ఛాలెంజ్
- బి.వి.సత్యనగేష్
ప్రతీ మనిషిలోను శారీరక, మానసిక మార్పులు సహజం, వయసుతోనూ, అనుభావంతోనూ అనేక మార్పులు కలగడం మామూలే. అంతేకాదు, మార్పును మనం కోరుకుంటాం కూడా, చరిత్రలో ఎంతో మంది జీవితాలలో మార్పుల గురించి విన్నాం, వింటున్నాం. బుద్ధుడు, యోగివేమన ఒకప్పటి జీవితాలు వేరు, మార్పు చోటు చేసుకున్నాక జీవిత విధానం వేరు. అలాగే వ్యాపార రంగంలో అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టి అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన గారిని చూస్తూనే వున్నాం. ఇది కూడా వారి మనోవ్య్ఖరిలో కలిగిన మార్పు వల్లనే. ధీరూబాయ్ అంబాని, గుల్షన్ రాయ్, రామోజీరావు, ఎస్.పి.వై. రెడ్డి, జి. పుల్లారెడ్డి, చందనా బ్రదర్స్ వంటి వారి ఆలోచనా తీరులో కలిగిన మార్పు వల్లనే వారి జీవితాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు.
మనసులో మార్పు కావాలంటే ముందుగ మన మనసును మనమే సవాలు (Challenge) చెయ్యాలి. అప్పుడే మార్పు (Change) వస్తుంది. ఈ రెండు ఇంగ్లీష్ పదాలను పోలిస్తే Change లో లేని మూడు అక్షరాలూ Challenge లో కనిపిస్తాయి. ఈ మూడు అక్షరాలను తొలగిస్తే CHANGE అవుతుంది/వస్తుంది. అవే ‘LLE’. ఈ మూడు అక్షరాల గురించి చూద్దాం.
L అంటే LAZINESS, సోమరితనం
L అంటే LINIENT ATTITUDE TOWARDS LIFE లోకువనివ్వడం
E అంటే EARLIER FAILURES పూర్వపు వైఫల్యాలు
ఈ మూడింటిని వదిలి పెడితే మార్పు తధ్యం. మార్పు అనేది విజయం తీసుకువస్తే ఆ మార్పు వల్ల ఆ వ్యక్తికి ఉపయోగం. అయితే ఈ SUCCESS కు కావలసిన మెట్లు ఏమిటో చూద్దాం.
S: SET GOAL
U: UNLEASH THE POTENTIAL
C: CARE & COMMITMENT
C: CONTINUOUS EFFORTS
E: ENTHUSIASM
S: SELF CONFIDENCE
S: SELF MOTIVATION
పై లక్షణాలను మెట్లుగా చేసుకుని పరిశ్రమ చేస్తే విజయం సాధ్యమవుతుంది. మార్పుతో విజయం సాధించడానికి పంచసూత్రాలున్నాయి. వాటి గురించి చూద్దాం.
SELF INTROSPECTION
SWOT ANALYSIS
POSITIVE MENTAL ATTITUDE
BURNING DESIRE
SMART WORK
పైన పేర్కొన్న పంచసూత్రాలు విజయం ఆశించే ప్రతీ వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు.
SELF INTROSPECTION (ఆత్మ పరిశీలన): విజయం అంటే మనం అనుకున్న లక్ష్యం చేరుకోవడమే. మన లక్ష్యం గురించి అవగాహన పెంచుకుని, మన ప్రయత్నాలు ఫలితాలు, చేయవలసిన కృషి, తదితర విషయాలను పరిశీలన చేసుకుని అంచనా వేయగాలగాలి. మన మీద మనం జాలిపదకుండా, పక్షపాతం లేకుండా పరిశీలించి, విజయ మార్గంలో ఎక్కడున్నామో అంచనా వేయాలి.
SWOT ANALYSIS: SWOT అనే పదంలో నాలుగు అక్షరాలకు నాలుగు పదాలున్నాయి. ఇది చాలా ఉపయోగకరమైన విశ్లేషణ.
S: STRENGTHS
W: WEAKNESSES
O: OPPORTUNITIES
T: THREATS
‘S’ అంటే మన సామర్ధ్యాలు, ‘W’ అంటే మన బలహీనతలు, ‘O’ అంటే మన అవకాశాలు, ‘T’ అంటే మనకుండే ఇబ్బందులు, భయాలు, వీటిని అంచనా వేసుకోవాలి. మన సామర్ధ్యాలను పటిష్ఠం చేసుకుంటూ, బలహీనతల్ని బలహీన పరుస్తూ అవకాశాలను చేజిక్కించుకుంటూ, భయాలను, అడ్డంకులను ఎదుర్కొని కృషిచేస్తే విజయం వరిస్తుంది. ఈ నాలుగు అంశాల విషయంలో విశ్లేషణ చేసుకుంటూ వుండాలి.
POSITIVE MENTAL ATTITUDE: అంటే సానుకూల దృక్పధం. ప్రతీ విషయంలో సానుకూలంగా ఆలోచించటం అలవరచుకోవాలి.
BURNING DESIRE: అనేది ఒక తపన. విజయం సాధించాలనుకునే వారికి తప్పనిసరిగా ఉండవలసిన ఒక లక్షణం తపన. జిజ్ఞాస, రగిలే కోరిక, కసి అనే పదాలు అన్నింటికీ తపన అని అర్ధం.
SMART WORK: రాత్రి పగలు అదే పనిగా కృషి చేస్తూ వుంటే దానిని HARD WORK అంటాం. అలా కాకుండా ఫలితాన్ని సాధించడానికి చలాకీగా, చురుకుగా, తెలివిగా చేసే పనిని SMART WORK అంటాం.
పైన పేర్కొన్న లక్షణాలను అలవర్చుకుని తపనతో పరిశ్రమ చేస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. ఈ విజయం కోసం మన మనసును మనమే ‘ఛాలెంజ్’ గా తీసుకోవాలి. అదే చేంజ్... అదే విజయం.
No comments:
Post a Comment