చెప్పుకోండి చూద్దాం ! - అచ్చంగా తెలుగు

చెప్పుకోండి చూద్దాం !

Share This
చెప్పుకోండి చూద్దాం !
- గోపీనాథ్ పిన్నలి

బ్రోచెడి వారి గ్రామమునఁ బర్వత పంక్తిలొ నుండు యెప్పుడున్
లేచెను సాహితీ గణము లందొక గుంపుకుఁ దానెఁ గర్తయై
గాచుట లక్ష్యమంచు మరి గోవుకు నిష్టుడు నయ్యవార్లకై
వేచెను  శాస్త్ర విద్యలను నేర్చెను మానవ జాతి మేలుకై
 "  నారాయణ నారాయణ అల్లా అల్లా
   మా పాలిట తండ్రీ ! మీ బిడ్డల మేమెల్లా
   మతం వద్దు, గితం వద్దు ... "
    అంటూ సర్వ జనావళి మేలుకోసం పరితపించిన వో మహనీయుడి జయంతి నవంబరు 15ననే. గొప్ప సంస్కర్తగానే గాక, అంతకుమించి కవితా వైతాళికుడైన ఆ మహా మనీషి పేరునే పై పద్యంలో గుంభనంగా పేర్కొనడం జరిగింది. ఆయన యెవరో గుర్తించాల్సిన పని పాఠక మిత్రులదే. ..కదా..!

No comments:

Post a Comment

Pages