చల్లని దేవుల అల్లరిలో రాధ!
- డా. వారణాసి రామబ్రహ్మం
చల్లని దేవుల అల్లరిలో రాధ
ఉల్లము పొంగ పొందె తీయని బాధ
ఆహ్లాదము కలిగించు కిరణములతో
స్పృశించి రాధను వివశను చేసెను
ప్రేమికుల పాలిటి ప్రియ శత్రువు
పున్నమిని చల్లదనములు పంచు కలువల రేడు
ఆహ్లాదము కలిగించు కిరణములతో
స్పృశించి రాధను వివశను చేసెను
ప్రేమికుల పాలిటి ప్రియ శత్రువు
పున్నమిని చల్లదనములు పంచు కలువల రేడు
గాయములు కనిపింప నీయక
పూలబాణములతో తనువునంతా
అతలాకుతలం చేసే రూపు లేని దొర
తీపుల బారిని పడవేసి రాధను నిలువనీయడము లేదు
పూలబాణములతో తనువునంతా
అతలాకుతలం చేసే రూపు లేని దొర
తీపుల బారిని పడవేసి రాధను నిలువనీయడము లేదు
మనసు పంచుకుని; ఊసుల మురిపించుచు
వయసు పండింప వలసిన రస తరుణమున
రాడు మాధవుడు సంకేత స్థలమునకు
అభిసారికయై అరుదెంచి వేచియున్న
రాధను రతిని ముంచి తేల్చి రసైక్యము నొందుటకై
వయసు పండింప వలసిన రస తరుణమున
రాడు మాధవుడు సంకేత స్థలమునకు
అభిసారికయై అరుదెంచి వేచియున్న
రాధను రతిని ముంచి తేల్చి రసైక్యము నొందుటకై
ఇలా చల్లని దేవుల అల్లరిలో రాధ
ఉల్లము తల్లడిల్ల పొందె తీయని బాధ
ఉల్లము తల్లడిల్ల పొందె తీయని బాధ
"మల్లెల వలపుమాలలు వైచి కొని ప్రణయ జీవులమైతిమి
తెల్లని వలువలు విడచి పొర్లాడుటకునై;
ఏమిది ఇంకనూ రాడు మాధవుడు?"
అనుకొనుచున్నది మాధవ సంగమేచ్ఛతో రాధ
వలపుల మల్లెల మాల శృంగార తార ప్రణయ సితార
తెల్లని వలువలు విడచి పొర్లాడుటకునై;
ఏమిది ఇంకనూ రాడు మాధవుడు?"
అనుకొనుచున్నది మాధవ సంగమేచ్ఛతో రాధ
వలపుల మల్లెల మాల శృంగార తార ప్రణయ సితార
చల్లని దేవుల అల్లరిలో రాధ
ఉల్లము పొంగ పొందె తీయని బాధ
ఉల్లము పొంగ పొందె తీయని బాధ
No comments:
Post a Comment