“తెలుగు – ఇల్లు “
- తోలేటి జయశ్రీ
తెలుగింటి వాకిట – ముత్యాల ముగ్గులు
మావిళ్ళ తోరణాలు – సందళ్ళు శోభలు
తెలుగు లోగిళ్ళు – అనురాగ నిలయాలు
పండుగలు పబ్బాలు – నిండు సంబరాలు
తెలుగింటి పురుషులు – వైకుంఠ మూర్తులు
ఇంటిల్లిపాదిని పాలించే – విష్ణు అవతారాలు
తెలుగింటి కోడళ్ళు – శ్రీమహాలక్ష్ములు
ఒడిపంట పండితే – ఆనంద సంగీతాలు
పసిపాప కేరింతలు – ఉయ్యాలజోల పాటలు
అచ్చట్లు ముచ్చట్లు – నట్టింట నయగారాలు
వంటలూ వేడుకలు – విందులూ వినోదాలు
పిన్నాపెద్ద అందరూ – కలిసే ఆప్యాయతలు
తెలుగింటి మాట – ముత్యాల మూట
నోరార పిలుపులూ – అనురాగ శృతులు
తెలుగింటి మనసులు – రతనాల రాశులు
మమతలు ప్రసరించే – సుగుణాల రత్నాలు
ఎన్నెన్ని శోభలో – అచ్చ తెలుగు ముంగిట
తెలుగు సామ్రాజ్యాన – వెలుగులే వెలుగులు
No comments:
Post a Comment