‘శ్రావణ’ సౌరభాలు - అచ్చంగా తెలుగు

‘శ్రావణ’ సౌరభాలు

Share This
‘శ్రావణ’ సౌరభాలు
- కొంపెల్ల శర్మ
“శ్రీల జెలు వొందుటకు సువాసినులొనర్చు శ్రావణీశుక్రవార పూజలను నలరు నమ్మహాలక్ష్మి శుభదృష్టి నవతరించు నమృత వీచికల శుభంబునార్చుగాత! (వేంకట పార్వతీశ కవులు) శ్రావణ శుక్రవారవ్రతం వల్ల శుభదృష్టి అవతరిస్తుందని ఆనాటి ప్రముఖ కవిద్వయం వెంకట పార్వతీశ కవులు ప్రస్తావించారు. ఆషాడభూతి కాలం పరిసమాప్తి అయ్యాక  ఈ ధరణిని శ్యామల తృణశాలినిగా శ్రావణమాసం మారుస్తుంది అని ఓ నానుడి ఉండి. మనం ఆచరించే చాంద్రకాలమానం ప్రకారం చైత్రాది పన్నెండు మాసాల్లో ఐదోమాసంగా శ్రావణం వస్తుంది. పౌర్ణమి నాడు ఉండే నక్షత్రం పేరుతొ నెలల్ని పిలుచుకొనే ‘చాంద్రమానం’ ప్రకారం, పున్నమినాడు వచ్చే ‘శ్రవణం’ నక్షత్రం మూలాన ఈ మాసాన్ని శ్రావణమాసంగా పిలుచుకొనే పద్ధతిగా మారింది. ఈ మాసాన్ని నోములు/వ్రతాల మాసంగా భావిస్తారు. భారతదేశంలో ఆబాలగోపాలం అమితంగా ప్రేమించే ‘వర్షరుతువు’ లో ఆషాఢ, శ్రావణ మాసాలు వస్తాయి. మన అన్నదాతలు ‘క్రుషీవలురు’గా నిత్యం శ్రమపడే రైతులు వ్యవసాయపు పనుల్లో నిమగ్నమైపోవడం పరిపాటి. విష్ణుమూర్తిది సాక్షాత్తూ ‘శ్రవణం’ నక్షత్రమని భావించే మాసం పేరుతో వచ్చే శ్రావణమాస మాహాత్మ్యాన్ని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరిస్తూ ద్వాదశ మాసాల్లో శ్రావణం అత్యంత ప్రియమైందని చెబుతాడు. మాసమంతా ధర్మ, వ్రత స్వారూపాలుగా విరాజిల్లే ఈ మాసంలో మన ద్వాపరయుగకర్త శ్రీకృష్ణ పరమాత్మ జననం కూడా యిదే మాసంలో జరగడం నిజంగా శ్రావణం ప్రాశస్త్యం పొందింది. ప్రఖ్యాత అరవిందయోగి, ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్, చూడికుడుత్త నాంచార్ లాంటి ఎందఱో ప్రముఖులు  జన్మ తిథులతో శ్రావణమాసంలో జన్మించినవారే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే జరిగిందని విశ్వాసం. గరుడుడు అమృతభాండసాధన ఈ మాసంలో ‘శుద్ధ పంచమి’ రోజునే జరిగిందంటారు. శ్రావణ మాసంలో మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం స్త్రీలు జరుపుకోవడం సదాచారం. శ్రావణ మాసంలో గృహనిర్మాణం ఆరంభిస్తే భ్రుత్యలాభం అని మత్స్యపురాణం విశదపరిచిందని చెబుతారు. ఈ శ్రావణమాసంలో – పక్ష/తిథివారీగా సంప్రదాయంగా వస్తున్నా ప్రత్యేకతల్ని పరిశీలిద్దాం.
శ్రావణ మాసం
శుక్ల/శుద్ధ పక్షం
కృష్ణ/బహుళ పక్షం
తిథి
పర్వ విశేషాలు
తిథి
పర్వ విశేషాలు
పాడ్యమిగౌరీవ్రతం ప్రారంభం.ధనదస్య ‘పవిత్రారోపణం’ స్మృతిగా బిల్వరోటక, అర్థ శ్రవణికా, ఆరోగ్య, విద్యాప్రాప్తి వ్రతాలు చేయాలని వ్రాత గ్రంథాల ప్రస్తావన. చైత్ర శుద్ధ పక్షంలో ‘దమనారోపణోత్సవాలు’ మాదిరిగా శ్రవణ శుక్లపక్షంలో ‘పవిత్రారోపణోత్సవాలు’ జరపాలని ప్రస్తావించారు. ఈ పక్షంలో పాడ్యమి నుంచి పూర్ణిమ వరకూ రోజుకో దేవతకు ఉత్సవం జరపాలని కూడా ప్రస్తావన. దొర గ్రంథి పూజ, తోరబంధనం కూడా ఆచారంలో ఉంది. పవిత్రాలకు తొలిపూజ, దేవాలంకరణ ఉత్సవం తర్వాత ఆ పవిత్రాలను భక్తులకు పంచడం జరుగుతుంది.పాడ్యమిధనప్రాప్తి మాసవ్రతం, సోద్యాపనం – మౌనవ్రతంగా శివ వ్రతం జరుపుతారు.
విదియస్వర్ణ గౌరీ వ్రతం.‘మనోరథ ద్వితీయా’ గా పగలు వాసుదేవార్చనం, రాత్రి చంద్రోదయంతో అర్ఘ్యదానం, నక్తం, భోజనం.విదియశ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జననం. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదని విశ్వాసం.అశూన్య శయన వ్రతం. చాతుర్మాస్యా ద్వితీయ.
తదియ
పార్వత్యా పవిత్రారోపణం – మధుశ్రావణీ వ్రతం చేస్తారు.
మధుస్రవం – గుజరాత్ లోప్రసిద్ది
తదియత్రుష్టిప్రాప్తి తృతీయా వ్రతం.
చవితినాగ చతుర్దశి. విఘ్నహారిణం, త్రిపురభైరవ పవిత్రారోపణం, గణేశ చతుర్ధి. ఆలోల చతుర్ధిగా  – వర్ష ఋతువు శోభని వర్ణించే ఉత్సవంతో గాన, నృత్యాలతోపాటు ప్రకృతి ఊయలాటలు.చవితిసంకష్ట హరణ /బహుళా చతుర్ధీ వ్రతం.
పంచమినాగపంచమి – మట్టితో చేసిన పాముని కొనుక్కొని/గోడమీద పసుపు/గంధం తో పాముల్ని చిత్రించి చేసే పూజ సర్ప భయాన్ని పోగొడుతుందని విశ్వాసం. కుండలినీ శక్తి Serpentine గా యోగవిద్యతో విద్యుత్ శక్తంత తీవ్రంగా పనిచేస్తుందని – “The Voice of Silence” – H.P.Blavetksee  వివరించాడు. మానవ శరీరాన్ని పుట్టతో పోల్చడం, సోమరిదేహాన్ని సాధనతో స్వాధీనం చేసుకొంటే దాని విషం విరిగిపోతుందని, మూలాధారం నుండి సహస్రారం వరకూ వెన్నెముక మధ్య నుండి సర్పాకారంగా కుండలినీ శక్తిగా సుషమ్నానాడిని లేవదేయడమే ‘నాగపూజ’ ప్రధాన   ఉద్దేశ్యంగా చెబుతారు. మాళవ, ఉత్కల, తమిళ, వంగ,కాశీ ప్రాంతాల్లో ఎవరి శైలిలో వాళ్ళు జరుపుకుంటారు. నేపాళ దేశంతోపాటు,  కృష్ణ, గోదావరీ నదీ ప్రాంతాల్లో గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు.పంచమిరక్షా పంచమి, నాగపూజ, మనసాదేవీ విషహరీ పూజ.
షష్టిసూర్యషష్టి వ్రతం. సూపౌదన వ్రతం (పప్పు అన్నం) – శివపూజతో నైవేద్యంతో భుజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఆమాదేర్ జ్యోతిషంలో ‘కల్కి జయంతి’ (సాయంకాలం). స్మృతి కౌస్తుభం ప్రకారం ‘గుహస్య పవిత్రారోపణం’ జరుపుకోవడం కూడా పరిపాటి.షష్టిహలషష్టి.
సప్తమిసత్యవర తీర్థర పుణ్యదినం. అవ్యంగా సప్తమీ వ్రతం – సూర్యపూజతో అ గ్రహం పేర నాలుగన్నర మూరల నూల గుడ్డ దానంతో అనంతఫలప్రాప్తి. ఈ రోజు హస్త నక్షత్రం కూడితే పాపనాశన సప్తమి అంటారు. ద్వాదశీ సప్తమి, పాపనాశినీ సప్తమీ వ్రతాలు చేయమని చతుర్వర్గ చింతామణి ప్రస్తావన. భాస్కరస్య పవిత్రారోపణం కూడా ప్రసిద్ధి.సప్తమిశీతలా సప్తమి.
అష్టమి‘దుర్గాష్టమి’ పుష్పాష్టమి వ్రతం, శివపూజలు ప్రారంభించి ఏడాది పొడుగునా పూజలు చేస్తారు. ‘అన్యేషాం దేవానామపి పవిత్రారోపణం’, దుర్గాయా: పవిత్రారోపణం అని  కూడా ప్రాచుర్యం.అష్టమిశ్రీకృష్ణాష్టమి / జన్మాష్టమి / గోకులాష్టమి   – అందరికీ పవిత్ర పండుగ. వైష్ణయులు నక్షత్రపరంగా జయంతి జరుపుకునే   అష్టమినాడు శ్రీకృష్ణ జయంతిగా పిలుస్త్గారు.   మహారాష్ట్రలో బుద్దాష్టమి. మంగలావ్రతం, కాలాష్టమి – కృష్ణ సంబంధాలు కాకపోయినా, అలాగే ప్రసిద్ధమైనాయి. సూర్య సావర్ణి (ఎనిమిదవ మనువు) మన్వంతరాది, దశఫల వ్రతం.
నవమిమాతృణామ్ పవిత్రారోపణం కౌమారీ నాయక పూజనం అని ప్రచారం.నవమిచండికా పూజ, కౌమార పూజ, అరవింద యోగి జననం
దశమిధర్మస్య పవిత్రారోపణం, దది, వేద వ్రతాల ఆరంభం. ఆశాదశమి – పగలు ఉపవాసంతో ఆశాదేవిని నెలకొల్పి శివపూజ చేస్తే ఆశలన్నీ నెరవేరుతాయని ప్రతీతి.దశమి
ఏకాదశిమునీనాం పవిత్రారోపణం. లలితైకాదశి.పుత్రైకాదశి – మహాజిత్తు కి సంతానలేమితో ఈ రోజు ఏకాదశి వ్రతం చేసిన ఫలితంగా పుత్రయోగం; పుత్రుణ్ణి దయచేసిన ఏకాదశి – పుత్రైకాదశి అయింది.ఏకాదశిఅజైకాదశి, – రాజ్యం, భార్య, పుత్రుల్ని  కోల్పోయిన హరిశ్చంద్రుడు విద్యుక్తంగా ఎకాదశీవ్రతం చేయగా, తిరిగి వాటిని పొందాడు.కామికా ఏకాదశి వ్రతం, శ్రీధర పూజ. ధర్మప్రభైకాదశి – పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం.
ద్వాదశిచక్రపాణినం పవిత్రారోపణం, హరే పవిత్రారో పనోత్సవ: విష్ణు ప్రతిమ దానం; బంగారం, వెండి, రెల్లు, దర్భాదులతో పవిత్రాన్ని చేసి శివ విష్ణులకు సమర్పించిన పూజని ‘పవిత్రారోపణం’ గా పిలుస్తారు. దామోదర ద్వాదశి గా కూడా ప్రచారం.ద్వాదశిరోహిణీ ద్వాదశీ వర్షం.
త్రయోదశిఅనంగ త్రయోదశి వ్రతం - అనంగునికి ప్రీతికరమైన ఈరోజు పవిత్రారోపణం. కుంకుమాక్షతలు, ఎర్రరంనైవేద్యం, గు పూవులతో రాతీమన్మదుల పూజ; మినపసున్ని ఉండల్ని, పాలని నైవేద్యం పెట్టి, మైనపువత్తితో హారతి. ఆంధ్రుల ఇళ్ళల్లో ‘మనుగుడుపులు’ రోజుల్లో ఈ మినిపసున్ని ఉండాలని అల్లుళ్లకు తప్పక పెట్టడం, రాతీమన్మదుల పూజలో నివేదన, బలవర్ధకం, మైథున ప్రీతికరం అని చెప్పే ప్రయత్నం.త్రయోదశిద్వాపర యుగాది.
చతుర్దశిహయగ్రీవోత్పత్తి.  దేవ్యాం, శివస్య పవిత్రారోపణం. శివుడు లింగరూప విగ్రహాలకు పిక్కలదాకా(లింగ వ్యాసం తో ముడి ముడికీ సమదూరం) పవిత్రం వేలాడితే ‘శివ పవిత్రం’ గా చెప్తారు.చతుర్దశిమాస శివరాత్రి., అఘోర చతుర్దర్శి.
పౌర్ణమిఆపస్తంభోపాకర్మ వరలక్ష్మీ వ్రతం.శ్రావణ పూర్ణిమ – ఉపనయన విశిష్టత. నవీన యజ్ఞోపవీత ధారణం. ఉపాకర్మ తర్వాత ఈ రోజునుంచి వేదవిద్య నేర్చుకోవడం శ్రీకారం చుట్టేవారు.జంధ్యాల, రాఖీ, నార్లీ పూర్ణిమ, రక్షాబంధనం చేసే రోజుగా కూడా పిలుస్తారు. సర్వ విద్యలకూ ఆద్యుడూ, చదువుల తల్లి సరస్వతికి కూడా గురువు – హయగ్రీవుడు.   హయగ్రీవ అవతార  జయంతి – శిష్ట జనుల విశిష్టాచార అయన పర్వదినం ఈ రోజునే జరుపుకుంటారు. విద్యారంభానికి శ్రావణ పూర్ణిమకు ఆపాదించారు. బ్రాహ్మణులు ‘శ్రావణి’ గా గత సంవత్సరం చేసిన పాపాల పరిహారార్ధంగా నిర్వహిస్తారు. ఋగ్వేద, యజుర్వేద శాఖలు రెంటికీ ప్రాముఖ్యం.  ఈ ఘట్టంలో పంచ గవ్య ప్రాశనం, గణపతి పూజ, హోమం చేస్తారు. సప్త మహర్షులను – శతపథ బ్రాహ్మణం ప్రకారం  (గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ట, కశ్యప, అత్రులు), మహాభారతం ప్రకారం  (మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్య, వశిష్టులు)  పూజించడం, పురోహితులకి దక్షిణ బహూకరించడం చేస్తారు. శ్రావణ పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం స్త్రీలు  వరలక్ష్మీ వ్రతం జరుపుతారు.   చారుమతి అనే ఆమెకు కలలో చెప్పిన వ్రతంగా మహాలక్ష్మి ఉపదేశంగా, సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. పరదేవతా ప్రసాదంగా – ప్రముఖ వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితులు ఈ వ్రతానికి సంబంధించి ప్రత్యేకంగా కృతిని రచించారు. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” (శ్రీరాగం, రూపక తాళం).   శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు   మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రతీ మంగళవారం కొత్తగా వివాహితులైన స్త్రీలు నోము నోచుకుంటారు. జన్మజన్మలకీ అమంగళాలు కలుగవన్నది విశ్వాసం. శ్రావణ వరలక్ష్మీ పూజతో కొత్తనగ, శ్రావణతగువు యివ్వడం సదాచారం. శ్రావణ పూర్ణమి  రోజున వివిధ సంప్రదాయ, శైలీ విధానాలుగా   ప్రాచుర్యం పొందింది.అమావాస్యపోలాల అమావాస్య – ఈ నాటికి  తెలుగుదేశం’లో  గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. ‘పోలామావాస్య’ గా మారి, పోల అనగా కడుపునిండా మేతమేసి నీరు తాగి పనిపాటు లేకుండిన ఎద్దు అని అర్త్ఘం. ‘అమా’ అనగా అమావాస్య. ఈ విధంగా గోపూజకు ఉద్దిష్టంగా స్పష్టం అవుతుంది.పోలాంబ దేవతా వ్రతం.సింహ సంక్రమణం, నృసింహ పూజ. సుజన్మావాప్తి వ్రతం. సంక్రాంతి స్నాన వ్రతం. సింహ సంక్రాంతి తర్వాత సంక్రాంతి వరకూ సింహమాసంగా పిలుస్తారు. ఈ మాసంలో ఆవు ఈనితే శాన్తి తో శాస్త్ర వచనంతో యజమానికి కీడు పోతుందని విశ్వాసం.
  పవిత్రారోపణం – ‘శ్రీకృష్ణ సంప్రదానకోపవీత దానరూపోత్సవ విశేష:’ ప్రకారం – ఆయా తిథులలో పవిత్రారోపణ ఉత్సవాలు ఆయా దేవతలకు చేయాలని ఓ ప్రస్తావన. శ్రావణ శుద్ధ – పాడ్యమి (ధనధునికి); విదియ (శ్రియ:పతికి); తదియ (పార్వతికి); చవితి (వినాయకునికి); పంచమి (శశికి); షష్టి (గుహునకు); సప్తమి (సూర్యునకు); అష్టమి (దుర్గకు); నవమి (మాతృ గణమునకు); దశమి (ధర్మరాజుకు); ఏకాదశి (మునులకు); ద్వాదశి (చక్రపాణికి); త్రయోదశి (అనంగునకు); చతుర్దశి (శివునకు); పూర్ణిమ (పితృదేవతలకు).    

No comments:

Post a Comment

Pages