బాగా సర్దారు . కేటరింగ్ ఐటమ్స్ కోసం చూస్తూ కూచున్నారు.
ఈ లోగా డోలక్,హార్మొనియం తీసి చక్కగా వాయిస్తూ ఎవరో పాటలు పాడుతున్నారు . వీళ్ళకి భోజనాలు లేట్ గా అలవాటేగా అనుకుంటూ కూచున్నారు. సరదాగా కొన్ని పాటలు పాడారు వీళ్ళూనూ .
టైం 10 అయింది . పిల్లలకి బయటికెళ్ళి ఎదో తినిపించి వచ్చాడు . 12అయింది 1,2,3.......టైం నడుస్తోంది . మధ్యలో మజ్జిగాలు అవీ వస్తున్నాయి కానీ భొజనాల జాడ లేదు ..
మర్నాడుదయం తెలిసింది –వాళ్ళు శివరాత్రి ఉపవాసం , భజనచెయ్యడానికి పిలిచారని , ప్రతీ సంవత్సరం అలా చేస్తారని, కొబిత చక్రబోర్తి అనే –పక్కావిడ చెప్పాకా -
అర్సంఝారావ్ కి బోధపరచింది సుమతి. భజన్ కి పిలిచారనీ,భోజనానికి కాదని. :)
No comments:
Post a Comment