అన్ని అంశలూ మనిషిలోనే ! - రాజవరం ఉష ప్రపంచం లో అన్ని జీవులు మనుషులతో బాటు మనుగడ సాగిస్తున్నాయి అయితే వాటికి తెలిసినది కల్లా కపటం తెలియని జీవనం .. ఆహారానికి , అవసరాలకు మాత్రమె అవి కొట్టుకుంటాయి. మిగతా అన్ని విషయాలలో అవి కనీసం వైర భావన తో కూడా ఉండవు మనిషికి అలాంటి స్వభావము లేదు ఎందుకంటే మనసు అనేది ఒకటి ఉంది దానికి రాగ ద్వేషములు ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయి .. ఇవి గాక తమో రజో గుణములు కూడా ఆడిస్తుంటాయి అందుకే నేమో! కృత యుగం లో త్రేతా యుగం లో, ద్వాపర యుగం లో దేవతలు, యక్షులు సిద్ధులు, సాధ్యులు మనుషులు రాక్షసులు అని ఇందరు ఉండగా ఈ కలి యుగములో అన్నీ అంశలు ఒక్క మనిషి లోనే ఉంటున్నాయి .............. .. ఉదాహరణకి ఒకే మనిషి లో ఒక పూట దేవుని లక్షణాలు, మరొక పూట మనిషి లక్షణాలు మరి కాసేపటికి రాక్షసుల లక్షణాలు ఈ కలియుగం లో కనబడుతూ ఉన్నాయి అంతే కాదు కొందరు ఎంతో నీతులు చెప్తారు చెడు లో కూడా మంచి ని చూడాలని ... బాగానే ఉంది .. కానీ అలాగని మంచి వారిలో చెడు ను వెతకటం వాళ్ళే చేస్తుంటారు ఇదేమి నీతి ? చెడు లో మంచిని వెతుక్కునే వాడు మంచి లో మంచి ని చూస్తే ఇంకెంత బాగుంటుంది ? కానీ అలా చేయరు గొర్రె దాటు లాగా ఎవడో ఒకడు ఒకరిని ఏదో అన్నాడు.. అని అనుకోగానే ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ ఒకరిని తాము కూడా తొందర పాటు తో ఏదో అనేస్తారు చివరికి నాలిక కరుచుకుంటారు అయ్యో! తొందర పడ్డానే అని... ......................... ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది రిలేటివిటీ అని .. అంటే ? ఒకడు ఒకరికి శత్రువు కావొచ్చు కానీ వాడు నీకు మిత్రుడు అయినప్పుడు నీవు ఎలా స్పందిస్తావు? మిత్రునిలాగే కాని శత్రువు లా ఎలా భావిస్తావు? వాడు వానికి మాత్రమే శత్రువు నీకు అవతలి వారి తో ప్రమేయం లేదు నీతో వారు ఎంత మంచి గా ఉంటె నీవు కూడా వారితో అంతే మంచి గా ఉండాలి అది రిలేటివిటీ.. అంతే కాని అలాగా మాస్టారు! వాడు మీతో ఇలా అన్నాడా! అయితే నేను కూడా వాడితో మాట్లాడను ... అనే వారు ఎంత నీచులో ఇక చెప్పనక్కర లేదు ,, మానవత్వం అక్కడ మంట కలిసిపోయింది ఇలాంటి కుతంత్రాలు పాపం పశు పక్ష్యాదులకు తెలియవు. ................ .. మరి కొందరిని చూస్తుంటాము ఎవరైనా ఒక విషయం పై తమ అభిప్రాయం వ్రాసుకుంటే అనవసరం గా తల దూర్చి దాన్ని అదే పని గా విమర్శిస్తారు తప్ప, అంతకు ముందు ఎన్నో మంచి విషయాల పై చర్చ జరుగుతున్నప్పుడు తమకు నచ్చినా.. ఎక్కడో ఒక మూల రగులుతున్న అసూయా ద్వేషముల ప్రాబల్యం వలన కనీసం ఒక మెచ్చుకోలు మాట కూడా అనరు అది వారి బల హీనతేమో !! విమర్శ కు ఒక్క పాయింట్ దొరికితే చాలు పని గట్టుకుని విమర్శించి , అవతలి వారి మనసు ను గాయ పరిచి "తుత్తి" అదేనండి !! తృప్తి పొందుతారు అదే వారిని ఎవరైనా పొగడితే మహదానందం... విమర్శిస్తే మాత్రం తట్టుకోలేరు ఇక మనకి, వాళ్లకి తేడా ఏముంది? పైకి మాత్రం పెద్ద మనుషులమని, సినియర్ ల మని చెప్పుకుంటారు ఎందులో సినియర్ లు? అజమాయిషీ చేయ డములోనా? పెద్ద వాళ్ళు అంటే ఒక మంచి మాటకు చక్కని స్పందన తెలిపి ప్రోత్సహించటం, ఒక మంచి విషయాన్ని , విజ్ఞాన కర విషయాలను నలుగురికి అందించటం, ఇలాంటివి చేస్తే తమ పెద్దరికం అందరికి ఆమోదయోగ్యం అవుతుంది అంతే కాని తమకు తాము పెద్దలమని అనుకోవటం తో పెద్దలు అయిపోరు .. ఎదుటి వారే చెప్తారు నీవెవరో .. నీకు నీవు నిర్ణయించుకునేది కాదు పెద్దరికం .. అని తెలుసుకోవాలి.
No comments:
Post a Comment