నావ సాగి పోయెరా
-- రచన చెరుకు రామమోహన్ రావు
సాకి : కడుపు కాలే మంట ఆశలే అడుగంట
వేసాల మోసాల బతుకు పై రోశి...
పల్లవి: నావ సాగి పోయెరా
నీబతుకు నావ సాగి పోయెరా
మానవా నావ సాగి పోయెరా
చరణము 1 : రెక్కలన్నీ ముక్కలయ్యి
రేయిపగాలు ఒక్కటయ్యి
కాలమంతా కనులముందే
కలలలోనే కరగిపోయి ||నావ||
చరణము - 2: కల్లకపటము తెలియలేక
కాని పనులను చేయలేక
కనికరించే వారులేక
కరువు తీరే దారి లేక ||నావ||
చరణము-3 : కొత్త వెలుగుల చూడనెంచి
కోరికల తెరచాపనెత్తి
కొండఎత్తున ఆశతోడ
కోరిన తీరాన్నిజేర ||నావ||
No comments:
Post a Comment