హై”క్లూ”లు - అచ్చంగా తెలుగు
హై”క్లూ”లు
-తరిగొప్పుల వి.ఎల్.ఎన్. మూర్తి


వీధివీధికో విడిది...
భలే ఛాన్సులే
వినాయకుడిది.!!
***
నవ్వులు పంచేందుకు
ఎందుకాలోచనా..?
చిరునవ్వుకదే చలానా..!
***
చినుకుచినుకు మధ్య
బాల్యం
గెంతుతోంది..!
***
శక్తి ఎంతుంటేనేం
ఆయుష్షు అల్పం
మెరుపు..!
***
జనారణ్యంలో
మొలిచిన కాంక్రీట్వృక్షం
కమర్షియల్కాంప్లెక్స్!!.
***
నగరంలో చీకటిని
శివార్లలోకి తరిమేస్తూ...
వీధిలైట్లు..!
***
రైలుముందుకీ
స్టేషన్వెనక్కి...
నేనుమాత్రం ప్రకృతితో...
***
సీతాకోకచిలుకలన్నింటికీ
ఒకేతానుబట్టలా..?
కాన్వెంట్..!
***
నూనెధర తగ్గించమని
దీపాలప్రార్ధన...
జీవితకాలం పెరుగుతుందనీ.!!

No comments:

Post a Comment

Pages