అక్షరశిల్పి
- - పోడూరి శ్రీనివాసరావు, హైదరాబాద్ 9849422239
అక్షరాలతో ఆటవేలడులాడుకుని తేటగీతులు వెలయించే ఓ కవీ! నీవు అక్షరబ్రహ్మవు అక్షర శిల్పివి!
నీకు అన్ని అక్షరాల మీద ఆసక్తే అన్ని అక్షరాలూ నీకు ఆప్తులే! నీకు ఏ అక్షరం మీద చిన్న చూపు లేదు నీ చేతిలో రూపు దిద్దుకున్న అక్షరాలు నీ మనోభావాలకు ప్రతి రూపాలై అందమైన గీతాలవుతాయి అపురూపమైన కవిత్వాలవుతాయి ఆణిముత్యాల్లాంటి కావ్యాలవుతాయి మనోహర దృశ్య నాటికలవుతాయి ఆధ్యాత్మిక మందారాలవుతాయి సరస్వతికి వందనాలవుతాయి
ఓ అక్షరశిల్పి!!! నీవు స్ప్రుసించని తావే లేదు అందాల ప్రక్రుతైనా, సుందర పుష్పమైనా సుమనోహర సుగంధమైనా, హరివిల్లైనా అలజడి కలిగించే తుఫానైనా, శ్రావణమేఘమైనా భయంకర అలలతోడైన సంద్రమైనా, ప్రశాంత పల్లైనా, రణగొణ ధ్వనుల పట్టణమైనా, బోసినవ్వుల పాపైనా, ముడతల ముదుసలి అయినా, ఏవైనా... నీ దృష్టిని తప్పించుకోలేవు నిన్ను స్పర్సించకుండా ఉండలేవు... విషయమేదైనా, వివరమేదైనా చక్కని రూపం కల్పిస్తావు జనరంజకం చేస్తావు పాఠకుల మనసునలరింప చేస్తావు ఎందరో మహానుభావులు సాహిత్య అకాడమీ విజేతలు కళాప్రపూర్ణ బిరుదాంకితులు ఎంత గొప్ప వారైనా అక్షరానికి దాసులే కదా! అక్షరం లేనిదే సాహిత్యం లేదు – సంగీతం లేదు
ఓ మహాకవీ! అక్షర మాన్యంలో విత్తులు చల్లుకుంటూ వెళ్ళు మరెన్నో మధుర మధుర రచనాఫలాలను జగతికందించు ఓ అక్షరశిల్పి!! నీవు చిరంజీవివి అక్షరామున్నంత కాలం నువ్వుంటావు... నువ్వుంటూ... నే ఉంటావు...
No comments:
Post a Comment