బైరాగి(గోదావరి కధలు ) - అచ్చంగా తెలుగు

బైరాగి(గోదావరి కధలు )

Share This

బైరాగి(గోదావరి కధలు )

 

బి.వి.ఎస్.రామారావు

“ అప్పాయమ్మ చేతికి ఎముకలుండవు. ఎంతడితే  అంత.అప్పాయమ్మా,నిన్ను అందరు చక్కని చుక్క అంటారు. నీ అందాన్ని,నీ మంచి మనసులో చూస్తున్నాను”అని తేరగా పొగిడాడు  భైరాగి . అప్పాయమ్మ  మరింత పొంగిపోయి ,మరో రెండు పళ్ళు తీసి “ పోలయ్య మావా యింద” అంటూ సరంగు చేతికి అందించింది. “అలా నావని నమ్ముకు బ్రతుకుతున్నాడు పాపం; ఈ గుడ్డివాడు “ అని ప్రతి వ్యక్తి జూపిస్తాడు భైరాగి మీద . నావకి కట్టవలసిన ముప్పై పైసలు కాక ,భైరాగికో ఐదు పైసలు కూడా – లేక్కేసుకొని  రేవు కోస్తారు అక్కడి జనాభా. ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు ,తక్కిన వారు కొంగు ముళ్ళు ,పంచె కుచ్చిళ్ళు తడుముకొని  భైరాగికి వరుసగా ముడుపు చెల్లించారు. “తిరిగొచ్చేటప్పుడు యిస్తా తాతా”అంది అలా యివ్వనందున బాధ పడిన ఓ పల్లె పడుచు . “ఎవరు నాగమల్లా! ఏంటి పిల్లా పన్లోకి యింత లేటుగా వెళుతున్నావు” భైరాగి పలకరింపు. “ఇయ్యాల బట్టు వాడా రోజు “ అంది బిగ్గా కప్పుకున్న వోణి కొస ముందుకి లాగి గాలికి ఎగరకుండా గట్టిగా పట్టుకు కూర్చొని . తెల్ల దారం  తో  కుట్టిన నల్ల రంగు జాకెట్టు, చాలీ చాలని చిలకాకు పచ్చ వోణి,వెలసి పోయిన పరికిణి,బోసిమెడా,చెంపల్లో ప్లాస్టిక్కు సీతాకోక చిలుక ,కొప్పులో  మందార పువ్వు ,దాయలేని నిండు యౌయనపు అంగ సౌష్టవంతో ,పంచ కళ్యాణి లా , ఏపుగా వుందా నాగమల్లి అనే పల్లె పడుచు . ఆ పడుచు పక్కనే నుంచున్నాడు మైనరు బాబు. ప్రతి కదలికలో ఆమె లోని అందాన్ని ఆడపాతడపా కళ్ళతో జుర్రేస్తూ,తెడ్డు  వూపుకి నావ అల్లల్లాడగా కుదుపు కుదుపుకీ,తన మోకాలితో ఆమె వీపుని రాపాడిన్చేస్తూ బులపాటం తీర్చేసుకుంటున్నాడు-ఏమి ఎరగనట్టే ఆకాశం లో కి చూస్తూ.ముందుకు జరిగితే పళ్ళ బుట్ట,వెనక్కి జరిగితే మోకాలు పోట్లు ,ఒక పక్క సైకిలు,మరొకపక్క మేకలు –పద్మవ్యూహం లో చిక్కడి నట్టు బిక్క చచ్చి బిగుసుకుపోయిందా పంచ కళ్యాణి.వీపు మర్ధనకి వాళ్ళు పులిసిపోయి యింక భరించలేక చెంప పిన్ను తీసి బలంగా మైనరు కాలి మడం మీద కసి గా పోటు పొడిచి,మేకలున్న కేసి జరిగి కూర్చుంది .ఏమి తెలియనట్టు . “అమ్మా” అన్నాడు మైనరు . పిల్ల మేకకు కొప్పులోని మందారం నోటికి అందటం తో ,కొప్పుతో సహా మేసేస్తుంటే “సీ,పాడు “ అంది నాగమల్లి.ఈ రెండు పదాలు ఒకేసారి వినపడటం తో ,ఏమిటా అని చూసాడు అటు వైపు భైరాగి .చరణం  ఆపి తన చేవులటు సారించాడు .మైనరు భుజాలు తడుముకొని , ఆ చేత్తోనే జేబులు కూడా తడిమి ఓ రూపాయి కాగితం తీసి భైరాగికి చ్చాడు – ఎప్పుడు ఇవ్వని వాడు. “అదేంటి బాబూ,కూ లాళ్ళ  మధ్య నించున్నారు ,కామందులు క్లాసుగా కాళ్ళ చుట్ట మీద బాబు గారి పక్కన కూర్చోలేకపోయరా?” అన్నాడు  భైరాగి –రూపాయి కాగితం జేబులో వేసుకుంటూ. పర్వాలేదని కాలరు సర్దుకొని హేండిల్ బారు మీద మద్దెల కొడుతూ ,దిక్కులు చూడసాగాడు   మైనరు –సూది పోటు కి రక్తం కారి నొప్పెడుతున్నా,కిక్కురుమనకుండా. “ఏ తీరుగ నను దయ చూసేదవో.. “ భైరాగి చరణం . “కుక్క ‘భౌ’మంది .పిల్ల మేక ‘మే’  అంది .తల్లి మేక ‘మే ! మే !!’ అంది. దూరం నుంచి బస్సు బాపతు గేసు హారను గావు కేక లా వినపడింది.కంగారు పడ్డాడు మన్మధం-బస్సు వేల్లిపోతుందేమోనని. “మీరేం కంగారు పడకండి బాబుగారు !యీ నావ వెళ్తే కాని బస్సు కదలదు “ అని గ్యారంటీ యిచ్చాడు భైరాగి. వీడికి కర్ణ పిశాచం ఉంది కాబోలు “ అని అచ్చర్యపడ్డాడు మన్మధం. కుక్కపిల్ల మళ్ళా “భౌ” మంది –పిల్లమేక “మే”అంది.”ఎందుకలా చెవికోసిన మేకలా అరుస్తావు?” అని మేక బాష లో “మే!మే!”అని కోప్పడింది తల్లి మేక. “ఏ తీరుగ నను దయచూసెదవో...” భైరాగి చరణం . మన్మధ రావు మనసు కుదుట పడింది.చల్లని గోదావరి,హాయిగా వీస్తున్న పైరుగాలి ,అద్బుతమైన  ప్రకృతి సౌందర్యం,అమాంతం అతన్ని పూనేశాయి.మైమరిచి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు .కెవ్వు మని పిడుగులా కేకేట్టింది సూరమ్మ నే బోడెమ్మ,ఆ కేక కు ఆకాశం అదిరింది .గోదావరి స్తంబించిపోయింది.సరంగు హడలిపోయి  చీకుతున్నమామిడి టెంక ను గుటుక్కున మింగేసి ,చుక్కాని వదిలేసాడు .చుక్కాని లేని నావలా ,నావ అటూ ఇటూ పొర్లింది.ఆ కుదుపు కి సైకిల్ అటుపడగా,దాన్ని పట్టుకోవటం మానేసి ,ఇటుపడి దొరికింది ఛాన్స్ అని ,నాగ మల్లి మీద పడి వాటేసుకున్నాడు మైనరు .”నీ జిమ్మడ”అని మైనరు ని బలంగా ఓ తోపు తోసింది నాగమల్లి .దెబ్బ తో అప్పాయమ్మ చిట్టెమ్మల మధ్యనున్న మామిడి పండ్ల గంప మీద దబిమని బోర్లా పడ్డాడు మైనరు .మిగల మగ్గిన పళ్ళు చితికి చిందగా రసం కాస్తా చిట్టెమ్మమీద పడింది .కంగారు పడ్డ చిట్టెమ్మ అడ్డ పొగ బాపతు నిప్పు నలిక్కంటుకుంది .తుప్పుమని ఉమ్మేసిందా చుట్టని .ఆదెళ్ళి  భైరాగి ముఖం మీద పడింది .భైరాగి బెదిరి తంభూర ను గట్టిగా మీటాడు.తీగ తెగి ఎగిరి షావుకారి పీకకు చుట్టుకుంది.బాబోయ్ అంటూ డబ్బుల సంచిని గట్టిగా పట్టుకొని కళ్ళు మీసుకున్నాడు ఆ షావుకారు.ఇవన్ని ఒక త్రుటి లో జరిగిపోయాయి. “హయ్యో –హయ్యో !”అని మళ్ళి గావు కేక పెట్టింది సూరమ్మ .అందరు అటు చూసారు . నున్నగా కనపడ్డ జాడి ని చూసి ముచ్చటపడి ,కాలెత్తి హాయిగా తడిపేస్తుంది ఆ కుక్కపిల్ల. ఛీ ఛీ అంటూ  కుక్కని పీక పట్టుకు లాగాడు మన్మధం “మే!”అంది కుక్కపిల్ల . ఆ అరుపు విన్న పిల్లమేక మతి పోయి “భౌ” అంది .అది విన్న తల్లి మేక కన్ఫుజు అయ్యి భౌ భౌ అంది. అసలు ఎం జరిగిందో తెలియని గుడ్డి భైరాగి “వోదసే చూయద నను గరుతీ ఏ” అని రివర్సు పాడేస్తున్నాడు తను కన్ఫూజు అయ్యి. అలా నావంతా గగ్గోలయి సగ్గోలు ఆపటానికి కొన్ని క్షణాలు పట్టింది. “నిక్షేపం లాంటి జాడి కుక్క ముట్టుకు పోయింది.ఈ  పాపం ఊరికే పోదు .రౌరవాది నరకాలు అనుభవిస్తారు – ఆ కుక్క మనుషులు “అంది సూరమ్మ . “ఇంతోటి దానికి నరకానికి వెళ్ళాలని శాపాలేట్టాలమ్మా సూరమ్మా”అని కోప్పడ్డాడు భైరాగి . “ఇంతోటి విషయంటయ్యా యిది!? నా పెళ్ళైన కొత్తలో మా పుట్టింటారు యిచ్చిన జాడి! వెయ్యి కళ్ళతో మడిగా చూసుకుంటున్నాను యిన్నాళ్ళూ.కష్టపడి సంపాదిస్తే కాని ,మళ్ళివస్తుందా ఈ జాడి!” “మా కష్టపడి స౦పాదిస్తున్నావమ్మ రూపాయికి రూపాయికి వడ్డీ కట్టి....”ఎదో అనబోయాడు రైతన్న. “మగదిక్కులేని దాన్ని ఎం చెయ్యమంటావు.మొగుడ్నోదిలేసిన మీ పెద్దమ్మాయిలా వీధులేమ్మట తిరిగి పెడెత్తి ,పిడకలద్దమంటావాపుంక లేమ్మట పోయి పుల్లలేర మంటావా?లేక మీ ఆవిడలా పక్కింటి దడ పీకేయ్యమంటావా?”అంది ఏక బిగిని సాగదీస్తూ. నోటికి హద్దూ పద్దూ లేకుండా పరువు తేసేస్తున్న౦ దుకు ,తన నోరు మూసేసుకున్నాడు  రైతన్న . తనకేం సంబంధం లేనట్టు ధీమాగా కూర్చొన్నాడు మన్మధం. “సర్లేవమ్మా!నువ్వేం నష్టపోకు . దాని ఖరీదెంతో చెప్పు .బాబు గారు నీకిచ్చేస్తారు “అని తుని తగువు తీర్చాడు భైరాగి. అదిరిపడి జాడికేసి చూశాడు మన్మధం- దాని ఖరీదు ఏ మాత్రం వుంటుందో నని . ‘మహా వుంటే ఐదో ,ఆరో వుంటుంది . మొగాన్ని  కొట్టేయ్యొచ్చు’అని ఖరారు  చేసుకున్నాడు . “షావుకారు ! నువ్వు చెప్పవయ్యా  ఆ జాడి ఖరీదెంతు౦టు౦దో “అడిగాడు భైరాగి . “ఆ ! వుండకేం,వుంటుంది .నేనీ మద్దినే తొమ్మిది రూపాయల పైసలకమ్మాను కొట్టుకాడ”అన్నాడు.రెండు రూపాయలు ఎక్కువే వెలకట్టి . “ఇంకా నయం నిరుడీరోజుల్లో  పాత రెవిన్యూ ఇనస్పెక్టర్ గారి  వంద రూపాయలిస్తాను ,ఆ జాడి నాకివ్వమని కాళ్ళా వెళ్ళా పడింది .అచ్చొచ్చిన పిత్రార్జితం జాడి కదా అని, ససేమిరా అన్నాను .యిది ఈస్టిండియా కంపెనీ వారి జాడి! సిసలైన లండను సరుగు .” “అవును ,మరే !యిప్పుడు లండను సరుకు బజారు లో  ఎక్క  “ సాక్ష్యం చెప్పాడు షావుకారు . ఆడంగులందరూ ఆ జాడికేసి చూశారు.’లండనంటే యిలాగే ఉంటుంది కామోను ‘అనుకున్నారు. “ఇది తరతరాల నాటి జాడి.మా అమ్మ కర్మం కాలి ముండ మోస్తే ,మనోపర్తి లేకుండా ఎలాగూ నన్ను పెంచి పెళ్లిచేసి,ఈ జాడి నాకిచ్చింది . నా తల చెడ్డా నేనలాగో నేట్టుకోచ్చి మా పిల్లకి పెళ్లి చేశాను.యిప్పటి జాడి,దాని కంద జెద్దామనుకుంటే,పాపిష్టివాళ్ళు  ముదనష్టపు కుక్కతో ముట్టి౦ చేసారు”అని భోరున ఏడిచింది చిర్రున చీదేస్తూ. “అబ్బా-ఊరుకోవమ్మా! ఆ వందా బాబు గారు యిచ్చేస్తారులే”అని ఊరడించాడు భైరాగి-అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. అదిరిపడి ,మరొకసారి జాడి కేసి చూసాడు మన్మధం. వంద పెడితే ఆ సైజు వెండి జాడీయే వస్తుంది అనుకున్నాడు.బోడెమ్మ పేరాశకి మనసులోనే తిట్టుకున్నాడు .సతిసహగమన నిషేధ చట్టాన్నిరద్దు చేసి ,ఇలాంటి వాళ్ళకు అమలుపరచనందుకు గవర్నమెంటుమీద మనసులో కోప్పడ్డాడు. ఆ వందా యిస్తాడా,లేదా అని అందరూ తనకేసే కను రెప్ప వాల్చకుండా చూస్తున్నారన్న సంగతి గ్రహించాడు మన్మధం.టపిమని జేబులో చెయ్యెట్టి పర్సు లాగాడు .-ఓ పదో,పరకో పారేద్దామని. “వెనకటికో దొరగారు పెంపుడు కుక్క కోసం తాజ్ మహల్  లాంటి గోరి కట్టి౦ చాట్ట.పెంచిన మమకారం అంటే అలాంటిది.బాబుగారు మట్టుకు తక్కువా?కుక్క కోసం బ్యాంకి నే వడ్డేయ్యగలరు.”అన్నాడు భైరాగి జనా౦తికంగా ఆ మాటలను కుక్క జ్ఞాన౦ తో కుక్క గ్రహించింది.అమాంతం మన్మధం మీద ప్రేమ ,అభిమానం ,భక్తి విశ్వాసం అన్ని కలగాపులగంగాపుట్టుకొచ్చి,మన్మధం చేతులు నాకేస్తూ పర్సుని కూడా నాకబోయి,పోర పాటున వేలు కోరికేసింది .ఒక్క విడుపులో పర్సు షావుకారు వొళ్ళో పడింది .నోట్ల కట్టలు విచ్చుకున్నాయి.సూరమ్మ కళ్ళు మేరిశాయి. “అలా డబ్బుని విసిరి కొట్టకూడదు నాయనా –కల్లోతాయి”అంది సూరమ్మ. “ఇదిగో తీసుకోండి “ అని వంద రూపాయల నోటు సూరమ్మ కిచ్చాడు షావుకారు. “చివర సున్నా వుంటే అరిష్టం నాయనా నూటోకటి చెయ్యాలి,మరో రూపాయి ఇయ్యి’’ అంది సూరమ్మ. మరో రూపాయి కూడా ఇచ్చి పర్సుని మన్మధరావు కి అందించాడు షావుకారు. “ఈ  ఆ భైరగాయానికిచ్చేయ్యి నాయనా యిచ్చేవాళ్ళకే తప్ప పుచ్చుకునే వాళ్ళకి ఉండదు “అనగానే అంచెలంచెలుగా భైరాగి జేబులో చేరింది ఆ రూపాయి . జాడికేసి చూశాడు మన్మధం.జాడిని ఆప్యాయంగా వేళ్ళతో నిమురు తూంది సూరమ్మ. ‘ఆ జాడి వదులు అది నాది ‘అన్నట్టు చూశాడు మన్మధం. ‘కుక్క ముట్టుకున్న జాడి తీసుకుంటావా నాయనా ! నిక్షేపం లా వాడుకోవచ్చు. దాని మట్టులో చిన్నబీట వుంది.కాస్త చింతపండు పూస్తే,ఊట కారినా పిండి మట్టుకు కారదు.యింద తీసుకో”అంది. “చిల్లు జాడి అరే౦ జేసుకుంటారు.యిలా యియ్యి,చిల్ల రేసుకుంటాను “అన్నాడు భైరాగి . మరుక్షణంలో జాడి భైరాగిని చేరింది. జుట్టు పీకేసుకొని గట్టిగా అరిచి గోదాట్లోకి దూకేద్దమనుకున్నాడు.ఒళ్ళు కుత కుత లాడిపోతున్న మన్మధం.కాని పేంటు,షర్టు తడిసి పోతాయి అని మానేసాడు. “పోలయ్యా!గేదేలకి, ఆవులకి పుచ్చుకున్నట్టు బాబుగారి దగ్గర కుక్కకి లగేజి పుచ్చుకోకు.వారసలే కొత్త .ఐదు రూపాయలే పుచ్చుకో.సరదాపడి యింకో రూపాయిస్తే పుచ్చుకో,కాని అడక్కు ,వారు అదనంగా పదిరూపాయలు ఇస్తానన్నారు కనుక ,మొత్తం పదహారే పుచ్చుకో,పొరుగూరి వారని మోసం చేశావా దేముడు క్షమించడు” సరంగుకి వార్ని౦గి చ్చాడు భైరాగి. ఏడవలేక ఊరుకున్నాడు మన్మధం కుక్క నోరు మూసి ,పీక పిసికి గోదాట్లో పడేద్దమన్న౦త  కోపం వచ్చింది.జీవ హింస పాపం అని మానేసాడు. “నా మామ కుక్కనేందుకు పెంచాలి ?పెంచినా ఆ కుక్క ఎందుకు యీనాలి?యీనినా  ,కుక్క కావాలని మరదలు ఎందుకు రాయాలి ?రాసినా ,కుక్కను పెంచాలని సరదా నాకెందుకు పుట్టాలి?పుట్టిన సెలవు చూసుకోకుండా ,నేనెందుకు బయలుదేరాలి?దేరినా,ఆ కుక్కకి ఒక గొలుసు ఎందుకు కొనకుండా రావాలి ? వచ్చినా చంక లోని కుక్కను ఎందుకు జారవిడాలి?జారినా ఆ కుక్క జాడి ని ఎందుకు పావనం చెయ్యాలి ? యిలా గొలుసు కట్ట్టుగా ఆలోచించుకుంటూ..నిశబ్దంగా గొంతుకు చించుకుంటూ  తనని తానే ఆడిపోసుకుంటున్నాడు మన్మధం. కుక్క భౌ మంది సానుభూతిగా. “ఛీ నోరుముయ్యి” అన్నాడు మన్మధం. మా బాగా అయ్యింది అనుకోని ‘మే’అని నవ్వింది మేకపిల్ల . “ఛా! పాపం తప్పు “అని మేమే అంది నవ్వు బలవంతంగా ఆపుకుంటూ తల్లి మేక . “పళ్లన్నీ చితికి ముద్దయిపోయినాయి”అంది తట్టలో పళ్ళు కెలుకుతూ అప్పాయమ్మ. నావ జనాభా యావత్తూ మైనరు కేసి చూసింది . దీనికేం సమాధానం చెప్తావన్నట్టు. “ఒసేయ్ అప్పాయి!సందాళ యింటికాడ కనపడు.తట్ట ఖరిదిచ్చేస్తాను “అన్నాడు మైనరు –జేబు రుమాలతో పేంటుకంటుకున్న రసం తుడుచుకుంటూ. “ఆయ్ ,యీ పళ్లన్నీ రసం పిండి ,తాండ్ర చేసి ,మీకే ఇచేస్తానులెండి”ముఖ్కం చాటంత చేసుకున్న అప్పాయమ్మ చూట్టూచిందిన రసాన్ని తట్ట లోకి పోస్తూ అంది. “అక్కర్లేదు. అది కూడా నువ్వే అమ్ముకో “ అన్నాడు మైనరు ఉదారత వలకబోస్తూ. “వాళ్ళిద్దరి మద్య నా ఎలాంటి కనక్షన్లున్నాయో,మనకెందుకులే”అనుకున్నారు నా వ జనాభా. “ఈ రొంపి లోంచి బయట పడటానికి ,ఇంకా పావుగంట పట్టొచ్చు”వాచీ చూసి అనుకున్నాడు మన్మధం. అవతల రేవు నుండి బయలు దేరిన నావ ,యీ నావ కి ఎదురైంది. “ఒరేయ్ పోలిగా –పోలిగా ,డమాను దింపు .గోసు కాడ చేరతా” అని పడవ బాషలో కూశాడు అవతల నావ సరంగు. “ఓయ్ ఎ హేస్.గోసుకాడికొద్దు.ప యుల కాడికిరా-ప యు లు కాడికి”అని పడవ భాషలో సమాధానం కూసి ,తేడ్డుని రైతన్న కందించి ,తెరచాప తాళ్ళు వదులు చేసి ,తెరచాప దింపాడు పోలయ్య.అవతల నావ సరంగు కూడా  తెరచాప దింపాడు .రెండు నావలు తెడ్లమీద దగ్గరకు చేరాయి.రెండిటిని తాళ్లతో బిగించారు . భైరాగి లేచాడు .జాగ్రత్త గా అవతల నావలోకి నడిచాడు .అవతల నావలో అతని స్థానం కాళి చేయబడింది.తాపీగా  చతికిలబడి,చరణం మొదలెట్టాడు.నావలో సంచలనం కలిగింది.అందరు బొడ్లు,కొంగు ముడులు తడుముకొని,చిల్లర వెతుకుతున్నారు. తాళ్ళు విప్పబడి నావలు విడిపోయాయి .కాస్త దూరం వెళ్ళాక,యధావిధిగా తెరచాపలు విచ్చుకున్నాయి. దూరం నుండి “వెళ్ళిపోతానోయ్”అంటూ బస్సు కారుకూతలు కూస్తుంది. బస్సు దొరుకుతుంది అన్న ఆశ మన్మధానికి పూర్తిగా పొయింది.యీ ముష్టి వెదవకోసం మరో పావు గంట ఆలస్యమైనందుకు వొళ్ళంతా కంపరమేత్తి పొయింది .ఒళ్ళంతా పాకేసి ,ఆ కంపరాన్న౦ తా నాకేసిందా కుక్కపిల్ల .”నేనంటే దీనికి  ఎంత యిదో”అని మురిసిపోయాడు మన్మధం.”దీనికేం పేరు పెట్టాలి చెప్మా” అని ఆలోచించాడు.ధీన్ని చేరదీయగానే జాడిని  కరాబు చేసి ,చేతి చమురు వదిలించింది కనుక “జాడి”అని పేరు పెడదామనుకున్నాడు. “ఛా! జాడి అంటే బాగోదు .”జార్”అని పేరు పెడదా౦”అనుకున్నాడు .”జార్” మెల్లగా అన్నాడు .కుక్క క్రీగంటితో చూసి, టపా టపా తోకాడించింది.”జార్ – జార్” అని రెండుసార్లు అన్నాడు .కుక్క చాతి పై కెగబ్రాకి ,బుగ్గ నాకి ముద్దు పెట్టెసుకుంది.అయితే దీని పేరు “జార్”అని ఖాయపరిచాడు మన్మధం. ఎట్ట కేలకు నావ రేవుచేరింది.బస్సు హారను మోగుతోంది.రేవులోకి దూకబోయాడు మన్మధం. “బాబుగారు ఆగండి” అన్నాడు సరంగు .నావ లోని జనాబా యావత్తు రేవులోకి దిగుతున్నారు .మైనరు సైకిల్ బెల్ వాయిస్తూ గట్టేక్కుతున్నాడు .అతని వెనకాలే అప్పాయమ్మ వయ్యారంగా నడూస్తో౦ ది.నాగ మల్లి కొప్పు సవరించుకొంటూ నావ దిగింది.మైనరు బెల్ బాటం మీద రక్తపు మరకలు చూసి కసితీరా ఆనందపడింది.చిట్టెమ్మ చీర దులిపి,గోచి బిగించి ,చుట్ట అంటించింది.పోలయ్య గడ్డిమోపు ఆమె నెత్తిమీద కేక్కించాడు.రైతన్నభుజానున్న తువ్వాలు దులిపి ,తలపాగా కట్టి ,సూరమ్మ కేసి కోపంగా చూసి ,గట్టు మీదకి దూసుకుపోయాడు.షావు కారు అంగ వస్త్రం కుచ్చిళ్ళు బిగిస్తూ నడిచాడు.తల్లి మేక పడిచెక్క ఎక్కి వాటం చూసుకొని ,గట్టు మీదకి దూకింది.పిల్లమేక కుక్కపిల్లను వెక్కిరించి,గట్టుమీదకి దూకబోయి,నీట్లో పడి నీళ్ళు దులుపుకొని పారిపోయింది సిగ్గేసి. “వస్తాను నాయనజాగ్రత్తగా వెళ్ళు “అంది శూర్పణక అప్ప గారైన సూరమ్మ –మనసులో ఇంకో రెండు జాడీలు తెచ్చి కుక్కకి ముట్టిన్చలేకపోయానని భాదపడుతూ. అందరు వెళ్ళాక.”బాబు గారు పదహారు రూపాయలివ్వండి “అన్నాడు సరంగు. చిర్రెత్తిపోయింది మన్మధానికి.”ఎం ఎందుకివ్వాలి ?నేనివ్వను .కావాలంటే ఈ ఐదు తీసుకో “అన్నాడు కచ్చితం గా . “అదేంటి బాబూ! పది రూపాయలిస్తామంటే కదా –కోసెడు దూర౦ నుంచి పడవ మళ్ళించాను.లేకుంటే పది నిముషాలు ముందుగా చేరేవాడ్ని ఈ రేవు కి .యిచ్చేయండి బాబు –పెద్దారు మీకు మర్యాద కాదు .!” టిక్కెట్టు కొన్న నాకు రెండు  నిముషాలు లేటైతే ,పది రూపాయలా?మరి ఆ గుడ్డి నాయలుని,ఆ పడవ లో కేక్కించటం కోసం అరగంట చేశావు.దానికేం చెబుతావు?” “అయ్య బాబోయి అదేంటి బాబు ,ఇస్తానన్నపుడు పెద్దతరంగా ఇచ్చేయాలి గాని ,ఏరుదాటి పేచి పెట్టటం దరమం కాదు బాబూ” “ఏరా నా కొడకా – నేను ఆ ముష్టినాయాల కంటే తీసిపోయానుట్రా?”

“అమ్మనాయనోయ్ నా కొంప ముంచేశారు .మీది పొరుగూరు కనుక నిజం చెప్పేస్తున్నాను. ఆడు మాములు నాయాలు కాదండి ఈ రెండు నావలు ఆడివె .ఆడే ఈ రేవులో నావలన్నిటికి ఓనరు .సందాళ ఈ డబ్బు యివ్వకపోతే ,నా జీతం లో తెగ్గోడతాడు.పెదోడ్ని బాబా”అని కాల్లట్టుకున్నాడు సరంగు. మన్మధరావు కొయ్యబారి పోయాడు .బస్సు బయలుదేరుతూ కొట్టిన హారను వినపడలేదు .      

(అయిపొయింది)

No comments:

Post a Comment

Pages