బాపు ముఖచిత్రాలు -' బ్నిమ్మానందమయం !' - అచ్చంగా తెలుగు

బాపు ముఖచిత్రాలు -' బ్నిమ్మానందమయం !'

Share This

బాపు ముఖచిత్రాలు -' బ్నిమ్మానందమయం !'

- బ్నిం

తొలిసారి నా కోసం బాపూ గారు ముఖ చిత్రం వేసిన నాటి అనుభూతి ' బ్నిమ్మానందమయం !' ' మిసెస్ అండర్ స్టాండింగ్ ' పుస్తకంలో 26 లు గల్పికలుంటాయి. ఆ 26 కి 26 అద్భుతమైన బొమ్మలు వేశారు విడివిడిగా..! అవి స్వాతీ వీక్లీలో ప్రచురించబడ్డాయి. వాటిని పుస్తకంగా సంకలీకరిస్తున్నప్పుడు, ముఖచిత్రం వేసిచ్చారు. ఈ రచన బాపూ గారికి చాలా నచ్చిందనే విషయం ఆయన వేరే ఫ్రెండ్ ఎవరికో ఉత్తరం రాసినప్పుడు దానిలో ' శ్రీ బ్నింగారు ' మిసెస్ అండర్ స్టాండింగ్' అనే పుస్తకానికి బొమ్మలేస్తున్నాను .. చాలా బాగా వచ్చాయి అని రాసారని , ఆ ఫ్రెండ్ ఆ ఉత్తరం జిరాక్స్ కాపీ కూడా నాకు పంపారు. ఇది మరీ థ్రిల్. ! ఆ తరువాత నేను రాసిన ' అనగనగా నాలుగు' కథా సంపుటాలకి 'మరపురాని మాణిక్యాలు ' సంకలనానికి , 'చీరపజ్యాలు ' శతకానికి వారే ముఖ చిత్రాలు వేసిచ్చారు. ఇప్పుడు జడశతకం తయారౌతోంది.. అట్ట మీద బొమ్మో...?? జడ సౌందర్యం చూపాలంటే బాపూ బొమ్మే కావాలిగా..! వారి బొమ్మలోనే ఒకటి తీసుకుంటా.. అక్షరాలు కుడా ఆయనవే తీసి వాడుకుంటా..! 10708129_745298898851324_50630904_n 10716199_745298748851339_1986718456_n 10714656_745298802184667_704713725_n

No comments:

Post a Comment

Pages