దృశ్య లిపి - అచ్చంగా తెలుగు

దృశ్య లిపి

---అయినంపూడి శ్రీలక్ష్మి

కనులకి దృష్ట్యాంతం ఉంటుంది కానీ, కలలకి దృశ్యాంతం ఉంటుందా? *** *** *** ఈ లోకం పొద్దు పొడిచిన నాటి నుంచి నాకో అనుమానం మొగ్గ తొడిగింది మా ఇంటికి రోజూ బ్రహ్మ దేవుడు అదృశ్య రూపం లో వచ్చి పోతున్నాడేమోనని. చతుర్ముఖాలు-అష్ట హస్తాలతో మా పరిసరాల్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నాడేమోనని. నమ్మశక్యంగా లేదు కదూ, ఎన్ని దృష్టాంతాలు చెప్పాలి నీకు? వేకువ కనుల తలుపులు తెరవగానే వాకిలి ముందు ముత్యాల ముగ్గులు పున్నాగ చెట్టు కొమ్మ లోంచి బంగారు పిచిక కువకువలు నవరసాల ఇంద్ర ధనుస్సును " చిత్ర వల" వేసిపట్టి ఫ్రేమ్ లలోకి జీవం పోసిన భంగిమలు రామాయణాన్నీ- లీలా జనార్ధనాన్నీ అలతి అలతి గీతలతో ప్రతీ హృదయ కుటీరం లో లలిత లలితంగా ప్రతిష్టించిన హస్త ముద్రలు సత్యాన్ని అన్వేషించడానికి శివాన్ని ఆవహించుకోడానికి సుందరమే మార్గమని నిరూపించిన బొమ్మలు... వీటన్నిటినీ నా ముందర సాక్షాత్కరింప చేసిన రంగుల గంధర్వుడు బ్రహ్మ కాక ఇంకెవరు?

No comments:

Post a Comment

Pages