రుద్రదండం(జానపద నవల )
- ఫణి రాజ కార్తీక్
చీకట్లు కమ్ముకున్న ఒక లోయ. వందల డేగల ఘీంకారాలు, నక్కల ఊళలు దూరం నుంచి ఒక జ్వాల కనపడుతుంది. జ్వాల మాటిమాటికి తగ్గి పెరిగిపోతుంది. సరిగ్గా అప్పుడు జ్వాల ఎదుట మాంత్రిక సామ్రాట్ ప్రత్యక్షమయ్యాడు. ఆగ్రహావేశాలతో ఏవో మంత్రాలు ఉచ్చరించాడు. అంతట ఆ జ్వాల ఒక ద్వారం లాగా తెరుచుకుంది. ఆ ద్వారంలో అడుగు పెట్టాడు మాంత్రికుడు. అంతా, ఒక్క నిమిషంలో జరిగిపోయింది. మాంత్రికుడి రాకతో ఆ ద్వారంలో నుండి తన స్థావరం అయిన గుహ బైట పడింది. ఆ స్థావరం గగుర్పాటుగా ఉంది. ఎదురుగా 100 అడుగుల శుద్రదేవి విగ్రహం ఉంది. ఆ మాంత్రికుడు శుద్రదేవికి నమస్కరించి “మాతా, మరొక రోజు వ్యర్ధమైనది, ఎలా ఎలా?“ అని అన్నాడు. మాంత్రికుడు నడుస్తూ ఆ విగ్రహం వైపు కదులుతూ ఉండగా అటు ఇటు బందీలై ఉన్న పిశాచాలు, దెయ్యాలు, భూతాలు ఆ మాంత్రికుడికి జయధ్వని ఇలా చేయసాగాయి. “మహామంత్ర ద్రష్ట, శుద్రసామ్రాట్, కపాలద్రష్ట, కాబోవు అజరామర దైవం మార్తాండ కపాలుడు జయహో”. మందహాసం చేసి ఆ మాంత్రికుడు “అలా అయిన వెంటనే మీకు శాప విమోచనం, దేవతల స్థానం ఖాయం అన్నాడు. మాంత్రికుడి సేవకుడైన మరుగుజ్జు ‘డి౦భకుడు’, ’వచ్చే వచ్చే’ అని మాంత్రికుడి దగ్గరకి ఫలరసం తెచ్చాడు. అది తాగిన మాంత్రికుడు “’డింభకా, ఆశలు లేవురా, ఏమియు తోచటలే, చిరంజీవినై సృష్టి పరిపాలించదలచిన ఈ మార్తాండ కపాలికి దారులు ఏమి గోచరించుట లేదు అని నిరాశ పడ్డాడు. డింభకుడు – “ప్రభూ! ఏమిటి అది నేను ఎప్పటి నుంచో అడగటానికి ప్రయత్నిస్తున్న” అని అన్నాడు. ”డింభకా నా నేస్తానివి నువ్వు, నీకు చెప్పుట సమంజసమే“, అని శుద్ర దేవికి మ్రొక్కి, ప్రళయహాసం చేసి, మాతా “ఈ సృష్టిని పాలించుటకు పుట్టిన వాడిని నేను, అందుకే నా విద్యలతో గత 1000 సం||లుగా బ్రతికి ఉన్నాను. ఒకానొక యక్షిణి ని నేను బంధించగా, తను నాకు ఈ విషయం చెప్పింది. మా గురువుగారు కూడా అది సాధించామని చెప్పారు. అవి ఎలా సాధించాలి, సాక్షాత్తూ పరమేశ్వరుడు శక్తి ఆపాదించిన ఆ మంత్రదండాలు ఎన్ని, అవి ఎక్కడ ఉన్నాయి? నా ఊహాశక్తికి, నా తపోశక్తికి అందుట లేదు, ఎలా, అవి ఎక్కడ, వాటి జాడ తెలుపు“ అని 100 అడుగుల శుద్రదేవి విగ్రహం ఎదుట గర్జి౦చాడు” మాంత్రికుడు. అప్పుడు డింభకుడు వణకగా, ”డింభకా! నా మాయా దర్శిని తీసుకురమ్ము” అని ఆజ్ఞాపించాడు. వేగిరంగా వెళ్లి డింభకుడు దానిని తెచ్చి తెరిచాడు. ఏవో మంత్రాల చదివిన పిమ్మట “డింభకా, ఇది మాయాజాలమున సృష్టించిన దృశ్యం. జరిగినది నీకు చూపుటకు ఇది చేసితిని, చూడుము“ అని అన్నాడు. డింభకుడు ఆ దర్పణం లోకి చూస్తూ “ప్రభూ ఏమిటి ఇది?“ అన్నాడు. ”నేను సృష్టికి ప్రభువుని కాగల సామర్ధ్యం ఎదో అవి ఏంటో చూడు” అని అన్నాడు. ఆ విచిత్ర దర్పణంలో దృశ్యం మొదలైయి౦ది.
“అది ఒక మహా స్మశాన౦ భూత ప్రేత గణాలు ఘీంకారం చేస్తున్నాయి. ఆ స్మశాన౦లో ఎన్నో వింతలకి తావు ఉంది. సరిగ్గా స్మశాన౦ మధ్యలో ఏవో పిలుపులు, ఉచ్చరణలు. అటుగా పోతున్న ప్రేతాలు ఆరాధనా భావంతో ఒక స్త్రీ వైపు ఒక పురుషుడి వైపు చూస్తున్నాయి. ఏవేవో తంత్రాలు వినిపిస్తున్నాయి. ఎవరా అని ఆరా తీస్తే త్రిశూల ఛాయలో త్రిశూలంతో ఒంటినిండా భస్మం పూసుకున్న శివుడు ఎదురుగా దీర్ఘాలోచనతో సతీమాత. శివుడు ఏవేవో ఉచ్చరించి స్మశాన౦లో ఉన్న అస్తిపంజరాలకు సతీమాతకు చూపటానికి కొన్ని శక్తులు ఆపాదించాడు. సతీమాత మనసు మాత్రం ఎక్కడో ఉంది .”సతీ! నీవు అడిగితేనే కదా నేను నీకు తంత్ర విద్యని నేర్పటానికి అంగీకరించి సిద్ధం చేసింది. కాని నీవు మాత్రం చంచల వలే ప్రవర్తిస్తునన్నావు. దృష్టి పెట్టి నా కనుల వైపు చూస్తూ తీక్షణతను గ్రహించు, విద్యను నేర్చుకో. నీ తపస్సు పూర్తి అయ్యి నీవు ఆదిశక్తి రూపాన్ని సంతరించుకున్న పిమ్మట నీకు అంతా బోధపడుతుంది“ అని అన్నాడు రుద్రశివుడు. తల ఊపింది సతీమాత. మళ్ళీ మొదలుపెట్టాడు తంత్రాన్ని శివుడు. కాని సతీమాత శ్రద్ధ కనపరుచుటలేదు. దాంతో పరమేశ్వరుడు “సతీ! ఒకింత శ్రద్ద సైతం ఏంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధ ఉన్న విద్య వెంటనే వస్తుంది”. అలా చెప్పినా సతీమాతలో పరధ్యానం అలానే ఉంది. ఇలా చాలా సార్లు చేసింది. వెంటనే ఆ మహాస్మశాన౦లో తన తీక్షణతో పెద్ద వెలుగుని సృష్టించాడు శివుడు. విద్యుత్ ప్రవాహం వలే వచ్చిన ఆ కాంతితో సతీమాత నివ్వెర పోయింది. ఏమిటి ఈ ఆలోచన సతి అని శివుడు పలికెను. సతీమాత “ప్రభూ! నా తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు కదా! దానికి వెళదామా” అని అంది. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు సతి అది ఎవరైనా, ఇప్పుడు అది నీ పుట్టినిల్లు కాదు, నీవు కైలాస రాణివి, ఇక్కడే ఉండు, పిలుపు వస్తే పోదాములే“ అని శివుడు మంత్ర తంత్ర విద్యని నేర్పసాగాడు.”ప్రభూ! నా తండ్రి మిమ్ము అవమాని౦చింది నిజమే! అయినా క్షమించరా ప్రభు అని వేడుకుంది”. శివుడు “ దక్షుడు నన్ను ఏమి అన్నా నేను పట్టించుకోను. అయినా నన్ను అవమాని౦చు వారు ఎవరు లేరు. వారు అన్నంత మాత్రాన నాకు ఏమియు కాదు, అయినా దక్షుడి అహంకారం పోవాలంటే అతని తల మారాలి “అని మళ్ళి విద్య నేర్పటం ఆరంభించాడు శివుడు, ఎట్లాగైనా శివుడుని ఒప్పించాలని, యజ్ఞానికి వెళ్ళాలని సతీమాత శివుడితో వాగ్వివాదానికి దిగింది. అన్నీ తెలిసిన శివుడు – “అక్కడికి వెళ్తే నీకు కీడు జరుగుతుంది” అని చెప్పినా సతీమాతా తన పట్టు కోల్పోకుండా వాదించసాగింది. అవన్నీ తర్వాత విద్యను అభ్యసించు అని సహనభావంతో శివుడు చెప్పసాగాడు. సతి యొక్క అక్కరలేని భావాలతో “శివుడు కోపించి నన్ను అవమాని౦చినా, దూషించినా ఒప్పుకుంటాను కాని విద్యలను నిర్లక్ష్యపరిచే వారిని క్షమించటం భావ్యంకాదు “ అని గర్జించాడు. సతీమాత తను ఎట్లాగైనా యజ్ఞం ముగించిన తర్వాతే విద్యను నేర్చుకుంటాను అని తను వెళ్ళకుండా ఆపితే తన మీద ఒట్టే అని గర్జించింది. దాంతో శివుడు కోపోద్రిక్తుడై త్రిశూలాన్నికదిలించి, నేలమీద గట్టిగా కొట్టాడు దాంతో, పరమేశ్వరుడు అస్తిపంజరానికి ఆపాదించిన శక్తులు ఉపసంహరిచుకోకపోగా, సతీమాత ఉద్వేగం వైపుచూసి నిలిచిన శివుడు ”పిలువని పేరంటానికి వెళ్ళిన నీ కథను జనులు ఉదహరించుకుంటారు. “నా మాట విను సతి“ అని ప్రేమగా చెప్పాడు. ”నా పుట్టిల్లు నన్ను ఏమి చేస్తుంది ప్రభూ” అని గద్దించి౦ది సతి. ఉద్వేగానికి లోనైన శివుడు, త్రిశూలం తిప్పి మూడు కోనలు భూమికి తాకించాడు. చిన్న భూకంపం వచ్చి, శక్తులతో కూడిన అస్తిపంజరం చిన్నాభిన్నమై జంబూద్వీపంలో భరత ఖండంలో దాదాపు ముక్కలు ముక్కలై పడింది.
ఇది చూసిన డింభకుడు ఆశ్చర్యంతో మాంత్రికుడు వైపు చూసాడు “ఆ మంత్ర దండాలు కావలెరా, వాటిని అన్ని సేకరిస్తే దానితో ఒక మహా మంత్రదండాన్ని చేయవచ్చురా, ఆ మంత్రదండమే “రుద్ర దండం” అది ఉన్నవాడు 14 లోకాలను పాలిస్తూ సాక్షాత్తు దేవుడు అవుతాడు. “అది సాధించాలిరా డి౦భకా“ అని తన గుండెల మీద చేతులతో సింహనాదం చేసాడు. ”సాక్షాత్తు శివుడే ఆ అస్తిపంజరానికి శక్తులు ఆపాదించి తీసుకొనుట మరిచాడు. అది నా కోసమే... హా హా హా“ అని మార్తాండ కపాలుడు అన్నాడు .
ప్రభూ మీ గూర్చి నా కసలు తెలియదు. మీరు వెయ్యేళ్ళు ఎలా బ్రతికారు, మీ గురించి దండం గురించి చెప్పండి. డింభకుడు “రుద్రదండం” గురించి మరింత అడగసాగాడు. అసలు ఈ రుద్రదండం మీకెలా తెలుసు? అని అడిగాడు మార్తాండుడిని. దానికి చెప్పసాగాడు మాంత్రికుడు “డింభకా! నేను పుట్టి వెయ్యేళ్ళు గడిచాయి. నేను ఒక బీదవాడిని, కాని ఐశ్వర్యం ఎలా తెచ్చుకోవాలి అని కలలుకనే వాడిని. ఒకానొకనాడు మా రాజ్యంలో యువరాణికి అంతుపట్టని జబ్బు చేసింది. అది ఎంత మందికీ అర్ధం కాలేదు. రాచరికం అన్నా రాజవైభోగం అన్నా నాకు ఎంతో ప్రీతి. రాజ్యం వారు ఒకవైపు చాటింపు వేశారు. ”ఎవరైతే రాణి పద్మిని దేవికి పట్టిన జబ్బుని నయం చేస్తారో వారికి అర్ధరాజ్యం ఇచ్చి యువరాణిని ఇచ్చి పెళ్లిచేస్తామని“ అయినను, నేను ఏమిచేయగలను అని భావించి ఎప్పటిలాగా అరణ్యం లోకి ఫలములను తెచ్చుటకు, మూలికలను సేకరించుటకు వెళ్ళాను. అలా సేకరిస్తుండగా, నాకు ఒక ఆర్తనాదం వినపడినది. అక్కడ ఒక అంధముని దాహం దాహం, ఆకలి అని రోదిస్తున్నాడు. నేను వెళ్లి ఆ మునిని చూసి, అతనికి పళ్ళు మరియు మంచినీరు ఇచ్చాను. దాంతో ఆ ముని “నీకేమన్నా వరం కావాలంటే కోరుకో, నీ సేవలకి తృప్తి చెందాను అన్నాడు. నేను “నీకు అంత శక్తీ ఉంటే నీవే నీకు కావలిసినవి సమకుర్చుకోవచ్చు కదా” అన్నాను. అప్పుడు అంధముని ఇలా చెప్పసాగాడు. “నాయనా! నాకు నా శక్తిని నేను ఉపయోగించుకునే భాగ్యంలేదు. విద్యలు ఉన్న గర్వంతో విర్రవీగిన నాకు, ఈ శాపం ఇచ్చారు. అని ఆవేదన వెలిబుచ్చాడు.
అయితే నేను నాకు నిలువెత్తు, బంగారం, ధనం అడిగాను. నీవు ఇంటికి వెళ్ళేపాటికి నీ ఇంట్లో ఉ౦టాయి అన్నాడు. నేను ఇంటికి వెళ్లి చూసే సరికి బంగారం, ధనం ఉన్నాయి. నా ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు రాత్రి నాకు నిదుర పట్టలేదు. ధనం ఉన్న నాకు, అది చాలదేమో అని తోచింది. అధికారం మీద ఆశ పుట్టింది. మూర్ఖులే కదా దొరికిన దానితో సంతృప్తిపడేది అనుకున్నాను. మరుసటి రోజు తెల్లవారగానే ఆ ముని ఉన్న దగ్గరకి వెళ్ళాను. ఆ అంధముని అక్కడే ఉన్నాడు. నేను ఇచ్చిన ఫలములను తింటున్నాడు. నేను ఇంకను కొన్ని తీసుకువెళ్ళి సమర్పించి నమస్కరించబోయాను. అతను నన్ను వారించి, ”నాయనా! ఇచ్చిన వాటితో సంతృప్తిపడు“ అన్నాడు. నేను ఆయనను మరొక్క వరము ఇవ్వవలసిందిగా కోరాను. అతను ససేమిరా కుదరదు అన్నాడు. నేను ఎంతో బ్రతిమాలగా ”నిన్న నేను పండ్లు ఇవ్వకపోతే మీరు మరణి౦చేవారు” అని గుర్తు చేసాను. ఆ అంధముని పరోపకారార్దం మరొకటి కోరుకో అనిచెప్పి “ఇంక ఇదియే చివరిది నా మనసు గ్రహించి ఇంక నన్ను నీవు కలువ రాదు“ అని షరతులు పెట్టాడు. కాని నా మనసులో అధికార దాహం బుసలు కొట్టసాగింది. సరే, ఒకే దెబ్బకు రెండుపిట్టలు అని తలచి “మా యువరాణి పద్మిని దేవికి జబ్బు చేసింది, అది తగ్గించే శక్తి నాకివ్వు“ అని అడిగాను. ఆ అంధముని “తధాస్తు” అని నన్ను మాయం చేసాడు. నేను మా రాజ్యం పొలిమేరలో ప్రత్యక్షమయ్యాను.
నా ఆలోచనలు మొత్తం రాజ్యం మీదే ఉన్నాయి. రాణి, ఆ అందాల రాశి నా సొత్తు అని ఆనంద పడసాగాను. పద్మిని దేవిని చూచుటకే మిగుల రాకుమారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అలాంటిది ఆ పద్మినినే నా దేవిగా మార్చుకుంటున్నాను అని సంబరపడ్డాను. అంతఃపురం దగ్గరకి వెళ్లి రాజభటులను ప్రశ్నించాను. వారు “ఇక , యువరాణి లేనట్టే“ అని అన్నారు. నేనొక మూలికా వైద్యుడనని చెప్పి “నేను ప్రయత్నిస్తాను” అని అన్నాను. ఆ భటులు నన్ను పరిహసించారు. కాని అటుగా వెళ్తున్న రాజోద్యోగులు నన్ను చూసి ఏ పుట్టలో ఏ పాముందో అనుకొని నన్ను లోపలికి తీసుకెళ్ళారు. అక్కడ రాజు, రాణి, సైన్యాధిపతి, రాజ పరివారము శోక సంద్రంలో మునిగి ఉన్నారు. వారి వద్దకు పోయి “నేను పద్మిని దేవికి వైద్యం చేయగలను అని చెప్పాను”. వారు కొంచం నిరాశావదనంతో ప్రయత్ని౦చు అనెను. కాని సేనాధిపతి మాత్రం అనుమానంగా నన్ను చూచెను. ”ఎంతో మంది వైద్యులు, ఋషుల వల్ల కానిది నీవల్ల ఎలా అవుతుంది” అని అనెను. ”అయ్యా! ఆలస్యం అయ్యే కొద్ది ప్రమాదం“ అనేసరికి, “నన్ను యువరాణిని వదిలిపొమ్మని“ అన్నాను. వారందరు బయటకి పోయి తలుపులు వేశారు. బయట ఎంతో బలగం ఉంది అని నన్ను హెచ్చరి౦చారు. నేను పద్మిని దేవిని చూసి తను మృత్యుఒడిలో ఉందని గ్రహించాను.
నేను వెంటనే ఆ అంధముని ఇచ్చిన వరమును ప్రయోగించాను. ఆ క్షణమే ఏవో రంగురంగుల ఛాయలు గల పాములు వచ్చి, రాణి దేహంలోకి వెళ్లి ఏవో పీల్చసాగాయి. అలా కొన్ని ఘడియల తరువాత ఆ పాములు మాయం అయ్యాయి. రాణి దేహం ఇప్పుడు జీవకళతో ఉట్టిపడి౦ది. యువరాణి కళ్ళు తెరచి “అమ్మా, నాన్న“ అంది. నేను వెళ్లి తలుపుకొట్టి, వాళ్ళని లోపలికి రమ్మన్న” వాళ్ళందరు రాణిని చూసి ఆనందోత్సాహానికి గురి అయ్యారు. వారు ఎంతో ఆనందపడ్డారు. నేను కాసేపు ఆగి, ”మహారాజా! మీరు చాటింపు వేసిన వరమును మరిచినారా?” అని అడిగాను. అక్కడ వారు, రాజపరిహారం వారు “చూస్తూ చూస్తూ రాణిని నీకెలా ఇస్తారు? ఆలోచించి, అర్ధరాజ్యం పాలించే భాగ్యుడవా నువ్వు?” అని వెక్కిరించారు. నేను, అది సబబు కాదు అని అన్నాను. కావాలంటే, కావలిసినంత ధనము, రాజ్యంలో హోదా ఇస్తామని ఆశపెట్టారు. రాజ్యకాంక్ష మారు, యువరాణి అందం ముందు అవి నాకు గడ్డిపరకవలె తోచాయి. నాకు ముందుగా ఇచ్చిన చాటింపు ప్రకారమే కావాలి అని గద్దించాను. అంతట సేనాధిపతి వచ్చి, ”రాజా! నేను ఇతని మాయని చూసాను, ఏవో సర్పాల చేత తంత్రం చేసాడు, ఇలాంటి వారు ప్రమాదకారులు“ అని నా గూర్చి చెప్పసాగాడు. యువరాణికి “శ్రీమన్నారాయణ రక్షాకవచం” ధరింపజేసారు. అది, ఏ శక్తీ ఏమీ చేయలేని కవచం అని, అది ఋషులు ఇచ్చారు అని అనుకున్నారు .
శ్రీమన్నారాయణ కవచం తొడిగిన తరువాత ఏ శక్తులు పీడించ లేవు. అలాగే, ఏదైనా పీడిస్తున్నపుడు అది తొడగకూడదు. కాని, నాకు ఏ మంత్రతంత్రాలు తెలియదు. వారు నన్ను మాంత్రికుడు అనుకున్నారు. వారిని ఏమైనా చేస్తానేమో అని అంతఃపురం చుట్టూ పురోహితులు, మంత్రద్రష్టల చేత మంత్రకవచాలు రూపొందించారు. నన్ను బంధించారు. స్వతహాగా బలిష్టుడిని కావటం వల్ల కొంత మందిని ఎదిరించాను. కాని ఎక్కువ సేపు ప్రతిఘటించలేకపోయాను. న్యాయం చెప్పవలసిందిగా రాజు గారిని మరొకమారు కోరాను. అయినా న్యాయం తెలుసుగనుకనే నీకు ధనం, హోదా ఇస్తామన్నాం. కాని నీవు దురాశ పడ్డావు, అని వెక్కిరించారు. రాణి గారు సైతం వెక్కిరించారు. నన్ను కొట్టి అవమానించారు. నన్ను బందికానాలో వేయమని సేనాధిపతి ఆజ్ఞాపించాడు. కాని రాణిని కాపాడానన్న భావనతో నన్ను అంతఃపురం బయట త్రోసేసారు. రక్తసిక్తమైన నామొహం, నా మదిలో అవమానభారంతో రాజ్యం దాటి నడుచుకుంటూ పోయాను. అలా నడుస్తూ నడుస్తూ అరణ్యం మధ్యకి చేరాను.
అక్కడ ఒక గుహ, అందులో ఒక బిలం ఉందని ప్రతీతి. అక్కడ దెయ్యాలు, భూతాలు ఉంటాయని ఎవరు పోరు. ఆ విషయం రాజ్యంలో అందరికి తెలుసు. ఆ గుహలోకి రాగానే పావురాలు అరిచాయి. గబ్బిలాలు ఎగురుతున్నాయి. బూజు పట్టి ఉంది. బహుశా కొన్ని వందల ఏళ్ళుగా జన సంచారం లేదు. అలా ఒక 10 నిముషాలు నడచిన తరువాత, కాంతిలో ఒక బిలం కనపడింది. అందులోకి ప్రవేశించి ప్రవేశించగానే రెండు అస్తిపంజరాలు నన్ను అడ్డుకున్నాయి. భటులు అనుకొని వాటిని ఛిద్రం చేశాను. ఎదురుగా 100 అడుగుల శుద్ర దేవి విగ్రహం ఉంది. అక్కడ నుంచి చిన్నగా మంత్ర స్వరం వినిపించింది. ఏదైతే అది అని ముందుకు నడిచా, అక్కడ ఆశ్చర్యం. మొండెం తల వేరువేరుగా ఉన్నాయి. తల మంత్రం చేస్తోంది. మొ౦డెం కూర్చొని ఉంది. గగుర్పాటుతో వెనక్కి నడిచా, ఒక పిశాచి నన్ను పట్టుకున్నట్లు కంపించిపోయా, ఎదురుగా సేనాధిపతి, ఎక్కడ లేని కోపంతో ముష్టి దెబ్బలు కురిపించా. ఆ సేనాధిపతికి నాకు పెద్ద యుద్దమే జరిగింది. చివరి వరకు తేలలేదు. అప్పుడు ఆ తల చేస్తున్న మంత్రం విని, దానిని మనసులో స్మరించాను. అప్పుడు ఆ సేనాని బలం తగ్గసాగింది. నా చేతులతో దాన్ని పట్టుకున్నాను. వెంటనే, అది తెల్లని పిశాచిగా మారింది. ఆశ్చర్యం కన్నా భయం వేసింది. కాని, పట్టు వదలలేదు. మంత్రం చేయటం ఆపలేదు. కొన్ని ఘడియల తర్వాత ఆ దెయ్యం పిశాచి అందమైన యక్షిణిగా మారింది. వదులు మార్తాండ అని కరుణతో అడిగింది. నీవు ఎవరి మీదైతే అమిత కోపంగా పగగా ఉంటావో వారి రూపులో నేను కనపడతాను. నేను ఆమెను నా చెర నుండి విడుదల చేసాను. ఏదైనా అడుగు నీ ప్రశ్నకు సమాధానం చెప్తా అంది. నేను ఆ తల మరియు మొండెం గూర్చి అడిగాను. ఆ యక్షిణి ఇలా చెప్పసాగింది..
ఆ మాంత్రికుడి పేరు కాలకూటకపాలుడు. కొన్ని వందల ఏళ్ళ క్రితం ఒక రాకుమారుడు ఆ గుహలోకి ప్రవేశించి, కాలకూటుడితో ద్వ౦ద్వ యుద్ధం చేసి తల, మొండెం వేరుచేసినాడు. మరణించినాడు అని భావించి రాకుమారుడు వెళ్ళాడు కాని, కాలకూటుడు తన మంత్ర శక్తీతో శుద్రదేవిని ఆరాధిస్తూ, పూర్వమే తనకు బంది అయిన నన్ను రక్షణగా పెట్టి, నాకు శాపవిమోచనం (నన్నుఎదిరించి, శుద్ర దేవి మంత్రం చేయటం) చెప్పాడు. అప్పడు శుద్రదేవి వాణి, నువ్వు అంతే తపస్సు చేయి, ఎదురుగా ఉన్న అగ్ని గుండంలో నుండి నీకు వజ్రాయుధ దేహం వస్తుంది అని చెప్పింది. అంతేకాక, ఆ దేహం ఎందుకు అని అడిగే లోపలే, నేను నీకు చూపిన దర్పణ దృశ్య కథ చెప్పి రుద్రదండం గూర్చి చెప్పి నా మార్గం గోచరింపచేసింది. ఇప్పుడు నేను ఏమి చేయాలో అడిగే లోపలే, మా౦త్రికుడికి విధేయుడు అయి ఉండు అని చెప్పి “ఒక ప్రశ్నకే సమాధానం చెప్పేది“ అని మాయం అయిపోయింది. కాని యక్షిణి స్వరం వినపడింది. ”నాకు శాపవిమోచనం కల్పించిన నీకు ధన్యవాదాలు. మాంత్రికుడి దగ్గర విద్యలు నేర్చుకో, అతనికి వచ్చే వజ్రాయుధ దేహం సామాన్యమైనది కాదు” అని...
యక్షిణి వరప్రభావంతో నాకు చెప్పినట్లు రుద్రదండం జాడ తెలుసుకున్నాను. అలాగే ఆ కాలకూటుడు స్థావరంలో అన్ని సౌకర్యాలతో కాలం గడుపుతున్నాను. కాలకూటుడి తపస్సు మరీ తీవ్రంగా సాగింది. ఆ తీవ్రత ఎంత అంటే అర్ధరాత్రి వెలుగుగా మారేది. ఇలా కొన్ని దినాలు గడిచిన తరువాత, నేను కూడా కాలకూటుడి మొండెం పక్కన కూర్చొని రోజు తపస్సు చేయటం ప్రారంభించా, ఒక నాడు నేను చూస్తుండగానే మొండెం భస్మం అయింది. అగ్ని గుండంలో నుండి ఒక తేజోమయ బలిష్ట శరీరం బయటకి వచ్చింది. దానికి తల లేదు. అంతే, కాలకూటుడు కళ్ళు తెరచి, ధన్యుడిని శుద్రమాత అని యక్షిణిని పిలిచాడు. ఎవరు రాకపోయేసరికి శాపవిమోచనమైనదని గ్రహించిన కాలకూటుడు నన్ను పిలిచాడు. ”నీ ధ్యేయం ఏమి” అని నన్ను అడిగాడు. “తమరి వద్ద శిష్యరికం చేయటమే” అని వినయంగా జవాబు ఇచ్చాను. కాలకూటుడు మరి కొన్ని ప్రశ్నలు అడిగాడు. నా వృత్తా౦తం చెప్పి నాకు మంత్ర విద్య నేర్పమన్నాను. బిగ్గరగా నవ్విన కాలకూటుడి తల “అలాగే కుమారా” అని ఆశిర్వదించి, తన తలను ఇప్పుడు వచ్చిన మొండెంపై పెట్టమన్నాడు. ఆతలను నేను మోయలేకపోయా. శుద్రదేవి మంత్రం చేస్తూ ఆ తలను తీసుకుపోయి మొండ౦పై పెట్టా, ఎంతో వయసున్న ఆ తల, ఆ మొండెంఫై పెట్టగానే, నిప్పులు కురిపిస్తూ, ఒక బలిష్టమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు. అతను నన్ను మార్తాండకపాల అని పిలిచాడు. నేను కాలకూటుడను లోకమునకు కాబోవు రాజును, దేవుణ్ణి” అని అరిచాడు. గుహ ఆ ధ్వనితో మారుమ్రోగిపోయింది .
కాలకూటుడు ఇలా చెప్పసాగాడు ”శిష్యా, నీకు నా అయిదు వందల ఏళ్ళ తపస్సులో సాధించిన విద్యలు నేర్పుతాను. నాకు శిష్యుడవై, నాకు సపర్యలు చేస్తూ కాబోవు దేవుడికి ఇప్పటి నుంచే పూజలు చెయ్యి“ అని అట్టహాసంగా నవ్వాడు. నేను “స్వామి నా వృత్తా౦తం నీకు తెలిపాను కదా, మీ వృత్తా౦తం నాకు చెప్పండి అని నీవలె ప్రాధేయపడ్డాను. ఇలా చెప్పాడు కాలకూటుడు – “నేను ఒక మాంత్రికుడి కొడుకుని, నా తండ్రి నాకు సమస్త విద్యలు నేర్పాడు. నేను అందాన్ని ఆస్వాదించే తుమ్మెదని, ఒకనాడు, ఆకాశమార్గాన పయనం సాగిస్తుండగా ఒక సరస్సులో ఒక అందగత్తె స్నానం చేస్తుంది. తనను చూస్తే బ్రహ్మ దేవుడికే తన సృష్టి మీద ఈర్ష్య కలుగుతుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఎవరు వారు తన ముందు? చంద్రుడు సైతం రోహిణిని వదిలి తన వెంటవస్తాడు. ఆమె రూపం మరొక రతీదేవి అవతారం. ఆమె పొందుతో తహతహలాడాలని ఆరాటాపడ్డాను. ఆమెను అనుసరించి, ఆమె రాణి అని తెలుసుకున్నాను. వీరుడైన యువరాజును పట్టాభిషేకంలో వరించి పాతివ్రత ధర్మాన్ని పాటిస్తుంది అని తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు ఏమిటి అంటే, ఆ లావణ్యను కలిసి నా కోరికను బట్టబయలు చేసి, నాకు చేతనైన మంత్రాలు చూపాను. అంతేకాక, నా గూర్చి నా నివాస స్థలం గూర్చి నా శక్తి గూర్చి చెప్పాను. కాని తను మాత్రం “నన్ను క్షమించండి“ అని “నా భర్త తప్ప అన్యులు నాకు పితృ, పుత్ర సమానులు అని అంది“. ఆ కోమలా౦గిని బలాత్కరించటం నాకు ఇష్టం లేదు. ఎంతైనా పువ్వులు విచ్చుకున్నప్పుడు తేనె పిలిస్తేనే కదా తుమ్మెదకు ఆనందం అనుకొని, తనకు తెలియకుండా తనను వెంబడించి, తన భర్త రూపు రేఖలు తెలుసుకొని, ఆమె భర్త లాగా మారాను. ఒక రోజు రాత్రి ఆమె శయన మందిరంలోకి, తన భర్త రూపంలో ప్రవేశించి తనను పొంధబోయాను. తేడా కనిపెట్టిన ఆమె తన పాతివ్రత్యంతో నా నిజరూపాన్ని బట్ట బయలు చేసింది. నేను అక్కడ నుండి పారిపోయాను. నా అధరాల మాటల ద్వారా తన భర్త వచ్చి, ఇంద్రుడు తనకు బహూకరించిన వజ్రాయుధ సమానమైన ఖడ్గంతో నన్ను నరికాడు. అప్పటినుంచి నా కథ నీకు తెలిసిందే, ఇక ఆ యక్షిణి, ఆ రాకుమారి లాగా కాక, నన్ను చూసి తన మగడిగా భావించి మోసపోయింది. దాంతో ఆమె భర్త, తనకు శాపమును, మరియు శాపవిమోచనమును ఇచ్చి, వారి లోకానికి వెళ్ళాడు. తనకు నీవు శాప విమోచనం గావి౦చావు. అయితేనేమి, నీవు నేను కలుసుకున్నాము. జై శుద్ర మాతా అని అన్నాడు. నా మనసులో మెదిలిన రుద్రదండం గూర్చి అడగటం మాత్రం అడగటం స౦శయి౦చాను. దాని గూర్చి నాకు తెలియనట్టే నటించాను. ఎంతైనా రుద్రదండానికి సాటి మేటి, పోటి, మరొకటి లేదుగా. కాని నా మనసు మాత్రం శక్తులకే శక్తి అతీంద్రియ శక్తి రుద్రదండం పైనే ఆలోచన సాధించాను.
“నేను నా శక్తులతో పగ తీర్చుకుందామంటే ఆ అల్ప మానవుడు బ్రతికి ఉండడు. ఏలనగా కొన్ని 100ల సంవత్సరాలు అయిందిగా. నేను పగ తీసుకోవలసింది మానవుడి మీద కాదు మానవాళి మీద, నా ధ్యేయం పూర్తి చేసుకొని మానవాళిని నా బానిసలను చేసుకుంటా” అని నవ్వుతూ అన్నాడు. నేను మాత్రం “మీరు తీర్చుకోలేకపోయినా, నేను తీర్చుకుంటా గురుదేవా” అని నా వృత్తాంతం మరొకసారి గుర్తు చేసాను. అలాగే అని నవ్వాడు కపాలకూటుడు. కొన్ని నెలల సమయంలో నాకు కాలకూటుడు అన్ని విద్యలు నేర్పాడు. క్షుద్ర విద్యలు, యక్షిణి విద్యలు, మంత్ర-తంత్రాలు, అస్త్రశస్త్రాలు అన్నీ నేర్పాడు. నేను వాటిని ఎంతో శ్రద్దగా నేర్చుకున్నా. నేను వాటిని ప్రయోగించటంలో నాటికి నేటికి ద్రష్టనయ్యా. ఇంక మా గురువు గారి అనుమతి తీసుకొని ప్రతీకారేచ్చతో మా రాజ్యంలోకి అడుగుపెట్టా. నేను రాజ్యం లోకి అడుగుపెట్టగానే, పొలిమేరలో నన్ను చూసి భీతి చెందారు. నేను నవ్వి ఆకాశంలో పెద్ద కారుమబ్బు సృష్టి౦చా, వారిని నా వశీకరణ విద్యతో లోబరుచుకున్నా. ఇక నా ప్రతాపం చూపిద్దామని రాజ్య రాజధానికి అంతఃపురానికి బయలుదేరాను. అందరు నా అవతారం చూసి భీతి చెందారు. వారికి ఆకాశంలో సూర్యుడిని, వానని ఒకేసారి చూపాను. అది యాద్రుచ్చికం అనుకొని, నన్ను పిచ్చివాడిగా జమకట్టారు. నా శక్తితో కోట ప్రహరీగోడలు బద్దలు చేశా. దానితో ప్రజలు భీతి చెందారు. వారికి నిప్పుల వర్షం చూపించా, దానికి వాళ్ళు నాకు సాష్టా౦గపడి మ్రొక్కారు. అప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంక నేను ముందుకు సాగాను. వెళ్తూ వెళ్తూ నా రూపాన్ని మునుపటి మర్తా౦డుడిలాగా మార్చాను. రాజభటులు నన్ను చూసి పరిహసించారు. సేనాని మిరీకుడు నాకు ఎదురయ్యాడు. అలా కొంత సేపు కావాలనే వారి ధూషణలను సహించాను. కాని, అంతఃపురం కోట ముందు, ఒక్కసారిగా వారి గుర్రాలతో సహా లేపి విసిరిపారేసాను. సేనాని మోహంలో భయం కనపడింది.
నేను “శక్తిహీనుల మీద కాదురా నీ ప్రతాపం ఇప్పుడు చూడు“ అని కొట్టిన దెబ్బకు నేలలో సగం కూరుకుపోయాడు. వాడిని మళ్ళీ పైకి లేపి వాణ్ణి పచ్చడి చేశాను. అలా ఆ దేశ సైన్యాన్ని ఓడించాను. ఎన్నో గుర్రాలు, ఏనుగులు ఎందరో రక్షకభటులు నా ముందు నిలువలేకపోయారు. సేనాని నన్ను చూసి భయపడసాగాడు. సరిగ్గా అప్పుడు ఒక బాణాల సమూహం వచ్చింది. నా చెంతకు వచ్చేసరికి పూలమాలలా మార్చాను. సుమారు గంట సాగిన సమరంలో వారు కనీసం నన్ను తాకను కూడా తాకలేదు. వారందర్నీ మట్టి కరిపించా. ఆ రోజు ప్రజలందరికీ అది ఒక భయానక దృశ్యమైనది.
నేను సేనానితో “నిన్ను చంపితే ఒకేసారి ఛస్తావురా, అందుకే నీకు విడతలు విడతలుగా ఛావుని చూపిస్తాను, మంచి చేసిన వాడి మీద, న్యాయం అడిగిన వాడి మీదరా నీ పౌరుషం, కాస్కో అని ఒక్క ఉదుటన వాడిని గాలి లోంచి రాణి గారి మందిరం లోకి విసిరి వేసాను. ఇక బయట అందర్ని చెల్లాచెదురు చేసాను. అలా కోటలోకి ప్రవేశించబోయాను. చూట్టూ చేరిన ప్రజా సమూహం నన్ను చూసి బెంబేలెత్తి పోయారు. ప్రజలందరు నా ముందు మోకరిల్లారు. దాంతో నా అహం పతాక స్థాయికి చేరింది. వారందరినీ వశీకరణ౦ చేసుకొని వారిని నా అనుచరులుగా మార్చుకున్నా. ఇప్పుడు రాజ్యం మొత్తం నా వశీకరణంలో ఉంది. నేను కోటలోకి వెళ్ళే కొద్ది అందరు నా ఆధీన౦ లోకి రాసాగారు. ఒక్క రాజు, రాణి, సేనాని తప్ప. కావాలనే వారిని వశీకరణం చేయాలా. నేను సింహాసనం మీద కూర్చుందామని ప్రయత్నించే లోపలే రాజు, రాణి, సేనాని నా ముందు మోకరిల్లారు. సేనాని నిలువెల్లా వణికిపోయాడు. నేను వాని వద్దకేగి ఒక నవ్వు నవ్వాను. దానితో వాడు స్పృహ తప్పాడు. రాజు, రాణి ఏడుస్తూ ”యువరాణి పద్మిని దేవి ఒకనాడు స్నానానికి సరస్సుకు పోయినది. ఎంతసేపటికి రాలేదు. భటులను పంపేసరికి యువరాణి మృతదేహం లభించినది. విషసర్పకాటుకు బలై౦దని, శరీరం మొత్తం నల్లగా తయారయ్యిందని నురుగు కక్కుకొందని“ చెప్పారు. నేను కూడా ఆ అందాల రాశిని పొందలేకపోయాను అని బాధపడ్డాను. కాని రాజ్యం అంతా నా పాదాల క్రింద ఉంది. అందరు నా వశీకరణంలో ఉన్నారు. అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఆ రాజ్యానికి రాజునయ్యా. ఇంక నా వైభవం సామాన్యమైనది కాదు. విందు, పొందు, చిందు అన్ని తనివితీరా అనుభవించా. సేనాని చేత అన్ని పనులు చేయించుకునేవాడిని. అలా రాజ్యంలో పర్యటిస్తుండగా ప్రజలందరు నారాయణునికి, పరమశివుడుకి, శక్తికి మ్రొక్కటం చూసాను. అప్పుడు నా మదిలో అంతర్మధనం మొదలయింది. అలా కొన్ని సంవత్సరాలు చూసాను. చిన్నగా సేనాని కాలధర్మం చెందాడు. నేను సుఖి౦చిన కాంతలు ముసలివారయి చనిపోవటం చూసాను. నాకు ఏదో ఆరాటం మొదలయింది. నాకున్న శక్తులతో ఎన్నో రాజ్యాలు జయించాను. చక్రవర్తిని కూడా అయ్యాను. కాని నాకు ఎదో అసంతృప్తి. అందరు నా రాజ్యంలో దేవుడికి మ్రొక్కసాగారు. నేను ఇలా ఆనుకున్నా ‘ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు, అయినా అడగకు౦డానే ఆయనను పూజిస్తున్నారు. ఈ రాచరికం, ఈ ఐహికం అంతా దండగ. నేను కూడా భగవంతుడిని అయితే నాకు చిరకాలం సేవలు చేస్తారు, మ్రొక్కుతారు. కాలకూటుడు నేర్పిన ఇచ్ఛామరణం కాకుండా, ఎప్పుడూ చిరంజీవిగా మిగలవచ్చు. అందుకే నేను దేవుణ్ణి, అంత శక్తిమంతుణ్ణి అవుదామని నిర్ణయి౦చుకున్నా. ఎన్ని సంవత్సరాలు అయినా దానిని సాధించి ఈ సృష్టిని పరిపాలించదలిచా. అప్పుడు మొదలయింది నా మనస్సులో రుద్రదండం.... రుద్రదండం...
రాజ్యమును, ముసలిరాజుకి అప్పజెప్పి వశీకరణం వెనక్కి తీసుకొని, అలా కొన్ని సంవత్సరాల తరువాత కాలకూటుడి స్థావరానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి కాలకూటుడి తల, మొండెం మళ్ళి వేరైనవి. నేను పరుగున వెళ్లి “గురుదేవా! ఏమైనది?” అని అన్నాను. కాలకూటుడు “మార్తాండకపాల! నేను నీకు తెలుపని వేరొక విషయం ఉంది. అదే రుద్రదండం” అని మళ్ళీ యక్షిణి నాకు చూపిన కథను చెప్పి “దానికోసమే ఇన్ని సంవత్సరాల తపస్సు... ఈ వజ్రదేహం నీవు వెళ్ళిన వెంటనే దాని జాడ కొరకు నేను జంబూద్వీపం వదలి ఒక మంచు ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ అంతా మంచు. సామాన్య మానవుడు అక్కడి చలికి చనిపోతాడు. అక్కడ నాకు ఒక దేవతల బృందం కనపడింది. వారిని చాటుగా పరిశిలించాను. వారందరు వెళ్ళిన తరువాత, ఒక ఇద్దరు దేవతలు అక్కడ ఉండి రుద్రదండం గూర్చి మాట్లాడకొనసాగారు. ఎలాగైనా అది దుష్టుల చేతిలో పడకూడదని అనుకున్నారు. దాని కీలకం ఈ మంచు గుహలో ఉందని చెప్పారు. వారు వెళ్ళిన వెంటనే నేను ఆ మంచు గుహలోకి వెళ్ళాను. అక్కడ మరోకిద్దరు నా మీద దాడి చేసారు. వారు నా మీద యుద్ధం చేస్తూ ఇలా అన్నారు. ”ఓయీ! మాంత్రిక నిన్ను దేవేంద్రుడు కనిపెట్టమని చెప్పాడు, రుద్రదండం కనక నీ చేతికి వస్తే మా ఇంద్రుడి పదవికి ఆటంకం అని వారి దగ్గర ఉన్న వింత ఆయుధాలతో నన్ను పొడిచారు. వారిని నిలువరించలేక నిలుచున్నాను. కాని నా దేహానికి ఏమి కాలేదు. అప్పుడు వారు నా తల పై వేటు వేసి, కాసేపు అంతే ఆ ఆయుధాన్ని ఉంచి మాయం అయ్యారు. నాకు ఆ రుద్రదండపు ఛాయలు ఏమి కనపడలేదు. నేను మళ్ళీ స్థావరానికి వచ్చాను. వచ్చిన పిమ్మట ఈ దేహం కు తల వేరైనది. మళ్ళీ అతుక్కొనుట లేదు. మార్తాండ, నీవు నా మొండాన్ని అగ్ని గుండం లో పడవెయ్యి. నీ తల తీసి ఈ మొండానికి పెట్టుకో. నీ దేహం కూడా శుద్రమాతకి ఆర్పణం చెయ్యి. అప్పుడు నా ఆత్మ, నీ ఆత్మ కలిసి వజ్రాయుధ దేహమే కాదు, తలకి వస్తుంది. ఇది నాకు శుద్రమాత వాణి చెప్పింది. కానిమ్ము అన్నాడు. నేను అలాగే గురుదేవా అని అయన తలను అగ్ని గుండంలో పడవేసి, నా తలని నరుక్కొని, శుద్ర దేవిని కీర్తిస్తూ ఆ మొండం పై పెట్టాను. నా మునుపటి మొండెంను అగ్ని గుండంలో త్రోసాను. నేను ఒక దివ్యరూపుడై ఇప్పుడు నువ్వు చూస్తున్న మార్తాండ కపాలునిగా మారాను. ఆనాటి అదియే నా స్థావరం సం||ల తరబడి. ఇప్పుడు ఇదే ఆ స్థావరంగా రూపాంతరం చెందింది. తరువాత మంచు ప్రదేశంలో (కూటుడు చెప్పిన) లోకమంతా తిరిగాను. కాని నాకు రుద్రదండం భాగాల ఛాయలు కనపడలేద. అప్పటి నుండి గాలిస్తున్నా”..
అదిరా డింభకా నా సంక్షిప్త కధ. నిన్ను మెచ్చినానురా సేవకా” అని మార్తాండుడు తన కథ చెప్పటం ముగించాడు. రుద్రదండం సాధనకై తీవ్రంగా ఆలోచించసాగాడు.
డింభకుడు ఈ కధ మొత్తం శ్రద్ద గా విని ఎంతో ఆశ్చర్యపడ్డాడు . డింభకుడు ఇలా అడిగాడు .”ప్రభూ ఇప్పటి మన స్థావరం ఆనాటి మీ గురుదేవుల గుహలోని బిలం అన్నారు కదా.ఇప్పుడు అది ఎలా ఇంత లోయలోకి వచ్చింది .”అని అన్నాడు .మార్తాండుడు “డింభకా ! నా వజ్రశరీరం రాగానే ఉరుములు ఉరిమాయి.మెరుపులు మెరిశాయి.నేను వికటాట్టహాసం చేశాను .నా బిలంలోకి మళ్ళి మా గురుదేవులను ఓడించిన ఆ దేవతల సైన్యం లోని ఇద్దరు వెతుక్కుంటూ వచ్చారు .వారు నాతో పోరాడారు .కాని నన్ను ఏమి చేయలేకపోయారు .ఈ సారి వారి దగ్గర ఉన్న ఆయుధాలు విరిచి పారేసాను.వారు నాతో పోరాడారు .నా గురుదేవులు నాలో ఉన్నందున ఈ సారి ప్రతి అవయవం వజ్రతుల్యం కావటం వల్లన వారు నన్ను ఏమి చేయలేకపోయారు .వారిని చిత్తు చిత్తు గా కొట్టి ఓడించాను .వారు అమృత౦ తాగ బట్టి చనిపోలేదు .వారు ఇంక భయపడి నా స్థావరం వదిలి వెళ్ళిపోయారు .ఇలా పలుమార్లు నా వెంట బడ్డారు. నన్ను ఏమి చేయలేక పోయారు .నేను కొన్ని సంవత్చరాలు ఈ గుహ లో వారిని ఎదిరిస్తూ గడిపాను .వారు పదే పదే నన్ను,నా తపస్సు ను భంగం చేయసాగారు.ఇంక నాకు చిరాకు పుట్టింది .ఒకసారి గుహ బయటకి వచ్చి చూసాను అడవి ఎంత గానో రూపాంతరం చెందింది.నాకు తళుక్కున ఒక ఆలోచన వచ్చింది .నాకు ఎవరు అడ్డురాకూడదు అనుకోని ,గుహని దాచదలిచాను.అది నాకు తప్ప అన్యులకి కనపడకూడదని అనుకుంటూ మంత్రి౦ చాను .అందుకే ,గుహలోకి రాదల్చుకునే ముందు మొదట వెలుగు వస్తుంది .అందులోకి నడవాలి ,ఎలాగూ నాకు ఎక్కడికి అంటే అక్కడికి పోయే విద్య తెలుసు కాబట్టి గుహని ఒక వంద అడుగుల నేలలోకి దింపాను .అటు పిమ్మట ,రుద్రదండంకై తీవ్రంగా యోచించి తిరుగుతూ ఉండేవాడిని .ఒకానొకనాడు ,కొన్ని వందల మంది రాక్షసులు నా స్థావరం ముందు వచ్చి నన్ను బైటకి రమ్మని గేలి చేసారు .నేను బైటకి వచ్చి వారితో మైత్రిగా ఉండమని నాతో స్నేహం చేయమని ప్రతిపాదించాను.కాని వారు “ ఓయి మనవుడివి నీతో మాకు వైరమే సమంజసం .గతం లో ఈ గుహలో 2000 సం||లకు పూర్వం మేము ఉండేవాళ్ళము .తర్వాత కాలకూటుడు మమ్మల్ని మోసగించి ఈ స్థావరం తీసుకున్నాడు. మా స్థావరం మాకు ఇచ్చెయ్యి అన్నారు .నా సాధనలకి ఎంతో అనువైన ఈ ప్రదేశాన్ని వారికి ఇవ్వటానికి నిరాకరించాను.వారు నాతో తలపడ్డారు .నా మంత్ర శక్తి ప్రభావంతో స్థావరాన్ని వారికి కనపడకుండా మాయం చేసాను .వారు నాతో మాయ యుద్ధం చేశారు , ఆ రాక్షస నాయకుడు దగ్గర ఒక మంత్ర దండం ఉంది ,దాంతో వాడు ఎన్నో మాయలు చేసి ,నన్ను సమానం గా ఎదిరిస్తున్నాడు .ఒకాకొక సందర్భం లో వాడు నన్ను ఓడిస్తాడేమో అనుకున్నాను .మిగిలిన రాక్షసులు చుట్టూ ఉన్న జంతువులను చంపి రాక్షసం గా వాటిని ఆకలితో తింటున్నారు .ఆ రాక్షసులకు లేడి మాంసం బహుప్రీతీ అని వారి మాటల ద్వారా కనుగొన్నాను .నేను వెంట నే నా మయా శక్తి తో కొన్ని లేళ్ళను సృష్టించాను .వాటి వెంట పడుతూ మంద బుద్ది గల రాక్షసులు పరిగెత్తారు .నాతో యుద్ధం చేస్తున్న రాక్షసుడు ,”శివంగి ,శివంగి మాంసం “ అని అరిచి ,భీకరం గా నవ్వి నన్ను ఎదిరిస్తున్నాడు . ఈ మంద బుద్ది రాక్షసుడిని కుయుక్తి తో తెలివితో ఓడించాలని నిర్ణయించుకున్నాను . నేను నా శరీరాన్ని వేరు చేయగలను కాబట్టి ఆ రాక్షసుడు తను విసిరిన మంత్ర బల్లానికి నా తల వేరైనట్లు దృశ్యం కల్పించాను.మిగిలిన రాక్షసులు కూడా కొన్ని లేళ్ళను వారి తలకు చుట్టుకొని వచ్చారు .కొంతమంది చెట్లకు తల క్రిందులుగా వ్రేలాడుతున్నారు.వారందరినీ చూస్తూనే నేను మరణి౦ చినట్లు నటించాను.అక్కడ ఉన్న వారందరూ ఆ రాక్షస రాజు గెలిచాడని జయ ద్వనులు చేస్తున్నారు .వాళ్ళ రాజు కోసం శివంగిని కట్టి తెచ్చారు .ఆ రాక్షస రాజు లొట్టలు వేస్తూ “ ముందు ఈ మనిషి మాంసం తి౦దా౦ తర్వాత అది అని ఆబరాగా దగ్గరకు వచ్చాడు.ఒక్క క్షణ వేగం లో నేను మళ్ళి నా శరీరాన్ని యదా స్థితి కి తెచ్చుకొని,ఆ రాక్షసుడి పంటికి ఉన్న కోరను పీకాను.అతని మీద దాడి చేసి అతని చేతిలో మంత్రదండం లాక్కున్న.దాంతో అప్పటి దాక పిచ్చి కేకలు వేస్తున్న రాక్షస సమూహం నివ్వేరపోయింది.స్వయానా నేను మంత్రవేత్తను కాబట్టి నేను ఆ రాక్షస మయాదండాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నా క్షణంలో దాంతో ఆ రాక్షసులని వారు ఇష్టం గా తినే జంతువులుగా మారి పోవాలని ఆజ్ఞాపించా,అక్కడ ఉన్న వందల రాక్షసులు ,కోతులు ,కుక్కలు ,లేళ్ళు,పాములు ,కప్పలుగా మారి వింత చేష్టలు చేయసాగారు.నేను నవ్వు అప్పుకోలేకపోయి,మిగిలిన ఆ రాక్షస నాయకుడు పారిపోబోయాడు.ఎదురుగా కట్టి పది ఉన్న శివంగి శవం వల్ల కింద పడ్డాడు .నేను నవ్వి మంత్రదండంతో వాడిని ఆ శివంగి లోకి ప్రవేశపెట్టాను .ఇంకా కొన్ని౦టిని డేగలు ,గబ్బిళాలుగా మార్చాను .
ఆ రాక్షసులలో కొంత మందికి అద్బుత శక్తులు ఉన్నాయని గ్రహించి వారిలో కొంతమందిని ఇప్పుడు నువ్వు చూస్తున్న వరుసలో ఉన్న దెయ్యాలు ,భూతాలుగా ఉంచాను .అవే ,ఇందాక నాకు జయద్వనులు చేసాయి.ఆ తర్వాత ఆ మంత్రదండ శక్తులు నాలోకి లాక్కొని ,దానిని విరిచాను.సరిగ్గా అప్పుడు జరిగింది ఒక వింత .అక్కడి నేల క్రిందకి పోసాగింది ,లోయలాగా అవ్వసాగింది.
నేను వెంటనే నా శక్తీ తో స్థావరాన్ని , ఆ భూత ప్రేతాలను జాగ్రత్తగా నిల్పాను .అలా భూమిలోకి చూట్టూ ఉన్న అరణ్యం అంతా కుంచిచుకుంటూ లోయ లాగ ఏర్పడసాగింది.అలా నువ్వు ఇప్పుడు చూస్తున్న మన స్థావరం, లాగా ఏర్పడింది.మిగిలిన రాక్షసుల జంతు రూపాలను కూడా కాపాడాను. వారు మన స్థావరం రక్షణ భాద్యత చూస్తున్నారు .అలా భూమి లోపలికి పోతూ పోతూ ఆగింది .ముందు నేను ఎలాగో మంత్రం తో గుహలోకి ప్రవేశం ఖాయం చేశాను కదా ,అలా కొనసాగించాను”.అని కపాల మార్తాండుడు తన స్థావరం గురించి చెప్పాడు .ఇన్నాళ్ళు డింబకుడికి తెలియని విషయాలు ,మార్తాండుడు చెప్పేసరికి ,డింభకుడు తాను ఎరిగిన మాయలు ,మంత్రాలు,అద్బుతమని కొనియాడి తనకు కొంత విద్యలు నేర్పమన్నాడు.”సమయ౦ ఆసన్న మయినప్పుడు నీకు నేర్పుతారా డింభకా” అని మార్తాండుడు ,విశ్రాంతి మందిరానికి వెళ్ళాడు .ఎంతో కాలం గా తను శారీరకం గా మానసికం గా అలిసిపోయాడు.తన అందమైన విశ్రాంతి మందిరం రాజశయ్యని పోలి ఉంది .నిజం గా స్రీ ని పోలిన పరుపు ,చూట్టూ తిరిగే మంచం అవసరం అయినప్పుడు ఊయల లా ఊగే మంచం కాడాలు,ఆ పరుపుని చూస్తేనే మార్తండుడికి నిద్ర వస్తుంది .నిషరసాలను ఆస్వాదించి మత్తు లో ఉన్న తూలుతున్న మార్తాండుడికి ఆట పాటలతో ఉల్లాసం గా గడపాలనిపించింది.తను వెంటనే తన మంత్రశక్తి తో ఒక కామ రూప పిశాచిని ప్రత్యక్షం చేసుకున్నాడు .ఆ పిచాచి నృత్యరీతులలో అమోగమైన ప్రతిభ కలది.”ఏమి ప్రభూ! మీకు ఏమి కావాలి .ఆట పాటలతో ఆనందింప చేయనా” అని పిచాచిని పలికినది .తూగుతున్న మార్తాండుడు”అందులకే నిన్ను పిలిచినది.”అని శృంగారబరితం గా పలికాడు.విద్యాధరదేశ రాణి అపూర్వ సౌందర్య వతి ,ఆమె రూపం లోకి మారి నర్తి౦ చనా అని పలికినది.” ఓహో నీకు రూపు మార్చే శక్తీ ఉంది కదా “ అని అయితే అయితే అని కళ్ళు మూసుకున్నాడు..మార్తాండుడు ఊహ లోకి తను మోహించిన రాణి పద్మిని దేవి గుర్తుకు వచ్చింది .తన మోముని అనేక రకాలుగా తలచుకున్నాడు .
“ఇది 1000ఏళ్ల నాటి సంగతి ,రాణి పద్మిని దేవి ,తన చెక్కేళ్ళ వైపు పాలధార,పంచదార పడుతూ ఉంటాయి.తను నవ్వితే నెమళ్ళు సిగ్గుపడతాయి.తన వొంపుసొంపులు చూస్తే హంస గింగిరాలు తిరుగుతుంది.నడిచే వీణ లాగా ,వెనక్కి నుండి చూస్తే తుంబురు లాగ ఉంటుంది .ఓహో ,ఆమె సొగసు వర్ణించుటకు ఏ బాష లో వ్యాకరణం లేదు .ఛ౦ దస్సు చాలదు.నా సాధనల విషయం లో పడి ఆమె విష కాటు కి గురి అయినది అనే విషయం మరిచాను .ఆ రూపం నువ్వు తెచ్చుకోగలవా అని నవ్వాడు .ఆమెని మదిలో తలచి నన్ను స్మరించండి ప్రభూ”అని అంది కామ రూప పిశాచి. అలా చేసాడు కపాల మార్తాండుడు,వెంటనే ఆ పిశాచి యువరాణి పద్మినిలాగా మారింది.మార్తండు డి ఆనందానికి హద్దు లేదు .ఆ యువ రాణి పద్మిని రూపంలో ఉన్న పిశాచి తో నృత్యాలు తనివి తీరా చేసాడు.తనకు నచ్చిన యువరాణి పద్మిని తో సమయం గడిపినందుకు తను ఎంత గానో సంతోషించాడు.ఆ పిశాచి సైతం తను కూడా మాంత్రికుడికి దగ్గరగా ప్రవర్తిన్చాసాగి౦ ది.మత్తులో తూలుతున్న మాంత్రికుడు ఆ పిశాచిని స్వయానా పద్మిని దేవి అని తలచి ఆడి ,పాడి ఆనందపడ్డాడు.”పద్మిని నిన్ను కన్నందుకే నీ తల్లి దండ్రులను ప్రాణాలతో విడిచి పెట్టా,మళ్ళి రాజ్యం వదిలినప్పుడు నీ తండ్రికే మూట గట్టా సింహాసనంకాని ,నీవు నయం చేసిన నన్ను స్వీకరించలేదే? ఏమి అంత నిర్లక్ష్యం ఇష్టపడు వారిని మీ ఆడువారు పట్టించుకోరు కదా ,మీకు ఈ వక్ర బుద్ది బ్రహ్మ దేవుడే పెట్టాడా? లేక మీకు మీరే కల్పించుకున్నారా ,సృష్టి రహస్యాన్నైనా చేదించవచ్చు గాని ఆడ వారి మనసులో ఏముంది ఎవరు కనిపెట్టగలరు.నీవు ఎందుకు దూరం అయ్యావు,చెప్పు,”అని తూగుతూ ప్రేలపించాడు మార్తాండుడు.ఇవే ఏవో అని ,నిద్ర లోకి జారాడు మంత్రిక సామ్రాట్.మార్తాండ శయన మందిరం లో ,ఆయన నిద్రకు ఉపక్రమించాగానే కాంతి పరికరాలు శిగ్రముగా ఆగిపోయాయి.గాడ నిద్ర లోకి జారాడు మార్తాండుడు. చీకటి రాజ్యం చేస్తుంది .గుహ చీకట్లో అలముకుంది.అంత నిశ్శబ్దం.
***************************
సూర్యోదయం.....
నిద్రలోంచి మేల్కొన్నాడు మార్తాండుడు.తన మీద పిశాచి పడుకోవటం చూసాడు . ఆ పిశాచి ని విసిరి అవతల వేసాడు .దాంతో ఆ పిశాచి... “ ప్రభూ ! నేను నిద్రలోకి పోయి నాకు తెలియకుండానే రూపు మార్చుకున్నాను క్షమించండి.” అని అడిగింది.మార్తాండుడు లేచి వెళ్లి శూద్ర దేవి కి ప్రణామం చేసాడు .ఆదేవి విగ్రహం ముందు “ ఏమి ! నా తప్పిదము,అనేక వందల ఏళ్ళుగా నిన్ను పూజించే చేతులు ఇవి ,నిన్ను ని శోభను చూచుటకు ఉన్న కళ్ళు ఇవి ,నీ వాణి వినుటకు చూచే చెవులు ఇవి ,నీకై పరితపించుటకు ఉన్న మనసు ఇది ,నీకు అంకితమైన శరీరం ఇది ,అయినను,నీ భక్తుని కోరికను తీర్చవా,అన్ని లోకాలా మీద ఆదిపత్యం కాదు నా వ్రతం,నేను సైతం జనులు మ్రొక్కె భగవంతుడు మారటం నాకు కావలిసినది .,ఆ కిటుకు చెప్పి , రుద్ర దండం సాధనకు మార్గం చెప్పావా “ అని పలికాడు.
అలా ఇంకా కొన్ని దినములు రుద్రదండం ఆచూకి కోసం ఎదురు చూసాడు .దొరకలేదు “ఏదైనా సాదించుటకు మార్గం తోచుటలేదే ,ఎలా చేయవలె “అని గర్జించాడు.వెంటనే శుద్ర దేవి విగ్రహం ఎదుట ఉన్న పేటిక లో నుండి ఒక స్వరం వినిపించింది-“మార్తాండ నీవు ఎన్ని ఏళ్ళు నుంచి అడిగినను ,నేను నీకు చెప్పంది ఎందుకంటే,మార్తండా! దైవశక్తి ముందు ఏది నిలబడలేదు,నీవు దేవుడిగా మారటం అనేది ప్రశ౦సనీయం, కాని రుద్రదండం గూర్చి,నా లాంటి క్షుద్ర దేవతలకి కూడా ఏమి తెలియదు .కాని నా భక్తుడివి కావున నీకు ఒక చిన్న ఉపాయం చెబుతున్న,ఇది మాత్రమే నేను నీకు చేయగలను ,ఇప్పుడు సమయం ఆసన్నమైనది,కావున నీకు చెప్పుటకు నా వాణిని వినిపించితిని ,నేను ఎ నాడో ఈ విషయము చెప్పవచ్చు,కాని ఇపుడు ఈ విషయం జరుగుతుంది కాబట్టి నీకు నేను ఈ ఉపాయం వివరిస్తున్నా.రుద్రదండం సాదించుటకు ఒక కారణ జన్ముడు పుడతాడు.అతడు
పుడుతూనే తలమీద జటా జూటాలు,నుదురు మీద మూడు విభూది రేఖల లాంటి గుర్తులతో పుడతాడు.అతడిని చూడగానే నుదుటిమీద విభూది రేఖలు అతను అని రుజువు చేస్తాయి.అతను ఏంటో శక్తి మంతుడు,సాక్షాతూ రుద్ర గణం లో నుండి ఉద్భవి౦ చిన వాడు .సరిగ్గా ఈ సమయమున గుగ పుష్కరములు జరుగుతున్నాయి,ఇప్పటి నుండి 24 స౦||లు ,అనగా 2 పుష్కరములు అవతల దినమున ,నీకు అతను తారసపడతాడు.ఇక,నీ యుక్తి కుయుక్తి ఉపయోగించు,నీ వలే ఒక దైవ శక్తి ఉన్న ఋషి రుద్రదండం గూర్చి తపమోనరిస్తున్నాడు,అతనికి భగవంతుడు ప్రత్యక్షమైతే సఫలం అయ్యేటట్లే, ఇక నీవు ఏమి చేస్తావో,ఆలోచించు” అని వాణి ఆగి పోయింది.” భళా! శుద్రమాతా ధన్యవాదములు”అంటూ జ్వాల లో నుండి వచ్చిన కాంతి తో మార్తాండుడి మొహం ఎర్ర బడింది.
మార్తండుడి కి వెంటనే ఒక సందేహం వచ్చింది.శుద్ర దేవి నీ మళ్ళి పిలిచాడు.శుద్ర వాణి మళ్ళి వినిపించింది.’ఇంతకి ఆ యువకుడు పుట్టాడా?”అని ,అందుకు శుద్ర వాణి ఈ పుష్కరాల కాలం లో పుడతాడు ,అతను నుదురు మీద సహజం గా ఏర్పడిన విభూది రేఖల లాగా శివుని నామాలు కలిగి ఉంటాడు .అలా ఎవరు ఉండరు ,అతనొక్కడే “అంది.వెంటనే మాంత్రికుడు మరి రుద్రదండం జాడ తెలిసిన మరో దైవసంపన్నుడు ఎవరు “ జాడ కాదు మార్తాండ ,నీవలె రుద్రదండం కోసం అతను పరితపిస్తున్నాడు .నీవు క్షుద్ర విద్యని ఎంచుకున్నావు ,వారు దైవ శక్తిని ఎంచుకున్నాడు”అంతియే .ఇక ఇంతకు మించి ఏమియు చెప్పలేను “ అని వాణి ఆగింది. మార్తాండుడు తన దగ్గర ఉన్న మంత్రదండం తీసుకొని “నిన్ను వదలను లే ,రుద్రదండం సాది౦ చినను నీ విలువ నీకు ఉంది లే “ అని నవ్వాడు .డింభకా! అని పిలిచాడు .” డింభకా ఇక నా కల నేరవేరుటకు ఇక 24స౦||లే ఉన్నది .ఇన్ని స౦||లు ఆగిన వాడిని రెండు పుష్కర కాలాలు ఆగుట సమస్యా?” అని నవ్వాడు .డింభకుడు గురువు గారి ఆనందం చూసి ఎంత గానో సంతోషపడ్డాడు.”భగవంతుడు ఎన్నో వేల సంవచ్చారాలు తపస్సు చేస్తే గాని ప్రత్యక్షమవ్వడు. ఆ మూర్ఖుడు రుద్రదండం కోసం ఏమి చేసిన దేవుడు అతనికి కనపడడు.రుద్రదండం నా సొత్తు,పరమ శివుడు దానిని భూమి మీదకు వదిలి పెట్టినది నా కొరకే,ఇక ఆ పిచ్చి తపస్వి ఎన్ని సంవత్చరాలు గడిచినా అంతే ,కాని రుద్రదండం సాదించిన వారికి అనగా ,నాకు ఎదురు ఉండదు .నన్ను ఎవరు పూజించినా వారికి వెంటనే ప్రత్యక్షం అయ్యి,వరమిస్తాను .నేను ఇప్పడు ఉన్న దేవుడి లా కాకుండా ,భోళాతనం తో నా కాబోవు భక్తులను అనుగ్రహిస్తాను.అని పరిహసించాడు.వందల ఏళ్ళు గా మార్తాండుడు తన కన్న కలకు ఈ రోజు ఆధారం దొరికింది.అని నివ్వెర పోసాగాడు.ఇది కలో ,వైష్టవ మాయో అని తనను తాను గిల్లి చూసుకున్నాడు .అక్కడ ఉన్న పిశాచాలు ,భూతాలు,ప్రేతాలు,బందించిన ఆత్మలు రుద్రదండం ఆచూకి తో ఆనందపడుతున్న మార్తాండు డుని చూసి జయ ధ్వనులు చేసాయి.అది విన్న మార్తాండుడు మీకు కూడా నా రాజ్యం లో ,అంటే నేను భగవంతుడిని అయిన తర్వాత ,నా సేవక పదవి లబిస్తుంది .అంటే మీరు కూడా భగవాన్ మార్తాండ కి సేవలు చేసారు కాబట్టి ,నా బక్తులు మిమ్మల్ని మ్రొక్కిన ,వాళ్ళ కార్యాలు అయ్యేటట్లు అనుగ్రహిస్తాను .పదునాలుగు లోకాలను గెలుస్తాను .నాకు భక్తి తో నమస్కరించి లొంగిపోయే వాళ్ళకు అన్ని వరాలు అనుగ్రహిస్తాను . ఇంద్ర లోకానికి ,ఇంద్రుని నా సామంతుడి లాగ నియమిస్తాను. అన్ని లోకాలను నన్ను పూజించమని ,ప్రార్ధ్దించమని ఆజ్ఞాపిస్తాను.మోక్ష అధికారం తీసుకుంటాను .ఎవరినా ఎదిరిస్తే ,వారికే కాదు వారి ఆత్మలను కూడా నాశనం చేసి మళ్ళి వాళ్ళకి జన్మ లేకుండా చేస్తాను .ఇక మీద నా భక్తులకు ఏమి లాబాలు ఉండవు .” అని పరిహసించాడు . డింభకుడు “ప్రభూ! రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమ ల చేత నాకు నృత్య ప్రదర్శన ఇప్పించండి.”అని అడిగాడు .” శభాష్ నా డింభకా! రసికత లో గురువు నే మించిన శిష్యుడవి” అని “అలాగే,వారినే కాదు ,నీవు ఎవరిని కోరిన ,వారిని ,నీకు ఎలా కావాలంటే అలా నీకు సేవలు చేయిస్తాను .నా బంటు వి రా నువ్వు “ అని రుద్రదండం తన చేతికే వచ్చేటట్లు భావించాసాగాడు.
*******************************
సూర్యోదయం .. కాశీ పట్టణం .. కాశీ లోని ఒక శివాలయం. గంగ ఒడ్డు . చల్లగా ,మెల్లగా గంగా హారతి .. పుష్కరాల సమయం .. పోటెత్తిన శివ ,కేశవ భక్తులు .. “ హర హర మహాదేవ కాశీ విశ్వనాధా,రుద్రదేవా , మహేశ్వరా,శంభో, కపర్ది,రజనీషా,ఫణిరాజా,కార్తిక,శంకరా…”అని జయ ధ్వనాలు..
కాశీ విశ్వనాధుని జ్యోతిర్లింగాలయం .. జ్యోతిర్లింగ స్పర్శ దర్శనం కోసం భక్తులు వరుసగా నిలబడి ఉన్నారు
సన్నిది లోకి ,వారు రాజులైన కాని ,భగవంతుని ముందు అందరు సమానమే అని భావించే వారు .అందుకే అందరి లాగా జన సమూహం లో నిలబడ్డారు.ప్రజలందరూ తమలో నిల్చున్న మహారాజు ,రాణి గారికి జయద్వానాలు చేయసాగారు .”మహా రాజు కేశవ పేనుడికి ,మహారాణి చంద్ర ప్రభకి జయహో “ అని .కేశవ సేనుడు –“ప్రజలారా! మీ అభిమానానికి ధన్యుడిని,కాశీ లాంటి పరమ పవిత్రమైన నగరం ,నా సువిశాల సామ్రాజ్యం లో ఉన్న ,కాశీకి ప్రత్యేకత కలదు.అది ,శివుడుకి తప్ప ఎవరికీ ఆదీనం లో ఉండదు .కావున ,7క్రోసుల ఈ నగరం ,ఈ అన్ని లోకాలను సృష్టించి ,పాలించి ,పోషించి ,లయంచే ఆ పరమేశ్వరుడి దే . అందుకే ఆలయం లో , ఆయన్నితప్ప ఎవరిని సృతించారాదు.”అని పలికి రాణి వైపు చూసాడు .భటులు కూడా సామాన్య భక్తుల వలే నిల్చోన్నారు .రాణి మనసులో ఆందోళన ఉంది.
ఇలా పరమేశ్వరుడిని ప్రార్ధించి౦ది-“పరమేశ్వరా నేను నిండు చూలాలను,11నెలలైన నీకు నా మీద దయ రాలేదా ,ఇంకను నాకు కాన్పు అయ్యే భాగ్యం లేదా .ఈ పరిణామం ఏమిటయ్యా, నా బిడ్డ నా సొత్తు కాదు ,రాజ్యం మొత్తానికి వారసుడు ,ఎంతో కాలం పిల్లలు లేని మాకు నీ వ్రతం ఆచరించిన పిమ్మట నేను గర్భం ధరించాను ,నా మీద కనికరం చూపు “ అని రాజు ,రాణి ప్రార్ధించారు .అలా ముందుకు దర్శనార్ధం వెళుతున్న భక్తులు ,”కాశీపతి ,గంగాధరా,పార్వతి నాదా,జ్యోతి స్వరూప,అని తీవ్ర తన్మయత్వం తో అరవ సాగారు.
కొంత మంది విస్వనాధుని జ్యోతిర్లి౦ గాన్ని దర్శించి పరవశించి ,కన్నీటి తో సివలింగముని సరిగ్గా చూడలేకపోయారు .వారు తమ జన్మ జన్మ పాపాలను ,క్షణం లో విభూది ని చేసే శంకరుని భక్తి తో మ్రొక్కసాగారు.అలా కొంతమంది వారికి తోచిన విధంగా కీర్తనలు చేశారు.కొంత మంది ఋషులు ఆలయం లో ఉంది ఇలా అన్నారు “జ్ఞానులు బ్రహ్మమన్నా,భక్తులు భగవంతుడు అన్నా ,యోగులు పరమాత్మ అన్నా,పామరులు లింగామన్నా ,జనులు దైవమన్నా,ఏ రూపైనా,ఏ పేరైనా,ఏ కాలమైనా,మీ కళ్ళ ముందు ఉన్న “ ఆ జ్యోతిర్లింగ స్వరూపుడిని .శివ కేశవ బేదము లేదు .అంతే ఆ శివ లింగమే .” అని తత్వాన్ని విసదీకరించారు.ఎవరి తన్మయత్వం వారిది ,ఎవరి భక్తి వారిది ,ఎవరి భావన వారిది ,ఎవరి ఆ లోచన ప్రకారం ఆ కాశీ విశ్వనాధుని దర్సనం చేసుకోసాగారు .రాజు రాణి సైతం “పరమేశా,నిన్నే శరణం”అని కీర్తన ఆలపించారు .సరిగ్గా కాశీనాధుని గర్భగుడి ముందుకు వచ్చారు.రాజదంపతులు భక్తి తో తన్మయత్వం తమ కళ్ళ ముందు ఉన్న శివలింగమును చూస్తూ సర్వ దర్శనం కోసం లోపలి పోసాగారు.
కాశీ విశ్వనాధుని ఆలయం లోని జ్యోతిర్లింగం లోకి అడుగు పెట్టబోతూ ,రాణి ప్రభ కాలు జారి తూలి వెళ్లి జ్యోతిర్లింగం పైన పడింది .దానితో ఆమె గర్భం సరిగ్గా విశ్వనాధుని లింగం మీద పడింది .అలా పడటం తో ,గర్భం లో కదలిక వచ్చి ,ఆమె కి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి .దర్శనం కోసం ఉన్న భక్తులందరూ ఈ హటాత్పరిణామానికి విస్తుపోయారు .కాని , మహారాజు మాత్రం తమ ప్రార్ధనను శివుడు వెంటనే ఆలకి౦ చినందుకు సంతోషించాడు.”ఇంత కాలం ప్రసవం కాలేదు అనే కదా నా బాధా,ఇప్పుడు తీర్చావు తండ్రి.”అని తనలో తాను ఆనందించాడు .ఈ లోపల మహా రాణిని ,పుర మహిళలు పక్కకి తీసుకొని వచ్చారు .వారిని తీసుకొని కాశీ విశ్వనాధుని ఆలయం లో౦చి బయటకు పోతుండగా బయట ఒక మహా కాయుడు గా రాక్షసుడు బయట ప్రత్యక్ష మయ్యాడు.ఆ రాక్షసుడికి మొహమంతా కను గ్రుడ్డు లాగా ఉంది .క్రింద అంతా మాములుగా ఉండి,తల మాత్రం కను గ్రుడ్డు లాగా ఉంది.వాడ్ని చూసి అందరు భీతిల్లారు.జనులందరూ ఆ రాక్షసుడిని చూసి భీతి చెందారు.అందరు పారిపోయారు .రాణి ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్ది ,బయట ఆ రాక్షసుడు ఎదురుచూడ సాగాడు. ఆ రాక్షసుడు ఆలయం లోకి అడుగు పెట్టబోయే ముందు అతనికి మంటలు కనపడ్డాయి .అయినా సరే ,పాదం మోపగానే విద్యుత్ ప్రవాహం ఒంటికి తగిలి అరవసాగాడు.ఈ సంగటన చూసిన భక్తులు ఆ రాక్షసుడు ఆలయం లోకి రాడులే అని తలచి,రాణి ,కాశీ విశ్వనాధుని మందిరం లోనే పురుడు పోయసాగాడు.రాణి ప్రభాదేవి,ఈ సంగటన చోసీ భితిల్లి ,భారం మొత్తం విస్వనాదుని మీద మ్రోసె భాద్యత అప్పగించి తను సృహ తప్పింది.రాజు ,భటులు ,ప్రజలు ఈ సంగటన చూసి నివ్వెరపోయారు.భటులు బైటకు వెళ్లి, ఆ రాక్షసుడి తో పోరాడసాగారు,వారిని నిలువరించి ,చంపాడు ఆ రాక్షసుడు.అలా కొంతమంది భటులను పొట్టన పెట్టుకున్నాడు రాక్షసుడు.వారు విసిరిన బల్లాలు,ఆయుధాలు వాడిని ఏమి చేయలేకపోయాయి.ఇంక ,రాజే వాడిని ఎదిరిద్దామని బయలు దేరగా,ప్రజలు,మహారాణి పరిస్థితి వివరించి వద్దని వారించారు.రాజు గారు ,మహారాణి పరిస్థితి గూర్చే కాకుండా ఆ రాక్షసుడిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. మునుపు ఎన్నడు ఎరుగని ఈ దృశ్యం అందరిని స్థంబింపచేసింది .విశ్వనాధుని ఆలయం బయట ,రాక్షసుడు ఉండటం ఏమిటి అని అందరు ఆర్చ్యర్య పడ్డారు.పరిస్థితి చేజారింది రాణి కి కాన్పు అయ్యే సమయం ఆసన్నమైనది. బయట రాక్షసుడు పెట్రేగి పోతున్నాడు .కొంతమంది ఋషులు ,యోగులు ఇది అంతా చూస్తున్నారు.వారి వారి యోగ దృష్టి తో ఇదంతా చూస్తూ అసలు ,ఈ రాక్షసుడు కాశి లోకి ఎలా వచ్చాడు అని ఆలోచించగా “ ఎంతో నిగూడమైన శక్తివంతమైన మంత్రాలను, అద్యయనం చేస్తుండగా ఆ రాక్షసుడు,వేద పాటశాల పైనున్న మహా వృక్షం మీద కూర్చొని విన్నాడు .అవి విష్ట్నుదేవుని అనుగ్రహ మంత్రాలు కావటం చేత ,అవి మననం చేయటం చేత,ఆ రాక్షసుడికి కాశీ ప్రవేశం లభించింది.కాని స్వతహాగా దుష్ట బుద్ది కల రాక్షసుడు కావటం వల్ల ఆలయం లొకీ అడుగుపెట్ట లేకపోయాడు.
రాక్షసుడు భీకరం గా విపరీతంగా నవ్వసాగాడు.వాడి నవ్వు కి చెట్ల పై ఉన్న పక్షులు ఎగిరి పోయాయి.ప్రజలు ఆ ధ్వనికి చెవులు మూసుకున్నారు .కొంతమందికి చెవిలో నుండి రక్తం రా సాగింది .రాణి సృహ తప్పింది.ఏమి చేయాలో పాలుపోలేదు.ఋషులు ఆ రాక్షసుడి గూర్చి ఎరిగిన వారు మహారాజుకి “ వాడి మంత్రపటనం వల్ల వాడికి కాశీ ప్రవేశం లభించింది”అని చెప్పారు .కేశవ సేనుడు కి ఏమి చేయాలో పాలుపోలేదు.అప్పడు కేశవసేనుడు ఋషుల౦ దరిని మంత్ర శక్తి చేత ఎదుర్కొనే శక్తి ఎదన్నా ఉందా అని అర్దించాడు.ఇదంతా చూస్తూ కూర్చున్నాడు ఒక తపస్వి .ఆ తపస్వి రాక్షసుడు వచ్చిన దగ్గర నుండి ఆలయం లో ఒక మూల కూర్చొని శివునికై ధ్యానం చేయసాగాడు.ఆ మునులందరి దగ్గరకు ఆ తపస్వి వచ్చి “ ఋషులారా! మీరు చెప్పింది నిజమే ,ఆ రాక్షసుడిని నిలువరించి మహారాణికి పుత్రుడికి రక్షణ కల్పించటమే మన కర్తవ్యం .”రాజుగారు” మీరు ఏమైనా చేయగలరా ,మహానుభావా” అని అడిగాడు .”ప్రజలారా! మీరందరూ పంచాక్షరి చేయండి.గట్టిగా ప్రతిద్వనించాలి.”అని అడిగాడు.దానితో అందరు ఋషులు
సైతం “ ఓం నమఃశివాయః” అని జపం చేయటం మొదలెట్టారు.ఆలయం లో అందరు ,చేస్తున్న పంచాక్షరి విని రాక్షసుడు విస్తుపోయాడు. వారందరూ భయపడటం మానేసారేమి అని విస్తుపోయాడు. మళ్ళి తను రాక్షస నాదం చేసాడు.ఆ తపస్వి ఇలా చెప్పాడు.-“ రాజా! నా పేరు విష్ట్ను నంది .నేను ఒక విరాగిని.మోక్ష సాధనకై కాశీ లో ఉండి తపస్సు చేయాలనుకుంటున్నా ,నా తపస్సు వల్ల నాకు కొన్ని శక్తులు లభించాయి .వాటిని పరోపకారార్దం మాత్రమే వాడలేను.ఆ రాక్షసుడు నిజానికి వచ్చింది.పుట్టబోవు మీ పుత్రుడుని సంహరించుట కే “,కేశవసేనుడు-“ఏమి మాట్లాడుతున్నారు,ఆర్యా”అని తెల్ల ముఖం వేసాడు..”అవును ప్రభూ!మీరు 11 నెలలైనా ప్రసవం కాలేదు అని భాదపడుతున్నారు,కాని అది విశ్వనాధుని లీల ,ఆ రాక్షసుడిని చంపగలవారు ఎవరు లేరు.,నిలువరించగలరు అంత మాత్రమే,మనందరం సాధించగలం .మీకు పుట్టబోవు యువరాజు రుద్రగ ణుడు, అతను ఒక కార్యం కై ఉద్భవించే కారణ జన్ముడు.మీ పుత్రుడు మాత్రమే అతన్ని సంహరించగలడు.అది తెలుసుకున్న ఆ రక్కసుడు బిడ్డని చంపుదామని యత్నిస్తున్నాడు.అతనికి ఉన్న శాపవశాత్తూ ఆడువారిని చంపలేడు.అందుకే తెలివిగా ,రాణి గారి ప్రసవం దాక ఆగాడు.ముందే గొడవ చేస్తే మీరు జాగ్రత్త పడతారని తెలిసి ,రాణి గారి ప్రసవం కోసం ఎదురు చూస్తున్నాడు.అందుకే రాణి గారికి నొప్పులు మొదలైన వెంటనే వాడు ప్రత్యక్షమయ్యాడు.అంతవరకు మాత్రమే నేను తెలుసుకున్నాను “ కేశవ సేనుడు –“భగవంతుడా ఏమి చేయాలి “ అని అర్ధించాడు. దాంతో విష్ట్ను నంది “రాజా! ఆ పరమేశ్వరుడు ధర్మ పక్ష పాతి ,అందుకే మీకు రాణి గారి ప్రసవం కాకుండా చూసాడు,ఇప్పుడు ప్రసవ వేదనప్పుడు ఆలయంలో ఉన్నారు .వాడు ఆలయం లోకి రాలేడు. చూశారా ఆ శివుని లీలా వినోదం “ అని సమాధానపరిచాడు.
“మరి రాణి గారికి కాన్పు ఎట్లా ఆమె సృహ తప్పింది కదా?”అన్నాడు రాజు.ఆ తపస్వి వచ్చి “జ్యోతిర్లింగాన ఉన్న పుష్పములు తెచ్చాను, ఇవి సామాన్యమైనవి కాదు,ఒక భక్తుని నిజమైన భక్తికి తార్కాణం .ఆ భక్తుడు ఇచ్చిన ఈ పుష్పం ,స్వయం గా పరమేశ్వరుడు స్వీకరించాడు.”అని మళ్ళి వెనక్కి వెళ్లి,జ్యోతిర్లింగానికి అభిషేకించిన జలం లో ఆ పుష్పం ముంచి ,కాసేపు మంత్రించాడు తపస్వి.”ప్రభూ!ఈ పుష్పం రాణి గారి వద్దకు తీసుకువెళ్ళి ఆమెకు తాకించి ,చిలకరించండి, ఆ పుష్పం లో ఉన్న తీర్దం ఆమె మీద పడగానే ఆమె కు సృహ వస్తుంది .”అని అన్నాడు.”అదేదో మీరే చేయండి మహాత్మా” అని అన్నాడు రాజు .” మీ చిత్తం” అని ఆ పుష్పాన్ని రాణి గారికి తాకించి ,అందులో జలాన్ని ఆమె మీద చిలకరించాడు. రాణి కి సృహ వచ్చింది.అక్కడున్న వారందరూ,ఆ తపస్వికి చేతులెత్తి మ్రోక్కారు.”ఏమైనది ప్రభూ! ఆ రక్కసుడి బారి నుండి మనం బైటపడ్డామా
“అని రాణి అడిగింది.” తీవ్రమైన ప్రసవ వేదన ప్రారంభమైనది.ఇక ,ఆలయం లో ఉన్న అందరు మహిళల్ని పిలిచి రాణి గారికి ప్రసవం చేయమని అర్ధించారు.అదృష్టవశాత్తు మంత్రసాని ఒకామె ఆలయం లో ఉంది .ఆలయం లో స్రీలందరూ చుట్టూమూగగా రాణి గారికి ప్రసవం ఆ మంత్రసాని మొదలుపెట్టింది.రాణి గారి వేదన తీవ్రతరమైనది.బయట రాక్షసుడి గర్జనలు వినపడుతున్నాయి.ప్రజలందరూ “ ఓం నమః శివాయః “ అని ప్రార్ధన గట్టిగా చేస్తున్నారు .రాణి గారికి ఎంతసేపు ప్రసవం కావటం లేదు .కిటుకు తెలిసిన మంత్రసాని “మహా రాజా! మీ రెందుకు బైటకి వెళ్లి ఆ రాక్షసుడి తో తలపడుతున్నారు” అని రోదించసాగింది.ఇది విన్న మహారాణి “మహారాజా” అని కేక పెట్టి ఒక మనో ప్రకంపనకు గురియినది వెంటనే ప్రసవం అయింది.
రాజ కుమారుడు ఉదయించాడు.అందరికి ఆనందానికి అవదుల్లేవు.పుత్రుడి జననం తో మహారాజు “ పరమేశ్వరా! ఈ రాజ్యానికి వారసుడిని ఇచ్చావు,ఇక వాని పోషణ,ఆలనా,పాలన,భాద్యత కూడా నీదే” అని నిట్టూర్పు ఇచ్చాడు.మంత్రసాని వచ్చి “రాజా! మీకు పుత్రుడు ఉదయించాడు,మన రాజ్యానికి వారసుడు,మాకు లభించాడు”అని ఆనందం గా చెప్పింది.”రాజు వెంటనే తన మెడలో ఉన్న రత్నాల హారాన్ని ఆమెకి భహూకరించి ఆమెకి సోదర భావంతో “సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞుడిని అమ్మా”అని అన్నాడు .ఇదంతా గమనించిన రాక్షసుడి కి పుత్రుడు పుట్టాడని చెలరేగిపోయాడు.ఆలయం బయట ఉన్న చెట్లను పరికించి ,అవి గంగ లో పారేయసాగాడు.మహా వృక్షాలని పెకలించి ,వాటిని ముక్కలు ముక్కలుగా చేసి ఆలయం పైకి వేసాడు.కొన్ని కొమ్మలని విరిచి ఆలయం ద్వారం గుండా లోపలి పడేటట్లు గురిచూసి విసిరాడు .అది మహా రాజు కి తగలబోగా అడ్డువచ్చిన ఇద్దరికీ తగిలి మూర్చిల్లారు.రాక్షసుడి తల అంటే కనుగ్రుడ్డు మొత్తం కోపం గా ఎరుపెక్కింది.అందరు ఏమి చేయాలో పాలుపోలేకపోయారు.అందరు దారి చూపు మహాదేవ అని ప్రార్ధించారు.మహారాణి మళ్ళి సృహ తప్పింది .
అందరికి రాకుమారుడి జననం వల్ల ఆనందం పొంగి’పొర్లింది.కాని ,ఆ రాక్షసుడి బారి వలన భాద కలిగింది.ఆ రాక్షసుడి దెబ్బకు కాశీ మొత్తం నిర్మానుష్యమైనది.అవి గంగ పుష్కరాలు కావటం చేత స్నానానికి వచ్చిన భక్తులు సైతం భితిల్లి పారిపోయారు.అయితే ఆలయం లో ప్రసవం తరువాత చేయవలసిన అన్ని పనులు దొరికిన అందుబాటులో ఉన్న వాటి తో చేసారు ప్రజలు.కాని అందరికి ఒక చోద్యం ఏమిటంటే .” రాకుమారుడు ఒక ఏడుపు కూడా ఏడవలేదు.అతనికి పుట్టుకతోనే జటాజూటాలు కలవు.పుట్టిన పసికందుకు జటాజూటాలా? అని ఆచ్యర్యపడ్డారు అందరూ.అంతే కాక నుదురు మీద విభూది వలే రేఖలు గీతాలు ప్రస్పుటం గా కనిపిస్తున్నాయి .నిజం గా ఈ బాలుడు శివ వరప్రసాది? అని ఆనుకొనసాగారు.
ఆనందం లో ఉన్న రాజు గారి సైతం పుట్టిన తన కుమారుడుని ఆలింగనం చేసుకుందామని వెళ్లి ,అక్కడి శిశువు ని చూసి నిచ్చేష్టుడైనాడు.ఆ బాలుడు ఏడవనేలేదు,పైగా జటాజూటాలు,నుదురు పైన విభూది రేఖలు ఉన్నాయి.జూటాలు,విభూది రేఖలు చూసి ,రాజుగారు ఎంతో ఆనందించిన ఉలుకు పలుకు లేని బిడ్డని చూసి,” పరమేశ్వరా! ఏమి ఈ పరీక్ష తండ్రి “ అని అర్ధించాడు.ఒక వైపు రాక్షసుడు సంహారం గూర్చి,యోచిస్తున్నారు.అంతయూ ,కర్మ అని ప్రజలు అనుకోసాగారు.రాణి గారి పరిస్థితి,ప్రజల స్థితి చూసి ,రాక్షసుడిని ఆపదలచి ,రాజుగారు ,ఆలయ ప్రవేశ ద్వారం వరకూ వచ్చి –“ రాక్షసుడా! నీకు ఏమి కావాలి ,ఆపు నీ మారణ కాండ” అని అన్నాడు .రాక్షసుడు క్రింద మాట్లాడిన రాజును చూసి “హో హో హో రాజా !నాకు నీ బిడ్డ కావాలి అని అన్నాడు .అంతే కాక ,నీ బిడ్డను ఇస్తే ,నేను ఎవరిని ఏమి చేయను, చూస్కో రాజ్య వారసుడా,రాజ్య ప్రజలా,పుత్రుడా? “ అని వికటాట్టహాసం చేశాడు.రాజు గారు శిశువు దగ్గరికి వచ్చి “ఈ ఒక్క బిడ్డ కన్నా ,నా రాజ్యం లో ఉన్న ఎంతో మంది బిడ్డల్ని కాపాడటమే నా బాధ్యత”బిడ్డను తీసుకెళ్లపోయాడు.ధ్యానంలో నుండి మేల్కొన్న విష్ణునంది వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి –“ మహారాజా! ఏమిటి ఈ శిశువు ని ఏమి చేస్తున్నారు” అని అన్నాడు.మహారాజు నిరాశావాదం తో “ జీవం లేని ఈ శిశువు కోసం ,ఇన్ని జీవితాలు బలిచేయలా అని అన్నాడు .”మహారాజా!ఈ బిడ్డకి జీవం లేకపోవటం ఏమిటి ,ఇతడు కారణ జన్ముడు ,కర్మ ఫలితం తో పుట్టే వారు ఏడుస్తారు ,సాదించుటకు పుట్టిన వారు పుట్టుక తోనే వారి భాద్యతను ఆలోచిస్తారు” అని ఆ శిశువు ని తన చేతుల్లోకి తీసుకొని బిడ్డ చెవి దగ్గర ఏవో కొన్ని నిగూడ మంత్రాలు చెప్పి ,ఆ శిశువు యొక్క నుదురు మీద ,ముక్కు మీద ,వీపు మీద ఏదో శక్తి ఆ పాదించినట్లు కొన్ని క్షణాలు పట్టాడు విష్ణు నంది దాంతో ఆ శిశువు “ కెవ్వు కెవ్వు మన్ని ఏడ్చాడు. అందరు తన్మయత్వం తో “ఓం నమః శివాయః”అని బిగ్గరగా పటించారు.శిశువు దగ్గర విష్ణు నంది రుద్రుని మంత్రం చెప్పాడు .బిడ్డ ఏడుపు చూసి అందరు ,రాజు గారు పరమానందబరితులయ్యారు.రాజు గారు బిడ్డను ముద్దాడారు.అందరు మహా దేవుని కి జయద్వానాలు చేయసాగారు.రాక్షసుడు,మరింత పెట్రేగి తన శక్తులతో చేతుల నుండి నిప్పులు రాజేసాడు.రాజు గారు విష్ణు నంది వైపు చూసి “ఎలా “ అని అర్ధించాడు.బయపడకండి ప్రభూ! ఆ రాక్షసుడిని నిలువరించే మార్గం ఉంది “అని అనే సరికి ఏమిటది”అని రాజు గారు సైనికులు ,ఉపాయం చెప్పమని ఎంతో ఆతురుతగా అడిగే సరికి విష్ణునంది చెప్పసాగాడు.
మహారాజా ! ఆ ఒంటికంటి రాక్షసుడ్నినియంత్రించడానికి ఒక మార్గం ఉంది” అని అక్కడ ఉన్న రాక్షసుడ్ని గుడి బయటకు వచ్చి ఎగాదిగా చూసాడు. అక్కడన్న ఋషులకు ,మహర్షులకు ,”అయ్యా! తామందరూ దయచేసి మీ తపస్సు కొంత శక్తిని ఆ జలంలోకి తీసుకోండి”, అని చెప్పాడు. ఆ రాక్షసుడు “రాజా! మరికొన్ని నిమిషాలు మాత్రమే వేచివుంటా . ఆతర్వాత తెలుసుగా ఏమి చేస్తానో “ అని.. ‘హా హా’ అని నవ్వసాగాడు. కేశవసేనుడు “ఆర్యా! ఏమి ఆ మార్గము ,తొందరగా చెప్పండి “ అన్నాడు . రాణి స్పృహ తప్పి ఉంది. ఋషులు మంత్రం జలమును సిద్ధం చేసారు. వాటిని విష్ణునంది ‘కాశీవిశ్వనాధునికి ‘ లింగానికి అభిషేకము చేసి ,మళ్ళీ ఆజలమును జాగ్రత్త చేయమన్నాడు. అంతా అలాగే చేసారు. విష్ణునంది తన మూట దగ్గరకు వెళ్లి దానిని విప్పాడు.అందులో ఒక బాకు ఉంది. దానిమీద ఎదో మీట లాగా వుంది . దానిని నొక్కాడు. అంతే ..అందరూ ఆశ్చర్యపోయే విధంగా ,అది రెండు కొనలు ఉన్న కత్తిగా అయింది. సన్నగా 5 అడుగులు ఉంది. దాన్ని చూసి అందరూ “ ఏమిటి, ఏమిటి “ అనుకోసాగారు. ఇంతలో జలం తెచ్చారు ఋషులు . విష్ణునంది ఆలయం బయటికి వచ్చాడు. రాక్షసుడు “ ఏరా ,అంత ధైర్యం, నాముందుకే వచ్చావా?” అన్నాడు.
విష్ణునంది ,” చూడు ,ఎప్పుడో చచ్చినదానికి ఇప్పుడు ఈ పసిబిడ్డ ని చంపుతావా ?”
రాక్షసుడు , “నాకెలా తెలుసు” అని కోపంతో ఊగిపోయాడు. అతడు ముందుకు రాబోయి ,ఆలయంలోకి ప్రవేశించలేనని తెలుసుకొని ఉన్నాడు. సిద్ధపరచిన ఆ అభిషేక మంత్రం జలమును విష్ణునంది దగ్గరకు తెచ్చారు భటులు. విష్ణునంది “నీకు మర్యాదగా చెప్తున్నా ,నామాట విను, వెళ్ళిపో “ అన్నాడు.
ఆ రాక్షసుడు “ నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు ,నన్ను ఎవరూ చంపలేరు”.... అన్నాడు.
విష్ణునంది “నిన్నుబాధపెట్టాలి అంటే చంపాలా ? చూడు “ అని ,తనదగ్గర ఉన్న మర కత్తిని ,మంత్రజలంలో ముంచి, ఎత్తి ఆకాశంలోకి చూసాడు. అంతే .ఉన్నట్లుండి ,మేఘాలు మెరిసి ,వర్షం పడటం మొదలయ్యింది.ఆ వర్షం అందరికీ ఆనందంగానే వుంది. కానీ రాక్షసుడికి మాత్రమే ఒళ్ళు దహించుకు పోతోంది . రాక్షసుడు “మంటలు,మంటలు “ అని అరవసాగాడు .తన కనుగుడ్డుని రెండు చేతులతో మూసుకోసాగాడు. అందరూ ఎంతో సంతోషించారు. వెనువెంటనే భటులు వచ్చి ,రాక్షసుడికి గురిపెట్టి ,పుంఖాను ,పుంఖాలుగా బాణాలు వదిలారు .ఆ బాణాలు వాడిని బాధించాయి. అంత కన్నా ఆ వర్షమే వాడిని చంపేస్తోంది. వాడు రోదించ సాగాడు. వెనువెంటనే మహారాజు వెళ్లి ,వాణ్ణి కత్తితో ఖండించుదామని అనుకున్నాడు . రాక్షసుడు తన కనుగుడ్డుకి బాణాలు తగులుతాయేమోనని చేతులు అడ్డం పెట్టుకున్నాడు. రాజు ఎంతనరికినా , వాడి శరీరంలోకి కత్తి దిగుటయేలేదు .అంతలో విష్ణునంది తన దగ్గర ఉన్న కత్తిని రాజుగారికి విసిరేశాడు . అర్ధం చేసుకున్న రాజు ,ఆ కత్తితో రాక్షసుడ్ని నరికేశాడు. బాధతో వాడు అరుస్తున్నాడు. “ఆ రాక్షసుడి శరీరం వేరు చేసినా ,వాడికి ఏమీ కాదు. మళ్ళీ ఎప్పటిలా అతుక్కుంటుంది .” అని చెప్పాడు విష్ణునంది . ఏమిచేయాలా అని తోచుచుండగా , మహారాజు “వాడి శరీరభాగాలను ఎక్కడ ,ఎక్కడ వేయమని “ ఆజ్ఞాపించాడు. కానీ రాక్షసుడి ఒంటికంటి తల మాత్రము “నేను నన్ను నరికింది ఎవరా అని చూడాలా ,మళ్ళీ వస్తావా ,నీ అంతు చూస్తా “ అంటున్నాడు. వాడి రోదన ఎవరూ వినకుండా ,వాడ్ని ముక్కలు ,ముక్కలుగా మూటకట్టి పారేయడానికి భటులు పయనమయ్యారు. అందరూ గండం గడిచింది అనుకోసాగారు. ఇంతలో రాణి స్పృహలోకి వచ్చింది. అందరూ విష్ణునంది కి ధన్యవాదాలు చెప్పారు. ఖడ్గం తిరిగి ఇచ్చారు.ఆ ఖడ్గం మీట నొక్కగానే మళ్ళీ బాకులాగా మారింది. రాణి ,రాజు ఇరువురూ ,విష్ణునందిని వారి అంతఃపురానికి ఆహ్వానించారు. దానికి అతను సమ్మతించాడు యువరాజును ఎత్తుకుని ముద్దాడాడు విష్ణునంది. ధన్యవాదాలు చెబుతున్నట్లు ,ఆశిశువు తన చేతిని విష్ణునంది చేతిలో పెట్టాడు. విష్ణునంది ఎంతో సంతోషించాడు. ఋషులను సైతం గౌరవించి వారికి , రాజ్యంలో ఆహ్వానం ఏర్పాటుచేసి ,వారిని సత్కరించాడు రాజు. ‘ఆబాకు రహస్యం ఏమిటి ‘అని రాజు , కేశవసేనుడు అడిగారు విష్ణునందిని . దానికి “రాజా !అది మాగురుదేవులు నాకు ఇచ్చిన బహుమతి. అడవిలో సంచరించే నేను , ఏదైనా ప్రమాదానికి గురి అవుతానేమో అని ఇది ఇచ్చారు. ఇంతవరకూ దానితో అవసరం పడలా. ఇప్పుడు మీ రాజకుమారుడికోసం వాడవలసి వచ్చింది. “అని చెప్పాడు. అందరూ ఆనందపడ సాగారు. మరొక్కమారు కాశీవిశ్వనాధుడికి నమస్కరించి ,వారి రాజ్యానికి బయలుదేరారు. విష్ణునందికి కూడా ఆ కారణజన్ముడిని కాపాడినందుకు చాలా ఆనందంగా వుంది.
రాజ్యంలో యువరాజు పుట్టినందుకు సంబరాలు చేసుకున్నారు.యువరాజుకు చేయవలసిన అన్ని క్రియలు చేసారు రాజదంపతులు. ఒక పండగలా చేసారు. ఋషులు , విష్ణునంది అందరూ రాజ్యక్షేమము కోసం యజ్ఞాలు చేసారు. అంతా ఆనందంగా ఉన్నారు. ఇక ఒకటే మిగిలిఉంది. యువరాజుకు నామకరణం. అందరూ ఏపేరు పెడితే బాగుంటుంది అని యోచించ సాగారు. ఆ బాలకుడి జాతక చక్రం గుణించారు పండితులు, విష్ణునంది. విష్ణునంది యువరాజు జాతకం చూసి , అతను చేసే సాహసాలు ,ప్రయాణాలు ,వింతలు అన్ని గుణి౦చుకున్నాడు. అతని ధ్యాన శక్తికి అతడు శివగణాలలో ఒకరు అనిపించింది అతను పుట్టినప్పుడు. అది నిజం. అతడు ఒక మహత్కార్యం కోసం జన్మించాడు . ధ్యానంలో ఉన్న విష్ణునంది ,బాలుడు పుట్టింది ఏకార్యం కోసమా అని చూసాడు. ఆశ్చర్యం..అతగాడు పుట్టింది “రుద్రదండం” కోసం. విష్ణునంది ఆశ్చర్యపడి ,నిద్రపోతున్న ఆ బాలుణ్ణి ఎత్తుకుని , చెవిదగ్గర ‘రుద్ర,రుద్ర’ అని పిలిచాడు. నిదురిస్తున్న ఆశిశువు ఉలిక్కిపడి లేచాడు . వెనువెంటనే మహారాజు వద్దకు వెళ్లి ,యువరాజుకు పేరు నిర్ణయించా అన్నాడు. ఏమిటి అని అందరూ అడగ్గా “ రుద్రసేన కార్తికేయుడు “ అని కేశవసేనుడి సభలో చెప్పాడు . అందరూ ‘రుద్ర’ అని పిలవాలని చెప్పాడు.
మార్తాండుడి స్థావరం ....
” నా కల నిజము కాబోతుంది, రుద్రదండం కోసం ఉద్భవించాడు వీరుడు. అతగాడ్ని నా వలలో చిక్కుకునేటట్లు చేయాలి. అప్పుడు నా పథకం అమలు జరుపుకోవచ్చు” అని నవ్వసాగాడు. “అచ్చటకు వెళ్ళి రుద్రదండం కైవసం చేసుకోవచ్చు, రుద్రదండం శివుడు విరిచింది నాకోసం. ఈ రుద్రగణ సంభవుడు పుట్టింది నా సేవ చేయడం కోసం” అని మరొక్కమారు బిగ్గరగా నవ్వి, తన మాయాదర్పణం దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచి, ఏవో మంత్రాలు చదివాడు, దాంతో ఆ దర్పణంలో “కాశీనగరంలో రాజకుమారుని జననం, రాక్షసుడి పోరాటం, బాలుడు జన్మించటం, జటాజటాలతో విభూదిరేఖలతో ఉండటం. ఆ బాలున్ని విష్ణునంది కాపాడటం, రాజ్యానికి రావటం, ఆ బాలుడికి “ రుద్రసేన కార్తికేయుడు “ అని నామకరణం చేయటం ‘రుద్ర’ అని పిలవమనటం “ మొత్తం చూశాడు మార్తాండుడు.
ఏదో పథకం వేసినట్లుగా ఒక చోట కూర్చొని శుద్రమాతకి మ్రొక్కాడు. డింభకుడు మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి “గురుదేవ, ఈ పానీయమే మీరు అడిగింది” అని ఇవ్వసాగారు. కానీ మార్తాండుడు మౌనంగా పథకం యోచిస్తున్నాడు. “గురుదేవా” అని మరోసారి బిగ్గరగా పిలిచాడు. మాంత్రికుడి మొహంలో ఒక నవ్వు కనబడింది. డింభకుడి చేతిలో ఉన్న పానీయం తీసుకొని దాన్ని ఒక్కసారిగా మొత్తం తాగాడు. “డింభకా! శివుడికి నంది, విష్ణువుకి గరుడపక్షి, బ్రహ్మకి హంస, ఎలానో నీవు నాకు అలారా, నేను భగవంతుడ్ని అయిన వెంటనే నీకు నా వాహన స్థానం కల్పిస్తా, నన్ను నమ్మి నా సేవలు చేసిన నాకు నా భక్తుల చేత పూజలు చేయిస్తా” అన్నాడు. డింభకుడు – “ప్రభూ! అంటే రుద్రదండం మీ చేతికి వచ్చేసిందా?”. వచ్చేసిందిరా .. వచ్చేసింది. దాదాపుగా, ఇక ఆ బాలుడు పెరిగి పెద్దవాడు అవ్వటం, వాడ్ని పంపించటమే మిగిలింది. ఈ లోపల ఆ రుద్రదండం ఎన్ని ముక్కలయ్యింది, ఎక్కడ పడింది అని తెలుసుకోవాలిరా. అంతలో అక్కడ ఉన్నట్లు ఉండి ఒక మెరుపు మెరిసింది. వెనక్కి తిరిగి చూశారు మార్తాండ డింభకులు- శుద్రవాణి వినిపిస్తుంది “మార్తాండా, నీకొక శుభవార్త. రుద్రదండ సాధనంలో ఒక వింత దాగి ఉంది. ఒక్కొక్క ముక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరొక రుద్రదండం ముక్క ఎక్కడ ఉందో తెలుస్తుంది.. అంటే నీవు పగిలిపోయిన అస్థిపంజరాలలో ఒక్క ముక్క కనపడితే చాలు, మిగితావి ఎక్కడ ఉన్నాయో అవే చెపుతాయి వాటి దారి “ అని ఆగింది. “ధన్యోస్మి శుద్రమాతా” ఎంత మంచి మాట, “మాతా, ధన్యోస్మి, నీకు నా వేల నమస్కారాలు”.. శుద్రవాణి “మార్తాండ, యుక్తితో ప్రవర్తించు, బుద్ధి బలం, మాత్రమే నీకు ముఖ్యం.. అది గుర్తుంచుకో, పోరాటంలో ఆ రుద్రుడిని నీవు ఏమి చేయలేవు, అతనికి దైవభక్తి పుష్కలంగా ఉంది అతన్ని నీవు ఏమిచేయాలి అని చూసినా , ఏమి చేయలేవు. అది గుర్తుంచుకో, గురికి బాణం తగిలేలా ప్రయోగించి, నీ వేల సంవత్సరాల తపస్సు కోరిక నెరవేరుతుంది. నీవు దేవుడివి అవుతావు, “అవును మాతా నీవు చెప్పింది నిజమే నేను దేవుణ్ణి అయినా, నిన్ను పూజించడం మానను, బుద్ధిబలాన్ని ఆయుధంగా పెట్టుకొని పన్నాగం రచించాను” అని శుద్రమాత కి విన్నవించుకున్నాడు.
డింభకా, చూశావురా నా గొప్పతనం, ఈ ప్రపంచంలో భగవంతుడ్ని అవ్వబోతున్న మనిషిని నేను పరమాత్మకు పోటి నేనే. ఇక నన్ను నమ్మిన భక్తులకు ఏమి ఇబ్బంది ఉండదు, అర్హత, కర్మ, ఋణం లేకుండా వారి కోరికలను నేను నెరవేరుస్తా. వారందరూ భోళామార్తాండుడు అని నామీద స్తోత్రాలు చేయవలె, ఇక నాకు ఎదురులేదు. రుద్రదండం ఒక్కటే నాకు కనబడుతుంది హాహాహా ,,, వస్తున్నా రుద్రసేనకార్తికేయ, తరతరాల కథానాయకుల దృక్పథం నాకోసం వాడుకుంటా” అని, డింభకుడితో , నేను భగవంతుడ్ని అయిన తరువాత, ఎటువంటి వేషధారణ ఉండాలో సలహా చెప్పు అని వెనువెంటనే, శివుడి రూపానికి మారాడు. “ ఆహా ఏమిరా ఈ వేషం ఈ విభూది ఏంటి, ఈ జటలు ఏంటి, మెడకు ఈ పాము ఏంటి, ఒంటికి విభూది, నాకు ఇది వద్దురా డింభకా, ఇలా ఉండటం శివుడికే చెల్లు, అందుకే ఆయన దేవాదిదేవుడు, తదుపరి విష్ణుమూర్తి వేషానికి మారాడు, ‘ఒరేయ్ డింభకా, విష్ణుమూర్తి వేషం బాగా ఉంది కానీ, విష్ణుమూర్తి వచ్చాడు అని అనుకుంటారు గానీ, భగవాన్ మార్తాండుడు వచ్చాడు అని అనుకోరుగా, ఇక బ్రహ్మదేవుడు అంటావా నాలుగు తలల శిరోభారం నేను భరించలేనురా.. హాహాహా “అని నవ్వసాగాడు. “డింభకా నీ సృజనాత్మకత అంతా ఉపయోగించి, నాకు ఒక మంచి వేషధారణ నిర్ధారించురా” అని ఆజ్ఞాపించాడు, దాంతో ఇద్దరూ నవ్వసాగారు. “రుద్రదండం” చేతికి రానివ్వరా, అప్పుడు చూద్దుగానీ ఈ భగవంతుడి కృపాకటాక్షాలు అని నవ్వసాగాడు.
**************************
వైకుంఠం... ఏడుద్వారాలు తెరుచుకున్నాయి...
కరుణమోముతో మహావిష్ణువు ఆపదమొక్కులవాడు, అర్త జననారాయణుడు, భక్తహృదయ పారాయణుడు, కమలాధరా చతుర్భుజుడు ప్రసన్నంగా, లోకమాత లక్మీదేవి పాదాలు ఒత్తుతుండగా, కనులు తెరిచి చూశాడు. లక్ష్మీ దేవి “ఓం నమో నారాయణాయ“ అని అంది. విష్ణుమూర్తి “ ఓం నమో నారాయణాయ, అని అన్న జనులు కోరుకునేది నీ అనుగ్రహమే లక్ష్మీ” అని చమత్కరించాడు. “నారాయణ, మిమ్ము తలచిన, మహాదేవుని తలచిన నేను వారి వద్దకు వెళ్తాను కదా” అని అంది, లక్మీదేవి “ప్రభూ! ఏమి ఈ మాంత్రికుడి ప్రవర్తన, మహాదేవున్ని మిమ్ము, బ్రహ్మదేవుని చమత్కరిస్తున్నాడు” అని అంది. “ఓ అదా! ఏమిటంటే పిల్లలు ఏమి చేసినా తండ్రికి కోపం రాదు కదా, కానీ వారి భవిష్యత్తు” అని అంది. విష్ణుమూర్తి “పరమేశ్వరుడు ఏమి చేసినా దానికి ఒక అర్ధం ఉంటుంది ఆయన ఏ చర్యలో అయినా కానీ, ఒక లోకకళ్యాణ రహస్యం ఇమిడి ఉంటుంది, ఎంతో జ్ఞానం ఉన్న మార్తాండుడు, మోక్షర్హత కోసం తపస్సు చేసి కూడా భగవంతుడ్నే ఎదురిద్దామనుకుంటున్నాడు. ఆ రుద్రదండం సాధనకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అది సాధించిన తర్వాత.... కానీ, మార్తాండుడి జ్ఞానం ఆసన్నమవ్వదు, తన చావు తాను వెతుకుతూ వెళ్తున్నాడు,”అన్నారు.
“అది ఎలా ప్రభూ” అని అడిగింది మాతలక్ష్మీదేవి.
“సమయం వచ్చినప్పుడు తప్పక అన్నీ అర్ధమవుతాయి.. అయినా లోకమాతవి నీకు తెలీకుండా ఏమీ జరగదు కదా లక్ష్మి” అన్నారు విష్ణు దేవుడు..
లక్ష్మిమాత “నారాయణ.. మాకు అన్నీ తెలిసినా మీ నోటి వెంట వినాలని నా ఆశ”..
విష్ణు దేవా “ఆ..”
అయితే చూడు ఇక మీద అసలు కథ మొదలవబోతుంది...
జంబు ద్వీపం... భరత ఖండం...
మహారాజ కేశవసేనుడు పాలించే రాజ్యం.. ప్రధమశివపురం..
రుద్రసేన కార్తికేయుడు... చిన్నగా పెరుగుతున్నాడు... ఇప్పుడు చిన్నబలుడు అయ్యాడు అయినా.. విష్ణు నంది ఆ రాజ్యం లో వుంది.. యువరాజుకి తగిన విధంగా శిక్షణ ఇస్తున్నాడు...
ఇక యువరాజు రుద్రుడు కి గురుకుల శిక్షణ సమయం ఆసన్నం అయింది.
మహారాజ మరియు రాణి రుద్రుడ్ని అన్ని విధాలుగా తర్ఫీదు ఇవ్వవలసిందిగా ప్రార్ధించి అన్ని విద్యలు తెలిసిన శివపాదుడు అనే మహర్షి దగ్గరకు పంపుదాము అని తన ఆశ్రమ పోషణ కోసం రాజు దగ్గరకు వచ్చిన మహర్షి తో పంపుదాము అని నిర్ధారించుకున్నారు...
శివపాద “రాజ ఏడి మీ రాజకుమారుడు?”
ఇంతలో రుద్రా అక్కడికి వచ్చాడు....
కేసవసేనుడు “కుమారా రుద్రా ఈ రోజు దివ్యమైన ముహూర్తం కావున.. ముందు అనుకున్న విధంగా.. నీవే వెళ్లి విద్యాభ్యాసం మొదలెట్టాలి.. అదిగో నీ గురువుగారు”
శివపాద రుద్రని చూసి.. “బాలుడా.. ఏమి నీ నుదుటి మీద ఈ విభూతిరేఖలు?” అన్నారు.
రాణి చంద్రప్రభ రుద్రా జన్మ వృత్తాంతం మొత్తం చెప్పింది.
శివపాద “ఇతను సహజ పరాక్రమాలు కలిగిన వ్యక్తి.. కేవలం మరొకసారి అన్ని గుర్తుచేయటమే ఇతనికి..” అంటూ ఆశీర్వదించాడు.
రుద్రా “గురుదేవా.. మాతపిత సమానులు, దైవం కన్నా గొప్పవారు నాకు విద్యాదానం చేసి నన్ను ఆదర్శవంతమైన పౌరునిగా తయారు చెయ్యండి. శాస్త్రాల ద్వారా నాకు జ్ఞానం ప్రసాదించండి.
శివపాద “ తప్పక నాయన.. నిన్ను చూస్తుంటేనే ఏదో ఆనందం కలుగుతుంది.. నువ్వు నిండా నూరేళ్ళు వర్దిల్లుతావు..”
రుద్ర అమ్మ నాన్న విష్ణునంది ఆశీర్వాదం తీసుకున్నాడు. విష్ణునంది వెంటనే రుద్రుని ఎత్తుకుని వాత్సల్యం తో ఒక ముద్దు పెట్టుకుని.. “రుద్రా.. ఈ బాకు నీ దగ్గర పెట్టుకో ఇది అన్ని వేళల్లో నిన్ను కాపాడుతుంది.. అంటూ బాకు పనితనం తెలిపి.. తను ఇది వరకు కాసి ఆలయంలో రాక్షసుడిని చంపిన బాకుని ఇచ్చాడు”.
ఇక రుద్రుడుతో పాటు శివపాదునకు కూడా రాజపరివారంతో ఆశ్రమానికి కావాల్సిన వస్తువులు ఇచ్చి పంపించారు.
విష్ణునంది “మహారాజా ఇక రుద్రా గురుకులానికి వెళ్ళాడు. నేను వెళ్లి కాశిలో సాధన చేసుకుని వస్తాను.. రుద్రుడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అతను పెద్దవాడు ఐన తర్వాత.. అతన్ని ఏ శక్తి ఏమి చెయ్యలేదు.. అతని జాతకం లో పూర్ణ ఆయుష్షు.. రాజవైభావం.. నీతి న్యాయం.. అన్నీ వున్నాయి..” అంటూ శెలవు తీసుకున్నాడు.
రుద్రుడు శివపాదుడు అరణ్యం వైపు పయనించారు..
ఇదంతా మాయా దుర్భిణి లో చూస్తున్న మార్తాండుడు ప్రధమపురానికి పయనించాడు..
క్రమేణా యువరాజు పెరిగి పెద్దవాడు అవుతూ.. సకల విద్యలలో ఆరితేరాడు. రుద్ర రుద్రా అని అందరూ అతన్ని కలవరిస్తారు.. మహర్షి.. శివపాదుడికి కూడా రుద్రా ఇష్టమైన శిష్యుడు లాగ ఉండేవాడు.. అన్ని విద్యల్లో అతనికి అతనే సాటి.
అక్కడ ఒక గుర్రాల మంద వుంది.. ఎందుకో తెలీదు.. అన్ని గుర్రాలు పచ్చిక తింటున్నాయి.. ఉన్నట్లుండి ఒక గుర్రం విదిలిస్తుంది.. ఎందుకో అర్ధం కాలేదు ఎవరికీ.. ఆ గుర్రాలు బెదిరిపోతున్నాయి.. అవి గనక బెదిరి పరిగెత్తి వస్తే శివపాదుని ఆశ్రమం నేల మట్టం కావటం ఖాయం.. అవి ఎంతో బలమైన గుర్రాలు.. వాటిని వంచటం ఎవరి తరం కాదు.. ఆ గుర్రాలు బెదిరాయి.. ఎందుకో అర్ధం కాలేదు.. అవి పరుగు మొదలెట్టాయి.. ఉన్నట్లుండి ఎక్కడి నుండో ఎవరో చెట్ల మీద నుండి చెట్ల మీదకి దూకుతున్నాడు.. ఎవరో అర్ధం కావటం లేదు.. ఆశ్రమానికి అడ్డంగా కొన్ని చెట్ల చివరి కొమ్మకి వేళ్ళాడుతున్నాడు.. ఆ కొమ్మని వంచి తన బలం మొత్తం ఉపయోగించి అలా కొన్ని చెట్లకి తాడుని కట్టాడు.. ఎవరికీ ఏమీ అర్ధం కావటం లేదు.. మిగతా శిష్యులు అందరూ ఏమి చెయ్యాలా అని అనుకుంటున్నారు.. అందులో ఒక తుంటరి వాడు “అయ్యో గురువుగారు బయటకు వెళ్ళారే.. ఈ గుర్రాలు మన ఆశ్రమాన్ని పడగొడితే ఎలా.. అసలు మధ్యాహ్న్నం భోజనం కూడా చెయ్యలేదు” అంటున్నాడు, తన పొట్ట మీద చెయ్యి వేసి.. ఇప్పుడు అర్ధం అయింది అతనికి ఆ ముడులు వేయటం వల్ల చాలా గుర్రాలు చెట్లు దాటి రాలేకపోయాయి.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ ఒక గుర్రం మాత్రం ఒక్కసారిగా అంత ఎత్తు మీద నుండి దూకి ఆశ్రమం వైపు పరుగుపెడుతుంది.. ఇక ఇందాక ముడులు వేసిన వీరుడు ఒక్కసారిగా ఆ గుర్రం మీదకు దూకాడు.. అది లొంగట్లా.. ఆ వీరుడు తన మొహం మీద ముసుగుని తీసి గుర్రం మెడకు కట్టాడు.. అయినా అది లొంగలా.. దాన్ని స్వారీ చేస్తున్నాడు.. అది వచ్చి సరిగ్గా ఆశ్రమంలో గురువుగారి స్థానాన్ని కొట్టబోయింది.. అది మట్టిది కావున ఒకవేళ ఆ గుర్రం డీకొంటే ఆ గురు స్థానం పగిలిపోయేది.. అందరూ చూస్తున్నారు వెనక నుండి.. సరిగ్గా అది గురువుగారి స్థానం మీదకి లంఘించబోయేసరికి ఒక్కసారిగా దాన్ని లొంగ దీసి వెనక్కి తిప్పాడు ఆ వీరుడు..
ఎవరో కాదు ఆ వీరుడు “రుద్రా.. రుద్ర సేన కార్తికేయుడు”
అందరూ చప్పట్లు కొడుతున్నారు..
“రేయ్ మన రుద్రా రా.. ముసుగు వేసుకుంటే అర్ధం కాలేదు” అంటున్నారు మిగతా శిష్యులు..
ఆగిన ఆ గుర్రం మళ్ళీ పరుగు మొదలెట్టింది.. దానికి తోచినట్లు అది పరుగుపెడుతోంది.. రుద్రా జాగ్రత్తగా ఆ గుర్రం మీద వున్నాడు.. అది పరిగెట్టి పరిగెట్టి చివరగా ఒక కొండ పై చొరియ కి చేర్చింది.. అది వారి ఆశ్రమ హద్దు.. అక్కడ ఒక సుందర ప్రకృతి రమణీయత వుంది.. చాలా చాలా పెద్దది ఐన జలపాతం వుంది.. ఆ జలపాతానికి అటు చివర ఇటు చివర పెద్ద చెట్లు వున్నాయి.. అటు ఇటు ప్రయత్నిస్తున్నట్లు అక్కడ పెద్ద పెద్ద కొమ్మలు వున్నాయి.. ఒక కొమ్మ బెరడు పట్టుకుని పోతే సరిగ్గా అటు ఒడ్డుకి చేరతారు.. అటు అంతే వుంది.. అది రుద్రకి తెలిసిందే..
రుద్రుడికి ఎక్కడినుండో ఒక పారవశ్యం కలుగుతుంది. వంద కోయిలలు ఒకేసారి కూసినట్లు ఉంది. అక్కడ జలపాతం ప్రవహిస్తుంది. ఆ కొండపై ఒడ్డు ఉంది. ఆ ఒడ్డు నుండి క్రిందికి దారి ఉంటుంది. అది ఎంతో మనోహర దృశ్యం – అక్కడ పచ్చికల మధ్యలో ఎవరో ఉన్నట్లు ఉంది. గుర్రం దిగి అటుకేసి చూశాడు రుద్రుడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక యువతి స్పృహతప్పి పడి ఉంది. ఆమె అపసవ్యమైన పరిస్థితిలో ఉంది. అది చూసాడు రుద్రుడు. రుద్రనోటిలో మాటలు లేవు. తానెప్పుడూ, ఇటువంటి అందాన్ని చూడలేదు. ఆమెని చూసి మైమరచిపోయాడు. ఆమె శరీరం మీద పడిన నెమలీకలు, పూలు ఆమెను కప్పుతూ ఉన్నాయి. రుద్రకి మాత్రం మనసులో వెయ్యి జలపాతాల శబ్దం వినబడుతుంది. పౌర్ణమి చంద్రుడి మీద విహారం చేసినట్లు ఉంది. ప్రపంచంలో అన్ని పక్షులు ఒకేసారి చూసినట్లు ఉంది. వెంటనే గుర్రం దిగి దగ్గరికి వెళ్లి జలపాతంలో నీరు తెచ్చి మొహం మీద చిలకరించాడు. కానీ, ఆమె లేవలేదు. రుద్రకి మనసు పనిచేయడం లేదు. “ఎవరీ వనిత, ఏమి ఈ సౌందర్య ఘనత , ఇదేనా సృష్టిలోని కవిత? “ అంటూ ఆశ్చర్యపడుతున్నాడు. “బహశా ఇంద్రుడు తపస్సును భగ్నం చేయటానికి పంపిన అప్సరస? అని అనుకుంటున్నాడు. ఆమె మ్రింగిన నీరును నోటినుండి బయటకు తెప్పించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఆమె చెవి దగ్గరికి వెళ్ళి “మొసలి మొసలి అని కేకలు వేశాడు. అంతే ఆమె అలజడితో కనులు తెరిచింది. ఆమె కదలికలతో ఆమెపై ఉన్న నెమలీకలు పూలు క్రిందపడ్డాయి. ఆమె అదురుపాటుతో లేచి తెలియని అతన్ని చూసి పరిగెత్తి పొదల చాటున దాగింది. అపుడు “ ఎవరు నీవు అప్సరసవా, శాపవశాత్తు భూమి మీదకు వచ్చిన దేవతవా?అన్నాడు రుద్రుడు.
“ఓ యువతి! భయపడకు, నీవు స్పృహ తప్పి ఉన్నపుడు సాయం చేసిన వాడను నేనే, ఇక్కడికి దగ్గరగా మా గురుకులం ఉంది, శివపాదమహర్షి శిష్యుడను నేను, భయము వలదు”, అన్నాడు. అపుడు ఆ యువతి నేను ఈ జలపాతానికి అవతలి వైపు ఉన్న “పద్మ పట్టణ” రాకుమారిని అన్నది. అంతలోనే ఉన్నట్లుండి ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. “ఓ రాకుమారి నాకు లొంగిపోతావా లేక నిన్ను భక్షించమన్నావా” అన్నాడు.
దానితో ఆ యువతి భయపడసాగింది.” ఓ రాక్షస పురుషా? నాకు నీవు అంటే మనసులేదు నిన్ను నేను వివాహ మాడను, దయచేసి నన్ను వదిలిపొమ్ము, నన్ను బాధపెట్టకు” అంది. సుఖపడు అని అంటే బాధ అంటావు, ఈ మానవులకు అసలు బుద్ధి లేదు, అని ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు.
“నా దగ్గరకు రావొద్దు,” అని భయంతో అరిచే కొలదీ, రాక్షసుడు మరింత వాంఛతో ,తన కోరిక తీర్చుకోవడం కోసం ముందుకు దూకాడు. ఒక్కసారిగా రుద్రుడు “స్త్రీని బలత్కరించడం పురుష లక్షణం కాదు, వలచి రావలసిందే కాని...”, అన్నాడు.
ఆ రాక్షసుడు ఎవరివిరా నీవు బాలకా, పొమ్ము నీ తల్లిదండ్రులకు పుత్రశోకం ఇవ్వటం మాకు ఇష్టం లేదు”, వెంటనే రుద్రుడు “అయితే నన్ను గెలిచి, ఆ వనితను తీసుకుపో”,అన్నాడు.
రాక్షసుడు “అలానా, రా...మనిషి మాంసం తిని చాలారోజులు అయ్యింది” ,అంటూ రుద్రుని మీదకు దుమికాడు. రుద్రుడు తన శక్తి సామర్ధ్యాలతో నిలువరిస్తున్నాడు. వారి పోరు దూరం నుండి చూసినా, పొదలచాటు ఉన్న రాకుమారి ఆనందంగా ఉంది. పోరులో ఉన్నప్పుడు రాక్షసుడు రుద్రుని విసిరివేశాడు. సరిగ్గా వచ్చి రాకుమారి చెంత పడడంతో రాకుమారి తత్తరపాటుతో ప్రక్కకు తప్పుకుంది. ఆమె బిడియాన్ని, తత్తరపాటుని చూసి పరిహసిస్తున్నాడు. ఇక రుద్రుడు వాయువేగంతో వెళ్ళి తన దగ్గర ఉన్న విష్ణునంది ఇచ్చిన బాకుతో వానిని హతమార్చాడు. ఆ రాకుమారి ఎంతో ఆనందించింది.
ఆ రాకుమారి, “వీరుడా, నా సమస్యను అంతం చేశావు, నేను పరిపూర్ణంగా ధరించుటకు మరియొక వస్త్రమును ఇవ్వుమని అడిగింది. రుద్రుడు తను తెచ్చిన వస్త్రమును, తన ముసుగును, తన శరీరంపై ఉన్న వస్త్రమును అటు ఇటుగా ఎన్నో తిప్పి , దాన్ని రాకుమారి ధరించే విధంగా తీర్చిదిద్దాడు. దానికి గట్టిగా మరికొన్ని ముడులు వేసి, దానికి కొన్ని పూలు ఆకులు అందంగా అలంకరించి ఒక నూతన శైలి వస్త్రమును చేసి ఆమెకు అందించాడు. అది ధరించి ఆ రాకుమారి పొదలమాటు నుండి బయటకు వచ్చి, అక్కడ నీటిలో తన బింబాన్ని చూసుకొని మురిసిపోయింది.
“వీరుడా, మా రాజ్య చేనేత పట్టుకళాకారులకు కూడా ఇంత గొప్ప శైలిలో వస్త్రములు చేయలేరు. ఇది బహు ముచ్చటగా ఉంది. నా మాన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు అంది. “ధన్యవాదములు రాకుమారి, మీ కథ సంక్షిప్తంగా చెప్పండి, అని చమత్కరింపుతో అడిగాడు. ఆ రాకుమారి “పద్మపట్టణ రాకుమారిని నేను, ఆ రాక్షసుడు నాచెంత ప్రత్యక్షమయ్యి మనువాడమని బలవంతపెట్టాడు. వాడ్ని ఎదిరిద్దామనేసరికి మాయమయ్యేవాడు. నాకు స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు, నా ముందు ప్రత్యక్షమయ్యి “ ఇంతకాలం సహనంగా ఉండడమే తప్పు, నిన్ను ఏమి చేయకపోవడమే నా తప్పు, ఇక ఆ తప్పు చేయను అని చెప్పి నన్ను అపహరించి తీసుకుపోతున్నాడు. నేను వాడ్ని మనువాడడం కన్నా చావడం మేలని గాలిలో వెళుతున్న అతని చేతిపట్టు వదిలించుకున్నాను, బహుశా నీటిలో పడేప్పుడు నా వస్త్రములు ఈ చెట్టు చేమలకు తగులుకొని, క్రిందపడే వేగం తగ్గి, కొంచెం గాయాలతో నీళ్ళలో పడి స్పృహ తప్పు తుండడంతో అతి కష్టం మీద ఒడ్డుకు వచ్చాను. ఆ తర్వాత నీకు తెలిసిందే?
రుద్రుడు మొత్తం విని “అది సరే నాకొక సందేహం...” అన్నాడు.
“ఏమి ఆ సందేహం ? “అంది రాకుమారి.
“మీ రాజ్యంలో పరిచయం అయిన వెంటనే పేరు చెప్పరా?” అడిగాడు రుద్రుడు.
రాకుమారి నవ్వుతూ “వీరుడా! అందరికీ పేరు చెప్పము, కానీ నా మాన,ప్రాణాలు కాపాడిన మీకు చెప్పుట సమంజసమే, నా నామధేయం “భావనాదేవి” అంది.
రుద్ర “ మిమ్ము చూస్తే ఎన్నో భావనలు కలుగుతాయి రాకుమారి, అందుకేనేమో మీకు “భావన” అని పేరు పెట్టారు,” అన్నాడు.
రాకుమారి “అది సరే, ఈ వస్త్రములు నాకు బాగా నచ్చినవి, దయచేసి ఇటువంటివి కొన్ని నాకు చేసి ఇవ్వు వీరుడా!...... అంతియే కాదు రుద్రా.. మా తండ్రిగారితో నీవు చేసిన సహాయము చెప్పి, మా రాజ్యంలో నీకొక మంచి కొలువు ఇప్పించగలము,” అంది.
రుద్రుడు “నేను రాకుమారుడను” అన్న మాట అనబోయి, చలాకీగా, “నేను వస్త్రములు ఇచ్చినంత మాత్రానికే మీరు నాకు జీవనాధారం కల్పించడం, ఎంతైనా మీరు దయార్ద్రులు రాకుమారి” అన్నాడు.
“పరోపకారం మా రాజవంశంలోనే ఉంది !” అన్నది రాకుమారి.
సూర్యకాంతి రాకుమారి మోముపై పడుతుండగా, వీచిన చిరుగాలికి అటుగా ఉన్న చిలుకలు రాకుమారి భుజాల మీద వాలగా, రాలిన పూలు ఆకులు రాకుమారిపై పడి, చిరునవ్వుతో ఉన్న భావనాదేవి రూపం చూసి రుద్రుడు ముగ్దుడు అయ్యాడు.
రుద్రుడు “రాకుమారి ! మీరు మీ అంతరంగిక మందిరంలో పక్షులను పంజరంలో పెడతారా”, అయినా మీరు అటువంటి పని చేయకండి, పంజరంలో లేకపోయినా అవి మీ చుట్టే తిరుగుతాయి. మీ నవ్వు, మనసు అనే పంజరాన్ని కూడా చేధిస్తుంది.” అన్నాడు.
రాకుమారి రుద్రుడి మాటలకు సిగ్గుపడి , “అటులనే, ఇక మీ పొగడ్తలు ఆపి మా రాజ్యమునకు ఎటుల పోవలయునో చెప్పుము” అన్నది.
రుద్ర “తప్పకుండా రాకుమారి, కానీ మీరు మీ రాజ్యమునకు వెళ్ళిన తర్వాత, ఇక మిమ్మల్ని కలవలేము అని తలచుకుంటే కొంచెం బాధగా ఉంది.” అంటూ తన నుదుటిపై పడిన జుట్టుని సవరించుకున్నాడు.
రుద్రుడి నుదుటిపై విభూది రేఖలవలె ఉండడం చూసి రాకుమారి ఆశ్చర్యపడి, రుద్రా, “ఏమి ఈ విభూది రేఖలు, నీవు శివవరప్రసాదివా? అందుకే అంత శౌర్యం ఉన్నదా ?” అన్నది.
రుద్రుడు తన వివరణ పెద్దగా ఏమి తెలపకుండా “పుట్టుకతో వచ్చాయి” అని మాత్రమే చెప్పాడు. ఎందుకంటే పద్మ పట్టణ రాకుమారిని కనిపెట్టడం రుద్రయువరాజుకి పెద్ద విషయం కాదుగా.
భావనాదేవి “రుద్రా, నా జాతకమును గుణించి, నాకు శివవరప్రసాదితో కల్యాణం జరుగుతుంది అని చెప్పారు”, అని రుద్రునికి తెలపాలని మనసులో ఉన్నా, ఆ విషయం ప్రస్తావించలేదు.
రుద్రుడు ,”మీతో పరిచయం నాకెంతో ఆనందంగా ఉంది రాకుమారి. ఈ చిన్ని వీరుణ్ణి గుర్తుపెట్టుకుంటారుగా” అన్నాడు. ఆ.. ఆ.. అన్నది రాకుమారి.
ఇంతలో వచ్చారు కొంత మంది భటులు, వారితో పాటు శివపాదమహర్షి. యువరాణిని చూసిన భటులు ఒక ఉదుటున వెళ్ళి రుద్రుడి మీద కత్తులు పెట్టారు. యువరాణి “ఆగండి భటులారా, అతను నా ప్రాణాలను కాపాడి, రాక్షసుణ్ణి సంహరించిన వీరుడు “ అంది. ఆ భటులు రాకుమారుడు రుద్రుడికి ధన్యవాదాలు తెలిపారు.
అటుగా చూసిన రుద్రుడు,” గురుదేవా ప్రణామాలు !” అని గుర్రం దిగి, రాకుమారి కథ అంతా శివపాదుడికి చెప్పాడు, అందరూ ఆశ్రమానికి వెళ్ళారు . అక్కడ భటులు, కొంత మంది చెలికత్తెలు వచ్చారు. శివపాదుడు అందరికి విందు ఇచ్చాడు. ఇక రాకుమారి బయలుదేరే సమయం వచ్చింది. శివపాదుడు “ రుద్రా , నీ విద్యాబ్యాసం పూర్తి అయింది, ఇక నువ్వు దేనికోసం జన్మించావో, ఆ పని చేయవలసి ఉంది. నీ తల్లిదండ్రులకు కబురు పెడతాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు నాయనా” అన్నారు బాధతో.
రుద్ర “గురుదేవా నా తల్లిదండ్రులకన్నా నాకు మీరంటే ఇష్టం, మిమ్ము వదిలి పోతున్నందుకు నాకు బాధగా ఉంది. మనసులో మీరంటే ఇష్టం ఉన్నా, ప్రత్యక్షంగా మీరు ఉండరు కదా ! అందుకే, నా దగ్గరికి వచ్చేయండి గురుదేవా, అక్కడ మారాజ్యంలో ఆశ్రమం స్థాపించుకొని, అక్కడే శిక్షణ ఇద్దురుగాని”, అన్నాడు కన్నీటితో.
శివపాదుడు “సమయం వచ్చినప్పుడు అలాగే వస్తాను ... మీ తల్లిదండ్రులకు కబురుపెట్టనా” అన్నారు.
రుద్ర “లేదు స్వామి, నేను వెళ్ళి వాళ్ళని ఆశ్చర్యచకితులను చేస్తాను” అన్నాడు.
రాకుమారి వచ్చి “రుద్రా, గురుదేవా, నన్ను కాపాడినందుకు కృతఙ్ఞతలు , మా రాజ్యమునకు రండు, ఇదే మా ఆహ్వానము అన్నది....
రుద్ర “రాకుమారి భావనాదేవి, తప్పకుండా ! “అని రాకుమారి ఇష్టపడిన వస్త్రములు ఇచ్చాడు.
రాకుమారి “ఇక సెలవు” అన్నది చిరునవ్వుతో .
రుద్ర “పద్మపట్టణ యువరాణి సెలవు”....
రుద్రుడు కూడా గురుదేవుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరబోయాడు. గురుదేవులు రుద్రున్ని పిలిచి “నాయనా! ఈ ఉంగరం ధరించు, ఎప్పుడూ తీయకు, దీని మహాత్యం నీకు నిజమైన అవసరం వచ్చినపుడు అర్ధం అవుతుంది .”అంటూ...
“న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, నిజాయితిని, భక్తిని, సంకల్పాన్ని, పట్టుదలను, ఆశయాన్ని వదలవద్దు. మునుముందు నీకు ఎదురుకాబోయే సంఘటనలు, సాహసాలు, అనితరసాధ్యమైనవి... ఈ ఉంగరం జాగ్రత్త, నీవు విజయుడవై రా..” అని ఆశీర్వదించాడు. రుద్రుడు, అతని స్నేహితుడు భట్టు, ఇద్దరూ ప్రథమ శివ పట్టణానికి బయలుదేరారు.. ఇక అసలు కథ మొదలు కాబోతోంది...
**********************
ప్రథమ శివ పట్టణం... ఉత్సవాలు జరుగుతున్నాయి. పోటీలు కూడా, అక్కడ ప్రజలు అందరూ ఆ వేడుకలను వీక్షిస్తున్నారు. అక్కడ పాటలు, నృత్యాలు బాగా జరుగుతున్నాయి. ఇక మహారాజు కేశవసేనుడు లేచి “ప్రజలారా, మన రాజ్యంలో ఉత్సవాలు చేసుకోవటం మనకి ఆనవాయితీ. మనకు రక్ష అయిన ఆ పంచముఖ ఆంజనేయుడి జయంతి నేడు. నేడు జరుగుతున్న “ఆయుధపూజ” కార్యక్రమంలో మన రాజ్యంలోని మహావీరులు పోటీలో పాల్గొని, గెలిచిన వారికి, అద్భుతనైపుణ్యం చూపినవారికి ఉన్నత పదవులు ఇచ్చి మన సైన్యం లో చోటు కల్పిస్తాం” అని అన్నాడు. ప్రజలందరూ “తరతరాల ఆనవాయితీ అని అనుకోసాగారు. పోటీలు మొదలైనాయి. గుర్రపుస్వారిలల్లో, కత్తియుద్ధంలో, మల్లయుద్ద్హంలో చాలా మంది నైపుణ్యం చూపించి విజేతలుగా నిలిచారు. ఎక్కడినుండో వచ్చాడు ముసుగువీరుడు. తను అందుకున్న ఒక ఖడ్గాన్ని ఆ వీరుల మధ్యలోకి విసిరేశాడు. అది పోటీకి ఆహ్వానించినట్లు ఉంది, కానీ, ఆ ముసుగువీరుడు గుర్రం మీదనే ఉన్నాడు. అక్కడి అధికారులు “ఓయీ, ఎవరు నీవు, పోటీలో పాల్గొన దలిస్తే ముందు రావాలి, అంతేగాని, పోటీలో విజేతలైన వారి ముందు ఇలా ప్రవర్తించకూడదు, అది రాచరికపు మర్యాదని అగౌరవపరిచినట్లు అవుతుంది.” కానీ వెనక ఉన్న భట్టు “మా ఉద్దేశ్యం అదే, గెలిచినవారిపై గెలిస్తే ఆ గెలుపు శాశ్వతంగా ఉంటుంది. కేశవసేనుడు, చంద్రప్రభ దేవి, సైనికాధికారులు, ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. కానీ ముసుగువీరుడి గుర్రం ముందుకు దూకుతుంది. భట్టు మహారాజా, విజేతలను ఓడించకూడదా, మాకు కావలసింది పదవి, బహుమతి, ధనం కాదు గౌరవం మాత్రమే.” కేశవసేనుడు “కానిమ్ము” అని సంజ్ఞ చేశారు. మొదటిగా మల్లయుద్ధపు యోధులు వచ్చారు. వారిని విచిత్రమైన పట్టుపట్టి మట్టి కరిపించాడు ముసుగువీరుడు. కట్టియుద్ధంలో వారిని కూడా చిత్తు చేశాడు ముసుగువీరుడు. అక్కడ గుసగుసలు ఎక్కువయ్యాయి. రాజువదనం నిరాశతో ఉంది. “ఎవరీ యోధుడు “ అని ఆలోచనలో పడ్డాడు. “తమ రాజ్యవీరులు ఈ రకంగా చిత్తు అవుతారని ఊహించలా?’ కేశవసేనుడు తన కత్తిని తీసుకొని వెళుతుండగా, ఇంతలో వచ్చాడు విష్ణునంది. రాజు, రాణి ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడో వెళ్ళిన విష్ణునంది ఇప్పుడు రావడం ఏమిటి అని”. విష్ణునంది ఖడ్గాన్ని తీసుకొని ముసుగువీరుడి తో పోరాడుతున్నాడు. విష్ణునంది “మహారాణి ఏమైంది” అని కేకవేశాడు. అంతే ఆ ముసుగువీరుడు వెనక్కి తిరిగాడు. విష్ణునంది ఆ ముసుగువీరుడి కత్తిని ఎగురవేశాడు, అది వెళ్లి అక్కడ ఉన్న పెద్ద పంచముఖహనుమ విగ్రహం ముందు పడింది. అంతే, అందరూ ఆనందపడ్డారు. మొత్తానికి వారి రాజ్య ప్రతినిధే గెలిచాడు. విష్ణునంది “ముసుగువీరుడా, నిజమైన యోధుడి లక్షణం శత్రువు బలం తెలుసుకోవటమే” అన్నాడు. వెంటనే రుద్రుడు తన దగ్గర ఉన్న బాకు తీసుకొని విష్ణునందిపై దాడి చేశాడు. కానీ, ఆ బాకుని తెలివిగా తప్పించాడు విష్ణునంది. ఆ బాకు చూడగానే మహారాజు రాణితో, “ఆ ముసుగువీరుడు” అని ఆనందంతో లేచాడు. విష్ణునంది కత్తితో ముసుగువీరుడి ముసుగుని చింపాడు. అంతే, యువరాజు రుద్రసేన కార్తికేయుడు. రాజు, రాణి ఆనందంగా నిల్చొని, “రమ్ము యువరాజా, నీ విద్యాభ్యాసం అయిపోయినది”అన్నారు ఆప్యాయంగా. ప్రజలందరూ “యువరాజు భలేవాడురా సింహాసనం వారసత్వం, వీరత్వం” అని చెప్పుటకే ఇదంతా చేసి ఉంటాడు. విష్ణునంది “రుద్రసేనా వీరుడవయ్యావు, ప్రథమశివపట్టణ వీరులను ఓడించటం సులభం కాదు” అన్నది. “నేను కూడా వీరుడనే”అన్నాడు రుద్రుడు... విష్ణునంది “తెలుసు రుద్ర నీవని పసిగట్టా, నీవు ఎందుకు నా మీద దాడి చేయలా”, “రుద్రా మీరే గెలిచారు”,.. విష్ణునంది రుద్రుని వాటేసుకున్నాడు. అందరూ
యువరాజు “జయహో” అన్నారు. ఇంతలో పురోహితులు వచ్చి ఆంజనేయపూజ చేయించారు. యువరాజుని రాజు రాణి అందరూ అక్కున చేర్చుకున్నారు. యువరాజు హనుమకి నమస్కరించి “హనుమయ్యా రామనామం చేస్తూ, మమ్మల్ని మరువకయ్యా” అని పాడుతూ, నృత్యము చేసాడు. అందరూ ఉత్సాహవంతులై నృత్యములో పాల్గొన్నారు.
ఇదంతా చూస్తున్నాడు. మార్తాండుడు తన మాయాదర్పణంలో. మార్తాండుడు “డింభకా , ఇక ఆ శివగణాన్ని ఎట్లా నా దారికి తెచ్చుకుంటానో చూడు” అని ఏదోఏదో తంత్రం చేశాడు.
నృత్యం అయిపోయిన తర్వాత భట్టు “మహారాజా యువరాజా రుద్ర నన్ను క్షమించు, నీవు యువరాజువు అని తెలియక నీ చేత ఎన్నో పనులు చేయించాను” అన్నాడు రుద్ర “నేను యువరాజునైనా నీ మిత్రున్ని” అని వాటేసుకున్నాడు”. అందరూ అంతఃపురానికి ఆమడదూరంలోకి వచ్చారు. ఉన్నట్టు ఉండి ఆకాశంలో నుండి ఒక పెద్ద ఒంటికన్ను వచ్చిపడింది. అందరూ బెంబేలు ఎత్తిపోయారు. ఆ ఒంటికన్ను మాట్లాడుతూ “ నీ అంతు చూస్తారా విష్ణునంది, రుద్ర.. మీరు నాకు ఆహారం అవక తప్పదు. రుద్రా, నీవు నా సోదరుడిని కూడా చంపావు, మేము పుట్టింది నీ చేతిలో చావుటకు లాగా ఉంది, నిన్ను వదిలి పెట్టను, ప్రాధేయపడి అడిగినా, నీ వాళ్ళని కూడా నాశనం చేస్తా, చూడు,అని అంది ఆ ఒంటికన్ను. రుద్రుడు తన చేతిలో బాకుని నొక్కాడు. ముందుకు వెళ్ళాడు. కానీ, ఆ ఒంటికన్ను అక్కడ ఉన్న మైదానంలో అటు, ఇటు మాయమై తిరుగుతూ “అంతుచూస్తా” అంటూ వెళ్ళింది. భట్టు అయితే ఆంజనేయస్వామి దగ్గరికి పరిగెత్తాడు. అందరిలో ఆందోళన.
ఇది కూడా చూసి మార్తాండుడు “దొరికిందిరా, డింభకా ‘ మార్గము, “నా మాజీ ప్రేయసి పద్మినిదేవి ఆహ” అంటూ నిప్పు వైపు చూస్తున్నాడు.
డింభకుడు, “మీ మాజీ ప్రేయసి పద్మినిదేవి ఎందుకు వచ్చింది” అంటున్నాడు మార్తాండుడు “గుర్తుందా, నీకు చెప్పిన కథ, అప్పుడు పద్మిని దేవికి వచ్చిన వింత వ్యాది, అది నయం చేశాను ఆ అంధముని వరం వల్ల, డింభకుడు “అవును స్వామీ, గుర్తుకు వచ్చింది అయితే”
మార్తాండుడు “చెప్పాను తరతరాల కథానాయకుల తత్వాన్ని వాడుకుందాము అని, ఇక, చెప్పటానికి ఏమి లేదు ఆట చూడు.”
.......................................................
అంతఃపురం అంతరంగిక మందిరం (ప్రథమ శివ పట్టణం )
రాజు:రాకుమారా, విద్య అయినది, ఇక నీకు వివాహం చేసి రాజ్యాన్ని అప్పజెప్పాలి.
రుద్ర మనసులో భావనాదేవి .... ఎన్ని చిత్రపటాలు చూపించినా కాని నచ్చలేదు....
పురోహితులవారు చివరిగా రాకుమారి భావనాదేవి చిత్రపటాన్ని చూపించాడు.
అంతఃపురం అంతరంగిక మందిరం(పద్మ పట్టణం)
రాణి:రాకుమారి భావనాదేవి, ఇక ఎవరో ఆ రాక్షసుణ్ణి హతమార్చావు అన్నావుగా, ఇక వివాహం చేసుకో.
భావనాదేవి మనసులో రుద్ర....
రాకుమారి ఎన్నో చిత్రపటాలు చూసింది కానీ నచ్చలా .........
...........................................
ఇంతలో రుద్ర తల్లి రాణి చంద్రప్రభాదేవి స్పృహ తప్పి పడిపోయింది. ఎవరికీ ఏమి అర్ధం కాలేదు. ఆమె ఉన్నట్లుండి కళ్ళు తేలేసింది. రుద్ర అందరూ భయపడిపోయారు. ఆమెను హుటాహుటిన రాజవైద్యుల దగ్గరికి తరలించారు. అందరూ ఆమెను పరీక్షగా చూస్తున్నారు, కానీ ఎమయినదో ఎవరికీ అర్ధం కాలేదు. ఆమె వ్యాధిని పసికట్టలేక పోతున్నారు. ఆమె నాడి, గుండె అన్ని బాగానే కొట్టుకుంటున్నాయి, కానీ ఆమె సజీవశవంలాగా ఉంది. ఎంతో మంది రాజపురోహితులు జోస్యులు అందరూ కూర్చొని అన్ని చేస్తున్నారు. యువరాజ్, రాజు మరి రాజపరివారం కన్నీరు కారుస్తున్నారు.రుద్ర “నాన్నగారు, అమ్మని ఎలాగైనా బాగు చేయాలి, అవసరమైతే పరాకాష్టా చాటింపు చేయండి” కేసవసేన “పరాకాష్టా చాటింపు అంటే రుద్ర, అర్ధరాజ్యం ఇవ్వాలి, ఈ రాజ్యం నీది” రుద్ర “నాదైతే, నా హక్కు కదా, చాటింపు వేయండి” అని ఆజ్ఞాపించాడు. చాటింపు స్వయానా యువరాజు “నా తల్లి మన రాణి, చంద్రప్రభాదేవికి వచ్చిన వింత వ్యాధిని నయం చేసిన ఎవరికైనా వారి అర్ధరాజ్యం సింహాసనం ఇస్తాం అంటూ ఏడుస్తూ, అవసరమైతే మొత్తం రాజ్యం త్యాగం చేస్తాను” అని ఏడుస్తూ చాటింపు వేశాడు. ఇంతలో రాజపురం నుంచి మరొక వార్త వచ్చింది. “రాణి గారి నాడి ప్రమాదంలో ఉంది” అని రుద్ర ఏడుస్తూ ఉన్నాడు. రాజకుమారుకి కన్నీరు చూసి ప్రజలు కూడా ఏడుస్తున్నారు. ఏమిటి ఈ కష్టం అనుకుంటున్నారు.
రుద్ర అంతఃపురానికి వెళ్తుండగా, “వారిలో రుద్రునికి ఒక శవం, ఒక రోగి, ఒక పండు ముసలివాడు కనబడ్డారు, వారిని చూసిన రుద్రునికి భగవంతుడి సృష్టిలో మానవజీవితం క్షణికం అని అర్ధమయ్యింది, కానీ రుద్ర మాత్రం తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. “అమ్మా నీ సమ్మతి మేర వివాహం చేసుకుంటా లేమ్మా” అని ఏడుస్తునాడు. రాణి నాడి చల్లబడి, ఉన్నట్లుండి రాణి శరీరంలో వింతవింత రంగులలోకి మారుతుంది. అందరూ భయపడ్డారు. రుద్రకి తన గురువు శివాపాదమహర్షి ఇచ్చిన ఉంగరం స్పురణకు వచ్చింది. అంతే అది తీసుకొని తన తల్లికి పెట్టాడు. రాణి నాడి మరింత వేగం అందుకుంది. ప్రాణం నిలబడింది, కానీ శరీరం మాత్రం రంగులలో ఉంది. ఏంటి ఈ వింత, ఎవరిదైనా ప్రయోగమా అని ఎందఱో భుతవైద్యులు అరాతీసి చూసారు. ఎవరికీ, ఏమి అర్ధంకాలేదు? అసలు ఏమి జరగబోతుంది..? “అదే మార్తాండుడి మాయ, ఆ మహామంత్రద్రష్ట ముందు ఎవరు సరి సమానంగా నిలబడలేరు,”అంటున్నాడు డింభకుడు (33)
మార్తాండుడు “డింభకా, సమయం ఆసన్నమైనది, ఇక ఆరుద్రుడు నా మాటకు బద్దుడు ఇక చూడరా అంటూ ప్రళయహాసం చేసి “రుద్రదండం నా చేతికి కొని మాసాలలో రాబోతుంది, శుద్రమాతా, ఇక నేను కూడా నీవలె కాకుండా అజరామర దైవం అవుతాను, పరమాత్మని అవుతాను అంటూ తన వేషధారణ మార్చుకున్నాడు. ఒక మహర్షి లాగా మారాడు, తన తలమీద జంగమదేవర లాగా శివలింగం వచ్చింది. తన మంత్రదండాన్ని చేత తపస్సు చేసుకునే చిన్న దండం లాగా మార్చాడు. ఇప్పుడు, మెడలో రుద్రాక్షలతో చేత దండంతో నిజమిఅన మహర్షిలాగా ఉన్నాడు. ఇక ప్రథమశివ పట్టణం ముందు డింభకుడికి “అవసరమైన పిలుస్తా, ఈ అంగుళీయకం ఎక్కడికి కావాలంటే అకడికి చేరుస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది జాగ్రత్తగా చూసుకో డింభకా “ అంటూ అంతఃపురం ముందు ప్రత్యక్షమయ్యాడు. మార్తాండుడు ప్రత్యక్షం అవ్వటం చూసారు, ఆ పురంలో చాలా మంది ప్రజలు భటులు, సైనికుల్, వారితో అంతఃపురం రహదారి దగ్గర ఉన్న రుద్ర కూడా. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు సాష్టాంగపడ్డారు. వారి సమస్యలు చెబితే అవి వెంటనే తీర్చాడు మార్తాండుడు. అది చూసిన రుద్ర కూడా మార్తాండుడి ముందుకు వచ్చి కూలబడి చేతులు జోడించి నమస్కరించాడు. “యువరాజా, మీ అమ్మకోసమే నేను ఇక్కడికి వచ్చాను, అసాధ్యమైనది సుసాద్యం చేయుటకే నేను వచ్చాను మీ సమస్య నేను మాత్రమే తీర్చగలను అందుకే నేను వచ్చాను”, అన్నాడు. విష్ణునంది. కూడా ఉన్నాడు. అతడు కూడా చేతులెత్తి నమస్కరించాడు. రుద్ర ఏమి మాట్లాడలేదు. అతని చూపులో “తన తల్లిని బ్రతికిస్తే చాలు ఏమైనా చేస్తా అనే భావం ఉంది. “వెయ్యేళ్ళ క్రితం ఇటువంటి సమస్య ఒకటి తీర్చాను. వెయ్యి సంవత్సరాలకి ఒకరికి మాత్రమే వచ్చే జబ్బు ఇది పద” అంటూ అంతఃపురంలో రాణి మందిరంలో కి వెళ్ళాడు.
డింభకుడు మీ మాజీ ప్రేయసి పద్మినీ దేవి ఎందుకు వచ్చింది అంటున్నాడు.
మార్తాండుడు “గుర్తుందా, నీకు చెప్పిన కథ, అప్పుడు పద్మినీదేవికి వచ్చిన వింత వ్యాధి అది నయం చేశాను. ఆ అంధముని వరం వల్ల అప్పుడు మా గురువు అంతా కథ డింభకుడు “ అవును స్వామీ గుర్తుకు వచ్చింది అయితే”
మార్తాండుడు “చెప్పాను తరతరాలు కలిసాయి కూడా తర్వాత వాడుకుందాము అని ఇంక చెప్పటానికి ఏమీ లేదు ఆట చూడు” అన్నాడు.
*****
అంతఃపురం ఆంతరంగిక మందిరం (ప్రథమ శివపట్టణం)
రాజు – రాకుమారా విద్య అయినది ఇక నీకు వివాహం చేసి రాజ్యాన్ని అప్పజెప్పాలి.
రాణి రాకుమారి భావనాదేవి ఇక ఎవరో ఈ రాక్షసుణ్ణి హతమార్చావు అన్నావుగా ఇక వివాహం చేసుకో. భావనా దేవి మ్నసులో రుద్ర రాకుమారి ఎన్నో చిత్రపటాలు చూసింది కానీ నచ్చలా..
రుద్ర మనసులో భావనాదేవి రాకుమారికి ఎన్నో చిత్రపటాలు చూపించారు కానీ నచ్చలా..
పురోహితులవారు – చివరిగా ఈ రాకుమారిని చూడు అంటూ భావనాదేవిని చూపించాడు.
ఇంతలో రుద్ర తల్లి రాణి చంద్రప్రభ దేవి స్పృహ తప్పి పడిపోయింది. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఆమె ఉన్నట్లుండి కళ్ళు తేలేసింది. రుద్ర అందరూ భయపడిపోయారు.
ఆమెను హుటాహుటిగా రాజవైద్యుల దగ్గరకి తరలించారు. అందరూ ఆమెను పరీక్షగా చూస్తున్నారు.
కానీ ఏమయినదో ఎవరికీ అర్థం కాలేదు ఆమె వ్యాధిని పసిగట్టలేక పోతున్నారు. ఆమె నాడి గుండె అన్నీ బాగానే కొట్టుకుంటున్నాయి.
కానీ ఆమె సజీవ శవం లాగానే ఉంది.
ఎంతోమంది రాజపురోహితులు జోస్యులు అందరూ కూర్చొని అన్నీ చేస్తున్నారు.
యువరాజు, రాజు పరివారమంతా కన్నీరు కారుస్తున్నారు.
రుద్ర “నాన్నగారు అమ్మని ఎలాగైనా బాగుచేయాలి. అవసరమైతే పరకాష్టా చాటింపు వేయించండి.
కేశవసేన “ పరకాష్టా చాటింపు అంటే రుద్ర అర్థరాజ్యం ఇవ్వాలి ఈ రాజ్యం నాదే
రుద్ర “ నాదైతే నా హక్కు కదా చాటింపు వేయండి.” అని ఆజ్ఞాపించాడు.
చాటింపు స్వయానా యువరాజు “ నా తల్లి మన రాణి చంద్రప్రభాదేవికి వచ్చిన వింత వ్యాధిని నయం చేసిన ఎవరికైనా అర్థరాజ్యం సింహాసనం ఇస్తాం అంటూ ఏడుస్తూ అవసరమైతే మొత్తం రాజ్యం త్యాగం చేస్తాను” అని ఏడుస్తూ చాటింపు వేశాడు ఇంతలో రాజపురం నుంచి మరొక వార్త వచ్చింది. రాణిగారి నాడి ప్రమాదంలో ఉంది అని.
రుద్ర ఏడుస్తూ ఉన్నాడు. రాజకుమారి కన్నీరు చూసి ప్రజలంతా ఏడుస్తున్నారు.
ఏమిటీ కష్టం అనుకుంటున్నారు.
--- ---- ---- --- --- --- ---
రుద్ర అంతఃపురానికి వెళ్తుండగా “వారిలో రుద్రునికి ఒక శవం, ఒకరోగి, ఒక పండు ముసలివాడు కనబడ్డారు. వారిని చూసిన రుద్రునికి భగవంతుని సృష్ఠిలో మానవజీవితం మాణిక్యం అని అర్థమైంది.
కానీ రుద్రమాత్రం తన తల్లి దగ్గాకి వెళ్ళాదు. అమ్మా నా సమ్మతి మీకు వివాహం చేసుకుంటాలేమ్మా” అని ఏడుస్తున్నాడు. రాణి నాడి చల్లబడి ఉన్న్నట్లుండి వింతవింతరంగులలోకి మారుతుంది.
అందరూ భయపడ్డారు.
రుద్రకి తన గురువు శివపాద మహర్షి ఇచ్చిన ఉంగరం స్ఫురణకి వచ్చింది.
అది తీసుకుని తన తల్లికి పెట్టాడు.
రాణి నాడి మరింత వేగం అందుకుంది. ప్రాణం నిలబడింది. కానీ శరీరం మాత్రం దిగులుతో ఉంది.
ఏంటి ఈ వింత ఎవరిదైనా ప్రయోగమా అని ఎందరో భూతవైద్యులు ఆరాతీసి చూశారు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అసలు ఏమి జరగబోతోంది?
“అదే మార్తాండుడి మాయ, ఆ మహాముద్ర ద్రష్ట ముందు ఎవరు సరి సమానంగా నిలబడలేరు.” అంటున్నాడు డింభకుడు.
మార్తాండుడు “డింభకా, సమయం ఆసన్నమైంది ఇక ఆ రుద్రుడు నీ మాటకు బుద్ధుడు ఇలా చూడలే అంటూ ప్రళయహాసం చేసి “రుద్రకుడు నా చేతికి కొన్ని మాసాలలో రాబోతుంది. రుద్ర తో ఇక నేను మారి నీవలె అజరామరదైవం అవుతాను. పరమాత్మని అవుతాను అంటూ తన వేషధారణ మార్చుకున్నాడు. ఒక మహర్షిలాగా మారాడు. తన తలమీద జంగమదేవర లాగా శివలింగం వచ్చింది.
తన మంత్రదండాన్ని చేతి తపస్సు చేసుకునే చిన్న దండంలాగా మార్చాడు. ఇప్పుడు మెడలో రుద్రాక్షలతో చేతి దండంతో నిజమైన మహర్షిలాగా ఉన్నాడు.
ఇక ప్రథమ శివపట్టణం ముందు డింభకునికి “అమరమైన వేయిస్తాడా? అంగుళీయకం ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తుంది. ఆహారాన్ని ఇస్తుంది జాగ్రత్త డింభకా ఆంటూ అంతఃపురం ముందు ప్రత్యక్షమయ్యాడు. మార్తాండుడు తిప్పడం ఇవ్వడం అన్నీ చూశారు. ఆ పురంలో చాలామంది ప్రజలు భటులు సైనికులు వారితో అంతఃపురం రహదారి దగ్గర ఉన్న రుద్ర కూడా అందరూ పరిగెత్తుకుంతూ వచ్చి అయిన మంది సాష్టాంగపడ్డారు వారి సమస్యలను చెబితే అవి వెంటనే తీర్చాడు మార్తాండుడు. అది చూసిన రుద్ర కూడా మార్తాండుడి ముందుకు వచ్చి కూలబడి చేతులు జోడించి నమస్కరించాడు.
“యువరాజా మీ అమ్మకోసమే నేను ఇక్కడకి వచ్చాను. అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేయుటకే నేను వచ్చాను మీ సమస్య నేను మాత్రమే తీర్చగలను అందుకే నేను వచ్చాను.” అన్నాడు
విష్ణునంది కూదా ఉన్నాడు. అతను కూడా చేతులెత్తి నమస్కరించాడు.
రుద్ర ఏం మాట్లాడలేదు. అతని చూపులో “తన తల్లి బతికిస్తే చాలు ఏమైనా చేస్తాను అనే భావం ఉంది. “వెయ్యేళ్ళ క్రితం ఇటువంటి సమస్య ఒకటి తీర్చాను. వేయి సంవత్సరాలకి ఒకరికి మాత్రమే వచ్చే జబ్బు ఇది పద అంటూ అంతఃపురంలో రాణి దగ్గరకి బయలుదేరారు.
రాజ్యసభ...సింహాసనం, సింహాసనానికి ఎదురుగా ఉన్న మెట్ల క్రింద ఈ తతంగం జరగబోతుంది. రాజ్యప్రజలందరూ ఈ వార్త విని అక్కడ గుమికూడారు. అందర్ని దూరంగా పంపాడు రుద్ర, కేశవసేనుడు కన్నీటిపర్యంతమయ్యాడు, విష్ణునంది కూడా “ఇలా, బలి ఇవ్వటానికా మనం రుద్రని ఆ రాక్షసుణ్ణి ఎదురించి కాపాడింది”.... రుద్రుడు తన బాకుని తీసి, పెద్దగా చేసి మార్తాండుడి చేతికి ఇచ్చాడు.
విష్ణునంది “అయ్యో రుద్ర, ఈ బాకు చివరికి ఇలా ఉపయోగపడినదా?”
రుద్ర “స్వామీ, ప్రాణాలిచ్చిన తల్లికోసం ప్రాణం ఇవ్వటము ఎంతో అదృష్టం” మీ వంటి మహనీయుని చేతిలో హతం అవ్వటం అంతకన్నా అదృష్టం అని మార్తాండుడి ముందు మెడపట్టి బలికి సిద్ధంగా కూర్చున్నాడు. మార్తాండుడు క్రూరంగా బాకు తీసుకొని దాన్ని పెద్దదిగా చేస్తే రాలేదు. కిటుకు తెలిసిన రుద్రుడు ఆ బాకుని పెద్దదిగా చేసి మార్తాండుడి చేతికి ఇచ్చాడు. అందరి మనసు కదిలిపోతుంది. అందరి కన్నుల వెంట కన్నీరు వస్తున్నాయి. మార్తాండుడు బలికి సిద్ధం అన్నట్లు కత్తిని పైకి ఎత్తి నరకబోయాడు. కత్తి చెవి వరకూ తెచ్చి బలి ఇవ్వబోయి ఆపాడు. రుద్రుడు చలించలేదు. రుద్రుని స్నేహితుడు భట్టు ఏడుస్తున్నాడు. కానీ మార్తాండుడు శిలవలె ఆగిపోయాడు. అందరూ లేచి చూస్తున్నారు....
మార్తాండుడు “నాయనా! రుద్ర నీ ధర్మరక్షణ అమోఘం, నీవు అజేయుడవు,శౌర్యపరాక్రమాలలో కాకుండా, త్యాగనిరతిలో ధిగ్యుడవు, ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు” అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు, మహారాజు విష్ణునంది ఆనంద పడుతున్నారు, భట్టు కూడా.
మార్తాండుడు తన మాయాజాలంతో ఒక పువ్వులమాల సృష్టించి, దాన్ని రుద్రుని మెడలో వేశాడు. రుద్రున్ని ఆలింగనం చేసుకున్నాడు.
రుద్ర “మహాత్మా, పదండి కనీసం ఈ రాజ్యమైన స్వీకరించండి, మీకు సేవకులలాగా మేమందరం ఉంటాం”.
ఇంతలో మరొక్కసారి పెద్ద ఒంటికన్ను మైదానంలో పడి “రుద్రా నిన్ను ఆ భైరాగి చంపకపోయినా నేను చంపుతాను, అంటుండగా” మార్తాండుడు ఒంటికన్ను రాక్షసుణ్ణి పైకిఎత్తి తంత్రం చేసి గాలిలో దూరంగా విసిరేశాడు.
మార్తాండుడు ‘రుద్ర నేనుండగా నీక్కు ప్రాణ భయమే లేదు”
అందరూ ఇప్పుడు, ఆ భైరాగి మంచివాడు అనుకొని ఆనందపడ్డారు.
మహారాజు, విష్ణునంది కూడా వచ్చి మార్తాండుడిని సింహాసనం తీసుకొమ్మని ఆర్ధించారు.
మార్తాండుడు “రుద్ర,సింహాసనం కావాలనుకుంటే... నాకు అది ఒక లెక్క కాదు, నాకు నీవు చేయవలసిన పని ఒకటి ఉంది నీతో నేను మాట్లాడాలి”?
రుద్ర “స్వామీ మీరు నా తల్లికి నయం చేస్తారా”
మార్తాండుడు “ ఖచ్చితంగా నాయనా, కానీ నీవు నాకోసం ఒక మాట నిలబెట్టుకోవలెను”
రుద్ర “తప్పకుండా స్వామీ, నా కన్నతల్లి ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు, మీకు ఈ రాజ్యం తప్పకుండా ఇస్తాను” అంటుండగా
భటుడు వచ్చి “యువరాజా, రాజమాతాకు శరీరం వెనువెంటవెనువెంట రంగులు మారుతుంది”
మార్తాండుడు, రుద్రుడు ఇద్దరు వేగిరముగా రాజమాత శయనస్థలంకు వెళ్ళారు.
రుద్రుడు “స్వామీ, దయచేసి నా తల్లిని చూడండి”
మార్తాండుడు మీ అందరూ శీఘ్రముగా బయటకు పొండి, నన్ను రాణిని వదిలివేయండి అని గట్టిగా డింభకా” అని ఆజ్ఞాపించాడు. అంతే డింభకుడు ప్రత్యక్షమయ్యాడు తన దగ్గర ఉన్న ఉంగరంతో, అందరూ ఆశ్చర్యపడ్డారు. అందర్ని బయటకు పొమ్మని ఆజ్ఞాపించి, “డింభకా, నేను తెమ్మన్న మూలిక తెచ్చావా?” అని అన్నాడు. “అన్ని లోకాల్లో గాలించి తెచ్చాను ప్రభూ!” అన్నాడు డింభకుడు.
మార్తాండుడు అందర్ని బయటకు పంపి, తలుపులు వేసి, రాణి శరీరాన్ని చూశాడు. “ఒకనాడు రాణి పద్మినిని ఇలా బాగుచేశాను, ఇప్పుడా విద్య రుద్రుదండం కోసం వాడబోతున్నాను” అని తన దండాన్ని అటుఇటుగా తిప్పి, “మాయరోగామా? ఇక వెళ్ళు” అని అన్నాడు, వెనువెంటనే గాలిలో రంగురంగుల పాములు వచ్చి, రాణి శరీరం అంతా ఇది వరకులాగా అయ్యింది, స్పృహలోకి రాబోతుంది. అంతే, మార్తాండుడు తలుపులు తీసి అందర్ని లోపలికి రమ్మన్నాడు. అందరు రాణిని చూసి ఆశ్చర్యబోయారు. ఇంకాసేపట్లో రానిగారికి స్పృహ వస్తుంది మహారాజా అన్నాడు మార్తాండుడు.
రుద్రుడు “స్వామీ, అని వచ్చి మార్తాండుడి కాళ్ల మీద పడి ఆనందంతో ఏడుస్తున్నాడు” మీ పేరు ఏంటి, మీరెవరు ఎక్కడినుండి వచ్చారు?”
మార్తాండుడు “మాటలు ఏలా. నీ తల్లిని కాపాడా, బదులుగా మీరు చెప్పింది చేయాలి?”
రుద్ర “చెప్పండి స్వామి, మీకోసం నా ప్రాణాన్ని అయినా ఇస్తాను, రాజ్యం ఇస్తాను”
మార్తాండుడు “సరే పదా? తక్షణమే సింహాసనము, నీ తల రెండు నాకు కావలెను”. అందరూ ఆశ్చర్యపడ్డారు, డింభకుడు కూడా” అదేంటి గురుదేవులు, రుద్రుని తల అడగటం”, అందర్ని ఘర్జించాడు మార్తాండుడు, “ఇచ్చిన మాట మరచిన ఎందుకు అని, కేశవసేనుడు “ఆర్యా! నా భార్యను కాపాడి బిడ్డను ఇవ్వమంటే ఎలా? మరొక్కమారు ఆలోచించండి”
కొంతమంది భటులు మార్తాండుడిని ప్రతిఘటించబోయారు, కానీ రుద్ర వారందర్నీ నివారించాడు, వారు మనకు నాకు దైవసమానులు, వారు ఏం చేసినా ఎవరు ఏమి అనకూడదు, విష్ణునంది సైతం మౌనంగా అంతా చూస్తున్నాడు.
మార్తాండుడు “ముందుగా, రాజకుమారుని తలని తీసి, నా పాదాల పై ఉంచి సింహాసనం అదిష్టింపచేయాలి నన్ను” అర్ధమయ్యిందా అన్నాడు బిగ్గరగా.
రుద్ర “ అలాగే ఆర్యా! మీ కోరికను మేము తీరుస్తాం, పదండి అని రాజ్యసభకు తీసుకు వెళ్తారు”
ప్రజలందరూ స్వామికీ, రుద్రునికి జయద్వనులు చేశారు.
కేశవసేనుడు “స్వామీ మీరు ఎవరో దేవుని వలె వచ్చి నా భార్యని, బిడ్డను కాపాడారు” మీరు మా ఆతిథ్యం స్వీకరించి మా రాజ్యంలో స్థిరపడవలసిందిగా కోరుకుంటున్నాం, ముందుగా చెప్పినట్లు, మేమందరం మీ సేవకులం, రాజ్యం మీకే ఇస్తాం” అని అన్నాడు ప్రాధేయపడినట్లు.
మార్తాండుడు “రాజా, నాకు ఏ రాజ్యం అవసరం లేదు, పరోపకారం కొరకే ఇదంతా చేసాను, ఈ రుద్రుడు తన త్యాగనిరతిలో నన్ను కట్టిపడేశాడు “రుద్ర నేను నీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి” అన్నాడు. ఇంతలో రాణి చంద్రప్రభదేవి పూర్తిగా మేల్కొంది అని వార్త వచ్చింది.
రాణి దగ్గరకు వెళ్ళిన వారందరూ, జరిగినదంతా చెప్పి, మార్తాండుడి గొప్పదనం విశదీకరించి చెప్పారు, రాణి చంద్రప్రభ సైతం మార్తండుడ్ని పొగిడి కృతజ్ఞతలు తెలుపుకుంది.
భట్టు “రుద్ర ఇక గండం గడిచింది, పదండి సుష్టుగా భోజనం చేద్దాం అనేసరికి అందరూ నవ్వారు.
***
ఆ రోజు రాత్రి, అతిథి సత్కారా మందిరం, ఏకాంతంగా ఉన్నారు రుద్ర మార్తండులు
రుద్ర స్వామీ , “ప్రాణాన్ని కాపాడిన మీరు నా తండ్రితో సమానం, మీ గురించి తెలపండి”
మార్తాండుడు “నాయనా రుద్ర, నీవు చేయవలసిన ఘనకార్యం ఒకటి ఉంది, అది ఎవ్వరికీ తెలియకుండా నీవు సాధించుకు రావాలి”
రుద్ర “ఏమిటది, మీ కోసం తప్పక చేస్తాను”
మార్తాండుడు “అది చెప్పాలంటే ముందు నా కథ చెప్పాలి....అని, తన కథ 1000సంవత్సరాల క్రితం అని చెప్పాడు. రుద్ర నేను పుట్టి 1000 సంవత్సరాలు దాటింది.అన్నాడు ఆశ్చర్యంగా
మార్తాండుడు “కట్టెలు కొట్టడం... అంధముని కాపాడడం...వరాలు ఇవ్వటం. రాణి పద్మినిదేవిని మొహించటం...రాణికి తన తల్లికి చేసిన జబ్బు ఒకటే అది తగ్గించటం, రాజ్యంలో అవమానం, బలంతో పోరాటం.. తన గురువు తల మొందం కథా అంతా చెప్పి, అసలు శిసలు అయిన శివ, సతిల రుద్రదండపు కథను కూడా చెప్పాడు...”
మార్తాండుడు తన క్షుద్ర ఉపాసన, తను రుద్రదండం సాధించుటకు వెనుక గల ఉద్దేశ్యం ఇవి ఏమి చెప్పాలి అని అనుకోలేదు. చెప్పలేదు.
మార్తాండుడు “రుద్ర నాకు ఎన్ని శక్తి యుక్తులు ఉన్నా అది సాధించుటకు పుట్టింది నీవే, నీవు మాత్రమే దానికి అర్హుడవు అందుకే నా తపస్సును భంగం చేసుకొని నీ కోసం వెతుక్కుంటూ వచ్చా, అది నీకు తప్ప ఎవరికీ అందని అతీంద్రయమైన విషయం.
రుద్రుడు ఈ కథని మొత్తం విని చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు రుద్రుడికి ఏమి అర్ధం కావటం లేదు.
మార్తాండుడు “రుద్రా? భైరాగి అయిన ఆ రుద్రదండం నాకెందుకు అనే కదా నీ ప్రశ్న”
రుద్ర “............”
మార్తాండుడు “రుద్ర, ఈ దుఃఖదాయకమైన ప్రపంచాన్ని చూసి జాలివేసింది నాకు, మనుషులు అల్పజీవులై కూడా, అరిషడ్వర్గాలను జయించలేక పోతున్నారు, ఆ భగవంతుడైన ఎందుకు ఈ సృష్టిని సరిగ్గా చేయలేదు, ఆయన మహిమతో ఈ ప్రపంచాన్ని మంచిగా మార్చవచ్చు కదా, ఎందుకు ఈ అసమానతలు,అసలు భగవంతుడు ఉన్నాడా అనిపించే దారుణాలు, అందుకే నేను ఈ సృష్టి కొరకు తపస్సు చేసా, నేను కూడా పగ ప్రతీకారంతో రగిలి ఆ రాజుపై తన రాజ్యంపై పగ తీర్చుకున్నా, నేను తీర్చుకుంటే పగ, దేవుడు చేస్తే కర్మ, ఆ తరువాత నా కళ్లముందే జనులు చనిపోవటం చూశా ఈ ప్రపంచం అశాశ్వతం అని తెలుసుకున్నా, శాశ్వతమైన ఆనందం కోసం తపస్సు చేశా, కానీ నాకు దొరికిన ఆనందం మానవాళి అందరికీ దొరకాలి, నీవు ఆరుద్రదండాన్ని తీసుకువస్తే, నాకు దైవశక్తి పుష్కలంగా వస్తుంది, దానితో ఈ ప్రపంచాన్ని మంచిగా మారుస్తాను.
రుద్రునికి మనస్సులో తను ఇదివరకు చూసిన రోగి, శవం, ముసలివాడు గుర్తుకువచ్చాడు.
మార్తాండుడు “ ఇదా భగవంతుని తత్త్వం, అది నాకు రుద్రదండం శక్తి వస్తే, నా గురువు ఆజ్ఞా మేరకు ఈ ప్రపంచాన్ని మంచిగా మారుస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఇదే నా కోరిక, నీవు రుద్రదండం తెచ్చి నా చేతిలో పెట్టడమే నేవు నాకు చేయవలసిన ఉపచర్య, పరోపకారం.
రుద్ర “స్వామీ....” అన్నాడు ఆశ్చర్యంగా , భక్తిగా
మార్తాండుడు “ఆ శివుడు చేజార్చింది... ఈ రుద్రగణసంభవితుడు అది సాధించటమే, భగవంతుడే ఈ సృష్టిని మంచిగా చేయుటకు ఇచ్చిన అవకాశం ఇది, అది సాధించుటకు పుట్టిన కారణజన్ముడవు నీవు, నీ జన్మసార్ధకం చేసుకో...”అన్నాడు అటు తిరిగి కపటనవ్వుతో ..
ఇక ఏమి జరగబోతుందో ఎవరూ ఊహించలేరు.
No comments:
Post a Comment