హై ‘క్లూ’ లు
-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
తట్టిలేపుతోంది
చినుకు!!...
స్వాతిముత్యం ధన్యం !
ఆమె నాసికపై -
‘ముక్కెర’య్యింది.!!
కళ్ళల్లో ‘వత్తు’లేసుకుని
ఆమె ఎదురుచూపు!
అతనొచ్చి ‘వెలుగి’స్తాడనీ...!!
ఎండలకి అన్నీ మోడులే -
వసంతగానం...
‘చెట్టె’క్కింది!!.
చెరువు ఎండింది –
రైతు గుండె
‘చెరువైం’ది...!!
మృత్యువైనా-
మంచితనానికి
భృత్యువే.!!
నిద్రలోఅందంగా
నవ్వుతానట…
ఈసారి అద్దంలో చూడాలి!
ముహుర్తాలు మార్చారే-
పెళ్ళికూతురు చూసే
సీరియల్ టైమదే.!!!
ఒంటరిగాళ్ల
సమూహం
అపార్ట్ మెంట్!!...
మట్టికొట్టుకున్నవేళ్ళు
మనకందిస్తున్నాయి-
పూలూ పళ్ళు!!
No comments:
Post a Comment