శివం (శివుడే చెబుతున్న కధలు )
- రాజ కార్తీక్
9290523901
నేనే... మీకు తెలుసుగా కొంతమంది నన్ను పరమేశ్వరుడు అని , లింగమయ్య అని ,శివుడని, విష్టువని , బ్రహ్మ అని ,శక్తి అని, అంటారు.
ఎవరు ఏ భాషలో ఏ భావంతో నన్ను పిలుస్తారో వారికి అలా అగుపిస్తాను. నా తత్వం అనంతమైనది....నా శక్తి అఖండమైనది. జన్మ లేని ,ఆకారం లేని అనాదిని నేను. సృష్టి, స్థితి , లయను చేసే సర్వకర్తను నేను. అన్నినేనే. అంతా నేనే. నేను తప్ప వేరేది లేదు .నేను కానిది ఏదీ లేదు. నేనంటే సత్యము,సనాతనము,ఏ యోగమైనా నన్ను తెలుసుకోవటమే... ఏ భోగమైనా నేను ఇవ్వటమే. మీ లక్ష్యం నన్ను చేరటమే. సచ్చిదానందుడను, బ్రహ్మమును, పూర్వమును, సర్వరూపమును, సర్వాతీతుడను, నిత్య నిరాకార సాకారుడను, ఆది అనంత రహితుడను, సంకల్పరహితుడను, నిర్మలుడను, కాలాతీతుడను నేను. మీ కళ్ళు నన్ను చూచుటకే,మీ వాక్కులు నన్ను పిలుచుటకే, మీ చర్యలు నన్ను తెలుసుకొనుటకే, బ్రహ్మoడాలు నా సంకల్పం చేత ఉన్నవి, నేనే కర్తను ,కర్మను, క్రియను....
అందరు అనుకుంటారు నేను కైలాసంలో ఉంటాను అని,కాని నేను కైలాస వాసినే కాదు , నేను ఉండేది నా భక్తుల హృదయాలలో. అందుకే నా మీద నమ్మకం ఉంచండి. నేను ఎక్కడో లేను, మీలోనే చైతన్య అత్మానందుడిగా ఉన్నాను.నన్ను ప్రార్దించుటకు మంత్ర తంత్రాలు, అనుష్ఠానాలు,హోమ యజ్ఞయాగాదులు, అవసరం లేదు....నా పరమాత్మా స్వరూప లింగాకారం మీద చారెడన్ని నీళ్ళు పోసి ,చిటికెడు బూడిద పూసి ,పిడికెడన్ని మారేడు ఆకులు పెట్టి ,ఒక్కసారి నన్ను ధ్యానిస్తే చాలు. ఎంతైనా భోళా శంకరుడిని కదా !నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు ? సముద్రమును సిరా చేసి కల్పవృక్షపు కొమ్మను కలంగా చేసి ,ఈ బ్రహ్మాండం మీద వ్రాసిన , ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చేసిన నాకు, మీ మీద ఉన్న ప్రేమను గూర్చి చెప్పటం మాత్రం వీలుకాదు. దేవతలకే దేవుడను నేను .నా నుండే వేదాలు ఉద్భవించినవి. పంచభూతములు నా ఆధీనములు. ఎందుకంటే వాటిని సృష్టించినది నేనే కదా.
శివ లింగమును పూజిస్తే ...నన్ను, బ్రహ్మ, విష్ణు, రుద్రులను,శక్తిని పూజించినట్లు. ఎందుకంటే నా లింగ స్వరూపం నా ప్రతీక. ఇక, నాకు ఎన్నో రూపములు ఉన్నా, నేనంటే మీకు గుర్తుకువచ్చేది లింగ స్వరూపమే ! నేను భస్మభూషితుడను. నా పక్కన నా అర్దాంగి పార్వతి ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తూ ఉంటుంది . ఎంతైనా సదాశివుడను కదా. విష్ణు భగవానుడు ,బ్రహ్మ దేవుడు... అందరు నన్ను తదేకంగా ధ్యానిస్తూనే ఉంటారు. ఇక నేను త్రిశూలం ధరించి, త్రికాలాలకు, త్రిగుణములకు అతీతంగా ,డమరుకం మ్రోగించి, కళలకు ఆద్యుడిగా ,భస్మం రాసుకున్న వైరాగిగా , విషం తాగిన గుర్తుగా నీలకంఠుడనై , రుద్రాక్ష ధరించిన సన్యాసినై , త్రినేత్రంతో జ్ఞానిగా ,స్థిరాసనంలో యోగిగా , జటాధరలతో నిరాడంబరుడిగా ,గంగని తలమీద జ్ఞాన ప్రవాహినిగా, చంద్రుడిని అర్దరూపం లో శోభాయమానంగా... మెడలో విషసర్పంతో సర్వజీవులను ప్రసన్న దృష్టితో చూసే ఫణిరాజునయి, కరుణగా ధ్యానించే వారికి జ్యోతిస్వరూపమైన తత్వంగా, నంది ,బృంగి ప్రమధ గణాలను భక్తులుగా, అన్ని జీవులూ సదా స్నేహితులై ఉండాలి అన్నందుకు సూచనగా ఉంటాను . వైకుంఠంలోను , బ్రహ్మ లోకంలోను ఉన్నది నేనే, నా విభిన్న రూపాలే. మీరు మీ ఇష్టం వచ్చినట్లు నన్ను తలచ వచ్చు. మీరు ఏ రూపంలో ఎవరిని ప్రార్ధించినా, అది చేరేది నాకే . నదిలోని నీళ్ళు సముద్రంలో కలవటం తప్పదు కదా !
నేను ఒక యాచకుడను ,బిచ్చగాడిని ,తలరాత లేని వాడిని , అర్ద నగ్న వికారిని అని అన్నా ,నన్ను తలచినట్లే భావిస్తాను . ఎంతైనా అప్పుడు మీ మది లో మెదిలేది నేనే కదా . భూతపతి , ప్రేతపతి, నేనే !భూతాలకు , ప్రేతాలకు అభయం ఎందుకు ఇచ్చాను అంటే.. అవి కూడా నా సృష్టి లో భాగాలే కదా! అవి నన్ను శరణు వేడాయి. వాటికి నేను తప్ప ఎవరు ఉన్నారు .పశువులకు పశుపతి అయినా అంతే! నా ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు. దోమ కూడా గిట్టదు. పుట్టుక చావు గురించి భయం ఎందుకు? నా నుంచి రావటం , నాలోకి రావటం అంతే, కాకపోతే మీకు కావాల్సింది భక్తే ! భక్తికి మాత్రమే నేను దాసుడిని. మరణ వేళలో నన్ను ధ్యానించండి ,మీ కోసం ఎప్పడూ మీ అంతిమ యాత్ర అయిన స్మశానoలో నిరీక్షిస్తూ ఉంటాను.
నా వైపు ఒక్క అడుగు వేయండి ,మీకు వంద అడుగులు చూపిస్తాను. నేను మాత్రమే కావాలని కొరుకొండి. మీకు అన్నీ ప్రసాదిస్తాను.
నేనుండగా మీకు భయం ఎందుకు ?అందరికంటే ఆప్తుడు మీకు నేనే. మీ బంధాలు ఎప్పుడైనా మిమ్మల్ని విడిచి పోతాయి.కాని నేను మాత్రమే శాశ్వతం.నన్ను మీరు తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడి గా భావించండి.మీ సేవకుడినై మీలో ఉన్న నాకు నేనే సేవలు చేసుకుంటాను .అన్నీ నాకు అర్పించండి, మీ కర్మను దహించి వేస్తాను .తెలిసో తెలియకో మీరు నా పూజ చేసినా ,దానికి కొండంత ఫలము ప్రసాదిస్తాను .మీరు నాకు అభిషేకం చేయకపోయినా,అభిషేకం చేసినట్లు భావించండి, అది స్వీకరిస్తాను. మీరు పదిమందికీ చేతనైన సహాయం చేయండి , దానిని శివపూజ వలె భావిస్తాను.
ఎందుకంటే మీలో ఉన్నట్టే వారిలో కుడా నేను ఉన్నాను కదా! మీరు ఎవరిని ఆనందపెట్టినా ఆనందపడేది నేనే! ఎవరిని బాధపెట్టినా బాధపడేది నేనే! నన్నుఎక్కడెక్కడో వెతక్కండి. నేను ఉంది మీ లోనే .మీరు మనసు పెట్టి పిలిస్తే వినపడేంత దూరం లో ఉన్నాను .మీరు చేసే ఏకబిల్వ అభిషేకాలు,దీపదానాలు విధి విధానాలను నేను ఎప్పుడూ విశ్లేసిస్తూనే ఉంటాను.
నా పూజ ఫలితంగా ఏమి ప్రసాదించానో వినండి,-“ ఇది త్రేతాయుగం నాటి సంగతి... శ్రీరామ చంద్రుడు అంటే నాకు ఎంతో ఇష్టం. (ఆయన గారంటే నాకెంతో ఇష్టం కాబట్టే ఆయనకోసం హనుమంతుడిగా రూపం దాల్చాను) వన వాసమునకు బయలుదేరిన సతి, సోదర సమేత శ్రీరాముడు, పడవ ఎక్కి అవతల నది ఒడ్డుకి పోవలిసి వచ్చినది. అక్కడ ఉన్న శృంగబేర పురమునకు రాజైన గుహుడు, రామయ్య తండ్రి కోసం పడవను తెచ్చి, ఎక్కించుకొని వివిధ గుణాలతో కీర్తించి , రాముడిని సంతోష పెట్టాడు .దాంతో రాముడు , గుహునికి మోక్షాన్ని ప్రసాదించాడు.గుహుడుని రామయ్య ఆలింగనం చేసుకొని ,గుండెలకు హత్తుకొని ఇలా చెప్పాడు -“ఓ గుహుడా ! నీవు పూర్వజన్మలో కిరతకుడివి , ఒకనాడు శివరాత్రి దినమున నీవు నీ కుటుంబ పోషణ కై అడవికి బయలుదేరావు. ఎంత వెదికినా ఏమియు దొరకలేదు .పక్కనే ఉన్న జలాశయమునకు పోయి అక్కడ కల మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నావు .నీకు తెలియకుండా అక్కడ ఉన్న బిల్వ పత్రాలను కింద ఉన్న శివలింగం పై వేశావు.అక్కడకు వచ్చి నీరు త్రాగుతున్న జింకను బాణమును ఎక్కు పెట్టి కొట్టపోగా అది గమనించిన జింక “ఏమిటిది ?”అని అడిగెను .నీవు నీ కుటుంబం కోసం వేటాడుతున్నావని చెప్పావు. దాంతో ఆ లేడి “ ఈ శివరాత్రి రోజున నీవు పరోపకారం చెయ్యడం నీ కుటుంబాన్ని పోషించటం కన్నా ఎంతో ముఖ్యం. నాకు కాస్త గడువు కావాలి అని చెప్పి, తిరిగి వస్తానన్న షరతుకు ఒప్పించి, తన భర్త మరియు లేడికూన దగ్గరకు వెళ్ళింది . పిమ్మట ఆ జింకల కుటుంబం వచ్చి నిన్ను కలుసుకొని తమను ఆహరంగా తినమని చెప్పసాగాయి. కిరాతకుడివి ఐన నువ్వు ఈ సంఘటనతో పశ్చాత్తాపం చెంది, కంటి నిండా నీరు కార్చావు. ఆ నీరు శివలింగం పై పడింది. కన్నీటి అభిషేకం చేసిన తపస్వి వయ్యావు.
ఆ జింకలను శ్లాఘించి, మనిషిగా మారి ఏడవటం మొదలు పెట్టావు. నీకు తెలియకుండానే శివపూజ చేసావు. దాంతో ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై నీ ముందు నిలబడ్డాడు .నీవు కన్నీటి అశ్రువులతో మహాదేవుని పాదాలయందు మోకరిల్లావు. నిన్ను శివుడు స్పృశించి ,”నీకు ఆ జన్మలో భోగాలను,ఈ జన్మలో నన్ను చేరి పరమపదము పొందే విధంగానూ “ అనుగ్రహించాడు.నీవు ఆ జింకలను సైతం ఉద్దరించమని మహాదేవుడిని ప్రార్ధించావు. నీ పరోపకార ప్రార్ధనను మెచ్చుకున్న శివుడు “తథాస్తు” అని అంతర్దానం అయ్యాడు, అని రాముడు చెప్పగా ,గుహుడు రాం! రాం! జై శ్రీరామ్! జై శివరాం! అని ధన్యుడైనాడు.శ్రీరాముడు ఆలింగనం చేసుకున్న గుహుడు ధన్యుడు కదా,నేను సైతం హనుమ గా రాముడిని కౌగిలించుకొని ఆనందభరితుడను అయ్యాను.
ఒకానొకనాడు భగవంతుడైన విష్ణు దేవునికి సృష్టిని రక్షించు భారము , అవతారాలు దాల్చి లీలలు చేయు వరము ,అంతేగాక ,భోగ మోక్షాన్నిచే అధికారము అప్పగించినది నేనే. నేను నా ఆత్మ సమన్వయము తో ఎల్లపుడు ఆయన్ని ధ్యానిస్తుంటాను. ఆయనా నన్ను ధ్యానిస్తుంటాడు. నన్ను పూజించువారు శ్రీహరిని నిందించరాదు .శ్రీహరి నేను ఒక్కటే! భక్తులు ఏ రూపంలో తలిస్తే ఆ రూపంలో ఉంటాము .మట్టి ఒకటే కానీ ,ఏ ప్రతిమను తయారు చేసుకొని పూజిస్తే ఆ ప్రతిమ రూపాన్ని సంతరించుకుంటాను. శంభో అంటే ప్రసన్నడనౌతాను. మితి మీరితే ,దుష్టశిక్షణ చేసే వీరభద్రుడను అవుతాను.
నన్ను అందరూ అడుగుతూ వుంటారు "ప్రభూ మీరెందుకు విష్ణు దేవునివలె అవతారములు ధరించరు ?" అని, నేను అందరికీ ఆయనొకటీ, నేనోకటా ..? ఇద్దరం ఒక్కటే .కాస్తంత స్థిమితంగా త్రితత్వంలోకి తర్కం చేసి చూడండి.అసలు ఈ అండపిండ బ్రహ్మాండాలు ,జీవరాశులు ,చలన వస్తువులు, అన్నీ నేనే. నేనే అన్నిటికీ ఆధారం .విష్ణు దేవుడు సైతం నా నుండి ఉద్భవించిన పదార్దమే ! ఆయన పుట్టుకకు నేనే కారకుడను .ఎవరికీ తెలియని,చెప్పని, సత్యం మీకు చెప్పగోరుతున్నాను.విష్ణు దేవుడు నానుండి పుట్టాడు కావున ,ఆయనకు పుట్టుక వున్నది.కానీ నేను ఆదిని ,జన్మ రహితుడను, అన్నీ నాలోనే లయం అయిపోతాయి .జన్మలేని నేను జన్మ ఎలా ఎత్తేది ? అందుకే ఆయన అవతారాలు దాల్చినప్పుడు , ఆయన పొందుతున్న మాతృ పితృ కుటుంబ ప్రేమ ఆయనలో వున్న నేను పొందుతుంటాను.ఆయన అవతారాలన్నిటికి సరైన ఏర్పాట్లు చేస్తాను. అందుకే పరశురాముణ్ణి ,శిష్యునిగా స్వీకరించి ,సకల విద్యలూ నేర్పాను . నేను అవతారాలు ధరించకపోయినా ,నా అంశలను సృజింప చేస్తాను.అందుకు ఉదాహరణ హనుమంతుడు , వీరభద్రుడు .తనే తానుగా రూపాంతరం చెంది ,పుట్టడం అవతారం.నారాయణుడు అవతారాలుగా తనలోంచి శక్తిని ఉద్భవింప చేయడం ,అంశ అంటారు.అందుకే ఆంజనేయుడు 'రుద్రాంశ 'గా కీర్తింప బడ్డాడు.నారాయణుడు, హనుమంతుడు,అంటే స్ఫురించేది ,అసలు శ్రీహరి పరిపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణుడిగా జన్మించడానికి , దుష్ట శిక్షణ చేయుటకు ,ప్రోత్సహించింది నేనే. ఆయన గోకులంలో ఉద్భావిస్తాడని వరమిచ్చింది అభయ ఆంజనేయుడే . ఆ కథ చెబుతా వినండి.
నా పార్షాదులలో ప్రధానమైన వాడు మణిభద్రుడు.అతని దగ్గర చింతామణి అను వింత మణి ఒకటి వున్నది.అది కౌస్తుభ శోభతో ,సూర్యునితో సమానముగా,వెలుగు ప్రసాదించగల శక్తి వున్నది.దానిని చూచినా ,తలచినా, ధ్యానించినా శుభము . మణిభద్రుడు తనకి ఎంతో సన్నిహితుడైన ఉజ్జయిని మహారాజు చంద్రసేనుడికి, ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి , ప్రసన్నుడై ఆ మణి ని బహూకరించాడు.చంద్రసేనుడు నా భక్తుడు,సకల తత్వాలూ ఎరిగినవాడు ,నాయందు భక్తి ,విశ్వాసాలు ,నమ్మకం ఉంచి ,ప్రజారంజక పాలన చేయువాడు .అతని రాజ్యంలో నాధర్మం పాటించమని ప్రోత్సహించువాడు. ఒకానొకనాడు ,చంద్రసేనుడు ఒక మహా యజ్ఞం చేయదలచి ,పొరుగు రాజ్యాల మైత్రి కాంక్షించి , అందరినీ తన ఆ స్థానంలో సమావేశపరిచినాడు. అతడు చింతామణి ని కంఠమున అలంకరించుకొని, సూర్యునివలే మెరుస్తూ సింహాసనమున కూర్చున్నాడు.సమావేశానికి వచ్చిన రాజులందరూ , చింతామణి మీద దృష్టి పెట్టి ,రాజు యొక్క శోభకు అసూయ పడ్డారు. ఎంతైనా మానవులు అరిషడ్వర్గాలకి చిక్కుకొని ,కొట్టు మిట్టాడుతూ వుంటారు. సమావేశం అయిన పిమ్మట ,ఎలాగైనా చంద్రసేనుడిని జయించి ,ఆ మణి సాధించాలని కుతంత్రం పన్నారు. ఆయనను ఎన్నోరకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ చంద్రసేనుడు ,అది శివ భక్తికి ఇచ్చిన బహుమతి అని, వారి ప్రలోభాలను, తృణప్రాయంగా త్యజించాడు.ఆ రాజులందరూ తమ తమ రాజ్యాలకేగి ,అందరూ కలసి కట్టుగా ,చంద్రసేనుడిని ఓడిద్దామని నిర్ణయించుకొన్నారు. వారి అత్యాశ ఫలితము ఏమిటో చూడండి. అందరూ ఉజ్జయిని ని ,బహువిధాల సైనిక శక్తితో,నాలుగు వైపులా చుట్టుముట్టారు. వారు దాడి చేసిననూ, కోటలోకి ప్రవేశించలేకపోయారు.ఇది తెలిసిన చంద్రసేనుడు,తాను తన సైనిక బలముతో ,వారితో పోరాడలేనని తలచి,ఆ రాజ్యం లో 'మహాకాళేశ్వరుడు' గా వున్న నా ఆలయానికి వచ్చి ,నన్ను శరణు జొచ్చి, 'నా ప్రజలను కాపాడు ' అని నన్ను,సందేహరహితంగా, రాత్రింబవళ్ళు , అనన్య దీక్ష తో ప్రార్ధింపసాగాడు. అదే నగరంలో ,ఒకానొక గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ 5 సం. శ్రీకరుడు ఉన్నారు. ఆ తల్లి ,తన కుమారుణ్ణి తీసుకొని నా మందిరానికి వచ్చింది. శ్రీకరుడు ,మహారాజు నాకు చేస్తున్న పూజలపట్ల ,ఎంతో అనురక్తుడై , తీవ్రమైన భక్తి పారవశ్యతనొ౦ది, గమనించసాగాడు. తరువాత వారు వారి ఇంటికి వెళ్ళారు. శ్రీకరుడు ఇంటి దగ్గ్గర శివపూజ చేయ భావించి, ఒకానొక రాయిని తెచ్చి,శివలింగము వలే భావించి ,తాను ఇంటినుండి పోగు చేసుకున్న గంధం, వస్త్రం, ధూప దీపాలు, పూజా ద్రవ్యాలు ఆ లింగమునకు,అనగా నాకు సమర్పించాడు. ఆ భక్తి తీవ్రత నన్ను కట్టి పడేసినది. ఇంకనూ రాజువలె పూజ చేద్దామని,ఆయనలాగే తనూ చేసినట్లు మనసునందు భావించాడు. మనో నైవేద్యము సైతము , అతని వ్యాకులత చూసి స్వీకరించాను. తనకు చేతనైన ఆటలు నాతో ఆడాడు. పాటలు పాడాడు. నృత్యము చేసాడు. వాటన్నింటినీ పరమానందముగా స్వీకరించాను .శ్రీకరుడు నృత్యముతో అలసిపోయి ,నా ముందు కూర్చుని,భక్తితో లయించి పోయాడు. అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి ,వాని వింత చేష్టలూ, పిల్ల చేష్టలుగా భావించి ,ద్రవ్యములు వృధా చేసినాడని భావించి, అవి శుభ్రం చేసి , ఆ శివలింగమును పారవేసినది. నా భక్తితో లయించిన శ్రీకరుడు ,ధ్యాన నిమగ్నుడై వున్నాడు.ధ్యానంలోనుండి లేచిన బాలుడు,తల్లిని పట్టించుకోకుండా, ఆమె విసిరేసిన రాయి దగ్గరకు వెళ్లి ,చేతిలోకి తీసుకొని "రామయ్యా, దెబ్బతగిలిందా , మందు రాయమంటావా, మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అంతే చేస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా .." అని రోదించ సాగాడు. నాకు తెలియకుండానే నా కంటి నుండి అశ్రువులు వచ్చాయి . ఆ బాలుడు శివలింగం నుండి నీరు రావడం చూసి ," శివయ్యా, ఏడవకు ,మా అమ్మ ను కొడదాం లే ..,నీ దెబ్బ తగ్గిపోతుందిలే , బాధపడవద్దు .." అనెను. నేను వెంటనే నా నిజరూపంలో ప్రత్యక్షమయ్యాను. అతను నాకు దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి ,అతనికి దెబ్బ ఉన్నట్లే అగుపించాను. శ్రీకరుడు నేను కనపడుటచేత ,మిక్కిలి ఆనందం పొంది ,నాకు మందు వ్రాసి,నాతో ఆటలు ఆడుకొన్నాడు. " నొప్పి తగ్గిందా శివయ్యా." అన్నాడు. "తగ్గింది శ్రీకరా,నీవు మందు రాసిన తరవాత ఇక దెబ్బ వుండదు ,నొప్పివుండదు " అని పరిహసించినాను.
"ఆం తిన్నావా రామయ్యా.. కాదు, కాదు శివయ్యా..? "అన్నాడు."తినలేదు " అన్నాను. వాళ్ళ అమ్మకు చెప్పకుండా ,ఇంటిలోపల వున్న వెన్నను తీసుకొచ్చి నాకు తినిపించాడు."తిను శివయ్యా.,మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది." అన్నాడు. నేను శ్రీకరుని ప్రేమ ,వాత్సల్యానికి పొంగి, వెన్న తిన్నాను. " నేనంటే చిన్న వాణ్ణి కదా, నాకు కొంచం చాలు ,కానీ నీవు పెద్దవాడివి కదా .." అని మళ్ళీ చద్ది అన్నం తీసుకువచ్చాడు. అది కూడా పెట్టాడు. మొత్తం తిన్న తరవాత ,నేను శ్రీకరుడిని "నీకు ఆకలి లేదా..?" అని అడిగాను. శ్రీకరుడు "నువ్వు తింటే నేను తిన్నట్ట్లే " అన్నాడు. అంత దాకా నాచుట్టూ తిరిగి నృత్యం చేశాడు. అలసి పోయి నా ఒళ్లో కూర్చుని నిద్రపోయాడు. ఆ బాలుని మునుపటి శివలింగం ఉన్నచోటుకి చేర్చి ,నేను అంతర్దానమయ్యాను.తరువాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్య చకితులయ్యారు.
శ్రీకరుడు మెలకువ రాగానే ,"రామయ్య ఏడీ..? ఎక్కడ శివయ్యా.."అని అరుస్తున్నాడు . శ్రీకరుడు ఒక కొత్తవెలుగును గమనించాడు. తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది . తాను ఇందాక పూజించిన శివలింగం ,ఇప్పుడు రత్నమయ లింగం అయింది. తన తల్లి శుభ్రం చేసిన సామాగ్రి ,మళ్ళీ తాను పూజించినట్లే ,ఆ రత్నమయ లింగం మీద ఉన్నాయి. ఒకసారి చుట్టూ పరికించి చూసాడు.అక్కడ ఒక మహా భవనం వెలిసింది. రత్న ఖచిత స్తంభాలు చూసి నివ్వెరపోయాడు.అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది. ఆ మహాభవనం పరమ శివుని మహా మందిరం గా మారింది. విశాల ద్వారాలు ,కవాటాలు ,ప్రధాన ద్వారం ,గోపురం అన్నీ నేల మీద సూర్యుని వలే ప్రకాశించాయి. కానీ శ్రీకరునికి అవేవీ గొప్పగా తోచలేదు .నేను మళ్ళీ వస్తానేమో అని , ఆ రత్నమయ లింగమునకు మళ్ళీ పూజలు చేసాడు. నాతో ఆడినట్లు ఆటలు ఆడి, పాటలు పాడాడు.కానీ నేను యదార్ధ రూపంలో కనపడక పోయేసరికి ఏడుస్తూ ,కొద్ది దూరంలో వున్న తన ఇంటికి గాబరాగా వెళ్లి , వాళ్ళ అమ్మను నిదురలేపాడు. శ్రీకరుని తల్లి ,నిదురలేచి ,ఆశ్చర్యపడింది .తాము వున్న ఇల్లు కూడా ఆ మందిరము వలె ,రత్నమయ మణి మాణిక్య , సువర్ణ చంద్రకాంతి తో ,దేదీప్యమానం గా వెలిగి పోతున్నది . ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం పొందింది. "ఏమైంది నాయనా ?" అని బాలుడిని ప్రశ్నించింది. శ్రీకరుడు రోదిస్తూ ' అమ్మా నువ్వు చెప్పావుగా రామయ్య అన్నా, శివయ్య అన్నా ఒకరే అని., నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేసాను..నువ్వు దాన్ని విసిరేశావు. నేను మందు రాశాను. " అని మెల్లగా , వచ్చీ రాని మాటలతో ,జరిగిందంతా చెప్పాడు. దాంతో శ్రీకరుని తల్లి ,'రత్న లింగం ' వద్దకు వచ్చి మోకరిల్లి ," ప్రభూ తెలియక చేసిన తప్పుకు క్షమించు " అని ప్రార్ధించింది. ఆమెను కరుణించాను. ఆమె కూడా ఆ భవంతికి వలె ,సమస్త శోభలతో ,అలరారింది. తన మునుపటి వేషధారణ పోయి , మహారాణి గా మారిపోయింది. కానీ శ్రీకరుడు నన్ను చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు. బాలుడిని ,తల్లి తన హృదయానికి హత్తుకొని ,వానియొక్క అదృష్టానికి , నా ఒడిలో పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది. "అందర్నీ తరింపజేసావు నాయనా " అని ముద్దాడింది.
ప్రజలు ముట్టడి భయంతో వున్నారు. అయినను వారు , ఆరత్న మందిరాన్ని ,భవనాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఇది ఎక్కడనుండి వచ్చిందని అందరూ నివ్వెరపోయారు. చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి పోయినది. చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే ,'శివానందం 'తో మనసు నిండిపొయినది. తాను పొరుగు రాజ్యాల దాడినుండి కాపాడుకొనుటకు శివపూజలో వున్నానని చెప్పి , ఆ బాలుని ,వాని తల్లిని తనవద్దకు తోడ్కొని రమ్మని చెప్పాడు.అది తనయొక్క విజ్ఞాప్తిగా చెప్పమని కూడా అన్నాడు. రాజ్యం నలువైపులా వున్న ,శత్రు సేనలకి ఈ విషయం ,గూఢచారుల ద్వారా తెలిసింది. వారు రాజ్యంలోని చిన్న బాలునికే అంత శక్తి వుంటే , మహా శివ భక్తుడైన చంద్రసేనుడిని జయింపలేమని గ్రహించి , వారిని మన్నింపమన్న అభ్యర్ధనను రాజు వద్దకు పంపారు .చంద్రసేనుడు ఆ అభ్యర్ధనను మన్నించి ,అందరికీ మహాశివ మందిరమును దర్శింపజేయ అభయమిచ్చాడు.
చంద్రసేనుడు "నీ భక్తితో కూర్చున్న నన్ను, నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ,ఒక బాలుని ఆసరా చేసుకొని, నీ లీల చూపించావా తండ్రీ .." అని నాకు కృతజ్ఞతలు తెలిపాడు. మిగిలిన రాజులందరూ క్షమా పూర్వకంగా చంద్రసేనుడిని వేడుకొన్నారు.అందరూ కలిసి నా పూజను , నా నామాన్ని జపిస్తూ , నా కోసం నృత్యములను చేయసాగారు. ఇంతలో శ్రీకరుడు ,వాని తల్లితో మందిరానికి విచ్చేసి ,దూరంగా కనబడుతున్న రత్నమయ భవనాలను చూపాడు. ఇంకా రోదిస్తూనే జరిగినదంతా రాజుకి చెప్పాడు. రాజు అతడిని ఎత్తుకొని ,కౌగిలించుకొని ,ముద్దాడి , ఆనందపడ్డాడు. రాజు , ప్రజలు , శత్రు రాజులు ఆ రత్నమయ శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు. అయినను బాలుడు నా దర్శనం కోసం, రోదిస్తూనే వున్నాడు .రాముడు ఎవరో ,శివుడు ఎవరో తెలియని ఆబాలుడు, నన్ను రామయ్య గా భావించి "రామయ్యా ,మళ్ళీ రా ఆడుకొందాం " అని రోదించ సాగాడు. సరిగ్గా అప్పుడు ,ఆ మందిరంలో 'రుద్రాంశ'యగు హనుమ ప్రత్యక్షమయి " ఎవరు 'రామ' అని రోదిస్తుంది..? ఎక్కడ రామనామం వుంటుందో ,అక్కడ ఆనంద భాష్పాశృవులతో ,నేను కూడా వుంటాను.." అని చెప్పాడు. హనుమను చూసిన ప్రజలందరూ ,ఆయనకు మోకరిల్లారు. దివ్యదృష్టితో అంతా చూసిన హనుమ ,ఆబాలుడిని ముద్దాడి ,"రాముడు , శివుడు ఒక్కరే ! మానవులే కాదు దేవతలు ,అన్ని జీవరాశులు సైతం శంకరుని భక్తి కలిగి వుండటం మన అదృష్టం ,అది మన కర్తవ్యంగా అని భావించాలి .." అన్నాడు . సాష్టాంగ పడిన చంద్రసేనుడినే గాక ,అందరినీ హనుమ ఆశీర్వదించాడు.
హనుమ రత్నలింగము ముందు భక్తిగా ప్రమాణాలు చేసి ,"ప్రభువైన శ్రీ రాముడు సైతం శివలింగమును పూజించేవారు. ఏవూరు , ఏపేరు , ఏకాలం అయినా రాముడు ,శివుడు ,నారాయణుడి రాబోవు అవతారమైన కృష్ణుడు ..అంతా ఒక్కటే.." అని శ్లాఘించాడు . రత్నమయ ఆలయంలో ప్రసన్నుడైన హనుమ ,భక్తితత్వంతో ,నా మహిమ , నా ఉపచారాలూ విశదీకరించి,రాజును ,బాలుడిని తనముందు కూర్చోపెట్టుకొని ," శ్రీ కరా , భక్తి మాత్రమే భగవంతుడిని చేరుస్తుంది , అయితే మంత్రం తంత్రం లేకుండా ,ఆర్తితో పిలిచావు కాబట్టే ,నీ శివయ్య నీ కోసం వచ్చాడని ,నువ్వు అనుకొన్న రామయ్య ,కృష్ణుడిగా నీ వంశంలో ,ఎనిమిదవ తరం లో పుట్టనున్నాడని , నారాయణుడు మీ గొల్ల జాతిలో ,గొల్లవానిగా కీర్తింప బడువాడు అని , నువ్వు శివునికి పెట్టిన వెన్న ,చల్దిలతో 'కృష్ణ లీలలు' చేస్తాడని మాట ఇచ్చాడు .అంతే కాక శ్రీకరునికి “భోగ భాగ్యాలను , మోక్షవరాన్ని "ఇచ్చి , అందరినీ ఆశీర్వదించి , అంతర్ధానమయ్యాడు.
పోనీలే , నేను శ్రీకరునికి భోగ మోక్షాలు ఇవ్వదలిచాను .అతను నిద్రపోయాడు.అందుకే నా అంశ అయిన హనుమ చేత ఇప్పించాను , ఎవరు ఇచ్చినా ఒకటే కదా ! హనుమను మీరూ పూజించండి. మీకు ఆ రామ సేవకుడు ,ఇహలోకంలో అన్నీ ప్రసాదిస్తాడు. హనుమ ,నేను రాముడు అంతా ఒక్కటే.! మీరు కూడా శ్రీకరుని వలె , చంద్రసేనుడి వలె నాపై నమ్మకం వుంచి , నిశ్చలంగా వుండండి. అన్నీ నేను చూసుకొంటాను .
భక్తుల కోసం ఏమైనా చేసే తత్త్వం నాది. అందుకే మార్కండేయుడికీ తలరాత మార్చాను. అల్పాయుష్కుడైన మార్కండేయుడ్ని విధి నియమాలు సడలించి యముడినై యముడ్ని సైతం శిక్షించాను. అతనికి మహర్షి సైతం జ్ఞానం ప్రసాదించి చిరంజీవిని చేశాను. నన్ను ఎన్నోసార్లు తెలియక దూషించి ఆనండపడ్డ మంజునాథుని నా జ్ఞానం ప్రసాదించి భక్తమంజునాథునిగా వచ్చాను. మోక్షాన్ని ప్రసాదించాను. మూఢభక్తితో మాంసం పెట్టి తన చెప్పులతో తినడు నా శివలింగమును శుభ్రం చేసిన ఆనందపడ్డాను. ఉమ్మివేసిన అభిషేకం చేశాడనుకున్నాను. నేను మీ యందు భక్తి మాత్రమే చూస్తాను. ఇలా ఒకటా రెండా ఎన్ని చేశానో చెప్పుటకు ఒక కల్పం సరిపోదు. నిజంగానే భక్తులు ధన్యులు. ఎంతోమంది ఎన్నో సాధనాల ద్వారా సాధించలేనిది నా భక్తులు వెంటనే సాధిస్తారు. అదియే వారి ఆదర్శం, జ్ఞానం అనే మాటకు అర్థం నన్ను తెలుసుకోవడమే. తపస్సు అంటే నన్ను తలవడమే. నన్ను తలుస్తున్నపుడు మీకు రోమాంచితమై కళ్ళవెంట నీరు వస్తాయో అప్పుడు మీరు నాకు సర్వం నివేదించినవారు అయ్యారు. దానిని ఆత్మనివేదన అని అంటారు. అందరూ రావణాసురుడు అంటే మీకెందుకు అంత ఇష్టం అని నా అర్ధాంగి పార్వతి, దేవతలు అడుగుతారు. అతను నాకోసం ఏమి చేశాడో తెలుసా? నాకోసం కఠిన తపస్సు చేశాడు. తన పది తలలను నాకు సమర్పించాడు.పిచ్చివాళ్ళు నేను తలలు తీస్తే వచ్చాను అనుకుంటారు, కానీ నేను వచ్చింది అతని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చూపిన నిశ్చల భక్తి కోసం నేను అతని యందు ప్రత్యక్షమయ్యాను. “రావణా, ఏమికావాలి పుత్రా?” అని అడిగాను. నన్ను చూసిన రావణాసురుడు పిల్లవాని వలె మారిపోయాడు. నిశ్చేష్ఠుడై నిలబడ్డాడు. “కనిపించవా మహాదేవా” అని తన్మయత్వం చెందాడు. నన్ను చూసినప్పుడూ అతను పడ్డ ఆనందం ఏమని వర్ణించను. నేను అతని శరీరం తిరిగి అతనికి స్పృజింపజేశాను. “చెప్పు నాయనా ఏమి కావాలి అని అడిగాను. అందుకు అతను “ఎల్లప్పుడూ నీ మీద భక్తి మాత్రమే నిశ్చలంగా ఉండాలి” అని అర్థించాడు. “భక్తి మాత్రమే కావాలి” అని అడిగాను అతని వరం విని నేను తాదాత్మ్యం చెందాను. భక్తి మాత్రమే కావాలా నాయనా అని మరొకసారి అన్నాను. “ హా నీయందు భక్తి చాలు శివయ్యా నీవు నాకు అన్నీ ఇచ్చావు” అని అడిగాడు, అన్నీ తెలిసిన నేను “నీవు సన్మార్గంలో ఉన్నంతవరకూ అది ఉంటుంది రావణా” అని పలికాను. లోతులు తెలియని రావణుడు “అలాగే ప్రభూ! నేనెప్పుడూ న్యాయంగానే ఉంటాను” అని నన్ను చూసిన ఆనందంలో భజన చేయసాగాడు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు బలం నా భక్తులే కదా! అని రావణుడు నన్ను ఇంకా నా తత్త్వం చెప్పమని ప్రార్థించాడు. నేను రావణా! నేనంటే ఏదో కాదు నేనంటే ఎవరో కాదు. నేనంటే నీవు నీలో ఉన్న నేనే నాకు నేను లాగా కనబడ్డాను. వ్యాకులత కలిగి ఉన్నావు నాకోసం కాబట్టి నాకు నేను కనబడ్డాను. నేను ఒక్కడ్నే అను అనుకోవడమే నాయనా జ్ఞానం నా పట్ల ప్రేమ పెంచుకో అన్నీ అవే వస్తాయి. అని చెప్పాను, నా బిడ్డనైనా తెలియక నన్ను దూషిస్తే నా త్రిశూలం వెళ్ళి తన తలను తీసివేసింది కానీ నా భక్తులను అది నేను ఏమీ చేయలేం రావణా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సృష్ఠిలో అన్నిటికన్నాగొప్పదైనా ఆయుధం నా పట్ల మీకున్న భక్తి మాత్రమే. అది ఉన్నంతవరకూ మిమ్మల్ని ఏదీ చేయలేదు. అని రావణుడికి అన్నీ విశదీకరించాను. అలా చాలాసేపు రావణుడు నా పాదాలయందు తలపెట్టి నన్ను ఎన్నో రకాలుగా ప్రార్థించాడు. నా భక్తులు ఆనందపడితే అందరికన్నా ఆనందపడేది నేనే కదా రావణుడు తనకు తోచినవిధంగా కొన్ని సంగీతస్వరాలు నాపై పాడాడు. తనకీ కళ్లవెంట ఆనందభాష్పాలు ఉండడం చేత మధ్యమధ్యలో పాట ఎంతో మధురంగా ఉంది. ఎందుకంటే అది భక్తితో పాడాడు కదా నాకు అవి ఎంతో నచ్చాయి కాబట్టే అతనికీ నామీద స్తోత్రాలు రాసే వరం ప్రసాదించాను. రావణుడు పాడిన స్తోత్రాలు కీర్తనలతో నేను ఎంతో సంతుష్టుడనయ్యాను. రావణుడు ఇంకనూ పారవశ్యస్థితిలోనే ఉన్నాడు. రావణ అని నేను స్పృశించి తట్టి పిలిచాను. “నాయనా! నీవు నాకోసమే కదా తపమొనర్చావు. నేను కనబడి నీతో ఉన్నాను కదా. ఇంకా పారవశ్యస్థితిలోనే ఉన్నావు” అని అన్నాను. “ప్రభూ! మహాదేవా ఎప్పుడూ ఎరగని ఆనందం నామదిలో ప్రస్పుటంగా ఉంది. మీ స్పర్శతో నా దేహం ఆనందగోళంలాగా మారిపోయింది. మిమ్ము సరిగా చూడలేకపోతున్నా ప్రభూ అని అన్నాడు. నేను ఏం అని అడిగాను. ప్రభూ మీరు సాక్షాత్కరించిన మొదలు నా కళ్ళవెంట నీరు వస్తూనే ఉంది. అవి ఆగుటలేదు. భజన చేసిన స్తోత్రం చేసిన కీర్తించిన మోకరిల్లిన ధ్యానించిన నీవు కనబడడం లేదు. ఒక్కనిమిషం కూడా ఒక ఘడియ కూడా నా నేత్రాలలోనుండి అశ్రువులు రావడం మానలేదు. అప్పుడూ మిమ్ము ఎట్లా స్పష్టంగా చూసేది. మహాదేవా అని అన్నాడు. నేను ఎంతో ఆనందపడ్డాను. “ప్రభూ ఒక్కసారి మిమ్మల్ని తాకవచ్చా, మిమ్మల్ని మీ ముఖారవిందమును స్పృశించవచ్చా’ అని అడిగాను. ‘బిడ్డ తండ్రిని తాకవచ్చా?” అని అడగవచ్చా’ అని అన్నాను. అతడు నన్ను ఆశీనుడిని చేశాడు. తన దగ్గర ఉన్న విబూధిని తీసుకొని నాకు రాశాడు. ‘ఆకారం లేని నేను నా భక్తులకోసం ఈ సృష్టికోసం అకారం దాల్చాను. అలాంటి నా ఆకారాన్ని నా భక్తుడు పరికిస్తుంటే నేను సైతం పరవశించాను. రావణూడి తన్మయత్వం తీవ్రస్థితికీ చేరింది. ప్రభూ మనస్పూర్తిగా నిన్ను చూచుటకే ఈ నేత్రములు చాలవు. అలాంటిది నిన్ను పట్టుకొనుట, శరీరమునకు చందనాది విభూతులతో మిమ్ము కొలుచుట, ఇంతకన్నా నాకు మాటలు రావట్లేదు ప్రభూ” అని మరొకసారి తన ఆనంద భాష్పాలను తుడుచుకున్నాడు. అలా తుడుచుకున్నపుడు తన చేతిలో ఉన్న విభూది రావణుడి కళ్లలో పడింది ‘ప్రభూ’ అని అన్నాడు.
‘ఏమైంది నాయనా’ అని నేను తన మొహాన్ని తీసుకొని చేతులోని కళ్లలో పడ్డ విభూది తీశాను. మళ్ళీ రావణుడు కుబేరుడికీ లక్ష్మీ దేవికీ ధనమిచ్చింది నీవేకదయ్యా నీవెందుకు ఆభరణరహితుడై ఉంటావు. అని కీర్తన ఆలపించాడు నేను దానికి సమాధానంగా ‘నాజటాజూటాలలో విశ్వాలు, బ్రహ్మాండాలు నాకు ఆభరణాలు, నా కొప్పులో పంచభూతాలు నాఆభరణాలు, ఎప్పుడైనా ఏదైనా బూడిద కావల్సిందే అని తెలుపుటకే నా శరీరానికీ విభూది ఆభరణం భక్తితో నా మెడలో ఉంటాను తండ్రీ అని అడిగిన నాగరాజే నా ఆభరణం గజాసురుడు తన చర్మాన్ని నన్ను వస్త్రంగా కట్టుకోమని వరం కోరాడు. అతడి కోరికమెచ్చి అతను భక్తితో ఇచ్చిన గజచర్మమే నా ఆభరణం అని సమాధానం చెప్పాను. రావణుడు దరహాసంతో ప్రభూ! మీరు జ్ఞానంతోనే కాదు, చమత్కారంతో కూడా భక్తులను ఆనందింపజేశారు అని అన్నాడు. నేను రావణా ఎల్లప్పుడు భక్తి కలిగి ఉండు అదియే నిన్ను పరమపదమునక్ ఉచేర్చేది నమ్మకం కలిగి ఉండు అదియే నిన్ను కర్మరహితం చేసే జ్ఞానం. నమ్మకం గూర్చి వివరిస్తూ రావణా! నా మీద నమ్మకం కలిగి ఉండు నేను నాలోనే ఉంటా నా మీద నమ్మకం లేకపోయి ఉన్నా మీరు నాలోనే ఉంటారు మొత్తానికి మీరు నేను ఒకటే అదియే అంతరార్థం. అదియే తాత్పర్యం అదియే సూక్ష్మం అదియే నిత్యం అదియే సత్యం అదియే మార్గం అదియే యోగం అదియే ధ్యానం అదియే సర్వం అదియే ప్రణవం శివం’ అని పలికాడు. ఏదో తెలుసుకున్నట్లు రావణుడు మోహమందు తేజస్సు తన్మయత్వం ప్రస్ఫుటమయ్యింది. ‘శంకరా పాహి పాహి శశిధరా పాహి పాహి మహాజనకా ఎన్నో ఏళ్ళుగా ఎన్నో తపస్సులద్వారా తెలుసుకునె జ్ఞానం నీవు నేను ఒకటే అనే చిన్నమాటతో చెప్పావు కదయ్యా ఎంతైనా ఆదియోగివి కదా అని సమ్తసపడ్డాడు పిదప రావణుడు ప్రభూ మిమ్ము విభూది చందన వాటితో అలంకరించుకున్నా మీరు అనుమతిస్తే మీకు ప్రత్యక్షంగా అభిషేకం చేసుకుంటాను ప్రభూ! అని అడిగాడు. “అభిషేకానికి జలం లేవు కదా రావణా అని అన్నాను. రావణుడు శీఘ్రముగా పోయి తెస్తాను ప్రభూ అని తన జలం తేవడం మరిచాడని గ్రహించాడు, అవసరం రేయ రావణా అని పలికీ నా జటంలోనుండి గంగని బయటకి రమ్మని ఆజ్ఞాపించాను. నా భక్తుని కోరిక వల్ల ఏమో గంగకూడా ఉత్సాహంగా వచ్చింది. రావణుడు స్వామీ ఈ దీనభక్తుడి కోసం స్వయానా నీవే జలమును గంగరూపంలో ఇచ్చి వాటితో అభిషేకం చేసుకోమన్నావు కదయ్యా ఆహా ఏమి నా భాగ్యం అని అన్నాడు. నా కొప్పులోనుండి వస్తున్న జలమును తను ఒక పాత్రలో పెట్టుకొని వాటితో తిరిగి నాకు అభిషేకం చేయసాగాడు. “నీనుండి వస్తున్న గంగ నీకు ఇస్తున్న గంగ నీ వు ఇచ్చినది నీకు ఇవ్వడమే కదయ్యా జీవితం ఓ అభిషేక ప్రియుడా ఎంతటి కరుణామయుడివయ్యా నీవి ఏంఇ మంత్రం తంత్రం ధ్యానం యోగం తెలియకపోయినా నిన్ను తలిస్తే వాటికన్నా ఫలమును ప్రసాదిస్తావు. ఎంతటి స్వార్థపరుడివయ్యా నీవు నా తలమీద గంగని పెట్టుకొని మళ్ళీ మాకు గంగతో అభిషేకం చేయాలనుకుంటావు ఎంతటి దురాశాపరుడవయ్యా నీవు ఎంతటి పాపాత్ముడైన నిన్ను ఆశ్రయించగానే వారిని పునీతలను చేస్తావు. ఎంతటి మాయగాడివయ్యా నీ మాయలో మమ్మల్ని భక్తితో కట్టివేస్తావు. ఎంతటిలోభివయ్యా నీ భక్తులు సుఖంగా ఉంది నిన్ను చేరేలా అనుగ్రహిస్తావు. ఎంతటి కామం కలవాడివయ్యా బుద్ధిలేని రాక్షసులకు వరాలను ప్రసాదిస్తావు నిన్ను తలచారని ఎంతటి క్రోధం కలవడివయ్యా నీ భక్తుల జోలికి వస్తే యముడ్నే యమలోకానికి పంపిస్తావు” అని అంటూ నా అభిషేకం కావించాడు. మందహాసం చేస్తే రావణుడ్ని నేను పరికిస్తున్నాను నిజానికి అతను చెప్పిన దాంట్లో తప్పేముంది రావణుడు ‘కైలాసనాథా! నిన్ను ఏమన్నా తిడితే నన్ను క్షమించవయ్యా అన్నాడు నీవు అన్ని నిజాలు చెప్పావు రావణా! భక్తితో నన్ను తిట్టిన కీర్తన అనుకునే విరాగిని నేను నేను అభిషేకప్రియుడ్ని కాదయ్యా భక్తప్రియుడ్ని వారి అందరూ న్యాయమార్గాన ఏమి చేస్తే నాకు ఇష్టం అనుకుంటారో అది నేను స్వీకరిస్తాను. నాయనా వేదాలు ఉపనిషత్తులు సకలవిద్యలు అన్నీ నా చెంతకు చేరుటయే పరమసత్యమును తెలుపుతున్నాయి. నేను సైతం మిమ్ములనందర్నీ చూస్తూనే ఉంటాను. సత్యం అనేది ఎంతటి గొప్పదో అది తెలుసుకొనుటకు ప్రయత్నించే ప్రతిఒక్కరూ నాచెంతకు ప్రయాణం మొదలుపెట్టినవారౌతారు. నీవుచేసిన నిందాస్తుతికి ఎంతో సంతుష్టుడయ్యాను. నాభక్తుడు నా మీద తను చూపు ప్రేమలో నేను కరిగిపోతూనే ఉంటాను. భక్తులారా! నన్ను అనన్యచింతన చేయండి మిమ్మల్ని స్వీకరిస్తాను మీ తప్పొప్పులు కాస్తాను. మీ పాపపుణ్యాలు నాకు అర్పించండి మీకు నిశ్చలమైన భక్తిని ప్రసాదిస్తాను. నేను తప్పు వేరొకటి కోరుకోకపోవడమే భక్తి అనేమాటకీ నిజమైన అర్థం అది కోరుకున్నావు కాబట్టే రావణా నీకు ‘మహాభక్తుడు అను విరుదును వరముగా ప్రసాదిస్తున్నాను. తాదాత్మ్యం చెందిన రావణుడు శివోహం శివోహం శివోహం అని పరికించాడు. విశ్వనాథా ఈ లోకమే ఈ సృష్టే నీ భిక్ష మరి నీవు ఎందుకయ్యా భిక్ష ఎత్తుకుంటావు దేవా అని అడిగాడు. నీ నిందాస్తుతిలో పాపాలు తీసుకునే యాచకుడివి అనడం మరిచినట్టు ఉన్నావు. మాత్సర్యముతో నా భక్తుల కోరిక తీర్చేవాడిని అవటము మరిచావు రావణా అని అన్నాను. రావణుడు ఏమి చెప్పావు హరా” అని అన్నాడు. “ప్రభూ ఎప్పుడూ మీతోనే ఉండాలి ఇలా మీతోనే సమయం గడపాలి అని అడిగాడు. ‘నేను ఒక లింగమును రావణునికి ప్రసాదించి ఇది నేను ఒకటే రావణా అని చెప్పి దాన్ని పూజించుకోమని చెప్పి అంతర్థానమయ్యాను. రావణుడు భక్తితో నేను ప్రసాదించిన శివలింగమును తీసుకొని బయలుదేరాడు. బయలుదేరుతున్న రావణుడు మొహంలో ఎంతో తేజస్సును గాంచాను. నేను ఇచ్చిన శివలింగమున తన కిరీటములో ఉన్న స్థానంలో పెట్టుకొని ‘మహేశ్వరా! అమరేశ్వరా! శరణం శూలపాణి పినాకపాణీ శరణం అని మరొక కీర్తన పడూకుంటూ తన లంకకు వెళ్ళినాడు. అది కూడా భక్తితో పాడాడు కాబట్టే రావణుడి కిరీటంపై ఉన్న నన్ను స్తుతించాడు. లింగరూపంలో కావున ఆ లింగస్వరూపంలోనే వసించి కీర్తన విని ఆనందించాను., నేను ఇచ్చిన శివలింగమునకు శాస్త్రోక్తంగాను రాగభక్తితోను రావణుడు అచంచలంగా పూజిస్తూనే ఉన్నాడు. అతను ఆ శివలింగమునకు చేసిన ప్రతిచర్య పరిచర్య నేను స్వీకరిస్తున్నాను. రావణాసురుడు వేదపండితుడు కూడా వేదాలను అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదించిన సర్వనిగూఢాలను మననం చేసుకొని వాటియొక్క భావతాత్పర్యాలకన్నా నీ యందు తీవ్రమైన భక్తి కల్గి ఉండడమే వాటియొక్క సారం అని తెలుసుకొన్నాడు. రావణుడు ఒకానొక భక్తునికి నాగురించి ఇలా చెప్పసాగాడు. ‘ మహాదేవుడు భక్తసులభుడు ఆ దేవుని యందు సమస్తము కొలువై ఉంది కంటితో చూస్తే కనబడేవాడు కాదు పరమేశ్వరుడు ముక్కంటిని చూడాలంటే జ్ఞాననేత్రం ఉండాలి. పిలిస్తే పలికేవాడు కాదు పరమేశ్వరుడు. మనసుతో పిలిచిన శీఘ్రముగా వచ్చువాడు శంభుడు. దేవుడు అంటే ఆయనే అది అనాదిగా అయనను గురించి తెలుసుకోవడం ఎవరివల్ల కాదు, దేవుళ్ళకు దేవుడు కాబట్టే ఆయన మహాదేవుడు ఆయన ఏం చేసినా ఆయనకే చెల్లు. ఏ రూపంలో తలచినా అట్లే వస్తాడు. ఎవరిని దూషించకుండా నిశ్చలంగా నాస్తికత కూడా మహాదేవుని భక్తికి సోపానం. ఆయన యందు మాత్రమే భక్తి ఉండడం జన్మజన్మల అదృష్టం. మిగతా ఏదైవస్వరూపం మీదయినా భక్తి కలగాలంటే దానికి మహాదేవుని కృప ఉండాలి. తల్లి దండ్రి అయిన మనల్ని విడిచిపోతారేమో కానీ ఆయన మాత్రం తన చల్లని చూపును మన మీద ప్రసరింపజేస్తూనే ఉంటాడు. ఆయన ఉనికి గూర్చి ఆయన విశిష్టత గూర్చి చెప్పడం సృష్ఠి ప్రారంభమైన నాటినుంచీ తపస్సుచేస్తున్న వ్యక్తి వల్ల కూడా కాదు. ఆయన భక్తి సాగాంలో కలసిన తర్వాత కదా అది అర్థం అయ్యేది. “అంతయే గాక ఆభక్తునికి నాకు రావణుడు చేసిన అభిషేకములు అలంకారములు స్తోత్రములు కీర్తనలను గూర్చి చెప్పాడు ఆభక్తుడు వెలుగుతున్న దీపం మరొకదీపాన్ని ఎలా వెలిగించగలదో ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విని అర్థం అయింది. దశకంఠ రావణా శివుని ఎలా వైదికంగా పూజించాలో రాగభక్తితో ఎలా ధ్యానించాలో చెప్పండి’ అని అన్నాడు. ఆయన గూర్చి నేను చెప్పటమంత మాత్ర వాడినా ఆయన్ని కొలవాలంటే ఆయనే దారి చూపిస్తాడు, ఆయన ఒరిగేది భక్తికే. ఆయనపట్ల ప్రేమే భక్తి వైరాగ్యాలు” అని అన్నాడు. రావణుడి చెప్పినది సత్యం కదా నా భక్తితో లయించిన వారు చెప్పినా నేను చెప్పినా ఒకటే. రావణుడు తనకు తోచిన విధంగా ఆభక్తునికి నా భక్తి సాధనలు వివరించి తిరిగి నన్ను “శివశివ ఆది శివ అనుతశివ” అంటూ ఆనందపడ్డాడు. ఈ నిమిషంలో మహాదేవుడు ఎట్లుండునో ఎట్లా తపస్సు చేయునో ఎలా కదలునో ఎలా స్పందించునో ఎలా వివరించునో అన్ని నేను ఎట్లు ఉండునో అని తలవసాగాడు. అది కూడా నా తపస్సే కదా నన్ను చింతన చేస్తూ ఉండేవాడు. నేను ఇచ్చిన శివలింగములో బాటి మహాలింగమున ప్రతిష్ఠించుకొని పూజించేవాడు. తన ఎత్తు ఉన్న ఆ లింగమును ఎల్లప్పుడూ వాటేసుకొని ఉండేవాడు “నిండుగా ఉన్న నీ భక్తిలో… పండగే కదా నీ రక్తిలో” అని పాడుతూ ఉండేవాడు. “ప్రభూ! మహాదేవా ఈ శివలింగమును ఆలింగనం చేసుకుంటే మిమ్ము చేసుకున్నట్టే ఉంది అని తీవ్రంగా తలచేవాడు. అతగాడి తలపులు అన్నీ నా తలంపులే. ఇలా ఉండగా రావణుడి పరివారం అతన్ని యుద్ధాలకీ పురిగొల్పిన అతను అవన్నీ తుచ్ఛంగా భావింపసాగాడు. యుద్ధం చేద్దామని వచ్చిన వారందరికీ నా మహత్తులు చెప్పి వారికి జ్ఞానోదయం చేసేవాడు. ఇలా నా నామం చేసి అతనికి వాక్శుద్ధి వచ్చింది. అతను ఏమి చెప్తే అది జరిగేది క్రమేణా రావణుడు జ్యోతిష్యశాస్త్రంలో సైతం పండితుడైనాడు. అతను ప్రతి ఒక్కరికి నాకు సంబంధించిన స్తోత్రం చెప్పి ఇది చేసుకో నాయనా మీ ఇబ్బందులు ఆ ఈశ్వరుడు తీరుస్తాడు అనేవాడు. నేను ఏమి చేసేది అట్లనే రావణుడి మాటమీద నమ్మకముంచి నా స్తోత్రాలు చేసిన వారి కష్టాలు తీర్చేవాడను. ఎవరూ ఎక్కడ శివపూజచేసినా రావణుడ్ని పౌరోహిత్యానికి రమ్మనేవారు. వారి యొక్కస్థితిలో సంబంధం లేకుందా వారిగృహాలకీ వెళ్ళిన రావణుడు నా పూజ ఎంతో అందంగా ఆనందంగా చేసేవాడు.
‘ఏమైంది నాయనా’ అని నేను తన మొహాన్ని తీసుకొని చేతులోని కళ్లలో పడ్డ విభూది తీశాను. మళ్ళీ రావణుడు కుబేరుడికీ లక్ష్మీ దేవికీ ధనమిచ్చింది నీవేకదయ్యా నీవెందుకు ఆభరణరహితుడై ఉంటావు. అని కీర్తన ఆలపించాడు నేను దానికి సమాధానంగా ‘నాజటాజూటాలలో విశ్వాలు, బ్రహ్మాండాలు నాకు ఆభరణాలు, నా కొప్పులో పంచభూతాలు నాఆభరణాలు, ఎప్పుడైనా ఏదైనా బూడిద కావల్సిందే అని తెలుపుటకే నా శరీరానికీ విభూది ఆభరణం భక్తితో నా మెడలో ఉంటాను తండ్రీ అని అడిగిన నాగరాజే నా ఆభరణం గజాసురుడు తన చర్మాన్ని నన్ను వస్త్రంగా కట్టుకోమని వరం కోరాడు. అతడి కోరికమెచ్చి అతను భక్తితో ఇచ్చిన గజచర్మమే నా ఆభరణం అని సమాధానం చెప్పాను. రావణుడు దరహాసంతో ప్రభూ! మీరు జ్ఞానంతోనే కాదు, చమత్కారంతో కూడా భక్తులను ఆనందింపజేశారు అని అన్నాడు. నేను రావణా ఎల్లప్పుడు భక్తి కలిగి ఉండు అదియే నిన్ను పరమపదమునక్ ఉచేర్చేది నమ్మకం కలిగి ఉండు అదియే నిన్ను కర్మరహితం చేసే జ్ఞానం. నమ్మకం గూర్చి వివరిస్తూ రావణా! నా మీద నమ్మకం కలిగి ఉండు నేను నాలోనే ఉంటా నా మీద నమ్మకం లేకపోయి ఉన్నా మీరు నాలోనే ఉంటారు మొత్తానికి మీరు నేను ఒకటే అదియే అంతరార్థం. అదియే తాత్పర్యం అదియే సూక్ష్మం అదియే నిత్యం అదియే సత్యం అదియే మార్గం అదియే యోగం అదియే ధ్యానం అదియే సర్వం అదియే ప్రణవం శివం’ అని పలికాడు. ఏదో తెలుసుకున్నట్లు రావణుడు మోహమందు తేజస్సు తన్మయత్వం ప్రస్ఫుటమయ్యింది. ‘శంకరా పాహి పాహి శశిధరా పాహి పాహి మహాజనకా ఎన్నో ఏళ్ళుగా ఎన్నో తపస్సులద్వారా తెలుసుకునె జ్ఞానం నీవు నేను ఒకటే అనే చిన్నమాటతో చెప్పావు కదయ్యా ఎంతైనా ఆదియోగివి కదా అని సమ్తసపడ్డాడు పిదప రావణుడు ప్రభూ మిమ్ము విభూది చందన వాటితో అలంకరించుకున్నా మీరు అనుమతిస్తే మీకు ప్రత్యక్షంగా అభిషేకం చేసుకుంటాను ప్రభూ! అని అడిగాడు. “అభిషేకానికి జలం లేవు కదా రావణా అని అన్నాను. రావణుడు శీఘ్రముగా పోయి తెస్తాను ప్రభూ అని తన జలం తేవడం మరిచాడని గ్రహించాడు, అవసరం రేయ రావణా అని పలికీ నా జటంలోనుండి గంగని బయటకి రమ్మని ఆజ్ఞాపించాను. నా భక్తుని కోరిక వల్ల ఏమో గంగకూడా ఉత్సాహంగా వచ్చింది. రావణుడు స్వామీ ఈ దీనభక్తుడి కోసం స్వయానా నీవే జలమును గంగరూపంలో ఇచ్చి వాటితో అభిషేకం చేసుకోమన్నావు కదయ్యా ఆహా ఏమి నా భాగ్యం అని అన్నాడు. నా కొప్పులోనుండి వస్తున్న జలమును తను ఒక పాత్రలో పెట్టుకొని వాటితో తిరిగి నాకు అభిషేకం చేయసాగాడు. “నీనుండి వస్తున్న గంగ నీకు ఇస్తున్న గంగ నీ వు ఇచ్చినది నీకు ఇవ్వడమే కదయ్యా జీవితం ఓ అభిషేక ప్రియుడా ఎంతటి కరుణామయుడివయ్యా నీవి ఏంఇ మంత్రం తంత్రం ధ్యానం యోగం తెలియకపోయినా నిన్ను తలిస్తే వాటికన్నా ఫలమును ప్రసాదిస్తావు. ఎంతటి స్వార్థపరుడివయ్యా నీవు నా తలమీద గంగని పెట్టుకొని మళ్ళీ మాకు గంగతో అభిషేకం చేయాలనుకుంటావు ఎంతటి దురాశాపరుడవయ్యా నీవు ఎంతటి పాపాత్ముడైన నిన్ను ఆశ్రయించగానే వారిని పునీతలను చేస్తావు. ఎంతటి మాయగాడివయ్యా నీ మాయలో మమ్మల్ని భక్తితో కట్టివేస్తావు. ఎంతటిలోభివయ్యా నీ భక్తులు సుఖంగా ఉంది నిన్ను చేరేలా అనుగ్రహిస్తావు. ఎంతటి కామం కలవాడివయ్యా బుద్ధిలేని రాక్షసులకు వరాలను ప్రసాదిస్తావు నిన్ను తలచారని ఎంతటి క్రోధం కలవడివయ్యా నీ భక్తుల జోలికి వస్తే యముడ్నే యమలోకానికి పంపిస్తావు” అని అంటూ నా అభిషేకం కావించాడు. మందహాసం చేస్తే రావణుడ్ని నేను పరికిస్తున్నాను నిజానికి అతను చెప్పిన దాంట్లో తప్పేముంది రావణుడు ‘కైలాసనాథా! నిన్ను ఏమన్నా తిడితే నన్ను క్షమించవయ్యా అన్నాడు నీవు అన్ని నిజాలు చెప్పావు రావణా! భక్తితో నన్ను తిట్టిన కీర్తన అనుకునే విరాగిని నేను నేను అభిషేకప్రియుడ్ని కాదయ్యా భక్తప్రియుడ్ని వారి అందరూ న్యాయమార్గాన ఏమి చేస్తే నాకు ఇష్టం అనుకుంటారో అది నేను స్వీకరిస్తాను. నాయనా వేదాలు ఉపనిషత్తులు సకలవిద్యలు అన్నీ నా చెంతకు చేరుటయే పరమసత్యమును తెలుపుతున్నాయి. నేను సైతం మిమ్ములనందర్నీ చూస్తూనే ఉంటాను. సత్యం అనేది ఎంతటి గొప్పదో అది తెలుసుకొనుటకు ప్రయత్నించే ప్రతిఒక్కరూ నాచెంతకు ప్రయాణం మొదలుపెట్టినవారౌతారు. నీవుచేసిన నిందాస్తుతికి ఎంతో సంతుష్టుడయ్యాను. నాభక్తుడు నా మీద తను చూపు ప్రేమలో నేను కరిగిపోతూనే ఉంటాను. భక్తులారా! నన్ను అనన్యచింతన చేయండి మిమ్మల్ని స్వీకరిస్తాను మీ తప్పొప్పులు కాస్తాను. మీ పాపపుణ్యాలు నాకు అర్పించండి మీకు నిశ్చలమైన భక్తిని ప్రసాదిస్తాను. నేను తప్పు వేరొకటి కోరుకోకపోవడమే భక్తి అనేమాటకీ నిజమైన అర్థం అది కోరుకున్నావు కాబట్టే రావణా నీకు ‘మహాభక్తుడు అను విరుదును వరముగా ప్రసాదిస్తున్నాను. తాదాత్మ్యం చెందిన రావణుడు శివోహం శివోహం శివోహం అని పరికించాడు. విశ్వనాథా ఈ లోకమే ఈ సృష్టే నీ భిక్ష మరి నీవు ఎందుకయ్యా భిక్ష ఎత్తుకుంటావు దేవా అని అడిగాడు. నీ నిందాస్తుతిలో పాపాలు తీసుకునే యాచకుడివి అనడం మరిచినట్టు ఉన్నావు. మాత్సర్యముతో నా భక్తుల కోరిక తీర్చేవాడిని అవటము మరిచావు రావణా అని అన్నాను. రావణుడు ఏమి చెప్పావు హరా” అని అన్నాడు. “ప్రభూ ఎప్పుడూ మీతోనే ఉండాలి ఇలా మీతోనే సమయం గడపాలి అని అడిగాడు. ‘నేను ఒక లింగమును రావణునికి ప్రసాదించి ఇది నేను ఒకటే రావణా అని చెప్పి దాన్ని పూజించుకోమని చెప్పి అంతర్థానమయ్యాను. రావణుడు భక్తితో నేను ప్రసాదించిన శివలింగమును తీసుకొని బయలుదేరాడు. బయలుదేరుతున్న రావణుడు మొహంలో ఎంతో తేజస్సును గాంచాను. నేను ఇచ్చిన శివలింగమున తన కిరీటములో ఉన్న స్థానంలో పెట్టుకొని ‘మహేశ్వరా! అమరేశ్వరా! శరణం శూలపాణి పినాకపాణీ శరణం అని మరొక కీర్తన పడూకుంటూ తన లంకకు వెళ్ళినాడు. అది కూడా భక్తితో పాడాడు కాబట్టే రావణుడి కిరీటంపై ఉన్న నన్ను స్తుతించాడు. లింగరూపంలో కావున ఆ లింగస్వరూపంలోనే వసించి కీర్తన విని ఆనందించాను., నేను ఇచ్చిన శివలింగమునకు శాస్త్రోక్తంగాను రాగభక్తితోను రావణుడు అచంచలంగా పూజిస్తూనే ఉన్నాడు. అతను ఆ శివలింగమునకు చేసిన ప్రతిచర్య పరిచర్య నేను స్వీకరిస్తున్నాను. రావణాసురుడు వేదపండితుడు కూడా వేదాలను అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదించిన సర్వనిగూఢాలను మననం చేసుకొని వాటియొక్క భావతాత్పర్యాలకన్నా నీ యందు తీవ్రమైన భక్తి కల్గి ఉండడమే వాటియొక్క సారం అని తెలుసుకొన్నాడు. రావణుడు ఒకానొక భక్తునికి నాగురించి ఇలా చెప్పసాగాడు. ‘ మహాదేవుడు భక్తసులభుడు ఆ దేవుని యందు సమస్తము కొలువై ఉంది కంటితో చూస్తే కనబడేవాడు కాదు పరమేశ్వరుడు ముక్కంటిని చూడాలంటే జ్ఞాననేత్రం ఉండాలి. పిలిస్తే పలికేవాడు కాదు పరమేశ్వరుడు. మనసుతో పిలిచిన శీఘ్రముగా వచ్చువాడు శంభుడు. దేవుడు అంటే ఆయనే అది అనాదిగా అయనను గురించి తెలుసుకోవడం ఎవరివల్ల కాదు, దేవుళ్ళకు దేవుడు కాబట్టే ఆయన మహాదేవుడు ఆయన ఏం చేసినా ఆయనకే చెల్లు. ఏ రూపంలో తలచినా అట్లే వస్తాడు. ఎవరిని దూషించకుండా నిశ్చలంగా నాస్తికత కూడా మహాదేవుని భక్తికి సోపానం. ఆయన యందు మాత్రమే భక్తి ఉండడం జన్మజన్మల అదృష్టం. మిగతా ఏదైవస్వరూపం మీదయినా భక్తి కలగాలంటే దానికి మహాదేవుని కృప ఉండాలి. తల్లి దండ్రి అయిన మనల్ని విడిచిపోతారేమో కానీ ఆయన మాత్రం తన చల్లని చూపును మన మీద ప్రసరింపజేస్తూనే ఉంటాడు. ఆయన ఉనికి గూర్చి ఆయన విశిష్టత గూర్చి చెప్పడం సృష్ఠి ప్రారంభమైన నాటినుంచీ తపస్సుచేస్తున్న వ్యక్తి వల్ల కూడా కాదు. ఆయన భక్తి సాగాంలో కలసిన తర్వాత కదా అది అర్థం అయ్యేది. “అంతయే గాక ఆభక్తునికి నాకు రావణుడు చేసిన అభిషేకములు అలంకారములు స్తోత్రములు కీర్తనలను గూర్చి చెప్పాడు ఆభక్తుడు వెలుగుతున్న దీపం మరొకదీపాన్ని ఎలా వెలిగించగలదో ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విని అర్థం అయింది. దశకంఠ రావణా శివుని ఎలా వైదికంగా పూజించాలో రాగభక్తితో ఎలా ధ్యానించాలో చెప్పండి’ అని అన్నాడు. ఆయన గూర్చి నేను చెప్పటమంత మాత్ర వాడినా ఆయన్ని కొలవాలంటే ఆయనే దారి చూపిస్తాడు, ఆయన ఒరిగేది భక్తికే. ఆయనపట్ల ప్రేమే భక్తి వైరాగ్యాలు” అని అన్నాడు. రావణుడి చెప్పినది సత్యం కదా నా భక్తితో లయించిన వారు చెప్పినా నేను చెప్పినా ఒకటే. రావణుడు తనకు తోచిన విధంగా ఆభక్తునికి నా భక్తి సాధనలు వివరించి తిరిగి నన్ను “శివశివ ఆది శివ అనుతశివ” అంటూ ఆనందపడ్డాడు. ఈ నిమిషంలో మహాదేవుడు ఎట్లుండునో ఎట్లా తపస్సు చేయునో ఎలా కదలునో ఎలా స్పందించునో ఎలా వివరించునో అన్ని నేను ఎట్లు ఉండునో అని తలవసాగాడు. అది కూడా నా తపస్సే కదా నన్ను చింతన చేస్తూ ఉండేవాడు. నేను ఇచ్చిన శివలింగములో బాటి మహాలింగమున ప్రతిష్ఠించుకొని పూజించేవాడు. తన ఎత్తు ఉన్న ఆ లింగమును ఎల్లప్పుడూ వాటేసుకొని ఉండేవాడు “నిండుగా ఉన్న నీ భక్తిలో… పండగే కదా నీ రక్తిలో” అని పాడుతూ ఉండేవాడు. “ప్రభూ! మహాదేవా ఈ శివలింగమును ఆలింగనం చేసుకుంటే మిమ్ము చేసుకున్నట్టే ఉంది అని తీవ్రంగా తలచేవాడు. అతగాడి తలపులు అన్నీ నా తలంపులే. ఇలా ఉండగా రావణుడి పరివారం అతన్ని యుద్ధాలకీ పురిగొల్పిన అతను అవన్నీ తుచ్ఛంగా భావింపసాగాడు. యుద్ధం చేద్దామని వచ్చిన వారందరికీ నా మహత్తులు చెప్పి వారికి జ్ఞానోదయం చేసేవాడు. ఇలా నా నామం చేసి అతనికి వాక్శుద్ధి వచ్చింది. అతను ఏమి చెప్తే అది జరిగేది క్రమేణా రావణుడు జ్యోతిష్యశాస్త్రంలో సైతం పండితుడైనాడు. అతను ప్రతి ఒక్కరికి నాకు సంబంధించిన స్తోత్రం చెప్పి ఇది చేసుకో నాయనా మీ ఇబ్బందులు ఆ ఈశ్వరుడు తీరుస్తాడు అనేవాడు. నేను ఏమి చేసేది అట్లనే రావణుడి మాటమీద నమ్మకముంచి నా స్తోత్రాలు చేసిన వారి కష్టాలు తీర్చేవాడను. ఎవరూ ఎక్కడ శివపూజచేసినా రావణుడ్ని పౌరోహిత్యానికి రమ్మనేవారు. వారి యొక్కస్థితిలో సంబంధం లేకుందా వారిగృహాలకీ వెళ్ళిన రావణుడు నా పూజ ఎంతో అందంగా ఆనందంగా చేసేవాడు.
రావణుడు చేసిన ప్రతి పూజని స్వీకరిస్తూనే ఉన్నాను. రావణుడు నాకుచేసే అభిషేకాలు అలంకారాలు చూసి జనులు ‘శివుడు ఎప్పుడూ అలంకార ప్రియుడిగా మారిపోయాడు” అని అనుకునేవారు. ‘పువ్వులు పూసేది నిన్ను కొలవడానికే మల్లయ్యా’ అని అలిగాడు చేసిన గానానికి నేను పరవశుడనయ్యాను. క్రమంగా రావణుడి భక్తి తత్పరత చూసి అందరూ మహాదేవుని మహాభక్తుడు అంటూ కీర్తించసాగాడు. అతని భక్తికి మెచ్చి సాక్షాత్తూ శివుడే అతనికి మహాభక్తుడు అని బిరుదును ఇచ్చాడు అని అనుకోసాగారు. రావణుడు నన్ను పరులకోసం ప్రార్థించిన సంఘటన చూడండి. ఒకానొకనాడు శివపూజ నిమిత్తం రావణుడు ఒక గ్రిహమున కేగి విధివిధానంగా నా పూజ చేయసాగాడు. ఆ ఇంతిలో ఉన్న ఒక బాలుడు దగ్గరకీ రావణుడు నా అభిషేకతీర్థం ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడు రావణుని ఆశీర్వాదం తీసుకోదల్చి అతని పాదాలు పట్టుకున్నాడు. ఆ పిల్లవాడ్ని లేపి రావణుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆ బాలుని ఒక కన్ను లేదు అది చూసి జాలిపడ్డాడు రావణుడు ఇంతలో తెలిసితెలియని ఆ బాలుడు రావణునితో స్వామీ నువ్వు ఇందాక శివుడికి మూడు కన్నులు ఉన్నాయ్ అన్నావు కదా నిజంగా ఉన్నాయా అన్నాడు. నవ్వుతూ ఊ అన్నాడు రావణుడు. స్వామీ నాకు లాగా ఒక కన్ను లేకపోతే అవిటివాడు అంటారు. మరి ఈ శివయ్య మూడు ఉన్నాయ్ కదా ఆయనను ఏమని అనాలి అని అడిగాడు. అమాయకర్వం తో అడిగిన ఆ బాలుడు రావణుడు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. రావణుడు సందేహంగా ముక్కంటి అనాలి పుత్రా అని చెప్పాడు. మా బామ్మ చెప్పేది మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అది లేనివారికి సాయంగా ఇవ్వాలి అని అన్నాడు. రావణుడు ఆ బాలునిమాటలో న్యాయం గ్రహించి ‘అవును పుత్రా అది నిజమే నీకు కన్ను ఎప్పుడు పోయినది అని అడిగాడు దాంతో ఆ బాలుడు ‘పుట్టుకతోనే ఒక కన్ను లేదు. అండరూ నన్ను సగంగుడ్డివాడు అంటూ ఉంటే ఏడుపు వస్తుంది స్వామీ అని రోదించసాగాడు. ‘నువ్వు చెప్పింది ఆ శివయ్య వింటాడంటగా నాకు కనీసం కన్ను రాదా స్వామీ; ఆ శివయ్యని అడగవా’ అని అడిగాడు. దూరం నుంచి చూసిన ఆ బాలుని తల్లిదండ్రులు రావణుడి దగ్గరకి వచ్చి “ రావణ్అా స్వామీ ఆ బ్రహ్మ రాసిన రాత ఇది. బాలుడు తెలియక అలా అన్నాడు. ఏమీ అనుకోవద్దు’ అని ప్రాధేయపడి ‘పుట్టుకతో కన్నులేని నా బిడ్డమీద ఆదేవుడు జాలిపడతాడా ఖర్మ అని వారిని వారే అనుకొని ఆ బాలుడ్ని పట్టుకొని రోదించసాగాడు. రావణునితో ఆ బాలుడు ‘అందరిలాగా కనీసం కళ్ళు కూడా లేని పాపం నేనేమి చేశాను. పూర్వజన్మపాపం నాకు తెలియదుగా ఆ దేవుడు అలా పగ తీర్చుకుంటాడా? అని బాలుడు తల్లిదండ్రులు రావణుడి పాదాలయందు పడి బాధపడసాగారు. రావణుడు ‘బ్రహ్మరాసిన రాత మార్చుకునే శక్తి శివభక్తికి మాత్రమే ఉన్నది. మన తల్లిదండ్రులను మనం ఎట్లా అడుగుతామో ఆ శివుడ్ని అంతే అడగవచ్చు ఆయన మనకు అందరికన్నా ఆత్మీయుడు అని చెప్పి నా శివలింగమున దగ్గరకివచ్చి ముక్కంటి జ్ఞాననేత్రమునే ప్రసాదించే నీవు ఈ బాలునికి నేత్రాన్నివ్వలేవా అ బాలుడు అడిగినదామ్ట్లో అన్యాయం ఏముంది నీ భక్తి రాజేస్తే ఖర్మలు పోతాయ్ అన్నావే అని ఉక్రోషంగా ‘కనుల వెలుగువు నీవు సగం వెలుగులేదా’ అని కీర్తన ఆలాపించాడు. అన్నీ నాకు తెలిసు అంతా చూస్తూనే ఉన్నా. లీలను చూపే సమయం అసన్నమైంది., రావణుడు ప్రభూ నిజంగా నీయందు భక్తి కనబర్చి నీ తలంపుతో ఆనందభాష్పాలు రాల్చిన వాడనైతే ఈ బాలునికి నీ అభిషేకజలం తగలగానే కన్ను రాగాక’ అని తిరిగి అభిషేక తీర్థమున పట్టుకొని ఆ బాలుడి దగ్గరకి వెళ్ళాడు. ఆ బాలుడితో ‘కుమారా! మనస్ఫూర్తిగా శివుడు దైవం అని నమ్ముతున్నావా. ‘ఆ’ అన్నాడు. ఆ బాలుడు అయితే ‘కర్మ తీరుట కొతకు ఈ స్తోత్రం రోజూ భక్తితో చేసుకో అని ఆ బాలునికి స్తోత్రం చెప్పాడు. ఆ బాలుడు దాన్ని విన్నవెంటనే కంఠస్తం చేశాడు. పిదప అ అభిషేక జలమును తీసుకొని బాలునికి తీర్థం ఇచ్చి ఆ కంటిమీద పోశాడు రావణుడు. ఆ బాలుడు స్పృహతప్పాడు. అందరూ విస్తుబోయారు. కానీ రావణుడు మత్రం నిశ్చలంగా ఉండి ‘ హరహరమహాదేవా’ అని నినాదం చేయసాగాడు. మన అందరి వైనం ఆ పరమశివుడు హరహరమాహాదేవా అంటే మనకోసం తల్లడిల్లే తండ్రి వవుతడు మరొకసరి బిగ్గరగా ‘జయజయశంభో’ అన్నాడు. అయినను బాలునిలో చలనంలేదు రావణుడు తన పదితలలతో ప్రత్యక్షం కావించుకున్నాడు. ప్రతి తలలో ఉన్న తన నోటితో వివిధరకాలుగా నన్ను జయధ్వని చేయసాగాడు. పదితలలతో పదిరకాలుగా నా కీర్తన స్తోత్రం చేయసాగాడు. అప్పుడూ అంతా ఒక్కసారి బాలుడివైపు చూశారు. ఆ బాలుడు కదలాడుతున్నాడు. ఆ బాలునికి అతని అంతరంగంలో నేను సూక్ష్మరూపంలో దర్శనమిచ్చి అతనికి కనుచూపు ప్రసాదించి అతనికి జ్ఞాననేత్రం సైతం ఇచ్చాను. ఆ బాలుడు కదలుతూ ఓం నమఃశ్శివాయ అంటూ లేచి తనకి కన్ను వచ్చింది చూపు కనబడుతుంది అని మిక్కిలి ఆనందంగా చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్నా అందరూ ఎంతో ఆనందపడి రావణుడి పాదాలముందు పడి ఆ బాలుడు అతని తల్లి దండ్రులు చెప్పారు. రావణుడు దేవా నా మాట నిలబెట్టావు అని చెమ్మగిల్లిన కళ్లతో నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అక్కడి ప్రజలు ‘మహాభక్త రావణా’ శివం శివం అంటూ అందరూ రావణుడ్ని అనసాగారు. రావణుడు మరొకసారి నా కీర్తన వినిపించేంత దూరంలో నా ఆర్ద్రత ఉంది అనే గానం ఆలపించి అంతా శివార్పణం అని చెప్పి ఆ బాలునికీ తన ఆశీస్సులు నా పేరు మీద అందించాడు.
“మహేశ్వరుడి మహత్యం వినగా ఆయన్ని కన్నుల్లారా చూశాక యిక ఈ జన్మకు ఏమి కావాలి”అని రావణుడు నా గూర్చి చెప్పసాగాడు.. ఎంతో శాంతపరుడైన రావణుడు తన రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టి కైలాసవాసిలాగ వుండేవాడు. నన్ను ఎప్పుడూ స్మరిస్తూ ఉండేవాడు. అతని స్మరణకు,చింతనకు,నేను కూడా అతనివెంటే వుండేవాణ్ణి…భక్తులు నన్ను ఎంత స్మరిస్తారో వారికి నేను అంత చేరువౌతాను..
“అసలు నన్ను ఎందుకు పుట్టించావు శివయ్యా? చక్కగా నీ దగ్గిరే వుంచుకోవచ్చుగా! చెప్పావుగా నాలోనే నువు వున్నావని.. మరి ఎందుకు ఈ జన్మ.. నాకు మోక్షం అంటే ఏంటో తెలియదు.. ఎల్లప్పుడూ నీ దగ్గిరే వుండేటట్లు అనుగ్రహించవయ్యా!”అని రావణుడు నన్ను తదేకంగా ప్రార్ధించేవాడు..”జయ పరమేశ్వరా, జయ విశ్వేశ్వరా”అని ఎన్నో కీర్తనలు ఆలపించేవాడు.. నన్ను ఎవరు పిలుస్తారో వారికే అన్నీ పిలవనట్లు చేయటమే కదా నా తత్వం.. రావణుడి భక్తి తన్మయత్వంలో ఉన్నాడు. అతను స్మశానానికి వెళ్ళి అక్కడ వున్న చితాభస్మంతో శివలింగమును చేసేవాడు.ఆ శివలింగమును నన్నుగా తలస్తూ “ప్రభూ! శాశ్వత బంధువు నీవు, అన్ని బంధాలు హరిస్తావు, నిన్ను ప్రేమించమంటావు, ప్రేమిస్తే పరీక్షిస్తావు, ఏమనగా అది పద్ధతి అంటావు, పుట్టించమని ఎవరు అడిగారు, బంధాలు ఇవ్వమని ఎవరు అడిగారు? జన్మ జన్మలు నీలో కలవటం కోసం ఎందుకు ఉండాలో,అన్నిటికీ కారణమైన మనస్సును ఎవరు సృష్టించారు?” అని ఆరాధనగా అడిగేవాడు. “ప్రభూ!ఎప్పటికైనా ఇక్కడికి రావలిసింది తప్పదుగా, అప్పుడు నీవు నన్ను తీసుకెళ్తావా నీతోపాటు” అని కళ్ళవెంట నీళ్ళతో నన్ను అడిగేవాడు.” అసలు నీవు వుండేది ఇక్కడే కదయ్యా, శివాలయం అని అంటారు కానీ, అదే కదా స్మశానం..స్మశానం అనేదానికి నిజమైన అర్ధం చెప్పు స్వామీ!ఈ స్మశానానికి వచ్చినపుడూ, శాశ్వతనిద్రలోకి జరుకున్నపుడూ నన్ను నీతో తీసుకెళ్తావా? చెప్పు తండ్రీ!” అని రోదించసాగాడు. మోకాళ్ళమీద కూర్చొని “తీసుకెళ్తానని మాట యివ్వు శివయ్యా!..” “నాకు యోగిని కావాలని లేదు. ముని, మహర్షి, తపస్వి కానక్కరలేదు.యివన్నీ వున్నది నీలో కలవటానికేగా.. అందుకే అడుగుతున్నా.. నేనేమీ సన్యాసిని కాదు, నిన్ను పూజించటం కన్నాయివి ఏవీ ఎక్కువ కాదు. చనిపోయిన తర్వాత నీలో ఐక్యం ఐతే యిక చావు గూర్చి భయం ఎందుకు.. ప్రమాణం చెయ్యి శివయ్యా”అంటూ ఆ శివలింగం వైపు చేతులు చాచాడు ప్రమాణం చెయ్యమని.. అలా అంటూ మరణం కాదు మహేశ్వరుని చెంతకు పయనం అని కీర్తన ఆలపించాడు. ఆకాశం మేఘావృతమయ్యింది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం మొదలయ్యింది. అది స్మశానం..ఒక శవం కాలుతూనే వుంది. కానీ అతడు “ప్రమాణం చెయ్యి శివయ్యా” అని చేయి చాచి మోకాళ్ళమీదే నిలబడి వున్నాడు. ఆ చితి కాలుతూనే వుంది. ఎవరైనా ఎప్పటికైనా అంతేగా అని రావణుడు దానివైపు శివలింగం వైపు చూస్తున్నాడు. వర్షం బాగా పెద్దదయ్యింది. కానీ రావణుడు కదలలేదు.పట్టు వదలలేదు….
వర్షం జోరున పడుతుంది. ఆ వర్షపు చుక్కల ప్రవాహానికి కొద్దిపాటి తడితో రావణుడు చేసుకున్న శివలింగం కరిగిపోతుంది. "ప్రభూ! ప్రమాణం చేయకుండా వెళ్తున్నావా ?" అని ఏడ్వసాగాడు."తిడితేనే భక్తి అనుకునే శంకరుడిని నేను. నాకోసం ఒక భక్తుడు విలపిస్తుంటేఎలా వుండగలను?"
ఆ శివలింగం పూర్తిగా కరిగిపోయింది.... కానీ రావణుడు చేయిచాచి వున్నాడు....
"వెళ్ళకు తండ్రీ, వుండి వరమివ్వు"అని అన్నాడు. సరిగ్గా అప్పుడు.. ప్రకాశం...ఆ కరిగిపోయిన శివలింగం చోట వెలుతురు విస్ఫోటనం..ఆ కాంతిని చూడలేక కళ్ళుమూసుకున్నాడు. క్రమంగా అతనికి అర్ధం అయ్యింది తన చేతిలో ఒక చెయ్యి వుందని....కళ్ళు తెరచిచూసాడు ఆ భక్తుడు. నేను కూడా రావణునికి సమానంగా మోకాళ్ళ మీద ఉండి ప్రమాణం చేసాను. నేను కనబడేసరికి అక్కడ వున్న ప్రేతాలు "హరహర మహదేవా" అని నినాదాలు చేయసాగాయ్. రావణుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడు కొయ్యబొమ్మలాగా మారాడు.
" రావణా, భక్తులారా! మరణ సమయంలో నన్ను తలవండి. నన్ను మీ మనోనేత్రంగా గాంచండి. నన్నే చేరెదరు." అని హామీ యిచ్చాను .రావణుడి కళ్ళు ఎంతో ప్రశాంతంగా వున్నాయ్. చిన్నగా అతడు "హరహరమహదేవా", అంటుంటే నా డమరుకం ఊగసాగింది. "మహదేవా...మహదేవా...మహదేవా...",అంటుంటే శంఖం శబ్దం చేయసాగింది. "హరహరమహదేవా" అంటే డమరుక శంఖ ధ్వనులు ప్రతిధ్వనించాయి. రావణుడు లేచి నిల్చొని నాయందు శ్రధ్ధతో పరికిస్తున్నాడు....నేను కూడా నిలబడ్డాను. " పిలిచిన వెంటనే వస్తే నీవు పలుచన కావా! పరమేశ్వరా! మాలాంటి మందమతులను ఆదరించు మహేశ్వరా!" అని గానం చేసాడు. "భక్తితో పిలిచిన వెంటనే రాకుండా ఎలా వుండగలను దానవేశ్వరా! మందమతి కాదు..మధురఫలశృతి దశకంఠేశ్వరా!" అని చమత్కరించాను. అక్కడ స్మశానంలో ఉన్న ప్రేతాలు ఉత్సవంగా నాముందు నాట్యం చేస్తున్నాయి. "ప్రభూ! మీరు ఈ శవభస్మంతో అభిషేకం చేయించుకుంటారా?" అని నా సమాధానం వచ్చేలోపలే అక్కడ వున్న చితాభస్మంతో నన్ను అభిషేకంగావించుతున్నాడు. అక్కడ వున్న ప్రేతాలు మా ముందు కూచొని "స్వామీ,మా దేహాలకు ఇది కదూ పండగ..నీ అభిషేకానికి మా శరీర చితాభస్మాలను వాడుతున్న ఈ రావణునికి మా కృతజ్ఞతలు చెప్పండి అని, అన్ని ప్రేతాలు "నమో భూతనాధా" అని నినాదాలు చేయసాగాయి..రావణుడు ఎక్కడ కనబడితే అక్కడ భస్మం తీసుకుని నన్ను అభిషేకించసాగాడు. అక్కడ ఉన్న ప్రేతాలు ఇది నా శరీర భస్మం అని ఆనందంగా అంటున్నాయి.."హర భోలా హరహరమహదేవా" అని ఆ ప్రేతాలు నాట్యం చేయసాగాయి.. కొన్ని ప్రేతాలు "ప్రభూ!బ్రతికున్నంతకాలం తెలుసుకోలేకపోయాం. నీ భక్తి పారవశ్యత ఈసారి అయినా నిన్ను చేరుకునేజన్మ యివ్వమని ప్రాధేయపడ్డాయి. "తథాస్తు" అన్నాను.. భక్తి పారవశ్యతతో ఉన్న రావణుడు దూరం నుండి నృత్యం చేస్తూ నా దగ్గిరకి రాసాగాడు. వేరొక చితి దగ్గిరకి వెళ్ళిన రావణుడు.....అక్కడ చేయిపెట్టి "శివశివా"అన్నాడు నొప్పిగా....
రావణుడు పొరపాటున అక్కడ కాలిన శవచితాభస్మాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అందుకే అతగాడికి నొప్పి పుట్టినది. కానీ రావణుడు మాత్రం “ప్రభూ! క్షమించయ్యా, ఈ చితితో నిన్ను అభిషేకిస్తే నీకు నొప్పి పుడుతుంది” అని అన్నాడు. వెనువెంటనే ఆ కాలుతున్న చితి మంచుముద్దలాగా మారింది. ఆనందంగా తీసుకువచ్చి రావణుడు ఆ మంచుతో నాకు అభిషేకం చేయసాగాడు. అక్కడ ఉన్న ఒక ప్రేతం రావణుడు అభిషేకం చేస్తుండగా “ఓ ప్రభూ! భూతాలకు భూతపతి, పశువులకు పశుపతి వయిన నీవు, మంచులాగా మార్చినది నా శరీరభస్మాన్నే తండ్రి! ప్రపంచంలో నిన్ను మంచుతో అభిషేకించిన భాగ్యం నాకు ప్రసాదించావు స్వామి, జన్మ జన్మలకు నీ మీద భక్తి నిశ్చలంగా ఉండేలా నాకు అనుగ్రహించు మహేశా !” అని ఆర్ధించింది. అక్కడ ఉన్న ప్రేతాలన్ని, “స్వామీ మమ్ము ఒకసారి నిన్ను తాకే విధంగా స్పర్శజ్ఞానం ఇవ్వమని ఆర్ధించాయి. నేను తథాస్తు అన్నాను. రావణుడు మరికొంత మంచు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మలు అన్ని నన్ను తాకుతూ “శివయ్యా” ఎన్నో జన్మలు తపస్సు చేసినా రాని అదృష్టం మాకు వచ్చిందయ్యా అంటూనే , ప్రభూ! మిమ్ము ఆలింగనం చేసుకుంటాము అని ఆర్ధించాయి. నేను చిరునవ్వు నవ్వాను. అవి అన్నీ నన్ను పట్టుకొని “హరహర మహాదేవా” అని ఆర్తితో బిగ్గరగా నినాదం చేసాయి. కానీ, వాళ్లకి ఎదురుగా ఒక బాలుని ఆత్మ నిల్చొని ఉంది. అతడు భుంగమూతి వేసుకొని ఏడుస్తూ నా వైపు చూస్తూ “స్వామీ, నా తల్లిదండ్రులకు నన్నెందుకు దూరం చేశావు, నీ కెవ్వరూ తల్లితండ్రీ లేరని నాకు అంతే చేసావు కదా, నా పిలుపులు మా అమ్మకి నాన్నకి వినబడుట లేదు” అని అరచేతిని కళ్ళమీద తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నేను “ఇటు రా నాయనా”! అని పిలిచాను. రావణుడు అభిషేకకోసం మంచు ఇంకా సేకరిస్తూనే ఉన్నాడు. ఆ బాలుని ఆత్మ ఏడుస్తూ వచ్చి “ స్వామీ నీ పూజ చేయకుండా కనీసం ఏమి తినము కదా!”, అలాంటపుడు ఎందుకు నన్ను మా అమ్మకి దూరం చేశావు అని వచ్చి నా పాదాల దగ్గర చతికిలబడి ఏడుస్తున్నాడు. ఆ బాలున్ని లేవదీసి... నేను “ నీకు సంక్రమించే వ్యాధిని చూసి నీవారు బ్రతికుందాము అని ఆశ ఉంచుకోరు, నీ బాధని చూడలేక. వారి బాధ వారే తట్టుకోలేక నరకవేదన అనుభవిస్తారు నాయనా, అందుకే నీకు సునాయాస మరణం ఇచ్చి నింద నా మీద వేసుకున్నాను. ఇప్పుడు, నాకు మనసు లేదు అనుకుంటారు గానీ, నా కోసం వారు పరితపిస్తారు.” మిగతా ప్రేతాలు కూడా నా వైపు ఏమి చెబుదామని చూస్తున్నాయి, ఆ బాలుడు “ స్వామి అన్నిటికి సమాధానం మరణమా?” అని అడిగాడు. “లేదు కుమారా! భక్తితో వచ్చే మరణం నా చెంతకు పరమపదం, మామూలు చావు మాత్రం వేరొక లౌకిక జన్మకు పయనం, నీ బాధ చూడలేక, నీకు మరణం ప్రసాదించాను, నీవు నన్ను కలుస్తావు అని తెలుసుగనుకే, నీ కోసం వేచి చూస్తున్నా” దాంతో ఆ బాలుడు “ నా కోసం నీవు చూస్తున్నావు? నిజమా! శివయ్యా!” అని అన్నాడు. “ అంతేకాకుండా నీ కోక బహుమతి కూడా ఇస్తున్నాను అని చెప్పగానే, “ఏమిటి అది శివయ్యా” అన్నాడు బాలుడు. “ నీవు మళ్ళీ నీ తల్లిదండ్రులకే జన్మిస్తావు, వారు కూడా మళ్ళీ నీవే పుట్టావు అని ఆనందపడతారు, ఈసారి సకల ఐశ్వర్యాలు అనుభవించి భక్తి మార్గాన నన్నుఅనుసరించి నన్ను చేరుకుంటావు” అని అనేసరికి ఆనందంతో బాలుడు నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. “ మా నాన్న నాకు చెప్పాడు శివయ్యా, నీవు చాలా మంచివాడివని నీకు ఏమి చేయాలో తెలుసు అని, కోరుకున్నది తీరుస్తావు అని”, “మరి వెళ్తావా? మీ అమ్మ దగ్గరికి” అన్నాను. దాంతో ఆ బాలుని ఆత్మ “హహహ” అని ‘సరే సరే’ అన్నాడు. ‘వెళ్ళు’ అనేసరికి నా దగ్గరికి వచ్చి, కూర్చున్న నా మీదకి ఎక్కి నాకు ముద్దు పెట్టాడు. నాకు ఏమన్నా నచ్చితే మానాన్నకు ఇలానే ముద్దు పెడతా స్వామీ, నీవు కూడా మా నాన్న లాగానే? అని అన్నాడు. ఆ బాలుని ఆత్మని మళ్ళీ వాళ్ళ అమ్మ గర్భాన ప్రవేశపెట్టాను”. అక్కడ ఉన్న ప్రేతాలు అన్నీ “ ప్రభూ నీవు ఎంతటి కరుణామూర్తివో, దయామూర్తివో ఇప్పుడు తెలుసుకున్నాము, మా అందరికి కూడా అలాంటి జన్మ ఇవ్వు అని ఆర్ధించాయి” నేను “మీరు అడగపోయినా నేను చేసేది అదే” అని అన్నాను. “మహాదేవ్, మహదేవ్, మహదేవ్” అని భక్తి ఉన్మాదంతోనృత్యం చేయసాగాయి. ఈ లోగా వచ్చాడు రావణుడు “గరళకంఠ, నీ పూజ కొన్ని వేలజన్మల పంట” అని పాడుతూ నాకు మంచుతో అభిషేకం చేయసాగాడు. రావణుడు “స్వామీ నీవెందుకు శ్మశానంలో ఉంటావు తండ్రీ చెప్పు అన్నాడు. నేను నవ్వి “ రావణా! ఇది తప్ప ఇంకేది మిగులుతుంది, ఏదైనా ఇక్కడకి రావాల్సిందే, వచ్చిన వాటిని అక్కున చేర్చుకోనటానికి నేను ఇక్కడ ఉంటాను, ఇదియే నిజమైన అంతిమజ్ఞానం “ దాంతో అక్కడి ప్రేతాలు సైతం “హరహరహర” అని నిశ్చేష్టాజ్ఞానముఖవర్చస్సుతో ప్రణామం చేశారు.
తర్వాత రావణుడు ప్రేతాలు అన్ని వెళ్ళిపోయాయి. స్మశానమే నా ఆలయం, అదే అంతిమ జ్ఞానం అని తెలుసుకున్న రావణుడు భక్తి పరాకాష్టకు చేరుకున్నాడు. క్రమేణ రావణుడు భక్తితో పాటు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. అతడు ఇంద్రలోకాన్ని కూడా జయించాడు. ఇలా సాగుతున్న రావణుడు నా పూజ మాత్రం ఆపలేదు. కానీ ఒకానొకనాడు రావణుడికి ఒక నాస్తికుడు తారసపడ్డాడు. అతడు రావణుడితో వాదోపవాదాలకు దిగాడు. మహాదేవుడు లేడు ఏమి లేడు, అతడు ఒక విరాగి, వాణ్ని భగవంతుడు అనుకోవటం సరైనది కాదు... వారు నిజంగా భగవంతుడైతే ఎందుకు ఈ సృష్టిలో ఇన్ని అసమానతలు ఉంటాయి అని వాదించసాగాడు. కానీ రావణుడు అతగాడికి సవినయంగా సమాధానాలు చెపుతున్నాడు. అతడు వినకుండా వాదిస్తూనే ఉన్నాడు. ఇంకా నా దూషణ ఎక్కువ చేసేసరికి రావణుడికి తీవ్రమైన కోపం వచ్చింది. అంతే ఒక్క ఉదుటున లేచి తన దశకంఠాలు సాక్షాత్కరించుకొని అతగాడిని విసిరి పడేసాడు. అతడు వెళ్ళి ఎక్కడో సముద్రంలో పడ్డాడు.
”మంచిగా చెపితే వినేవారు మానవులు ఎందుకు అవుతారు ? అందుకే దానవ శైలిలో నేను సమాధానం చెప్పాను. నా ముందు మహాదేవున్ని ఎవరు దూషించినా వారికీ ఇదే గతి పడుతుంది. వారిని చంపటానికి కూడా వెనుకాడను. అలా మహాదేవున్ని దూషించిన వారిని చంపిన మాకు ఎంతో పుణ్యం వస్తుంది. ఊరికే కూర్చొని శివ శివ అనడం కాదు ఓపిక ఉన్నంతవరకు ఎదిరించగలిగినంతవరకు, మన దైవాన్ని ఎవరు దూషించినా వారిని శిక్షించాలి. అపుడు మనం చేసుకునే పూజ సార్ధకత “ అన్నాడు. అక్కడ అందరు రావణుడికి జయ జయధ్వానాలు పలికారు. అవి రావణుడి మొహంలో అహంకారం రాజేసాయి... “మహాభక్త రావణ గరళకంఠ భక్త రావణ, అని నినాదాలు చేశారు.... అపుడు ఒకడు దశకంఠ రావణ.... లంకేశ్వర రావణ... అన్ని లోకాల అధిపతి అయిన రావణ...” అంటూ నినాదం చేయసాగాడు. అంతే రావణుడు అతడి వైపు తీక్షణంగా చూశాడు. రావణుడి మొహంలో అతడి మాటలపట్ల ఆకర్షణ పెంచుకున్నాడు.” భేష్ భేష్ , మళ్ళీ అను” అని మరోసారి అడిగి మరి వానిచేత నినాదాలు చేయించుకున్నాడు. అపుడు మొదలైంది అతగాడి అహంకారం. అయినా నా పూజ చేయటం మానలేదు. ఇది వరకు రావణుడు మనసుతో పూజ చేసేవాడు. క్రమేణా రావణుకికి అహంకారం పెరిగి పెద్దదైపోయింది. ఇలా చాలా సంఘటనలు జరిగిపోయాయి. ఇలా రావణుడు భక్తి మార్గం నుండి చిన్న చిన్నగా దూరం అవుతున్నాడు. అనేక వరాలు పొందాడు రావణుడు. అవన్ని అతని స్వార్ధం కోసమే. సన్మార్గంలో ఉన్నవారి భక్తి మాత్రమే నాకు పూర్తిగా చేరుతుంది. నా పూజకు కావాల్సింది... సమయం ,సందర్భం, ఆడంబరం కాదు. కేవలం మనసు !మనసుతో పిలిస్తే పలికే వాడిని నేను. ఏ రూపంలోనైనా వచ్చి ,మీ బాధ తీరుస్తాను.
ఒకానొక నాడు రావణుడు కైలాస పర్వతం వచ్చాడు. అక్కడ నంది మరియు నాగులు నా ఆజ్ఞ మేరకు రావణుడిని లోపలికి ప్రవేశించనీయలేదు . దానితో రావణుడు “ఏమి నన్ను మహాదేవుడు రానివ్వద్దు అన్నారా ?” అని అడిగాడు.
నంది “మిమ్మలిని కాదు దశకంఠ రావణా, ఎవరినీ రానివ్వద్దు అన్నారు.”
రావణుడు : “ఏమి నీ అహంకారం? మహాభక్తుడు, వేదపండితుడు, కైలాస పురోహితుడు, లోకాల పాలకుడు.. మహాదేవున్ని ఎపుడూ ప్రసన్నం చేసుకునే నేను రావటానికి అడ్డు పెడతారా ?” అన్నాడు అహంకారంగా.
నంది: కైలాసంలో అలాంటివి ఏవీ ఉండవు దశకంఠ, అందరూ సమానమే మహాదేవుడికి. నువ్వు ఏంతో ఒక చీమ కూడా అంతే !
అది విని రావణుడు నందిని ఎన్నో మాటలతో దూషించాడు. దానితో నంది “ ఏదో ఒకరోజు కోతి నీ లంకకంతా మంటపెడుతుంది” అని శపించాడు..
ఇలా పిలుస్తున్నా నేను ఎందుకు రావణుడికి కనిపించడం లేదో తెలుసా? ఇదివరకు అతడు భక్తితో పిలిచాడు, ఇపుడు అహంకారంతో పిలుస్తున్నాడు.
రావణుడు ఒకసారి అతికోపంతో, శివయ్య రాకపోతే కైలాసాన్ని నా లంకకు తీసుకుపోతా అని తన భుజాలతో కైలాసాన్ని ఎత్తటానికి ప్రయత్నించాడు. అలా కైలాసం ఎత్తబోతే, నేను నా బొటనవేలితో ఒక్కసారి గట్టిగా నొక్కాను అంతే రావణుడు క్రింద పడిపోయాడు. అపుడు అతని అహంకారం వమ్ము అయింది. ఇక ఏడుస్తూ “దేవాధిదేవుడవు నీవు, దీనాదిదీనుడను నేను అని గానం చేశాడు. ఇంకా రావణుడు తన కడుపు చీల్చి తన పేగులతో రుద్రవీణ వాయించాడు. అపుడు మొదలైంది అతగాడి ఆర్ధ్రత. ఎందుకంటే ఇపుడు అతడి భక్తి ప్రకంపనం నన్ను చేరుకుంటుంది. కానీ అతని అహంకారం దాన్ని ఆపేస్తుంది. ఇలా చేస్తూ చేస్తూ, తను కన్ను మూసాడు. వెంటనే ఒకసారి రావణుడు కనులు తెరిచాడు. నేను బతికే ఉన్నానా? అని ఆనంద పడ్డాడు... అతని కళ్ళముందు తీక్షణమైన వెలుగు ఉంది.
రావణ: “ ఏంటి ఆ వెలుగు ?ఎవరు నీవు ?”
నేను: “ నేను ఆది అంతం లేని వాడిని, అన్ని తెలిసిన వాడిని.. విష్ణువుని.. బ్రహ్మని.. రుద్రున్ని.. సూర్య చంద్రులను పుట్టించినవాడిని.. విశ్వాన్ని ఏలుతున్న వాడిని.. విశ్వాన్ని లీనం చేసేవాడిని.. శక్తిని.. దశావతారాన్ని.. గీత చెప్పబోవు కృష్ణున్ని.. కాలుడిని..”
రావణ“మహాదేవా మహాదేవా నువ్వా? నువ్వేనా...”
నేను”.......”
రావణ “నువ్వు ఐతే నేను ఎందుకు చూడలేక పోతున్నాను”
నేను ”చెప్పా కదా రావణ నన్ను చూడాలంటే జ్ఞాననేత్రం కావాలి... అది నీ అహంకారంతో మూసుకు పోయింది... అందుకే నేను నీకు కనపడలేదు.. చూడు జ్ఞాననేత్రాలతో చూడు... నీ ఊహాశక్తికి అందను నేను... నీ వేదజ్ఞానం నా గురించి చెప్పేది కొంతే.. భక్తుడు మాత్రమే నన్ను చూడగలడు... జ్ఞాని మాత్రమే నను అర్ధం చేసుకోగలడు...”
రావణ ”శివయ్యా ఒకసారి కనపడవయ్యా”
నేను “ చూడు రావణ చూడు నేను ఇదివరకు లాగానే ఉన్నా కానీ నీవే ఇదివరకు లాగా లేవు...”
రావణుడు తీవ్రంగా రోదించసాగాడు.. వేదనతో గొప్ప స్తోత్రాన్ని కీర్తన చేశాడు... అప్పుడు ఆ స్తోత్ర ప్రభావం వల్ల కాసేపు.. అతన్ని జ్ఞాననేత్రం తెరుచుకుంది అపుడు నేను అతనికి కనపడ్డా...
రావణ ”శివయ్యా కనపడ్డావా.. పిలిస్తే పలికే నీవు.. ఏమిటి అయ్యా నన్ను కైలాస పర్వతం మోస్తుంటే తోసావ్”..
నేను “రావణా నేను తోయలేదు నాయనా.. కైలాస పర్వతాన్ని నువ్వు ఎత్తావ్.. కానీ నీలో భక్తి సవ్యం కాలేదు నాయనా అది ఎక్కడ నీ మీద పడుతుందో అని నిన్ను పక్కకు తోసాను... భక్తా..”
నంది విస్తుబోయాడు. ”ప్రభూ.. నువ్వు దశకంఠడు కైలాసం ఎత్తుతుంటే కోపగించుకున్నావ్ ఏమో అనుకున్నా.. కానీ నువ్వు రావణుడి ప్రాణాన్ని కాపాడటానికా?.. ఆహా దయామూర్తి.. నీవు.... నీవు..” అని తన్మయత్వంతో అన్నాడు.
రావణ : “ స్వామి నేను చేసింది తప్పు అయితే క్షమించు”
నేను : “రావణా నీకు ఎన్నడో చెప్పాను.. నాకు నీ మీద భక్తి మాత్రమే కావాలి శివయ్యా అని. నువ్వు అడగనప్పుడు నేను నీవు సన్మార్గంలో ఉన్నంతవరకు అది ఉంటుంది..”
రావణుడు ఒకసారి.. నన్ను ప్రత్యక్షం గావించుకోవడం.. శుద్ధ భక్తిని వరంగా కోరుకోవటం.. నా పాదాల మీద అతను తల పెట్టి ఆనందపడడం, నాకు కీర్తన కావించడం నన్ను తాకడం.. నేను స్తోత్రాలు చేసే వరం ఇవ్వడం. నాకు భస్మం పోయడం.. నా మీద చేసిన కీర్తన.. నేను అతనికి సమాధానం చెప్పటం.. గంగ నుండి జలం తీసుకుని అభిషేకించటం.. శివలింగాన్ని వాటేసుకోవడం.. బాలుని కోసం ప్రార్ధన చేయటం.. వేరొక వానికి శివపూజ గురించి చెప్పడం.. స్మశానంలో నాకు శవభస్మంతో మంచుతో అభిషేకించడం మొత్తాన్ని నెమరువేసుకున్నాడు...
ఏడుస్తూ “పువ్వులు ఉన్నది మల్లయ్యా.. నవ్వులు ఉన్నవి నీ వల్ల అయ్యా.. చేసిన ప్రార్ధన నీకోసం అయ్యా.... తప్పులు కాయవయ్యా..అయ్యలకన్న అయ్యా...”
నేను “రావణా , అహంకారం ఒకటి చాలు అది మన పతనానికి నాంది”.
రావణ “......”
నేను “నేను ఒక తీర్పు చెప్పేవాడిని రావణా... చేసిన పూజ కైనా, తప్పుకైనా, పుణ్యంకైనా ఫలితం ఇచ్చే వాడిని... నాకు అందరు ఒకటే.. నీ మనసుని ఎలా చూస్తానో... ఒక చీమ మనసుని కూడా అంతే చూస్తాను.. అందుకే అందరూ శివుని అజ్ఞా లేనిదే చీమైనా కుట్టదు అని”.
రావణ “నన్ను క్షమించు ప్రభూ! ఇక నా తప్పు తెలుసుకొని ప్రవర్తిస్తాను...”
నేను “రావణా ఎప్పటిలాగా నీ స్తోత్రానికి ఎంతో తృప్తి చెందాను. సన్మార్గంలో ఉన్నంతవరకు నిన్ను కాపాడుతాను.. నువ్వు చేసిన స్తోత్రం శివ తాండవ స్తోత్రంగా ఖ్యాతి గడిస్తుంది ఒక సిద్ద మంత్రం అవుతుంది అని ఒక అస్త్రాన్ని ఇచ్చాను..”
రావణుడు దాన్ని తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు.
తర్వాత... కొంతకాలం తర్వాత...
సీత స్వయంవరంకి వచ్చాడు అహంకారి రావణ...
మరొక్కమారు “కైలాసాన్ని ఎత్తిన నాకు శివుని ధనస్సు ఎత్తడం ఒక లెక్కా... అని దాన్ని ఎత్తబోయి.. అవమానం పాలు అయ్యాడు...
`అటుపిమ్మట సీతాపహరణం... నంది శాపం వల్ల హనుమ చేత లంకాపట్టణ దహనం.. చివరగా యుద్ధం...
విభీషణుడు చెప్పిన రహస్యం వల్ల... రాముడు కొట్టిన బాణంతో రావణుడు కిందపడి చనిపోయే స్థితిలో ఉన్నాడు..
రావణుడి మదిలో...
“శివా.. నువ్వు చెప్పావా అహంకారం విడు అని.. కానీ ఏమి చేయటం.. పరిస్థితి వల్ల ఇలా జరిగింది.. ఇన్ని లోకాల ఆధిపత్యం సాధించి.. సీతను అపహరించి .. నా కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నా.. అంతిమ గమ్యం నేనే అని నీవు చెప్పినమాట స్పురణకు కూడా రాలేదు. అంతా మాయ తండ్రీ.. ఇంకా కొన్ని క్షణాల్లో నేను అంటూ ఉండను.. అది ఇపుడు అర్ధం అయ్యింది ప్రభూ.. ఇక ఈ రావణుడు కథ అయిపొయింది..ఎన్ని సార్లు నువ్వు చెప్పినా సన్మార్గంలో ఉండు అని, నా చెవికి ఎక్కలేదు.. శివయ్యా అని “లేచి కూర్చున్నాడు...
ఎదురుగా రావణుడికి రామయ్య విష్ణుమూర్తి లాగా కనపడ్డాడు
హనుమ నా అంశ కావున నేను కనపడ్డాను...
రావణుడి జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి. ఇపుడు అహంకారం మొత్తం చనిపోయింది. అతనికి అన్ని నా ఊసులే.. నేను అతనికి ప్రత్యక్షమవ్వడం పదే పదే గుర్తుచేసుకున్నాడు...
హనుమకి రాముడికి వందనాలు చేసుకొని అతను కన్నుమూసాడు...
నేను అతనికి ఎదురుగా ఉన్నా.. రావణుని ఆత్మ నన్ను చూసింది... శివయ్యా వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు...
నేను: “ మరణ వేళలో నన్ను తలచుకోండి భక్తులారా, నా వద్దకు చేరుకుంటారు అని నీకు మాట ఇచ్చాను కదా రావణ..”
రావణ: “తండ్రి.. నీ కరుణ నాకు పశ్చాత్తాపం తెప్పిస్తుంది.. ఎన్ని పాపాలు చేసినా.. ఎందుకు తండ్రీ మేమంటే ఇష్టం”
నేను: “ చెప్పాను కదా మీరు నేను ఒక్కటే అని.. నన్ను నేను ఇష్టపడక ఎవరిని మనసుపడతాను భక్తులారా..”
రావణ: “ ప్రభు ఆత్మ జ్ఞానం అంటే ఇప్పుడు అర్ధం అయ్యింది ప్రభూ.. భోళాతనం అంటే ఏంటో తెల్సింది ప్రభూ.. స్మశానంలో ఎందుకు ఉంటావో నా మనసుకి అందింది స్వామీ...”
నేను: “ భక్తులారా.. నన్ను అనన్య చింతన చేయండి.. నన్ను నమ్మండి... నిజము నేను... ఉన్నది నేను...అంతా నేనే.. నీతిని వీడకండి.. వెయ్యి పూజలు చేసినా ఒకటే నీతిగా ఉన్నా ఒకటే”
రావణ: “తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే వేలు పట్టి నడిపిస్తారు.. భార్యా బిడ్డలు బంధాలు.. ఊపిరి ఆగగానే .. ఊరి బయట పారేసివస్తారు.. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మమ్మల్ని చూస్తూనే ఉంటావు తండ్రీ.. నిన్ను నమ్మిన వాడు.. నిజమైన జ్ఞాని.. అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు”
నేను: “ రావణ చెప్పానుగా భక్తి కి దాసుడను నేను...”
రావణ: “ నీ కరుణ భరించలేను తండ్రి..”
నేను:“ రావణా.. బాధపడకు.. అన్నీ నా ప్రకారమే జరుగుతాయి.. అందరు నిమిత్తమాత్రులు .. నన్ను నమ్మినవారికి అంతా మంచే జరుగుతుంది.. నీవు మరొక జన్మ ఎత్తి విష్ణులోకం చేరుకుంటావు” అని వరం ఇచ్చాడు.
రావణ “ స్వామీ శివకేశవులు ఇద్దరు ఒకటే..... ఇప్పడు తెలుసుకున్నాను..
అటుగా హనుమ సీతమ్మను తీసుకొని వస్తున్నాడు... రామయ్య ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు.. వారిద్దరూ కలుసుకున్నారు..
హనుమ: “ ఆహా ఈ కోతి ఎంత గొప్ప సన్నివేశం చూస్తుంది..రామయ్య సీతమ్మ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారు.. ఆహా..
రామా రామా సీతారఘురామా ... రామబంటులో నేను కూడా ఒకడిని.. నా రామయ్య తండ్రి సీతమ్మను కలవడానికి నా వంతు సాయం చేసాను...” అంటూ ఆనందభాష్పాలు విడుస్తున్నాడు. అందరు ఆ దృశ్యం చూసి పులకించిపోయారు...నేను కూడా...
రావణుడి ఆత్మ రాముడి దగ్గరకు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి వారిని క్షమాపణలు అడిగింది. వారిరువురు .. రావణుడిని క్షమించారు..
నేను “ శాపంవల్ల ఈ జన్మ ఎత్తావు రావణ” అని అతని కథ మొత్తం చెప్పాను...
అలా రావణుడు మళ్ళీ ఆత్మరూపంలో కొంత కాలం నాతో గడిపి.. మరొక జన్మ ఎత్తి.. తర్వాత వైకుంఠంలో ఉండిపోయాడు.
భక్తులారా నన్ను నమ్మండి.. మహాభక్తుడగు రావణుడు కైలాసాన్ని ఎత్తాడు.. కానీ అహంకారి అయిన రావణుడు కేవలం నా ధనస్సుని కూడా ఎత్తలేకపోయాడు.. అహంకారం వదిలి నామీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి..
మరొక మంచి కథ మీకు చెప్తాను మీకు.......
**************************************
భక్తులారా! మరొక మంచి కథ చెబుతాను మీకు, నంది గురించి. ఈశ్వరుడిని అంటే - నన్ను మోసిన నంది, నందీశ్వరుడు. ఎవరు ఎక్కడ నా నామస్మరణ చేస్తారో, ఎవరికి నా నామం మనసులో ధ్యానంగా ఉంటుందో, అక్కడ ఎప్పుడూ నంది ఉంటాడు. “మహాదేవా, మహాదేవా” అంటూ నన్నే స్మరిస్తూ ఉంటాడు. శుద్ధభక్తికీ, జ్ఞానానికి, తపస్సుకు సరియైన ఉదాహరణ నందియే. నా ప్రియభక్తుడు, నా సేవకుడు, నా వాహనం, నాకు అందరి కంటే ముఖ్యమైన నంది గూర్చి ఒక మంచి కథ చెబుతాను.
అది పూర్వం నేను సన్యాసిగా విరాగిగా, ఒక్కడ్నే ఉన్నప్పుడు జరిగిన కథ.....
శిలాదుడు నాకు ఎంతో ఇష్టుడు. నా కోసం ఘోర తపస్సు చేసి నన్ను ప్రత్యక్షం చేసుకున్నాడు. శిలాదుడు నాముందు మోకరిల్లి “ దీనులకు ధన్యత, పాపులకు మోక్ష అర్హత, అన్ని కోరికలు పటాపంచలు చేసే మహాశివా” అంటూ నా చుట్టూ తిరిగి నాకు ప్రదక్షిణలు చేసి “ శరణం లయ, చరణం లయ, ఓ శివాలయ “ అంటూ ప్రసన్నం చేసుకున్నాడు. “హరహరమహదేవ్” అంటూ తీవ్రతన్మయత్వంలో ఉన్నాడు. నేను “శిలాదా నీ ఆర్తి నన్ను కదిలించింది, నీ భక్తికి నా మనసు పులకించింది, నీకు ఏం కావాలి? ‘ అని అడిగా. శిలాదుడు “త్రినేత్ర, నాకు నీ యందు ఎల్లప్పుడూ భక్తి ఉండేట్లు, ఒక బిడ్డని అనుగ్రహించు తండ్రి” అని వరం కోరుకున్నాడు. నేను “తథాస్తు, నీ కోరిక తథ్యం నెరవేరుతుంది” అని ఆశీర్వదించి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నంది శిలాదునికి పుట్టి, క్రమక్రమంగా పెరుగుతూ, శివభక్తి పరాయణుడు అయ్యాడు. కానీ ఇద్దరి మహర్షుల వాక్కుచేత, నంది తాను అల్పాయుష్కుడనని తెలుసుకొని, శిలాదుని దగ్గరకు వెళ్ళి, బాధపడుతున్న శిలాదుని ఓదార్చి “మహాదేవుణ్ణి నమ్మిన వారిని తలరాత, మృత్యువు ఏమి చేయలేదు, మీరు నాకు అనుమతి ఇస్తే, నేను వెళ్ళి మహాదేవున్ని తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకుంటా” అని ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు.
నంది “భువననది “ లో తపస్సు చేద్దామనుకొని బయలుదేరి వెళ్తున్నాడు. భక్తులారా! నంది ద్వారా అనన్య చింతన, నవవిధభక్తిమార్గాలు అంటే ఏమిటో చూపటానికి నేను ఈ లీల చేశాను. మార్గమధ్యంలో నేను మరొక రూపంలో నంది ముందు ఉన్నాను. తోటి బాటసారిలాగా నందితో పయనమయ్యాను. నంది నాతో భువననదికి దారి తెల్సా అని అడిగి, దారి చూపమన్నాడు, మారువేషంలో ఉన్న నన్ను నంది గుర్తించలేదు? “భువననదికి” ఎందుకు అని అడిగాను. దానికి నంది “స్వామీ, ఎందుకు తెలీదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మీరు బాగా ఎరిగిన వారులాగా ఉన్నారు, నా మనసు మీతో మాట్లాడుతుంటే, పరవశించిపోతుంది. నేను “మనిద్దరి బంధం ఇంకా మున్ముందు మొదలుకాబోతుందిలే” అని అన్నాను. దానికి నంది “మీరు కూడా మహాదేవుని భక్తులా”, అని అతడు అడిగాడు. నేను “ఏ దేవుడ్ని నేను నమ్మను, నన్ను నేనే నమ్ముకుంటా. మహాదేవుడు అసలు దేవుడు అని ఋజువు ఏది? ఇందాక శిలాదుడిని కలిసి మాట్లాడాకా , నాకు శివుడు లేడని తెలిసిపోయింది ,” అని అన్నాను. నంది తానెవరో చెప్పకుండా “మీకు ఏమి తెలిసినది మహాత్మా, దయచేసి శివుడ్ని నా ముందు విమర్శించవద్దు” అని గౌరవ హెచ్చరిక చేశాడు.
నేను - “వరం ఇచ్చినవాడు అదే ఆ మహాదేవుడు, ఆల్పాయుషు ప్రసాదించాడట, శిలాదుడు కన్నీరు పెట్టుకుంటే అడిగి తెలుసుకున్నా...”.
నంది - ” మహాత్మా! ఆయుష్షు తక్కువైనా , మహాదేవుడ్ని నమ్మితే భౌతిక మరణం తర్వాత ఆయనలో లీనమవ్వచ్చు కదా? అప్పుడూ, రాత, ఆయుష్షు అనే పదాలకు అర్ధం ఏముంది, అంతిమ చర్య మోక్షానికి ఆయనలో లీనం అవ్వటమేగా?
నేను - అబ్బో, భలేగా చెప్పావు, ఇంతకీ ఆ నదికి నీవు ఎందుకు వెళ్తున్నావో ?”
నంది - “తపస్సు చేయుటకు పయనమయ్యాను”.
నేను -“ఏ వరం కావాలో” అన్నాను వ్యంగ్యంగా.
నంది - ”మహాత్మా, వరాలకోసం తపస్సు కాదు, ఆయన్ని దర్శిచటం కోసం”.
నేను - “పిలిస్తే వస్తాడు అంటారు కదా, మరెందుకు తపస్సు చేయటం? ”
నంది -“మహాత్మా, మీ ప్రశ్నలో నాకొక కొత్త ఆలోచన వచ్చింది, నేను వరం కోరుకుంటా”.
నేను - “చెప్పలా...వరంకోసమేగా”....హాహాహా .
నంది - “నేను కోరుకునే వరం వేరు, నీవు అనుకునేది వేరు” , అంటూ నా గూర్చి నా ముందే పాటలు పాడుతూ స్తోత్రం చేస్తూ తిరుగుతున్నాడు. నంది పాడుతున్న సంకీర్తనలను విని నేను చాలా సంతోషపడ్డాను. భక్తావేశం ఎక్కువై నంది పూనకం వచ్చిన వాడిలాగా ‘శివ శివ శివ’ అంటూ తిరుగుతూ క్రిందపడ్డాడు. క్రిందపడిన నంది కాలికి గాయము అయ్యింది, అక్కడి నుండి మళ్ళీ దొర్లటంతో. నంది కదలలేని స్థితిలో ఉన్నాడు.
నంది” శివయ్యా, నేను కవిని కాను, బుద్ధిలేని ఈ పశువు పాడిన పాటలు నీకు వినబడ్డయా?” అని ఆర్తితో ఏడుస్తున్నాడు. నేను వెళ్ళి నందిని గట్టిగా పట్టుకొని “ఏమయింది నీకు” అని గాబరాగా అడిగినట్లు అడిగాను. “నేను త్వరలో శివయ్యను చూడబోతున్నా” అని ఆనందంగా అరుస్తున్నాడు. నంది కాలికి గాయము అయ్యింది. నేను వెళ్ళి అక్కడ ఆకుపసరు సేకరించి నంది కాలు పట్టుకొని రాయబోతున్నా, నంది “స్వామి మీరు పెద్దవారు నా కాలు మీరు పట్టుకోవటమా ?”, అన్నాడు.
నేను” ఏమి పర్లేదు నాయనా, నా బిడ్డ లాంటి వాడివి నీవు, నా బిడ్డవే అనుకో” అంటూ చొరవగా నంది పాదాలకు మందు వ్రాసాను. నంది చిన్నగా లేచి కదలబోయాడు. కానీ కదలలేక పోయాడు. నందిని చిన్నగా ఆసరాగా తీసుకొని జాగ్రత్తగా నందిని నిలబెట్టాను. నంది భక్తి పారవశ్యంలో ఉన్నాడు. నందిని దగ్గరగా కూర్చోబెట్టుకొని అన్నం ఎప్పుడు తిన్నావో, తిను నాయనా అని అన్నం పెట్టాను. నంది చేయికి గాయం కావున, నేనే దగ్గరుండి తినిపించాను. ప్రకృతి ఈ దృశ్యాలు చూసి మైమరచిపోతుంది. నంది “నీవు చెప్పిన శిలాదుని బిడ్డను నేనే” అంటూ ఏడవసాగాడు, “ఇలా ఉంటే, నేను ఎలా తపస్సు చేయాలి” అని అడిగాడు. నేను వెంటనే “నాయనా, నేను నిన్ను మోయగలను “అంటూ పైకి ఎత్తబోయాను. నంది “ఆ శివయ్య తపస్సు చేద్దామని భువననదిలో నిర్ణయించుకున్నా” ,అందుకు శివుడే సాయంగా పంపినది నిన్నే మహాత్మా” అని అన్నాడు ఆనందంగా. నేను నందిని ఎత్తుకొని నా భుజాలకు వేసుకున్నాను. నంది కళ్ళు మూసుకున్నాడు. నేను నా నిజరూపంలోకి మారాను.
స్పృహలేని నందిని నేను ఎత్తుకొని మోసుకుంటూపోతున్నా. ఆ దృశ్యం గాంచిన విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు నా ముందు ప్రత్యక్షమయ్యి “మహాదేవా, భక్తులకు మీరు అంటే ఎంత ఇష్టమో, మీకు అంతకన్నా ఇష్టము వారంటే ! ఈ సంఘటన చూసి మేమెంతో పులకించిపోయాము. భవిష్యత్తులో నంది మీ వాహనం, మీ భక్తుడు అవ్వబోతున్నాడు. అలాంటి మీ వాహనాన్ని మీరే మోయటం ఏంతో కనులపండుగగా ఉంది. మేము కూడా మీ భక్తులమే” అని అన్నారు.
నేను “శ్రీహరీ, బ్రహ్మదేవా, నంది యొక్క భక్తి అజరామరమైనది. ఆ భక్తికి ఏ భగవంతుడు అయినా దాసుడు అవ్వవలసిందే! చాలా మంది భక్తులు ‘శివుని వరం పొందాలి’ అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే శివుడిని పొందాలి అనుకుంటారు. అటువంటి వారిలో నంది అగ్రగణ్యుడు. అందరూ అనుకున్న విధంగా అతడు ఒక బలమైన కోరిక కోరుకుంటాడు. అది తప్పకుండా నెరవేరుస్తాను. ఇక మిగిలింది నందిని పూర్తిగా పరిశుద్దుడిని చేసే తపస్సు మాత్రమే”, అన్నాను.
బ్రహ్మ,విష్ణువులు నమస్కరించి వెళ్ళిపోయారు. నా భుజాల మీద ఉన్న నంది కొంచం స్పృహ లోకి వచ్చి కలవరిస్తున్నాడు. అతని కల నాకు తెలుసు, ఆ కల “నేను ఒక స్మశానంలో కూర్చొని ఉన్నా, నాముందు ఉన్న నంది నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యంలో “స్మశానంలో ఒక్కడివే ఎలా ఉంటావయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను. నా తోడు నీకు అవసరం లేకపోయినా, నీ తోడు నాకు కావాలి” అంటూ పారవశ్యంతో నర్తిస్తున్నాడు. నేను నవ్వుతూ ఉన్నాను. నా దగ్గరికి వచ్చి ఆనందంగా నా మీద నీరు పోసి, నా ఢమరుకం తీసుకొని దాన్ని లయబద్ధంగా వాయిస్తూ, నా ముందు నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యానికి నేను ఎంతో ప్రసన్నత చెందాను. నేను లేచి నిలబడ్డాను. నంది నా వైపు చూస్తున్నాడు. నేను కూడా నా త్రిశూలాన్ని పట్టి నంది ముందు ఆనందతాండవం చేసాను.
నంది మోకాళ్ళ మీద కూర్చొని, నా ఢంకా మ్రోగిస్తున్నాడు. నా నృత్యం చూసిన నంది ఎంతో భావోద్రేకం చెందాడు. నాట్యం మధ్యలో “నీవు కూడా రా నంది” అని సైగ చేశా, ఆ సైగతో నా దగ్గరికి వచ్చాడు నంది, నాతో పాదాలు కలిపి, నృత్యం చేయసాగాడు. మేమిద్దరం ఎంతో ఆనందంగా నృత్యం చేస్తున్నాము”.
నంది నా భుజం మీద ఊగుతున్నాడు “యోగిదేవా, అనంతదేవ, మహాదేవా” అని కలవరిస్తున్నాడు. అతని మనసు అతని కలలో ఉన్నా, నా చుట్టూ నాట్యం చేస్తుంది. ఆ కలలో “ప్రభూ! ఈ దీన భక్తుడికోసం నీవు చిందులేశావా, నీ సృత్యం నాకు చాలా నచ్చింది స్వామీ, ఇక మీదట ఎవరు ఎక్కడ ఉత్సవం చేసినా, అక్కడ నేను కూడా ఉండి ఆనంద పారవశ్యంతో నృత్యం చేస్తాను తండ్రీ” అంటున్నాడు.
“హరహరశంభో” నృత్యం చేస్తా మహేషా అంటూ నా భుజం మీద ఊగుతున్నాడు. ఇంతలో భువననది వచ్చింది. నన్ను చూసిన ఆ నది నాకు నమస్కరించింది. నేను “భువన, యితడు నంది నాకు ప్రియమైనవాడు, ఇతనికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడు “, అన్నాను.
ఆ నదీమాతా “అలాగే స్వామీ! తప్పకుండా.” అంది, నేను నందిని క్రిందకు దింపి ఒంటిని స్ప్రుశించాను. నందికి అన్ని చోట్ల నయం అయ్యింది. నంది కళ్ళు తెరిచాడు. “మహాత్మా, తామెవరో మహాదేవుని దూతలాగా ఉన్నారు నన్ను ఎంతో ఓర్చి ఇక్కడికి చేర్చారు. మీ వైద్యంతో నాకు నయం చేశారు. ఇక మీద తపస్సులో లీనం అవుతాను” అని నాకు కృతజ్ఞతలు చెప్పాడు. “మరి నేను వెళ్ళి వస్తా, శివానుగ్రహప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించా. దానికి నంది “శివానుగ్రహం ఉంది స్వామి, శివదర్శనప్రాప్తిరస్తు” అని దీవించండి అని అన్నాడు.
దానికి నేను “నందీ, శిలాదపుత్రా ! నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ మహాదేవుడు నీకు ఎప్పుడో దర్శనం ఇచ్చి ఉంటాడు, మళ్ళీ తప్పక ఇస్తాడు” అని అన్నాను. నంది వచ్చి నేను చేసిన సేవకు, సహాయానికి నాకు కృతజ్ఞతలు చెప్పి, నా పాదాలను తాకి “స్వామి, ఈ పశువును బరువు అనుకోకుండా మోశావు, మీకు అవసరమైనప్పుడు మిమ్ము నేను కూడా మోస్తా స్వామీ !” అని నాకు అభయం ఇచ్చాడు. నేను మాత్రం చిరునవ్వు నవ్వి, “తప్పకుండా నాయనా, నీవు నాకు ఇచ్చిన ఈ వరాన్ని వాడుకుంటాను అని చెప్పి, “మహాదేవుని దర్శనం పొందాలంటే ఏవిధంగా తపస్సు చేయాలో చెప్పి వెళ్ళిపోయాను బాటసారి లాగా.
ఇక నంది లక్ష్యం నా దర్శనం, అక్కడ పడి ఉన్న ఒక పాతరాతిలింగాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని, నది ఒడ్డున ప్రతిష్టించుకొని, బాటసారిగా నేను చెప్పిన తపస్సు సూత్రాలు అనుసరించి తపస్సు మొదలెట్టాడు. నంది మొహం మీద సూర్యుడు పడుతున్నాడు. దానికి అడ్డంగా అక్కడ ఉన చెట్టు నందికి నీడలాగా అయ్యింది. భువన నదికి ఎక్కడి నుండో పెద్ద వరద వచ్చింది. కానీ, తపస్సులో లీనమయిన నందికి తలంపు లేదు, ఆ వరద నందిని తాకబోయి సమయానికి, భువననది ఆ వరద దారి మళ్ళించి, నందికి ఏమి కాకుండా చేసింది. కానీ, నంది ఘోరతపస్సు చేస్తున్నాడు. నేను అంతా చూస్తూనే ఉన్నాను. నా మనసు కూడా నంది మనస్సు కన్నా ఉవ్విళ్ళు ఊరుతుంది. జోరున వర్షం పడుతుంది, కానీ నందిలో చలనం లేదు. ఉరుములతో, పిడుగులతో వర్షం మరింత పెద్దదయ్యింది. సరిగ్గా నంది మీద పిడుగు పడబోయింది. నేను వెంటనే ఆ పిడుగు నందికి తగలకుండా చేశాను. నంది మాత్రం తపస్సు నా జ్ఞాపకాలతో చేస్తున్నాడు. నేను, నాకు తోడుగా మరొక కైలాసవాసి......
నంది చేస్తున్న తపస్సు తీవ్రత, ఆర్ధత నన్ను తాకింది. నంది శ్రద్ధ నన్ను ఎంతో పులకరింప చేస్తోంది . నేను కూడా నందికి దర్శనం ఇవ్వటానికి ఊవిళ్ళురూతున్నాను. నాకు తోడుగా మరొక సహవాసి దొరుకుతున్నాడు అని నా సంతోషం. ఘోరతపస్సు తెలిసిన వాడిలా ,ఏ మాత్రం కోరిక లేకుండా, తధేకంగా నిశ్చలంగా నా ధ్యానం చేస్తున్నాడు. అతని పరధ్యానం కూడా పరమేశ్వర ధ్యానమే అన్నట్లు ఉంది. అతని భక్తి తీవ్రత. పిడుగులు, ఉరుములు, వరదలు ఏవి నంది మీద ప్రభావం చూపలేకపోతున్నాయి. ఎందుకంటే వాటికి అడ్డుగా, నందికి రక్షణగా నేను ఉన్నాను.
‘హరాహరా హరా హరహరహర’ అంటూ నంది నుండి ప్రతిధ్వనులు వస్తున్నాయి. అతని తపస్సుకి పంచభూతాలు సైతం పునీతం అవుతున్నాయి. నంది శరీరం నిశ్చలం అయిపొయింది. శరీరం జడంగా మారింది. మనసు నా దగ్గర ఆగిపోయింది. దివ్యకాంతి నంది శరీరం నుండి ఉద్భవించింది. ఆ కాంతికి సూర్యుడు కూడా వెలవెలబోయాడు. విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు సైతం నంది చేస్తున్న తపస్సుకి విస్తుబోయారు. క్రమక్రమంగా నంది దేవతలా స్థానాన్ని కూడా మించాడు. నంది పరిసరాల్లో ఉన్న మోడుబోయిన చెట్లకు కూడా పూలు పూసాయి. అలా ఎన్నో పూలు గాలికి వచ్చి నందిని తాకుతున్నాయి. నందిని తాకిన పూలు అక్కడ నా రూపమైన లింగమును తాకుతున్నాయి. నా భక్తుని స్పర్శతో వచ్చిన పూలు నన్ను తాకటం, ఆ భక్తుని సమర్పణ భావన ఉండటం ఎంతగానో ఆనందంగా ఉంది. ఇక నందికి దర్శనం ఇవ్వవలసిన సమయం వచ్చింది....
నేను నంది ముందు ప్రత్యక్షమయ్యాను. నందితో నేను “శిలాపుత్రా, నంది నీ తపస్సుకు మెచ్చాను, అందుకే నీకై వచ్చాను.” అన్నాను.
కనులు తెరిచి చూసాడు నంది. నంది నోటి వెంట మాట రాలేదు. నందికి నా దివ్యరూపం తప్ప ఏమి కనుబడుటలేదు. నా ఢమరుకం దాని అంతటదే ధ్వనిస్తుంది. నా నుండి ఓంకారం నందికి ప్రసారం అవుతుంది. అప్పటికింకా నా మెడలో నాగరాజు, తలపై చంద్రుడు, కొప్పులో గంగ ఏమి లేవు. నా వెంట ఉన్న త్రిశూలం నేను తప్ప... నంది అలాగే స్థాణువుడై ఉన్నాడు. భక్తికి చివరి మజిలి.. నంది ఆహార్యం మారిపోయింది, శుష్కించిన అతని శరీరం బలంగా మారింది, అతని భక్తే బలంగా మారింది నందికి.
నేను “ నంది, చెప్పు నంది, నన్ను గుర్తుపట్టలేదా?” అన్నాను.
బాటసారిగా మారి నందికి మనస్సులో “ నేను బాటసారిగా రావటం, నన్ను నేనే విమర్శించుకోవటం, నందికి భువననది దారి చూపడం, నంది స్పృహ కోల్పోవటం, అతన్ని నేను మోయటం, అతని గాయాలకు మందు రాయటం, ఆహారం తినిపించడం, మన పరిచయం మునుముందు చూస్తవులే అనటం” అన్ని, కళ్ళ వెంట నీరుతో ఉన్నాడు నంది.
నేను “నంది మన పరిచయం మునుముందు చూస్తావులే అని అన్నాను అర్ధమైందా”
నంది”............”
నేను “ఏమి నంది మౌనంగా ఉన్నావు, నాతో మాట్లాడవా? చెప్పు “
కళ్ళు తుడుచుకుంటున్న నంది “ఆ.... నా పిలుపు నీకు వినబడిందా?”
నేను “ఎప్పుడో... కాబట్టే కదా, నిన్ను దగ్గరుండి అన్నీ కల్పించేటట్లు చేసాను”
నంది”....”
నేను “ చెప్పు నంది, మళ్లి మౌనమా?”
నంది “ స్వామీ, నేను మాట్లాడకపోతే, నీవే మాట్లాడుతున్నావు కదా, అది బాగుంది”
నేను “నంది నీతో మాట్లాడటమే కాదు, నీ కోసం ఏదైనా చేస్తా, నీకన్నా ప్రియమైన వారు ఎవరు, నీవు నేను ఇద్దరం ఒకటే”
నంది “ఒకటా”
నేను “అందుకే కదా నంది, నీవు ఢంకా వాయిస్తే నృత్యం చేసాను”
నంది “అది కలా, నిజమా?”, నేను “ఏదైనా ఆ అనుభూతి ఒకటే”
నంది” స్వామీ నా ఆయుష్షు ఎప్పుడు అయిపోతుంది”.. నేను “ఎందుకు”
నంది “ అప్పుడు నీ దగ్గరికి రావచ్చుగా, శాశ్వతంగా నీతో ఉండిపోవచ్చుగా”
నేను “ఇప్పుడు మాత్రము ఏమైనది ఉండవచ్చుగా, నీవు మృత్యుంజయుడవు”
నంది “ స్వామీ, నేను ఒక జ్ఞానం లేని పశువుని, ఈ సమయంలో ఏ పండితుడు, పామరుడు ఎవరు ఉన్నా గొప్ప గొప్ప స్తోత్రాలు, కావ్యాలు రాసేవాడు. కానీ”
నేను “పండితోత్తమ నీవు పండితుడవే, తథాస్తు, సకలశాస్త్రాల పండితుడవు”
నంది” మహాదేవా స్మశానానికి తీసుకురావడానికి పుట్టించడం ఎందుకు” అంటూ గీతం ఆలపించాడు.
నేను “ చెప్పు నంది, నీ కోరిక ఏమి”, నంది “ప్రభూ, మీతో ఉండటమే ”
నేను “నేనే ఒక యోగిని, నాతో నీవు ఎందుకు, నంది”, నంది “నేను కూడా నీతో”,
నంది “ఇన్ని లోకాలను చూస్తున్నావు కదయ్యా, నేను ఒక్కడ్ని నీకు భారమా?”
నేను “నంది, నీవంటి భక్తుడు నాకెప్పుడూ భారం కాడు, నీవు నాకు ఎంతో ఇష్టుడివి”
నంది “స్వామీ నేను ఒక పశువుని కదా, పైగా మీకు నేను వాగ్ధానం చేశాను, మిమ్ము మోస్తా అని”
నేను “చెప్పు నంది, నీకు ఏమి కావాలన్నా ఇస్తాను”
నంది “ప్రభూ, ఈ పశువుని మీ వాహనంగా చేసుకోండి, మిమ్ము ఎక్కడికైనా తీసుకువెళ్తాను”
నేను “అవును మరి, నీవు నాకు వరం ఇచ్చావుకదా, దాన్ని సద్వినియోగం చేసుకుంటా”
నంది “మరైతే అధిరోహించండి” అని నంది తన యదార్ధ రూపంలోకి మారాడు. నేను నందిని అధిరోహించి, ప్రేమగా వాటేసుకున్నాను, నంది నా స్పర్శతో పులకించాడు. విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు.
విష్ణువు “ప్రభూ, మహాదేవా, ఈ సంఘటన కన్నుల పండుగగా ఉంది”
బ్రహ్మ “మహాదేవా, భక్తులకోసం ఏమైనా చేస్తారు, నంది నీవు ధన్యుడవు”.
నంది మామూలు మనిషిగా మారి నా పాదాల ముందు మోకరిల్లి “నిన్ను నమ్మి, ఉన్న, నిన్నే తలచుకున్నా, నీ తలంపులో వచ్చే కన్నీటిని తుడుచుకున్నా” అంటూ విష్ణువుని, బ్రహ్మని చూసి నమస్కరిస్తూ మధురమైన కీర్తన ఆలపించాడు.
నేను, “నంది, నీ కీర్తనకు ప్రసన్నుడయ్యాను, నా దర్శనానికి ముందు నిన్ను దర్శించుకునేలా వరం ఇస్తున్నాను. కైలాసంలో నా తర్వాత నీవే గణాలను, చూసుకోవాలి ఇక మీద” అంటూ భోగభాగ్యవైరాగ్య వరాల జల్లు కురిపించాను.
కాని నందికి అవి ఏమి అక్కరలేదు, కావాల్సింది ఒకటే “నేను”, అలా మీరు అనుకోండి అన్ని వస్తాయి. మిగతా ఎవరికైనా గర్వభంగం జరిగింది ఏమో గాని, నంది ఎప్పుడూ అందరి, భక్తులకు ఆదర్శప్రాయుడు.
నేను “నందీశ్వర” అంటూ నందికి నా ఈశ్వర నామధేయం ఇచ్చాను. ఎన్ని ఉన్నా, ఇప్పటికీ నందికి కావలిసింది ‘నేను’ మాత్రమే !
************************
సాంబయ్య కధ
అదొక చిన్న పట్టణం. ఆ ఊరిలో ఉంది శివాలయం. ఆ శివాలయంలో ఎందరో బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తుంటారు. ఎంతో మంది భక్తులు నా దర్శనం చేసుకుంటారు. ఎవరికీ తోచిన విధంగా వారి మనస్సును నాపైన నిశ్చలంగా (27) ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఆ గుడి బయట “దయచూపండి బాబు, ధర్మం చేయండి బాబు” అని కొంతమంది బిచ్చగాళ్ళు వేడుకుంటున్నారు. “దయకలిగిన దేవాలయం” అని కొందరూ,”ఆకలిబాబు”, అనాథలం బాబు ,”అవిటివాళ్ళంబాబు”, బిక్షబాబు” అని కొందరూ తమ చేతులను చాచి అడుగుతున్నారు. ఎవరుకి తోచిన ధర్మం వారు చేస్తున్నారు, కానీ వారి ఆత్రుత నా దర్శనం కోసమే కానీ వారి పరిస్థితి చూసి కాదు. కొంతమంది “ఏ జన్మలో ఏ పాపం చేశారో” అని వారి మీద జాలి పడుతున్నారు. మహాన్యాసభిషేకాలు మళ్లీ మొదలయ్యాయి, కానీ నాకు వినిపిస్తుంది ఒక భక్తుని తత్వగానం “మనుషులను ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్ళు అంటారు, నిన్ను ప్రాధేయపడే వారిని భక్తులంటారు శివయ్యా” అని, ఇంతలో వచ్చారు ఆ భక్తుని దగ్గరికి వారు, ఆ భక్తునితో “చెప్పుల సాంబయ్య, ఎన్నో సంవత్సరాల నుండి ఈ శివాలయంలో పాదరక్షలను భద్రపరుస్తుంటావు, ఏ రోజు ఎవరిని డబ్బులు అడగవు, ఇచ్చినంత తీసుకుంటావు నీకే అవసరాలు ఉండవా?....దానికి సాంబయ్య “నా కంటూ ఎవరూ లేరు స్వామీ, నా కుటుంబం మొత్తం అంతం అయ్యారు, వారికి నాకు ఋణం తీరిపోయింది, ఒక ప్రమాదంలో నన్ను తప్ప ఆ శివయ్య అందర్నీ తీసుకుపోయాడు,,”. ఆ భక్తుడు “ఏదైనా ఆ శివయ్య ఎందుకు అలా చేశాడో? నీకు అలా జరగాల్సింది కాదు” ...సాంబయ్య “నాకేం తెలుసు, నా కన్నా ఆ శివయ్య నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు కదా, అందుకే వారందర్నీ తనదగ్గరికి తీసుకుపోయాడు”. అనేసరికి ఆ భక్తుడు మౌనం వహించి వెళ్ళిపోతూ “ఎంత తత్వాన్ని చెప్పాడు ఈ చెప్పులు కుట్టేవాడు,”అనుకున్నాడు.అభిషేకాలు మొదలయ్యాయి, మళ్లీ సాంబయ్య పాడటం మొదలెట్టాడు. “అందరూ జోలెతో భిక్ష అడిగితే, నేను ఈ శరీరాన్ని జోలేగా భిక్ష అడుగుతున్నా” మళ్లి మిగతా వారు చెప్పులు తీసుకుని ఇచ్చిన చిల్లర ఒక హుండిలో వేసుకున్నాడు, పాడుతూ “మట్టిలో కలిసిపోయే దేహం విభూదా? భూడిదా, వేరొకరు మనల్ని మోసం చేస్తే పగ పెంచుకుంటారు, నీవు ఏమి చేసిన, ఎవర్ని దూరం చేసిన, నీమీద భక్తి పెంచుకుంటారు, వేరొకరు చేస్తే తప్పు, నీవు చేస్తే లీల” అని పాడుతూ తన కుటుంబాన్ని తలచుకొని కన్నీరు కారుస్తున్నాడు. ఇంతలో ఎవరో ఇచ్చిన చిల్లర హుండీలో వేసుకున్నాడు. ఇంతలో పంతులుగారు వచ్చి “దూరం సాంబయ్య మడి మడి ‘ అంటూ వెళ్ళిపోయాడు “సాంబయ్య, నేను నీవు ఒకటేనా, సమశానంలో ఉండే నీకు మడి, మైల ఏందయ్యా, అవన్ని నీకే లేనప్పుడూ మాకు ఉంటాయా లేక మేము నీ అంతవారము కాదంటావా?” ఎవరో ప్రసాదం ఇస్తుంటే భద్రపరుస్తున్నాడు. అలా ఎంతో చిల్లర, ప్రసాదాలు భద్రపరుస్తున్నాడు. “ఈ సాంబయ్యకి కొంచెం పిచ్చి వచ్చింది, పరమేశ్వరుడ్ని వీడు తిడుతున్నాడా, పొగుడుతున్నాడా?” అంటూ అందరూ సాంబయ్య గూర్చి అనుకునేవాళ్లు. సాంబయ్య నిష్కల్మషమైన భక్తి నన్ను చేరుతుంది, అది పిచ్చికాడు వైరాగ్యం.
తీసుకున్న ప్రసాదాలు సాంబయ్య అందరికి బయట ఉన్నవారికి పంచుతున్నాడు. వారు “చెప్పులసాంబ, నీ పుణ్యమా అని ఒక పూటైన భోజనం చేస్తున్నాం” అంటున్నారు. సాంబయ్య “నాదేముంది, ఇది నాకు ఇచ్చిన వారు పుణ్యాత్ములు “ అంటూ, మళ్ళి గానం చేస్తూ “నిన్ను చేరక, ఎన్ని జన్మలు, ఇలాంటివి, ఎందుకు ఈ అవిటివారి కష్టాలు, నా కుటుంబాన్ని తీసుకుపోయినట్టు వీరిని నీ దగ్గరికి తీసుకోవయ్యా, నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకిన నాకు ఎక్కడి పాపాలు” అంటూ ప్రసాదాలు పంచారు అంతలో ఒక అవిటివాడు పెట్టింది తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు “చేతనైన సాయం చేయనివార్నిదుర్మార్గుడు అంటారు, అన్ని తెలిసిన నీవు ఏమి చేయకపోయినా నిన్ను మహాదేవుడు అంటారు అంటూ కన్నీరు కారుస్తూ ఆ అవిటివాడికి అన్నం పెట్టపోతే, అతడు మరణించాడు. ఆ అవిటివాడి మరణం చూసి అందరూ ఎంతో ఆనందపడ్డారు, “కానీ శివయ్యా, పిలిచినా వెంటనే అతనికి ముక్తి ఇచ్చావు, ఇక నేనే “అంటూ ఆ కన్నీరుని ఆ అవిటివాడి మీద కార్చాడు. ఆ కన్నీరు వచ్చి నా పాదాలపై పడింది. ఆ శవం కళ్ళు మూస్తూ సాంబయ్య “వెళ్లిరా మిత్రమా” అంటూ వీడ్కోలు పలికారు. అ అవిటివాడ్ని చూసి సాటి ముష్టివారు బాధపడుతున్నారు. “అనాథగా ఉండి, ఇంతమంది నీకోసం కన్నీరు కార్చేవార్ని సంపాదించుకున్నావు అంటూ శ్రద్దాంజలి ఘటించాడు. ఇంతలో గుడి నిర్వహణ బృందం వచ్చి ఆలయం మూసివేయాలి “మైల మైల అశూచి” అంటూ గుడి మూశారు. “సంప్రోక్షణ చేయాలి” అంటున్నారు. “స్మశానంలో శవాలు ఉండక, ఏముంటాయి, శివాలయం అంటే (28) స్మశానమే కదా శివయ్యా” అంటూ వేసిన తలుపుల ముందు ఆ అవిటివాడ్ని స్మశానానికి తరలిస్తూ పాడాడు. స్మశానంలో ఆ శవదహనం ఖర్చుకోసం తన హుండిలో డబ్బులు తీసుకున్నాడు. “శివయ్యా ఇది నీకోసం, నీ పని కోసం దాచిపెట్టిన డబ్బు, ఈ అవిటి శవం కోసం వాడుతున్నా ఏమి అనుకోకయ్యా” అంటూ ఆ అవిటివాడికి దహన కార్యక్రమాలు చేశాడు. ఆ అవిటివాడి చితిలో “దయలేని, దయామయుడు, జాలి చూపని ఓ కరుణామూర్తి నీ దయా జాలికి ఎంతో నేర్పు, నీ భక్తులను ఎవరు అవమానిస్తున్నా, నీవు మాత్రం అన్నీ లెక్కలు వేసుకొని చేస్తావయ కదయ్యా” అంటూ తన కుటుంబాన్ని తలచుకొని, గుక్కపట్టుకొని ఏడుస్తున్నాడు, అతని బాధ ఎందుకో నాకు తెలుసు, అతని అసంతృప్తి ఏమిటో నాకు తెలుసు, అతనికి కావలసింది ఏంటో నాకు తెలుసు, సాంబయ్య కోసం ఈ శివయ్య వెళ్ళవలసిన సమయం వచ్చింది. రోజులు గడిచాయి, మళ్ళి సాంబయ్య గుడి దగ్గర చెప్పులు తీసుకుంటూ “తెలిసోతెలియకో, ఎన్నో సార్లు నిన్ను దూషిస్తే నన్ను క్షమించు శివా! నా మొరని,బాధని, నీకు తప్ప ఎవరికీ చెప్పాలి “ అంటూ పాడుతున్నాడు. ఇచ్చిన చిల్లర తీసుకొని భద్రపరుస్తున్నాడు. ఈ చిల్లర ఎందుకు భధ్రపరుస్తున్నావు అన్న ప్రశ్నకు “మన ఊరిలో ఆచారం తెలుసు కదా స్వామి, శివరాత్రి రోజున స్వామికి విగ్రహానికి జరిగే ఊరేగింపులో స్వామి యొక్క పెద్ద విగ్రహానికి చెప్పులు వేస్తారని, ఈ సారికి మన పంతులుగారి దయవల్ల ఆ చెప్పులు నేను స్వయంగా తయారుచేసి, మంచి లోహాలతో స్వామికి సమర్పించాలి” అందుకే ఈ పొడుపు.....
సాంబయ్య కోసం ఎవరు ఊహించని లీల ఒకటి చేశాను.
సాంబయ్య చేసిన పొదుపు అంతా తీసుకొని, నాకు శివరాత్రి రోజు జరిగే ఉత్సవంలో నీ పాదాలకు చెప్పులు కుట్టి అ ఉత్సవం తిలకిద్దామని అనుకుంటున్నాడు. ఇంతలో ఆ గుడికి అ ఊరు మహారాజు తన పరివారంతో వచ్చారు. ఆ మహారాజు తన పరివారం పాదరక్షలను చెప్పుల సాంబ భద్రపరిచాడు. రాజు వచ్చినా పూజ చేసుకొని ఆలయ అర్చకులతో మాట్లాడుతున్నడు. “పంతులుగారు శివరాత్రి దగ్గరపడింది కదా, ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఇకపోతే అయ్యవారిని పెళ్ళికొడుకుగా అమ్మవారి దగ్గరకి తీసుకుపోయేటప్పుడు అయ్యవారికి చేసే చెప్పులు సిద్ధమా?”, పంతులుగారు “అది సాంబయ్య సిద్ధం చేస్తాడు. మహారాజు పరివారం అంతా సాంబయ్య దగ్గర పెట్టిన చెప్పులు తీసుకొని వెళ్ళిపోయారు.
మహారాజు కూడ వచ్చాడు. వచ్చి సాంబయ్యతో “సాంబయ్య నేను నిన్ను ఎన్నో సంవత్సరాల నుండీ చూస్తున్నా. నీవు ఎందుకు ఎవరినీ డబ్బులు అడగవు. నా పరివానానైనా?”
సాంబయ్య “సామీ నాకు రాజు పేద తేడా లేదు. ధనధాన్యాలపై అశలేదు. నాకు కావలసింది ఆ మహారాజు మహాదేవుడే, ఆయన తప్ప నన్ను ఎవరూ స్థిమితపరచలేరు”
రాజు “సాంబయ్యా! నీవు ధన్యుడవు నీకున్న వైరాగ్యమే భగవంతుని మీద ప్రేమ. అవును. ఈసారి ఉత్సవాలకు చెప్పులు కుట్టావా?
సాంబయ్య ”ఆ పనిలోనే ఉన్నా ఇంక కొన్ని సేకరించి ఉత్సవం మొదలయ్యేసరికి తీసుకువస్తాను. సామీ”
రాజు “నీకేమైనా కాఆలా?”
సాంబయ్య” నాకేం వద్దు రాజా, వారిని చూడు. ఆ అవిటివారు వారికి ఏమైనా సాయం చేయి.”
రాజు “ ఏం చేయను సాంబా?”
సాంబయ్య “ ఏ పుణ్యమో శివయ్య నీకు అన్నీ ఇచ్చాడు. వీరికి జీవనానికి సాయం చేయి వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయి అలాగే అలాంటివారికి చిన్న సత్రం లాంటిది నిర్మించు ఆ శివయ్య తప్పక ఆనందిస్తాడు. రాజు “అలాగే సాంబయ్య, నీ కోరిక నెరవేరుస్తాఅను. నీకు కూడా ఏమైనా కావాలా?”
“నాకేం వద్దు సామీ”
రాజు “అవును నీ కుటుంబానికి ఏమీ వద్దా?”
సాంబయ్య “నా కుటుంబాన్ని శివయ్య ఏనాడో తీసుకువెళ్ళాడు.” అంటూ ఏడుస్తున్నాడు సాంబయ్య.
సంబయ్య మన్సు చూసి రాజు మనసు కదిలింది.ఉత్సవంలో కలుద్దామని వెళ్ళిపోతూ అవిటివారందరినీ సత్రానికి తరలించమని ఆజ్ఞాపించాడు.
అక్కడ ఉన్న అవిటివారు “సాంబయ్యా! నీ పుణ్యమా అని మాకు నీడనిచ్చి ఆకలి దప్పికలు లేకుండా చేశావు.” అంటూ తనని ఆశీర్వదిస్తున్నాడు. ఇక శివరాత్రి దగ్గర పడింది.
సాంబయ్య తను చేసిన పొదుపుతో చావడికి వెళ్ళి పట్టణంలో పంచలోహాలన్నీ కొన్నాడు.
సాంబయ్య “స్వామీ శివా! నీకు ఈసారి ఎవరూ కుట్టలేనంత అందంగా కుడతాను. నీకు మంచి చెప్పులు కావాలి కదయ్యా, స్మశానంలో తిరుగుతావు. నీవు పొరపాటున కాలే నిప్పు మీద కాలేస్తే నీకు కాలు నొప్పి పుట్టి గాయం అవ్వదా? నీవు అందర్నీ చూస్తూ ఉంటావు. నిన్ను ఎవరు చూస్తారు? నీ గాయానికి మందు ఎవరు ఇస్తారు?” అంటూ చెప్పులకు సరిపడ సామాన్లు అన్నీ తీసుకొని తన కుటీరానికి పయనమయ్యాడు.
ఊరంతా ఉత్సవంగా ఉంది అందరూ శివరాత్రి ఆనందంలో ఉన్నారు. సాంబయ్య కూడా ఆనందంగా ఉన్నాడు. ఈ సారి తను కుట్టిన చెప్పులు నేను వేసుకుంటానని. జోరున వర్షంపుడుతుంది. మార్గమధ్యంలో ఉన్న సాంబయ్య తలదాచుకోవడానికి ఏమీ దొరకలేదు.
“ఆగితే చెప్పులు ఉత్సవానికి అందించలేనేమో శివయ్యా అనుకుంతూ బయలుదేరాడు. “ పరీక్ష కకపోతే అన్నీ సామాన్లుకు కావాల్సిన డబ్బులు ఈరోజే సమకూరాలా? ముందు వచ్చి ఉంటే ఈ పాటికి అందంగ చెప్పులను కుట్టేవాడిని కదా అనుకుంటూ వెళ్తుంటే సాంబయ్యకాలికి పెద్ద ముల్లు గుచ్చుకొని గాయం అయ్యి రక్తం వచ్చింది. ఆ గాయం వైపు చూస్తూ “నాకు ఏ గాయమైనా నీ పాదాలకు చెప్పులు కుట్టీ తొడిగేంత వరకూ నేను చెప్పులు తొడగను శివా అంటూ తన కుటీరానికి చేరాడు. వర్షంలో తడిసి ముద్దైన సాంబయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది.
అంతే కూలబడిపోయాడు.
చెప్పుల సామగ్రి అంతా పోయి ఒక మూల పడిపోయింది. ఒళ్ళు కదలని జ్వరం వచ్చింది సాంబయ్యకీ, స్పృహ తప్పుతున్న సాంబయ్య మంచం మీద వాలి ”శివయ్యా నీకు చెప్పుల మొక్కు ఎలా తీర్చుకోవాలి? అంటూ స్పృహ తప్పాడు.
కాసేపట్లో ఉత్సవం మొదలవుతుంది.
“రాజా! చెప్పుల శివ సాంబయ్య తెచ్చే చెప్పులు తన స్వహస్తాల మీదుగా నాకు తొడగనివ్వు. ఎంత అవాంతరం వచ్చినా ఉత్సవం కొనసాగించండి.” అనేసరికి రాజుగారు నిదురలేచారు. అది నేను కలలో రాజుకు వేసిన ఆజ్ఞ. రాజుగారు లేచి వెంటనే ఉత్సవవిగ్రహం దగ్గరకి వెళ్ళాడు. పంతులుగారు అందరూ ఉత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపు సిద్ధం రాజు గారు తన కలను అందరికీ చెప్పాడు. అందరూ విస్తు పోయారు.
“ఎక్కడున్నాడు సాంబయ్య?” అన్నారందరూ
స్పృహ తప్పిన సాంబయ్య కళ్ళు తెరిచాడు. సాంబయయ్ కీ తన కుటీరంలో ఏదో వెలుగు కనబడింది. ఓపిక చేసుకొని లేచాడు కొంచెం. సాంబయ్యకి త్రిశూలనీడ కనబడింది. ఆ వెలుగులో ఎవరో చెప్పులు కుడుతున్నట్లు నీడ కూడా కనపడింది.
సాంబయ్యకి ఏమీ అర్థం కాలేదు.
అది ఏమన్నా కలా అని చూస్తున్నాడు.
మంచం మీద నుండి లేవబోయి కింద పడ్డాడు. సాంబయ్య. కింద పడి అటుగా చూస్తే నేను సాంబయ్య నోరు తెరిచి చూస్తున్నాడు. సాంబయ్య తెచ్చిన సామగ్రి తీసుకొని క్రింద కూర్చుని ఒక కాలు ముందుకు పెట్టి త్రిశూలాన్ని నిలబెట్టి సాంబయ్య మనసులో ఏవిధంగా అనుకున్నాడో ఆ విధంగా పాదరక్షలు సిద్ధంచేస్తున్నాడు.
సాంబయ్య కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగ వస్తున్నాయి.
“శివయ్యా నా మొక్కు నువ్వు తీర్చావా? నీ మొక్కు నీవే తీర్చుకుంటున్నావా?” అంటున్నాడు. ఎందుకో భోరున ఏడుస్తున్నాడు.
పార్వతీదేవి నోరు తెరిచి చూస్తోంది. నంది కళ్ళ్వెంట నీళ్ళు బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నాడు.
విష్ణుదేవుడు, మహాదేవుడు భక్తుల కోసం ఏదైనా చేస్తాడు”
అన్నట్లు చూస్తున్నాడు.
నడవలేని సాంబయ్య నేలమీద నుండి దేకుతూ వచ్చి నిశ్చేష్టుడై చూస్తున్నాడు. నేను “చూడు సాంబయ్యానా గురించి ఎవరూ పట్టించుకోవట్లా చూడు న కాలికి ఎంత గాయం అయిందో అని ముందున్న కాలిని చూపించాడు. సాంబయ్య తన కాలిని చూసి గాయం లేదని నిర్థారించుకొన్నాడు. “నువ్వు ఏదో చెప్పులు కుట్టి నాకు ఇస్తావు అనుకుంటే నీకు ఓపిక లేదుగా అందుకే నేను కుట్టాను చెప్పులు.
సాంబయ్యా స్పృహ తప్పాను స్వామీ, లేకపోతే నేనే కుట్టేవాడిని. అంటున్నడు తల ఊపుతూ నేణు ఏమీ ఫరవాలేదులే, నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టావు నేను ఏమన్నా అనుకున్నానా చెప్పు.” కరుణకైనా దేనికైనా హద్దు ఉంటుంది స్వామీ కానీ నీవు నా కోసం” అని ఏడుస్తున్నాడు. అటు దేకుతూ వెళ్ళి పసరు తెచ్చి నా కాలికి పూస్తున్నాడు.” క్షమించు సామీ నాకు స్పృహ లేదు.
నేను “చెప్పులు బాగా కుట్టానా సాంబయ్యా! నీవు అనుకున్నట్లు”
సాంబయ్య “ ఆ కానీ…..”
నేను “ చెప్పు సాంబయ్య కానీ”, సాంబయ్య “స్వామీ, నీకు చేతకానిది ఏదయ్యా? ఇన్ని లోకాలను సృష్టించావు, కనబడే నక్షత్రాలు ఏ ఆధారంతో ఉన్నాయి, అలాంటిది నీకు ఈ జత చెప్పులు కుట్టడం లెక్కా, మరి”, నేను “సాంబయ్య, నువ్వు అనుకున్న విధంగా ఆ చెప్పుల మీద సాంబయ్య అని కూడా రాసినట్టు కుట్టు ఉంది, చూడు “. సాంబయ్య అది చూసుకొని “శివయ్యా, ఎన్నోసార్లు నిన్ను దూషించా నన్ను క్షమించు, మహామహా తపస్సు చేసినవారికి కనిపించవు కదా స్వామి, మరి నాకు కనిపిచావు, నా మీద నీకు ఏ కోపం లేనట్లేగా, అన్నాడు అమాయకంగా “కోపం ఎందుకు సాంబయ్య, నీవు అన్న ఏ మాటలోను తప్పు లేదు, నేవు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఇక వెళ్లు సాంబయ్య నీ మ్రొక్కు తీర్చుకో, ఉత్త్సవానికి వేళయ్యింది”, సాంబయ్య” నీవు యాడికి పోవుగా ఈడనే ఉంటావుగా, ”నేను” ఇక మీద నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు, వెళ్లి నీ స్వహస్తాలతో నాకు చెప్పులు తొడుగు. నిన్ను ఎవరూ ఆపరు,”సాంబయ్య” శివుడు వచ్చే, మ్రొక్కు తీర్చే” అనుకుంటూ పాడుతున్నాడు. ఉత్సవం జరిగే చోటు రాజుగారు “ఏడి చెప్పుల శివ? అతగాడి పుణ్యమా అని నేను శివవాణి విన్నాను”. భటులను పంపండి, సాంబ కోసం”, ఆలయంలో వేరొక అధికారి “ఊరేగింపు మొదలెడదాము, మళ్ళీ వేళ దాటుతుంది, సాంబయ్య ఎట్లాగో వచ్చినప్పుడూ చెప్పులు వేస్తాడు. ఆ తంతుకి సమయం ఉంది కదా?”, రాజుగారు మాత్రము “సాంబయ్య వచ్చే దాకా ఉత్సవం మొదలైన ఊరేగింపు మొదలు కాదు” అన్నాడు ఆజ్ఞ వేసినట్లు. సాంబయ్య ఆ జత చెప్పులను తీసుకొని, ఇక శివయ్య చెప్పులు వేసుకుంటాడు. ఆ చెప్పులో సాంబయ్య అని కూడా నా పేరు ఉంది, నా మ్రొక్కు తీర్చుకున్నా అని ఆనందపడుతున్నాడు. కానీ శివయ్య నువ్వే నిజమైన నేస్తానివి. సాంబయ్యకి మాత్రము జ్వరం అంతే ఉంది తనలో ఓపిక క్షీనించుకొని పోతుంది. అతికష్టం మీద అడుగు పడుతుంది. కళ్ళు మూతపడుతున్నాయి. సాంబయ్య తూలుతున్నాడు, కిందపడుతున్నాడు. అతని లక్ష్యం నన్ను చేరుకోవడమే అదే నాకు చెప్పులు వెయ్యడమే. సాంబయ్య “స్వామి ఇక నీవు స్మశానంలో తిరిగిన నాకు ఏమి కాదు, ఎందుకంటే నీకు చెప్పులున్నాయిగా, ఈ రోజు నీకు పెళ్ళి కదా, పార్వతి మాత కూడా సంతోషిస్తుంది, ఎంతోమంది దణ్ణం పెట్టుకునే నీ పాదాలకు ఇక ఏ గాయాలు కావు. శివుని ఆజ్ఞ లేనిదే చెప్పులు కూడా కుట్టలేము” అంటూ గానం చేస్తున్నాడు. కానీ సాంబయ్యకి స్పృహ తప్పుతుంది, దూరం నుండి సాంబయ్యకి ఉత్సవం జరిగే చోటు కనబడుతుంది. అక్కడ ఎవరికీ తోచిన వారు పండగలాగా బాణాసంచాలు,పాటలు,నృత్యాలలో మునిగి ఉన్నారు. సాంబయ్య అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి కూలబడ్డాడు. మళ్లీ లేచి “శివయ్యా చెప్పులు కుట్టింది కూడా నీవే, కనీసం, నీకు చెప్పులు వేసి అయిన నా మ్రొక్కు తీర్చుకుంటా అంటూ ఎంతో ఓపిక చేసుకొని నడుస్తున్నాడు. మొత్తానికి ఉత్సవం మొదలయ్యింది. అక్కడ కొంతమంది “శివయ్యకి పూజచేస్తే ఇష్టము, నృత్యం అన్నా మరీ ఇష్టము, అందుకే అయన ముందు ఆనందంగా నర్తిద్దాము” అంటూ నృత్యం చేస్తున్నారు. “శివరాత్రి పండుగ చూడాలంటే మన ఊరిలోనేరా” అంటూ అక్కడి జనాలు వాళ్ళ ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎలాగో సాంబయ్య ఉత్సవం ముందుకు వచ్చాడు. చెప్పులసాంబ వచ్చాడు అని అక్కడ భటులు ఆ వార్తని రాజుగారికి చేరవేశారు. కాని సాంబయ్య కళ్ళు నా ఉత్సవ విగ్రహం కోసం వెదుకుతున్నాయి.
రాజు, పంతులుగారు చెప్పులసాంబ దగ్గరికి వచ్చారు. సాంబయ్య మాత్రం స్పృహ తప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజుగారు “సాంబయ్యా నీ పుణ్యమా అని శివుడు నాకు కలలో “ అని మొత్తం చెప్పాడు. సాంబయ్యకి అర్ధం అయ్యింది. ఇప్పుడు తన చేతులతోనే నాకు చెప్పులు తొడగవచ్చు అని. సాంబయ్య ఎవరితో ఏమి మాట్లాడలేకపోతున్నాడు. ఎదురుగా కనబడింది సాంబయ్యకి నా విగ్రహం. అందరికీ విగ్రహం ఐతే సాంబయ్యకి మాత్రము సాక్షాత్తు నేనే కనబడుతున్నాను. సాంబయ్య గుండె “హరహర” అని అంటుంది. సాంబయ్యకి అడుగులో తడబాటు వల్ల నడవలేకపోతున్నాడు. కిందబడిన సాంబయ్య నన్ను చూసి “శివయ్యా, ఇంత వరము ఇచ్చావా? నేను ఏనాడు నీపూజ జేసి ఎరుగను, ఏనాడు నీమీద స్తుతి చేసి ఎరగను, అంటూ ముందుకు నేలమీద దేకుతూ వస్తున్నాడు. శివయ్యా నేను నీవద్దకు వస్తాను అని నేల మీదనుండి వస్తున్నాడు. అందరికి ఏమి అర్ధం కావట్లేదు. చూసేవారు అందరూ సాంబయ్యకి మహాదేవుడు కనబడ్డాడా? అని అనుకుంటున్నారు. రాజుగారు మాత్రము ఉత్సవ విగ్రహం వైపు చూస్తున్నారు, కానీ వారికి విగ్రహమే కనబడుతుంది. సాంబయ్య చిన్నగా నా దగ్గరికి వస్తున్నాడు, వచ్చాడు.. సాంబయ్య “స్వామీ, ఉత్సవంకి ఆలస్యం అయ్యింది, నన్ను క్షమించు స్వామీ?” నేను “తప్పుచేసిన వారిని క్షమించాలి, నీవు ఏమి తప్పు చేశావు?” సాంబయ్య ఏదో వెతుకుతున్నట్లు తన దగ్గర దాచిన ఏదో పొట్లం బయటకు తీశాడు. ఆ పొట్లంలో నుండి గాజులు బయటకు తీశాడు. ఇంకా పసుపు, కుంకుమ కూడా ఉంది. సాంబయ్య “స్వామి మనం మగపెళ్ళి వారము కదా, ఉత్తచేతులతో ఆడపెళ్లి వారి దగ్గరకు వెళ్ళకూడదు, ఇది నీ చేత్తో అమ్మగారికి ఇచ్చి, గాజులు తొడుగు”. నేను “తప్పకుండా సాంబయ్య, ఇవి లేకుండా ఆలస్యం అంటే ఎలా, వీటి కోసమే చూస్తున్నా”
సాంబయ్య “ఆ ....ఆ ..అవును”
నేను “సాంబయ్య చెప్పులు ఏవి”
సాంబయ్య “ఇదిగో స్వామి, అంటూ రెండు చెప్పులు తీసి నా పాదాలను పట్టుకొని నమస్కారం చేసి ఒక్కఒక్క పాదానికి చెప్పులు తొడిగాడు.
నేను “సాంబయ్యా నీ మ్రొక్కు తీరిందిగా”
సాంబయ్య “తీరింది స్వామి, మహేశా, సురేశా, పాపవినాశ” అంటూ పాడుతూ తలను నా పాదాలపై వాల్చాడు. “చల్లని స్వామి, ఏది ఎందుకు చేస్తావు, ఈ నిమ్నభక్తుడి మీద ఎందుకు అంత దయ, అంటూ భోరున ఏడ్చి, ఒక్కసారి తలపైకి ఎత్తి, నా మొహాన్ని చూశాడు.
నేను “చెప్పు సాంబయ్య ఏమికావాలి”
సాంబయ్య “నాకు ఏమి వద్దు, నీ దగ్గర ఉంటే చాలు” అంటూ నన్ను చూస్తూ నా పాదాలపై తలవాల్చాడు. సాంబయ్య భౌతికంగా చనిపోయాడు. అందరూ ఆ సంఘటనని హృదయ విదారకంగా భావించి సాంబయ్యని తలుచుకున్నారు. ఆటంకం వచ్చినా ఉత్సవం జరపండి అన్న నా మాట రాజుగారికి అర్ధం అయ్యి, ఉత్సవం మొదలుచేసి ఊరేగింపు కొనసాగించారు. సాంబయ్య పార్థివ దేహాన్ని జాగ్రత్త చేశారు రాజు మరియు అతని భటులు. “మహాదేవుడి దర్శనం చేసుకున్న సాంబయ్య ధన్యుడు” అంటున్నారు రాజు మరియు అందరూ....
ఊరేగింపు సాగిపోతుంది. సాంబయ్య పార్థివ దేహానికి కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఊరేగింపులో అందరికీ సాంబయ్య శివుడికి వేసిన చెప్పులు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు అయినా ఇంత బాగా చెప్పులు కుట్టిన పనివాడిని ఎక్కడ చూడలేదు అని కొంతమంది అంటున్నారు. సాంబయ్య శవాన్ని రాజపరివారం చూసుకుంటారు, మనం తిరునాళ్ళ చేసుకుందాం అంటున్నారు. శూస్యం...మోక్షస్థితి....యదార్ధస్థానం... కళ్ళు తెరిచాడు సాంబయ్య. సాంబయ్య ఆత్మ అన్ని రకాలుగా మోక్ష అర్హత సంపాదించుకుంది. సాంబయ్య కి శూన్యం తప్ప ఏమి కనబడుటలేదు. ఆ శూన్యంలో ఒక పెద్దవెలుగు నా రూపంలో అతనికి కనబడింది. సాంబయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. నేను సాంబయ్య, ఇదే ఆత్మ యొక్క యదార్ధస్థితి, నీవు జన్మరాహిత్యం పొందావు. మోక్షాన్ని సాధించావు. నీ నిశ్చలమైన వైరాగ్యభక్తితో, నన్ను పొందావు, అందుకే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను, చెప్పానుగా ఇక మీద నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు అని , సాంబయ్య “ఆ..ఆ... “కళ్ళవెంట నీరుతో ... నేను “సాంబయ్య నీ ఇష్టదైవాన్ని నేను కాబట్టి నీకు ఈ రూపంలో నేను దర్శనమిచ్చాను, ఎవరు ఎట్లా పూజించినా, వారికీ అలానే దర్శనం ఇస్తాను, అటువంటి భక్తి పదార్ధాన్ని నేను”, సాంబయ్య “మనసంతా ఆనందంగా ఉంది సామి,” నేను “దీనికే ఇంత ఆనందపడితే, ఇక నాలో లీనమైపోతే...” సాంబయ్య “వస్తున్నా సామి” అంటూ అడుగు ముందుకేశాడు. అడుగుఅడుగుకీ సాంబయ్యకీ. “మనస్సు బుద్ధి చిత్తం అహంకారం శివోహం” “భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని శివోహం” “పాపం పుణ్యం సుఖం దుఃఖం శివోహం” “తల్లి తండ్రి గురువు దైవం భార్య బిడ్డ, ఆస్థి,పాస్థి శివోహం” “ధర్మం అర్ధం కామం మోక్షం శివోహం” “ప్రేమ, రాగం, అసూయ, ద్వేషం, లోభం, మొహం, కామం, మధువు, మాత్సర్యం శివోహం” “వేదం, తత్త్వం, సంగీతం, కళ శివోహం” “అండ, పిండ, తేజ, బ్రహ్మాండం శివోహం” అంతా శివోహం.. చిదానంద ఈశ్వర శివోహం అన్ని సాంబయ్య అడుగడుగుకీ వినబడుతున్నాయి. ప్రతి మాటకీ అర్ధం అయినట్లుగా సాంబయ్య తల ఊపుతూ , నా రూపం లేని వెలుగు రూపాన్నే చూస్తున్నాడు. “అన్ని నీవే, అంతా నీవే శివా” అంటూ గానం చేస్తున్నాడు “ఇక నాలో లీనమైపోతా” అంటుండగా నేను “ఆగు సాంబయ్య, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఒకటి ఉంది” సాంబయ్య ప్రశ్నలు ఇప్పుడు అతనికి వినబడుతున్నాయి. ప్రశ్న:మనుషులను ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్లు, నిన్ను ప్రాధేయపడే వారిని భక్తులు అంటారు. సమాధానం:”అవును సాంబయ్య, ఇక్కడ ప్రాదేయపడేది లేదు, అందరిలో ఆత్మలాగా ఉంది నేనే కాబట్టి నన్ను నేనే అడుగుతున్నాను అది మోక్షమైన, కోరికైన, వరమైనా. సాంబయ్య తల ఊపాడు. అటు చూడు సాంబయ్య “నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నారో అంటూనే.. అటు చూశాడు. అంతే సాంబయ్య కుటుంబం ఎటువంటి ఆనందస్థితిలో ఉన్నారో చూశాడు, “నీకన్నా నీ కుటుంబాన్ని నేను బాగా చూసుకున్న చూశావా?”... ప్రశ్న: శరీరాన్ని జోలేగా భిక్షగా ఇవ్వు, వేరొకరు మోసం చేస్తే పగ పెంచుకుంటారు, నీవు ఏమి చేసిన ప్రేమ పెంచుకుంటారు, వేరొకరు చేస్తే తప్పు, నీవు చేస్తే లీల జవాబు: శరీరాన్ని ఇచ్చింది, ఆత్మసాధనకే, అదే నిజమైన భిక్ష సాంబయ్య నేను ఎవర్ని మోసం చేయను, జీవుల యొక్క పాపపుణ్యాలతో వారికి తలరాత ఇచ్చేవాణ్ణి మాత్రమే, పిలిస్తే పలికేవాణ్ణి మాత్రమే, నిజమైన భక్తికి లీలను చూపేవాడిని మాత్రమే, మీ ప్రార్థన పరాకాష్టకు చేరితే అన్ని కర్మలను దహించేవాడిని మాత్రమే. ప్రశ్న: స్మశానంలో ఉండే నీకు మడి మైల ఏందయ్యా.. జవాబు: అవును సాంబయ్య మడి, మైల, నాకు లేవు శుభ్రత, పరిశుభ్రత కోసం అది మీరు పెట్టుకున్న కట్టుబాట్లు. ప్రశ్న:నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకిన నాకేం పాపాలు జవాబు: అవును, సాంబయ్య నిజంగా వారి చెప్పులను తాకి, నీ నమ్మకంతో నీ కర్మలను ప్రక్షాళన చేశావు. ప్రశ్న: అవిటివాడి మరణ ఉదంతం జవాబు:సాంబయ్య, నీ కోరిక మేరకే, ఆ అవిటివాడికి జన్మవిముక్తి చేసి, వేరొక మంచి జన్మ ఇచ్చాను, కావాలంటే చూడు అంటూ వాడు , పూర్వ పాపాలు, వాడికి వేసిన శిక్ష మొత్తం చూపాను... సాంబయ్య, అవును సామీ, నీ తీర్పులో ఏ అన్యాయం ఉండదు. అపుడు నేను “సాంబయ్య, నా స్థానంలో ఉన్నవారు ఎవరైనా అంతే “ సాంబయ్య: నీ స్థానం నీకు మాత్రమే ప్రభూ”... ఇలా, సాంబయ్య మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది. నేను కరిగిపోయాను, నీ భక్తి నన్ను కదిలించింది. ఇది వరకు స్మశానంలో చెప్పులు లేకుండా తిరిగేవాణ్ణి, కానీ ఇప్పుడు నీ పుణ్యమా అని చెప్పులు వేసుకుంటాను అంటూ మందహాసం చేసి, మీ మాతా పార్వతి దేవికి నీవు ఇచ్చిన గాజులు చేరాయి, ఎంతగానో ఆనందపడింది, అంటూ .. పార్వతీదేవి తను తెచ్చిన గాజులను వేసుకొని ఉండి ఆశీర్వదించటం కనబడింది.. సాంబయ్య చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. నేను ఎంతగానో సంతోషపడ్డాను, నీవు ఏ వరం కోరిన నేను ఇచ్చేవాన్ని, కానీ నీలో కోరిక ఏమాత్రం లేదు వైరాగ్యమని నా మీద ప్రేమ తప్ప, అందుకే, నీవు మోక్షాన్ని పొందావు, వైరాగ్యమంటేనే, నా మీద ప్రేమ, ఆ మీద నీవు ఎప్పుడూ ప్రేమను చూపుతూనే ఉన్నావు , ఎన్నో భక్తి మార్గాల్లో నీవు చూపిన ప్రేమ మార్గం ఒకటి” సాంబయ్య “ధన్యుడిని సామీ, ఇక ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను,” సాంబయ్య, అంతా ఒక అణువులాగా కనబడింది, ముందుకు సాగుతూ సాంబయ్య “శంభో అంటే చాలా స్వామి, భంభం అంటే చాలా స్వామి, “ అంటూ ఆనందస్థితిలో పాడుతూ నా చెంతకు చేరాడు, సాంబయ్య ఆత్మను జ్యోతిరూపంలోకి మార్చాను, కర్పూర హారతి ఇచ్చినట్లు, ఆ జ్యోతి నా చుట్టూ తిరిగింది,”శివ శివ హర శివ శివ హర , హర హర శివ “ అంటూ ఆ జ్యోతి నాలో లీనంయ్యింది, ఇప్పుడు సాంబయ్య కూడా శివుడు అయ్యాడు సాంబయ్య ఆత్మలో శివునిలో లీనమయిన తర్వాత తను చేసిన శివధ్యానం అంతా గుర్తుచేసుకున్నాడు, చివరికి తన కోసం నేను చెప్పులు కుట్టింది గుర్తు చేసుకొని, ఇక పూర్తిగా ఆ ఆత్మ పదార్ధం, ఈ పరమాత్మ పదార్ధంలో విలీనమయింది. అంతా శివమయం...శివోహం...శివం....(కధలు కొనసాగుతాయి...)
No comments:
Post a Comment