చిగురిస్తాయేమోననీ.....
- బెహరా వేంకట లక్ష్మీనారాయణ
పలకరిద్దామని..పరవశిద్దామనీ
అమ్మనూ ఆవునూ తల్చుకుంటూ
మళ్ళీ పల్లెకెళ్ళా
అమ్మ..అలాగే..పగులుబారిన పంట చేలులా
అంబారావాలు ఎప్పుడో అంతరించాయంట
అ ఆ లు నేర్చి..గుడి వైపూ అడుగులు లాక్కెళ్ళాయి
మోరలెత్తి పలికే మంత్రాలు వాడినై పూలుగా నేలన ఎండుతున్నాయి
బానిస భాష హోరు..అమ్మా ఆవులను వెక్కిరిస్తోంది
ఒకటొకటిగా అన్నీ ఖాళీ...నాలో కూడా
బడిలోని పిల్లలంతా..కాన్వెంట్ల గుహల్లోకీ
కొట్టాల్లోని పశువులేమో కబేళాలదారీ
పల్లె.........................కనిపించలేదు
కంట తడిని అక్కడే వదిలేసొచ్చా...........
ఏదో రోజు...అ ఆ లు చిగురిస్తాయేమోననీ....
No comments:
Post a Comment