టొమేటోబాత్ - అచ్చంగా తెలుగు
టొమేటోబాత్
పెయ్యేటి శ్రీదేవి


కావల్సిన పదార్థాలు:  గ్లాసు బియ్యం, 6 ఎర్రగా వుండే టొమేటోలు, 2 బంగాళాదుంపలు, 1 కేరట్, 2 ఉల్లిపాయలు, పచ్చి బటానీలు, 6 చిక్కుడుకాయలు, తగినంత ఉప్పు, 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు జీలకర్ర, కరివేపాకు, పోపు దినుసులు, 2 చెంచాలు ఎర్రకారం, 3 చెంచాలు MTR సాంబారు పొడి, చిటికెడు పసుపు.తయారు చేసే విధానం: పచ్చిబటానీలు, చిక్కుడుకాయ ముక్కలు బియ్యంలోనే వేసి అన్నం ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు, కేరట్ పెద్దముక్కలుగా తరిగి ఉడికించి ఉంచుకోవాలి. టొమేటోలు కడిగి, నీళ్ళలో 5 నిముషాలు ఉడికించుకోవాలి. మిక్సీగిన్నెలో ధనియాలు, జీలకర్ర, ఎర్రకారం, ఒక ఉల్లిపాయ, కరివేపాకు వేసి మిక్సీ చేసి, తరవాత ఉడికించిన టొమేటోలు కూడా వేసి మిక్సీ చెయ్యాలి. మూకుడులో నూనె వేసి శనగపప్పు, ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక ఆలుగడ్డ ముక్కలు, కేరట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.  అందులో మిక్సీ చేసిన టొమేటో రసం పొయ్యాలి.  తరవాత ఉడికించిన అన్నం వేసి ఉప్పు, పసుపు, MTR సాంబారు పొడి వేసి బాగా కలపాలి.  పైన నెయ్యి వేసి కొత్తిమీర చల్లాలి. తరవాత తింటే అద్భుత:! ఉల్లి రైతా గాని, కొబ్బరి పెరుగు చట్నీ గాని, బూందీ రైతా గాని ఇందులోకి బాగుంటుంది.
*******************

No comments:

Post a Comment

Pages