శివం (శివుడు చెప్పిన కధ -5 )
- ఫణిరాజ కార్తీక్
(రావణుడి శివభక్తిని గురించి చెప్తుంటాడు శివుడు...)
రావణుడు చేసిన ప్రతి పూజని స్వీకరిస్తూనే ఉన్నాను. రావణుడు నాకుచేసే అభిషేకాలు అలంకారాలు చూసి జనులు ‘శివుడు ఎప్పుడూ అలంకార ప్రియుడిగా మారిపోయాడు” అని అనుకునేవారు. ‘పువ్వులు పూసేది నిన్ను కొలవడానికే మల్లయ్యా’ అని అలిగాడు చేసిన గానానికి నేను పరవశుడనయ్యాను. క్రమంగా రావణుడి భక్తి తత్పరత చూసి అందరూ మహాదేవుని మహాభక్తుడు అంటూ కీర్తించసాగాడు. అతని భక్తికి మెచ్చి సాక్షాత్తూ శివుడే అతనికి మహాభక్తుడు అని బిరుదును ఇచ్చాడు అని అనుకోసాగారు. రావణుడు నన్ను పరులకోసం ప్రార్థించిన సంఘటన చూడండి. ఒకానొకనాడు శివపూజ నిమిత్తం రావణుడు ఒక గ్రిహమున కేగి విధివిధానంగా నా పూజ చేయసాగాడు. ఆ ఇంతిలో ఉన్న ఒక బాలుడు దగ్గరకీ రావణుడు నా అభిషేకతీర్థం ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడు రావణుని ఆశీర్వాదం తీసుకోదల్చి అతని పాదాలు పట్టుకున్నాడు. ఆ పిల్లవాడ్ని లేపి రావణుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆ బాలుని ఒక కన్ను లేదు అది చూసి జాలిపడ్డాడు రావణుడు ఇంతలో తెలిసితెలియని ఆ బాలుడు రావణునితో స్వామీ నువ్వు ఇందాక శివుడికి మూడు కన్నులు ఉన్నాయ్ అన్నావు కదా నిజంగా ఉన్నాయా అన్నాడు. నవ్వుతూ ఊ అన్నాడు రావణుడు. స్వామీ నాకు లాగా ఒక కన్ను లేకపోతే అవిటివాడు అంటారు. మరి ఈ శివయ్య మూడు ఉన్నాయ్ కదా ఆయనను ఏమని అనాలి అని అడిగాడు. అమాయకర్వం తో అడిగిన ఆ బాలుడు రావణుడు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. రావణుడు సందేహంగా ముక్కంటి అనాలి పుత్రా అని చెప్పాడు. మా బామ్మ చెప్పేది మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అది లేనివారికి సాయంగా ఇవ్వాలి అని అన్నాడు. రావణుడు ఆ బాలునిమాటలో న్యాయం గ్రహించి ‘అవును పుత్రా అది నిజమే నీకు కన్ను ఎప్పుడు పోయినది అని అడిగాడు దాంతో ఆ బాలుడు ‘పుట్టుకతోనే ఒక కన్ను లేదు. అండరూ నన్ను సగంగుడ్డివాడు అంటూ ఉంటే ఏడుపు వస్తుంది స్వామీ అని రోదించసాగాడు. ‘నువ్వు చెప్పింది ఆ శివయ్య వింటాడంటగా నాకు కనీసం కన్ను రాదా స్వామీ; ఆ శివయ్యని అడగవా’ అని అడిగాడు. దూరం నుంచి చూసిన ఆ బాలుని తల్లిదండ్రులు రావణుడి దగ్గరకి వచ్చి “ రావణ్అా స్వామీ ఆ బ్రహ్మ రాసిన రాత ఇది. బాలుడు తెలియక అలా అన్నాడు. ఏమీ అనుకోవద్దు’ అని ప్రాధేయపడి ‘పుట్టుకతో కన్నులేని నా బిడ్డమీద ఆదేవుడు జాలిపడతాడా ఖర్మ అని వారిని వారే అనుకొని ఆ బాలుడ్ని పట్టుకొని రోదించసాగాడు. రావణునితో ఆ బాలుడు ‘అందరిలాగా కనీసం కళ్ళు కూడా లేని పాపం నేనేమి చేశాను. పూర్వజన్మపాపం నాకు తెలియదుగా ఆ దేవుడు అలా పగ తీర్చుకుంటాడా? అని బాలుడు తల్లిదండ్రులు రావణుడి పాదాలయందు పడి బాధపడసాగారు. రావణుడు ‘బ్రహ్మరాసిన రాత మార్చుకునే శక్తి శివభక్తికి మాత్రమే ఉన్నది. మన తల్లిదండ్రులను మనం ఎట్లా అడుగుతామో ఆ శివుడ్ని అంతే అడగవచ్చు ఆయన మనకు అందరికన్నా ఆత్మీయుడు అని చెప్పి నా శివలింగమున దగ్గరకివచ్చి ముక్కంటి జ్ఞాననేత్రమునే ప్రసాదించే నీవు ఈ బాలునికి నేత్రాన్నివ్వలేవా అ బాలుడు అడిగినదామ్ట్లో అన్యాయం ఏముంది నీ భక్తి రాజేస్తే ఖర్మలు పోతాయ్ అన్నావే అని ఉక్రోషంగా ‘కనుల వెలుగువు నీవు సగం వెలుగులేదా’ అని కీర్తన ఆలాపించాడు. అన్నీ నాకు తెలిసు అంతా చూస్తూనే ఉన్నా. లీలను చూపే సమయం అసన్నమైంది., రావణుడు ప్రభూ నిజంగా నీయందు భక్తి కనబర్చి నీ తలంపుతో ఆనందభాష్పాలు రాల్చిన వాడనైతే ఈ బాలునికి నీ అభిషేకజలం తగలగానే కన్ను రాగాక’ అని తిరిగి అభిషేక తీర్థమున పట్టుకొని ఆ బాలుడి దగ్గరకి వెళ్ళాడు. ఆ బాలుడితో ‘కుమారా! మనస్ఫూర్తిగా శివుడు దైవం అని నమ్ముతున్నావా. ‘ఆ’ అన్నాడు. ఆ బాలుడు అయితే ‘కర్మ తీరుట కొతకు ఈ స్తోత్రం రోజూ భక్తితో చేసుకో అని ఆ బాలునికి స్తోత్రం చెప్పాడు. ఆ బాలుడు దాన్ని విన్నవెంటనే కంఠస్తం చేశాడు. పిదప అ అభిషేక జలమును తీసుకొని బాలునికి తీర్థం ఇచ్చి ఆ కంటిమీద పోశాడు రావణుడు. ఆ బాలుడు స్పృహతప్పాడు. అందరూ విస్తుబోయారు. కానీ రావణుడు మత్రం నిశ్చలంగా ఉండి ‘ హరహరమహాదేవా’ అని నినాదం చేయసాగాడు. మన అందరి వైనం ఆ పరమశివుడు హరహరమాహాదేవా అంటే మనకోసం తల్లడిల్లే తండ్రి వవుతడు మరొకసరి బిగ్గరగా ‘జయజయశంభో’ అన్నాడు. అయినను బాలునిలో చలనంలేదు రావణుడు తన పదితలలతో ప్రత్యక్షం కావించుకున్నాడు. ప్రతి తలలో ఉన్న తన నోటితో వివిధరకాలుగా నన్ను జయధ్వని చేయసాగాడు. పదితలలతో పదిరకాలుగా నా కీర్తన స్తోత్రం చేయసాగాడు. అప్పుడూ అంతా ఒక్కసారి బాలుడివైపు చూశారు. ఆ బాలుడు కదలాడుతున్నాడు. ఆ బాలునికి అతని అంతరంగంలో నేను సూక్ష్మరూపంలో దర్శనమిచ్చి అతనికి కనుచూపు ప్రసాదించి అతనికి జ్ఞాననేత్రం సైతం ఇచ్చాను. ఆ బాలుడు కదలుతూ ఓం నమఃశ్శివాయ అంటూ లేచి తనకి కన్ను వచ్చింది చూపు కనబడుతుంది అని మిక్కిలి ఆనందంగా చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్నా అందరూ ఎంతో ఆనందపడి రావణుడి పాదాలముందు పడి ఆ బాలుడు అతని తల్లి దండ్రులు చెప్పారు. రావణుడు దేవా నా మాట నిలబెట్టావు అని చెమ్మగిల్లిన కళ్లతో నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అక్కడి ప్రజలు ‘మహాభక్త రావణా’ శివం శివం అంటూ అందరూ రావణుడ్ని అనసాగారు. రావణుడు మరొకసారి నా కీర్తన వినిపించేంత దూరంలో నా ఆర్ద్రత ఉంది అనే గానం ఆలపించి అంతా శివార్పణం అని చెప్పి ఆ బాలునికీ తన ఆశీస్సులు నా పేరు మీద అందించాడు. (సశేషం...)
No comments:
Post a Comment