కనకదుర్గమ్మ మాత్యం (కధ- 3 వ భాగం) - అచ్చంగా తెలుగు

కనకదుర్గమ్మ మాత్యం (కధ- 3 వ భాగం)

Share This

కనకదుర్గమ్మ మాత్యం (కధ- 3 వ భాగం)

 

 - బి. వి. రమణారావు

దుర్గ తనకీ ఉద్యోగం అంత సులభం గా వస్తుందని కలలో కూడా అనుకోలేదు అసలు అప్లికేషన్ అయినా పెట్టలేదు.
తిరిగొచ్చాక జరిగిందంతా తల్లికి చెప్పింది .తను అనుకున్నట్టు గానే నెవ్వెళ్ళీన కాడినుంచీ ఆ కనక దురగమ్మ తల్లికి దణ్ణాలెట్టుకుంటూనే వున్నాను .అంతా ఆ చల్లని తల్లి మాత్యం" అంది.
"దుర్గ తన తల్లిని టైలరింగ్ ట్రైనింగ్ తో బాటు వయోజన విద్యా కేంద్రం లో చేర్పించింది . తన టైలరింగ్ వృత్తికి  కావల్సిన పేర్లూ కొలతలూ ,తేదీలూ లాంటివి తప్పులతోనైనా వ్రాసుకోగల చదువు నేర్చుకుంది . అయితే తల్లి మాటల్లో చిన్ననాతి నుంచీ అలవాతైన యాస మాత్రం పోలేదు . ఇప్పుడు దుర్గ కి తల్లంటే ఎంత ప్రాణమో ,తల్లి మాటల్లో సహజమైన ఆ యాస వినటమన్నా అంత ప్రాణం.
                           ******************
ప్రసాద్ విదేశాల్లో ట్రైనింగ్ అయ్యి స్వయంకృషి తో  వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) స్థాయికి ఎదిగాడు .అందరితో పాటు దుర్గ ని కూడా నవ్వుతూ పలుకరించేవాడు ,మంచి మాటకారనీ,సమయస్పూర్తి తో సలహాలివ్వగల పేరుంది  . అతని దగ్గిర సెక్రటరీ గా వుండటం  ఎంత ఆనందదాయకమో అంత మానసిక ఉద్రిక్తతకు గురయ్యే అనుభవమూ ఉంది. విధినిర్వహణలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నామందలించి దాన్ని   ఏవిధముగా సవరించాలో చెప్పి చేయించి ,మళ్ళీ కొన్ని నిమిషాలలో మరచిపోయినట్లే ప్రవర్తించి
ఊరట కలిగించేవాడు.ఎన్నో సందర్భాలలో అతనితో కలిసి విందులూ ,వినోద కార్యక్రమాలలోనూ  పాల్గొంది . అతను ఎంత చనువిచ్చినా తమ మధ్య ఉన్న అంతస్తుల అంతరాల నూ విస్మరించకుండా  తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్మణ రేఖను దాటకుండా వివేకము తో ప్రవర్తించేది.
ప్రసాద్ తో టూర్ వెళ్ళి రెండు మూడు రోజులున్న సంఘటనలు ఉన్నాయి ఎక్కడకెళ్ళినా తన ప్రయాణ బడలిక ,భోజన వసతుల పట్ల శ్రద్ధ చూపే వాడు . ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వెట్టర్ ,స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు  వాచ్ ,హాంగ్ కాంగ్ లో వైట్ ఎంబ్రాయిడరీ  శారీ కొని ,వొద్దనటానికి వీలు లేనంత  అతి సున్నితమైన మాటలతో బహుకరించాడు . ఎంత సన్నిహితం గా ఎన్నడూ ప్రేమ, పెళ్ళి అనే వ్యక్తిగతమైన విషయాల మీద సంభాషణ రాలేదు.
 రెండు రోజులు వరుసగా శలవుదినాలొచ్చాయి . అందులోనూ .అందులోనూ ఉగాది ఆదివారం  ఓ రోజునే అయ్యింది .సనివారం  ఉదయానికల్లా విజయవాడ  రమ్మని తల్లి వ్రాసింది . తను శుక్రవారం  బయల్దేరి విజయవాద వెళ్ళి సోమవారం ఉదయానికల్లా తిరిగొస్తానని ప్రసాద్ కి చెప్పినప్పుడు-
"నా హృదయ పూర్వక ఉగది శుభాకాంక్షలు.వెళ్ళీరా. నీకో శుభవార్త. నా పెళ్ళీ త్వరలోనే జరగబోతూంది. నువ్వు తిరిగొచ్చేక పెళ్ళికూతుర్ని పరిచయం చేస్తాను" అన్నాడు. " అయితే మీకు రెట్టింపు శుభాకాంక్షలు" అంది దుర్గ ఒక్క క్షణం వివర్ణమైన మొహాన్ని చిరునవ్వుతో కప్పిపుచ్చుకుంటూ..ఈ వార్త ఏమూలో తన అంతరంగములో చెలరేగిన కలల అలలకది చెలియలి కట్ట. తనని ఎంతో దయతో చూసుకుంటున్న తన బాస్ కి అన్ని విధాలా అనుకూలమైన జీవిత భాగస్వామిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించింది. ******************
    తల్లి కోసం నిరీక్షిస్తూ ఆలయ ప్రాంగణం లో కూర్చుని ఉండగా" "ఏమిటి దుర్గా !దీర్ఘం గా ఆలోచిస్తున్నావు?" అన్న సుపరిచితమైన గొంతువిని ఉలిక్కిపడి ప్రక్కకి చూసింది.భవాని గారు తనవైపే అడుగులేస్తూ వస్తోంది.
"ఋఅంది ఋఅంది. ఉగాది పండుగనాడు మీ దర్శనమవ్వటం మా అదృష్టం. ముందు మీకు శుభాకాంక్షలు . తర్వాత మీ ఆశీస్సులకు ధన్యవాదాలు" అంది దుర్గ.
  "థేంక్యూ, ఏమిటి విశేషాలు"
"ఆనాటి మీ ఆశీస్సులు ఫలించాయి. ఆ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది .రెండు నెలల క్రితం చేరాను. అంతా మీ నోటి చలవే" అంది దుర్గ లేచి ఎదురుగా ఉన్న ఆమె పాదాలకు నమస్కరిస్తూ.
"శ్రీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు " ఆశీర్వదించింది భవానీ గారు
"మరె అంత శీఘ్రముగా వద్దులెండి. పైగా నేనింకా వరాన్వేషణ ప్రయత్నంలో లేను . అంచేత ఆ అవకాశం లేదు."" ఈ పురుషాధిక్య సామాజిక వ్యవస్థలో నా స్వాతంత్ర్యాన్ని త్యాగం చేసి బానిసత్వం స్వీకరించడానికి సిద్ధం గా లేను. నేనున్న పరిస్థితిలో పెళ్ళంటే కోరి కష్టాల్ని కొని తెచ్చుకోటమే అవుతుంది".
"నాన్‌సెన్స్! నేను నీ వయస్సులో ఉన్నప్పుడు నా పరిస్థితి నీ పరిస్థితి కంటే అధ్వాన్నంగా ఉంది.నేను పేద కుటుంబములో పుట్టాను . పైగా మాది హరిజనుల్లో అట్టడుగు కులం. మేముండే వీధిలోనె ఉన్న సారధి  గొప్పింటి యువకుడు. మా ఇంటికి పదిళ్ళవతల   మేడలో ఉండేవాడు. అతనిది అగ్ర కులం. నేను ఎమెస్సీ పాసై  టంపరరీ గా టీచర్ గా పనిచెస్తున్నాను. అతని తండ్రి ఎడ్వకేట్  . తండ్రి దగ్గరే సారధి జూనియర్ గా ప్రాక్టీస్ చేసేవాడు.
 ఇద్దరమూ ఎంత జాగ్రత్తగా వున్నా ఎంత వద్దనుకున్నా ప్రేమలో పడ్డాం. చుట్టుపక్కల వాళ్ళ కళ్ళ పడ్డాం.. మా పెద్దలకి పట్టుపడ్డాం .వాళ్ళ వాళ్ళూ , మా వాళ్ళూ బెదిరింపులకూ, దౌర్జన్యాలకూ దిగారు  ",
"మీ వాళ్ళూనా?" "మా వాళ్ళు మరీనూ,ఒకటి అగ్రకులాలంటే అవిశ్వాసం ,ద్వేషం.రెండు- మేము పెళ్ళీ చేసుకుంటే మా సంతానానికి చట్టప్రకారం కులం ప్రాతిపదికన మీద వచ్చే రాయితీలు  పోతాయి..మూడు - పైగా అవమానలన్నీ మాకే, నేనే సారధిని వల్లో వేసుకున్నానన్నారు .సారధి ధైర్యం గా నా చెయ్యి పట్టుకుని వాళ్ళనీ,వాళ్ళ సంకుచిత్వాన్ని , వాళ్ళ ఆస్తిపాస్తుల్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇల్లు విడిచిపెట్టి వచ్చాడు . రిజిస్టర్ మేరేజ్ చేసుకుని అందరికీ దూరమయ్యాం. మూడేళ్ళు రకరకాల కష్టనిష్టూరాల్ని ఎదుర్కొని ఎలాగో నిలబడ్డాం. ఇప్పుడు సారధి లీడింగ్ ఎడ్వొకేట్. నేనీమధ్యనే గరల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యాను అంది భవని. ఆమె మాటల్లో గర్వం లేదు. జీవిత సాఫల్యతకి సహజమైన సంతోషం ధ్వనిస్తోంది.సమాజంలో మంచితనం, మంచితనానికి గౌరవం అంతరించలేదన్న విశ్వాసం స్ఫురిస్తోంది. "ప్రేమ వివాహాలే అనేక వివాదాలకీ,సమస్యలకి దారి తీస్తాయి. అందుల్లోనూ వర్ణాంతర వివాహం సుఖాంతమైందంటే మీరు అదృష్టవంతులు. మార్గదర్శకులు". "సాధారణం గా ప్రేమనేది రూపసౌందర్యం,ధనార్జన పట్ల ఆకర్షణ మీద ఆధారపడుంటుంది. కానీ   మాకు ఆ రెండూ లేవు. నేను కానీ,సారధి కానీ అందమైన వాళ్ళం కాము . ఆర్ధికం గా కూడా సారధి లా ప్రాక్టీస్ లో స్థిరపడేవరకూ,మూడేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాము.నీకు రూపం,చదువూ, సంపాదనా అన్నీ ఉన్నాయి". "ధాంక్స్ మేడం  . అసలు పెళ్ళీ విషయం లో నేనింకా ఒక ఓ నిర్ణయానికి రాలేదు". అంది దుర్గ. "మొన్నమొన్నటి వరకూ మా అమ్మాయి అలాగే అనేది. ఇప్పుడు మా ఆర్ధిక పరిస్థితి,పలుకుబడి బాగున్నాయి. ఇప్పుడు సమాజం  మమ్మల్ని సంస్కర్తలుగా గౌరవిస్తుంది.మా అబ్బాయీ, అమ్మాయీ  కూడా బావుంటారు .మా అమ్మాయి కి కావల్సినన్ని మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. గతం లో తను పొందిన అనుభవాలు మరచిపోలేదు.డెయిరీఫార్మింగ్ లో రీసెర్చ్ స్కాలర్ గా నాలుగు నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళీంది. అదే సెంటర్ లో ట్రైనింగ్ కు వచ్చిన ఇండియన్ బాయ్ తో స్నేహం అయ్యింది.
 ఇద్దరూ ప్రేమించుకున్నారుట . అక్కడే పెళ్ళి చేసుకుంటాం అన్నారు .శుభం అన్నాం.పెళ్ళి చేసుకున్నారు ఆ పిల్లవాడు పంజాబీ వాడు. వాళ్ళెప్పుడొస్తే అప్పుడే రిసెప్షన్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం" అంది భవాని గారు.
"మరి మీ అబ్బాయి..."
"వాడు ఎంటెక్ పాస్ అయ్యాడు . నాలుగేళ్ళ ఉద్యోగం చేశాక ఆ కంపెనీ వాళ్ళే అమెరికాలో నాలుగేళ్ళు ట్రైనింగ్ ఇప్పించారు.పెళ్ళీ చేసుకోరా అంటే ఇన్నాళ్ళూ చెల్లి పెళ్ళి అవ్వనియ్యండన్నాడు . ఇప్పుడు చేసుకుంటానన్నాడు  .చాలా పెద్ద సంబంధాలు వస్తున్నాయి . ఈ పెద్దలందరూ కులాంతర వివాహమంటూ ఒకప్పుడు మమ్మల్ని హీనం గా చూసినవాళ్ళే.అంచేత ఒక పేద హరిజన పిల్లని చూసి చేసుకోమన్నాం. సరే అన్నాడు .మూడు నెలల క్రితం డిగ్రీ ఉన్న అందమైన హరిజన పిల్ల కావాలి, కట్నం అక్కర్లేదు అని ఫోటో తో బయోడేటా పంపమని   బాక్స్  నంబర్ తో ప్రకటన ఇచ్చాం. గంపెడు అప్లికేషన్లొచ్చాయి . అందులోంచి పది ఎన్నిక చేసి మా వాడికి చూపెట్టాం. చివరికి మా ముగ్గురికీ   ఓ అమ్మాయి అన్నివిధాలా నచ్చింది." ఆ అమ్మాయి మంచి చెడ్డలు మీరు వాకబు చెయ్యండి ,మిగిలిన విషయాలు నాకు వదిలెయ్యండి" అన్నాడు . ఆ కంపెనీ ప్రెసిడెంట్ తో సంప్రదించి సరిగ్గా ఆ అమ్మాయి అర్హతలే ఉన్న అవివాహితైన పర్సనల్ సెక్రటరీ  కావాలని ప్రకటన ఇచ్చాడు . ఆ అమ్మాయి అప్లయి చెయ్యకపోవడం చూసి,
పెళ్ళి కూతురిగా  ఆ అమ్మాయి తల్లీ,తమ్ముడూ పంపిన ఉత్తరాన్నే పర్సనల్ ఆఫీసర్ కి ఇచ్చి   ఇంటర్వ్యూ కి పిలిపించాడు .ఈ లోగా నేనా అమ్మాయిని ,తల్లినీ ఈ ఆలయం లోనే చూసాను . ఆ అమ్మాయి ఇక్కడ పనిచేసిన కంపెనీ డైరెక్టర్ తోనూ, రామ్మూర్తి మాష్టారి తోనూ సారధి సంప్రదించాడు .చాలా బుధ్ధిమంతురాలన్నారు .రెండు నెలల తర్వాత ఆ అమ్మాయి తనకి అన్నివిధాలా నచ్చిందన్నాడు మా అబ్బాయి. ఇక మరి ఆ కనక దుర్గమ్మ దయవల్ల ఆ అమ్మాయికి కూడా నచ్చితే త్వరగా వాళ్ళ పెళ్ళి....."
    "దైవం మానుష రూపేణా అన్నాట్టు ... మా పాలిట కనక దుర్గ మీరే అంటూ గద్గద స్వరం తో దుర్గ భవానీ గారికి పాదాభివందనం చేయబోతుంటే ఆమె దుర్గని లేవదీసి అక్కున చేర్చుకుంది.
 

No comments:

Post a Comment

Pages