జోహారు...జోహారు....బాపూ నీకు (గేయం )
- భారతి కాట్రగడ్డ
జోహారు...జోహారు....బాపూ నీకు మరచిపోని మరువలేని బాపూ నీవు. :జోహారు: బొమ్మలె్న్నొ గీసినావు - భవిత నీవు చూపినావు బవబంధాలు తెంచుకొని - దిగంతాలకు తరలినావు :జోహారు: పాత్రలెన్నొ మలచినావు- పదిలంగా నిలిపినావు మాటలెన్నొ పలుకుతూనె- పరమపదం చేరినావు :జోహారు: " ముత్యాలముగ్గు " తోనె- ముగ్ధను తీర్చినావు " రాధాగోపాళం " తో- రమణీయత చూపినావు : జోహారు: " మిస్టర్ పెళ్ళా" మంటూనె - " పెళ్ళిపుస్తకం" రాసినావు " గోరంతదీపం " తో - " సుందరకాండ " మలచినావు :జోహారు: కాదేదీ గీతకనర్హమంటూ - కావ్యాలె గీసినావు మణులూ,మాణిక్యాలే-కానుకగా ఇచ్చినావు :జోహారు:
No comments:
Post a Comment